విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!


Sun,March 11, 2018 01:49 AM

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ్‌లాండ్‌ల నుంచి వస్తున్న సరుకులు విశ్వవేదిక మీదకు వచ్చిపడినాయి. ఆ పెద్ద బహుళజాతి కంపెనీలతో పోటీకి నిలిచేవిధంగా మన వడ్రంగులను నిలబెట్టగలుగాలి. అం దుకోసం విశ్వకర్మ పారిశ్రామికవాడను నెలకొల్పాలి. వడ్రంగి యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి.

చితికిపోయిన చేతివృత్తులు, ధ్వంసమైన గ్రామీణ జీవన వ్యవస్థను చూసి రాష్ట్రసాధన ఉద్యమంలో తెలంగాణ కన్నీళ్లు పెట్టుకున్నది. దుర్భరస్థితి లో ఉన్న తెలంగాణ ముఖచిత్రం మారాలం టే తెలంగాణ రాష్ట్రం రావటమొక్కటే శరణ్యమని తెలంగాణ తెగించి పోరాడింది. ప్రజల ఆకాంక్షల మేరకు కులవృత్తులకు తిరిగి పురావైభవాన్ని కలిగించాలన్న దీక్షతో కేసీఆర్ బీసీల కోసం అనేక కోణాల నుంచి ఆలోచిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అందుకు సన్నద్ధం చేస్తూ వస్తున్నారు. బీసీ కమిషన్‌ను వీరి స్థితిగతుల మెరుగు కోసం అధ్యయనం చేయవలసిందిగా ఆదేశించారు. ఎంబీసీలతో పాటు మరింత దీనస్థితి లో, నాగరిక సమాజం తలదించుకునే స్థితిలో ఉన్న సంచారజాతుల బతుకులు మారాలన్న మానవీయ దృక్పథం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఇందుకోసం ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రకటించారు. ఇంతకుముందే చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూసి చలించిన ప్రభుత్వం వారికోసం ఎంతో శ్రమించింది.

చేనేత కార్మికుల బతుకులకు అండదండగా ఉంటున్నది. కొన్ని కులవృత్తులకు నేటికీ బాగా డిమాండ్ ఉన్నది. అలాంటి కులవృత్తులను ఆదుకోవలసి ఉన్నది. ప్రధానంగా వడ్రంగి వృత్తి కి డిమాండ్ బాగా ఉండి కూడా ఇక్కడి విశ్వకర్మలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవటం వల్ల వెనుకబడిపోయారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయరంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడవ్వటంతో విశ్వకర్మల జీవితా లు బజారునపడ్డాయి. సృష్టికర్తలుగా సమాజానికి ఉపయోగపడిన వీరిస్థితి దారుణంగా దిగజారింది. సృష్టికర్తలుగా వెలిగిన విశ్వకర్మలు ముష్టికర్మలుగా మారలేక, చేసేందుకు పనులులేక వడ్రంగి, కంసాలి, కంచర, శిల్పులుగా ఉన్న ఈ పంచకర్మ కులస్థులు మరో దారిలేక కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యల కు పాల్పడ్డారు.

ఒక అంచనా ప్రకారం కులవృత్తులు దెబ్బతిన్న నేపథ్యంలో గత రెండు దశాబ్దాల లెక్కలుతీస్తే అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పండింది ఈ విశ్వకర్మ కులస్థులే. వీరి జీవన ముఖచిత్రం మార్చటంకోసం ఏదో ఒకటి చేయాలని, విశ్వకర్మ కులస్థులు తిరిగి వారి పురా వైభవాన్ని పొందేందుకు ఏం చేయాలోనన్న ఆలోచనలతో కేసీఆర్ అనేక దఫాలు వీరి గురించి చర్చించటం జరిగింది. మొత్తం బీసీ కులాల్లో అణగారిన స్థితిలో ఉన్న వారందరినీ స్వతంత్రంగా నిలబెట్టుకున్న తలంపులో భాగంగా నే జీవో నెంబర్ 9ని విడుదల చేశారు.

విశ్వకర్మ కులస్థుల్లో వడ్రంగి కులవృత్తిని పూర్తిగా ఆధునీకరించవలసి ఉన్నది. ఈ వృత్తిపై రాష్ట్రంలో ఆరులక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వడ్రంగి వృత్తి అన్నది నేడు ప్రపంచవృత్తిగా మారింది. చైనా, థాయిలాండ్, జపాన్, సింగపూర్, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వుడ్‌వర్క్ నేడు ప్రపంచంలోని అన్నిదేశాలకు విస్తరించాయి. ఈ వృత్తి గ్లోబల్ వృత్తిగా మారినందుకు ఈ వృత్తిదారులు ఆనందించాలో లేక బాధపడాలో అర్థంకానీ దశ ఏర్పడింది. మన దగ్గర వడ్రంగి వృత్తిపై ఆధారపడ్డ వాళు దుగోడ, బాడిశ, ఉలి, సుత్తి పట్టుకొని ఉంటే ప్రపం చం వేగంగా ముందుకు దూసుకుపోతున్నది. గత పాలకులు పుణ్యమాని మన దగ్గర వడ్రంగి వృత్తి సంపూర్ణంగా దెబ్బతిని ఆ కుటుంబాలు సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లే కొత్తదారులు వేసుకుందామని కేసీఆర్ అనేక సమీక్షా సమావేశాల్లో చర్చించారు. ఇలాంటి చితికిపోయిన కులాల సంరక్షణే ప్రధాన ధ్యేయంగా, అదే ప్రధాన ఎజెండాగా ముందుకుసాగమని బీసీ కమిషన్‌తో అనేకసార్లు చర్చించారు. అధ్యయనానికి పురికొల్పారు.

