గురుకుల విద్యతో వెలుగులు


Fri,March 2, 2018 01:12 AM

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన్న దానితో సమాజానికి ఒనగూరేదేమీ ఉండదు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా బాగా డబ్బున్న పిల్లలకు అందే విద్యావసతులు తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో పేదలకు అందుతున్నది. దాన్ని కాదనలేరు. మంచిని మరింతగా ఉన్నతీకరించేందుకు సద్విమర్శలు ఎల్లప్పుడూ అవసరం.

కుల, మత, వర్ణ, వర్గ, జాతి, లింగ వివక్షలేకుండా ప్రజలందరి కీ సమాన అవకాశాలు లభించాలని మన రాజ్యాంగం చెబుతున్నది. పిల్లలు స్వేచ్ఛగా, సగౌరవంగా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉండాలని రాజ్యాంగంలోని 39 (ఎఫ్) చెబుతున్నది. బాలలందరికీ 14 ఏండ్ల వయస్సు వచ్చేదాకా నిర్భంద ఉచిత ప్రాథమిక విద్య ను అందించాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ ఇప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయి? మురికివాడల్లో పిల్లలు మరికివాడల్లోనే మగ్గుతున్నారు. పేదవర్గాల పిల్లలకు చదువు ఆమడదూరంలోనే ఉండిపోయిం ది. సంచారజాతులు, బాగా వెనుకబడిన బీసీలు, దళితులు, మైనార్టీలు, గిరిజనులు, పేదల పిల్లలకు సరైన చదువులేదు.

రాష్ట్రసాధన ఉద్యమ సమయంలోనే ఈ చదువుల ముఖచిత్రం మారాలన్న నినాదాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యారంగాన్ని తీర్చిదిద్దుకుందామని అధ్యాపక, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలన్నీ నినదించాయి. తెలంగాణ ఉద్యమకర్తగా, ఉద్యమనేతగా కేసీఆర్ మన విద్యారంగాన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. రాష్ట్రసాధన తర్వాత ఉద్యమకాలం నాటి మాట సాక్షిగా కేజీ టు పిజీ విద్యా విధానానికి రూపకల్పన చేసి అట్టడుగున చదువందని పేదపిల్లల వాకిళ్లదాకా చదువుల సరస్వతిని తీసుక పోయారు. అందుకు గురుకుల విద్యావ్యవస్థను ప్రారంభించారు.
తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం ఉన్నారు. తెలంగాణ వికాసమంటే ఈ వర్గాల వికాసమేనన్న దార్శనికతతో కేసీఆర్ రాష్ట్రం లో 545 గురుకుల విద్యాలయాలను ప్రారంభించారు. చదువు అందరికి అందితే సమాజ ముఖచిత్రమే మారుతుంది. ఆధిపత్య సంస్కృతికి చరమగీతం పాడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పటం కాకుం డా కేసీఆర్ ఆచరణాత్మకంగా వాస్తవం చేస్తున్నారు.

రాష్ట్రం అవతరించాక సంచారజాతులు, బాగా వెనుకబడిన కులాల వారి పిల్లలు బడికి వస్తున్నారు. తొలిసారిగా బడిమెట్లు ఎక్కుతున్న కులా ల పిల్లలకు అన్ని వసతులతో గురుకులాలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వారందరినీ తిరిగి బడిబాటకు మళ్లించటం జరుగుతున్నది.గతంలో వెనుకపడేసిన, వెనుకపడిన తెలంగాణ ఇప్పుడు తననుతాను మానవ సంపదగా మార్చుకుంటున్నది. సాంకేతిక తెలంగాణగా మార్చుకునేందుకు మానవసంపదే ముఖ్యం. అందుకు సాంకేతిక సైన్యాన్ని తయారుచేసేందుకు విద్యారంగాన్ని పునాది నుంచి పటిష్టం చేసేపనికి సీఎం కేసీఆర్ పూనుకున్నారు. ముఖ్యంగా బడికిరాని పేద పిల్లలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పిల్లలను బడికి తీసుకరావటమే కాదు, వచ్చిన పిల్లలకు నాణ్యమైన చదువు అందించటం, పౌష్టికాహారం అందించటం గొప్ప విషయం. కేసీఆర్ దార్శనికతకు సకల సదుపాయాలతో ఉన్న గురుకుల విద్యాలయాలే నిదర్శనం. రాబోయే ఐదు పదేండ్లలో ఈ గురుకులాల నుంచి వచ్చిన బహుజన మైనార్టీవర్గాల పిల్లలు తెలంగాణ లో కొత్త చరిత్రను రాసి తీరుతారు. ఇది జోస్యం చెప్పటం లాంటిది కాదు. ఇటీవల బీసీ కమిషన్ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుం టే గురుకుల విద్యాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించటం జరిగింది. ఎక్కడ ఏ స్కూలుకు వెళ్లినా మొదట వాతావరణం, పరిశుభ్రత, ఆహారం, వంటకాలు, టాయిలెట్స్, హాస్టల్స్ గదులు చూస్తే సంతోషమేసింది. విద్యార్థుల పాలిట స్వర్ణయుగంగా తోచింది. భవిష్యత్తులో తాము ఏ దిశగా పోదలుచుకున్నారో తమ లక్ష్యాలేమిటో కూడా ఆ పిల్లలు చెబుతుంటే ఒళ్లు పులకరించింది.

గతంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ఇప్పటి గురుకులాలకు పోలికే లేదు. గతంలో నీళ్ల సాంబరు, అల్యూమీనియం కంచాలతో పిల్లలు రోడ్లె క్కి నినదించేవారు. ఇప్పుడు సన్నబియ్యంతో రుచికి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అతిశయోక్తి కాదనుకుంటే ఇంటికంటే మంచి ఆహారం అందిస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీల పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల ల్లో యాభై శాతానికి మించి ఉన్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 119 గురుకులాల నిండా ఉన్నారు. బహుజనులకు కనీస వసతు లు, సౌకర్యాలు కల్పిస్తే వాళ్లు ప్రపంచాన్నే తమ చిటికెన వేళ్లతో మార్చగలరని, ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదన్న విషయాన్ని గురుకుల విద్యాలయాలు తేల్చిచెబుతున్నాయి. భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండబోతుందో, దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో అన్న దాన్ని దర్శించాలంటే గురుకుల విద్యాలయాలలోని పిల్లలను తట్టితే తెలుస్తుంది. గురుకులాలు సమర్థవంతంగా నడిస్తే పిల్లలే తెలంగాణ తలరాతలు మార్చేస్తారు. అందు కే ఈ గురుకుల విద్యాలయాలపై ఈగ వాలకుండా బహుజనులే సంరక్షించుకోవాలి.

తెలంగాణ పునర్నిర్మాణంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీసినట్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు అందబోతున్న ట్లు, చదువులు కూడా బహుజనుల గడపలదాకా చేరాలన్న లక్ష్యంతో ముందుకుసాగున్న కేసీఆర్ ఆలోచనలను ప్రతి ఒక్కరూ హృయపూర్వకంగా అభినందించాలి. తెలంగాణ విద్యావంతుల సమాజమైతేనే అది వివేకవంతమైన విజ్ఞాన సమాజాన్ని ప్రతిష్ఠిస్తుంది. గురుకుల విద్యాలయాలపై విమర్శలు చేసేవాళ్లు ఉండవచ్చు. సద్విమర్శలకు ