ఆదివాసుల పోరాట స్ఫూర్తి అల్లూరి


Sat,October 6, 2012 03:47 PM

భారత స్వాతంత్య్ర కోసం ప్రాణాన్ని తృణవూపాయంగా అర్పించి అసువులు బాసిన పోరాటవీరుల్లో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డు. ఆదివాసీల మనుగడ కోసం, విశాఖ మన్యం ప్రాంతానికి స్వ యం పాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం పై 1917-1924 కాలంలో అల్లూరి సాగించిన సమరమే మన్యం పోరాటం. తెలంగాణలో ఆదివాసుల హక్కుల కోసం కొమురం భీం సాగించిన నిజాం వ్యతిరేక పోరాటానికి రామరాజే స్ఫూర్తి. గోండ్వానా ప్రాంతంలో జరిగిన రాంజీగోండు పోరాటం (1850-60). మహారాష్ట్రలోని చోటానాగాపూర్ పరిధిలో జరిగిన బిర్సాముండా ఉద్యమం (1894-1899), ఆంధ్రవూపదేశ్‌లో బంధాల చంద్రయ్యలు నడిపిన పితూరీలు(1910-1915)రామరాజు ఉద్య మం కంటే ముందే జరిగాయి.

రామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామం లో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు.శ్రీరామరాజు బాల్యమంతా పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులోనే గడిచింది.1902లో వెంకటరామరాజు కుటుం బం రాజమహేంద్ర వరానికి మారింది. తండ్రి మరణాంతరం శ్రీరామరాజు నరసాపురంలో నివాసం ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం కాకినాడ, తుని, రాజమండ్రి,విశాఖపట్నంలో సాగి నా స్వతంత్ర భావాలు, విప్లవభావాలతో ఆయన ఆంగ్లవిద్యపై ఆసక్తి కనబరచక విలువిద్య గుర్రపుస్వారీ, హస్తసామువూదికం, యోగా మొదలైన విద్యలను అభ్యసించాడు. భారత స్వాతంవూతోద్యమకాలంలో విశాఖ పట్నంలో జరిగిన సభలకు హజరయ్యారు. బ్రిటిష్ పరిపాలనలో మగ్గిపోతున్న దేశకాల పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో ప్రభావితుడై స్వాతంత్య్ర ఉద్యమం వైపు మొగ్గు చూపాడు. 17 ఏళ్ల వయస్సులో పశ్చిమబెంగాల్ దర్శించాడు. పంజాబ్, బెంగాల్ జాతీయవిప్లవకారులు అందించిన సహకారం, స్ఫూర్తితో ఉద్యమబాట పట్టాడు.

ఆదివాసీల్లో చైతన్యం నింపి, తెల్లదొరలపై తిరుగుబాటు లేవదీశాడు. సాంప్రదా య ఆయుధాలను సమకూర్చుకున్నాడు. రంపచోడవరం, కృష్ణదేవి పేట, నర్సీపట్నం, తుని, అన్నవరం ప్రాంతాల్లో కొండజాతి గిరిజనులను సమీకరించి, పోలీసుఠాణాలపై మెరుపుదాడులు చేశా డు. ఆయుధాలను సేకరించాడు. నాటి మన్యం పోరాటానికి ఆదివాసీ నాయకులు గంటం దొర, మల్లుదొర, అగ్గిరాజు, సింగన్న, పడాలు రామ రాజుకు అండగా నిలిచారు.

గాంధీ చేపట్టిన అహింసాత్మక పద్ధతుల వల్ల దేశానికి విముక్తి లభించదని భావించిన అల్లూరి పత్యక్ష పోరుకు సిద్ధపడ్డాడు. అల్లూరి మన్యం పోరాటం 1922, ఆగస్టు 22న ప్రారంభమైంది. తొలిరోజునే 300 మంది గిరిజనులతో కలిసి చింతపల్లి పోలీసు ఠాణాపై దాడిచేసి ఆయుధాలు పట్టుకెళ్ళారు. ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీసు ఠాణాలపై అల్లూరి దళం దాడులు చేసి తెల్లదొరల గుండెల్లో గుబులు రేపింది. అక్టోబర్ 15న అడ్డతీగల, అక్టోబర్ 19న రంపచోడవరం పోలీసు ఠాణాలపై దాడులు కొనసాగాయి. అక్టోబర్ 23న బ్రిటిష్ అధికారి సౌండర్స్ ఠాణాపై దాడి చేసి యూరోపియన్ బంగాళాకు నిప్పంటించాడు. అందుకు ప్రతిచర్యగా మలబార్ పోలీసు బృందాలకు తోడు, అస్సాం, రైఫిల్స్‌ను రంగం లోకి దింపింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. నడింపల్లి వద్ద అల్లూరి ముఖ్య అనుచరుడు మల్లు దొరను బంధించారు. ‘విభజించు పాలించు’ సూత్రంతో కొంతమంది గ్రామస్తులను లొంగదీసుకున్నారు.

1924లో బ్రిటిష్ అధికారి రూథర్‌ఫర్డ్‌ను ఏజెన్సీలో పోలీసు చర్యకు ప్రత్యేక కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. గూడేల్లోని ఆదివాసులను చిత్రహంసలకు గురిచేశారు. 1924, మే 7న సూర్యోదయాన పోలీసులు చుట్టిముట్టి పట్టుకున్నారు.ఆతర్వాత కాల్చి చంపారు.రామరాజు 26 ఏళ్ళ వయస్సులోనే వీరమరణం పొందాడు. తెల్లదొరల గుండెల్లో సింహస్వప్నంగా మిగిలాడు.మన్యం పోరాటం సాగింది. 20 నెలలే అయినా రామరాజు ఒక విప్లవ జ్యోతిలా వెలిగాడు.అల్లూరి ఆయన అనుచరులైన గంటందొర, మల్లుదొరల సమాధులను, కొయ్యూరులోని స్మారక పార్కును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. అల్లూరి జయంతీ, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.

- గుమ్మడి లక్ష్మినారాయణ
ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
(నేడు అల్లూరి 88 వ వర్ధంతి)

35

GUMMADI LAXMINARAYANA

Published: Mon,February 18, 2013 06:09 PM

ధీర వనిత రాణిమా

భారత స్వాతంవూత్యోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఆదివాసీ వీరనారి రాణి గైడిన్ల్యూ. తెల్లదొరల దురాక్షికమణ నుంచి గిరిజన

Published: Tue,January 1, 2013 03:56 PM

ప్రశ్నార్థకమవుతున్న హక్కులు

ప్రపంచ దేశాలు ప్రతియేటా డిసెంబర్ 10 న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమును ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. జాతి, మతం, కులం, భాష, ప్రా

Published: Wed,December 26, 2012 02:50 PM

గిరిజన మాణిక్యం

మడవి తుకారం ఒక సాధారణ గోండు తెగ గిరిజన వ్యక్తి. ఆయ న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో 1951 మే 4వ

Published: Sat,October 6, 2012 03:46 PM

వాకపల్లి బాధితులకు న్యాయం దక్కేనా?

భారత రాజ్యాంగం ప్రకారం మతం, కులం,లింగం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. 1979 లో వియన్నాలో జరిగిన ‘సీడా’

Published: Sat,October 6, 2012 03:51 PM

గోండుల తొలి పోరాటయోధుడు

భారత స్వాతంత్య్ర పోరాటం అంటే స్ఫురించేది సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివా

Published: Sat,October 6, 2012 03:51 PM

ఆదివాసీల ఆప్తుడు బియ్యాల

ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ము