ఎంబీసీలకు కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ఖజానాకు అంతకుమించిన సంపదను ఎంబీసీ లు, సంచారజాతులు రాష్ర్టానికి అందిస్తార న్న నమ్మకం కేసీఆర్‌కు ఉన్నది. ఆ ఒక్క నమ్మకం చాలు తెలంగాణ తప్పక ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది. వడ్రంగి వృత్తిదారులకు పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలి. ఇక్కడి విశ్వకర్మలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచే సే వస్తువులతో వారి బతుకులు మారటమే కాకుండా వీరి వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండేవిధంగా తయారుచేయట మన్నది బృహత్ లక్ష్యం. ఇందుకోసం దేశదేశాల్లో ఈ రంగంలో తయారవుతున్న వస్తువులు, ఆ వస్తువులకున్న డిమాండ్, ఉత్పత్తి, సామర్థ్యం, అందుకయ్యే ఖర్చు, ఇం దుకు కావల్సిన ఆధునిక సాంకేతిక శిక్షణ వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆధునిక యంత్రాలను కొనటం, ఆ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువులను ఎవరైనా తయారుచేయవచ్చును. కానీ, తరతరాలుగా ఆవృత్తినే నమ్ముకున్న విశ్వకర్మీయు లే ఆ పనిని చేపట్టేవిధంగా చూడాలి. వీళ్లు తయారుచేసిన వస్తువులను మార్కెట్‌తో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేసే వ్యవస్థను ప్రభుత్వమే ఏర్పాటుచేయా లి. ఇది చట్టపరమైతే తెలంగాణలో విశ్వకర్మలు గొప్ప సంపద సృష్టికర్తలవుతారు. మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వడ్రంగి కులస్థులు ఒక శక్తిగా మారుతారు.

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ్‌లాండ్‌ల నుంచి వస్తున్న సరుకులు విశ్వవేదిక మీదకు వచ్చిపడినాయి. ఆ పెద్ద బహుళజాతి కంపెనీలతో పోటీకి నిలిచేవిధంగా మన వడ్రంగులను నిలబెట్టగలుగాలి. అం దుకోసం విశ్వకర్మ పారిశ్రామికవాడను నెలకొల్పాలి. వడ్రంగి యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. విశ్వకర్మ పారిశ్రామిక వాడ నుంచి తయారుచేసిన వస్తువులను విక్రయించేందుకు అతిపెద్ద మాల్‌ను ప్రభుత్వ అధీనంలోనే నెలకొల్పాలి. డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణంలో వాడే కలపనంతా ఈ విశ్వకర్మ పారిశ్రామిక వాడ నుంచే సరఫరా చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. నాణ్యమైన వస్తువులను, తక్కువ ధరలకు వస్తువులను అందించగలుగాలి. ఈ విస్తృత వ్యవస్థ ద్వారా వేలాదిమంది విశ్వకర్మలకు ఉపాధి కలుగుతుంది. ఈ ఫెడరేషన్ పారిశ్రామిక వాడకు కలపను, ముడిసరుకును ప్రభుత్వమే అందించాలి.
Gowri-Shankar.jpg
వడ్రంగి వృత్తివారికి మండల, గ్రామ, పట్ట ణ స్థాయిల్లో గ్రూప్‌ల ద్వారా రెండు నుంచి పది లక్షల వరకు వెచ్చించి ఆధునిక పరికరాలను ఇప్పించేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు, ఎంబీసీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్‌లు తయారుచేస్తున్న ది. హైదరాబాద్‌లో విశాలమైన ప్రాంగణంలో విశ్వకర్మలు తయారుచేసిన వస్తువుల అమ్మకానికి విశ్వకర్మ వస్తువులు మాల్‌ను నెలకొల్పవలసి ఉన్నది. ఇంటికి కావల్సిన అన్నిరకాల వస్తువులను, ఆధునిక హంగులతో తయారుచేసి ఈ మాల్స్‌లో పెట్టాలి. మహాదేవ్‌పూర్, అచ్చంపేటలో ఫారెస్ట్ డిపోలున్నాయి. ఆ ఫారెస్ట్ డిపోలలో వేలంవేసే కలపనంతా ఒక నిర్ణీత ధరకు విశ్వకర్మ పారిశ్రామిక వాడకే ఇవ్వాలి. ఆధునిక ప్రపంచ మార్కె ట్ పోటీకి నిలబడేవిధంగా మన విశ్వకర్మలను తయారుచేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ విశ్వకర్మలు నిలువాలి. రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ విశ్వకర్మలను తీర్చిదిద్దాలన్న కేసీఆర్ దార్శనిక ఆలోచనలు గెలువాలి. వీరి జీవితాల్లో వెలుగులు నిండాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

608

GOURI SHANKAR JULUR

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles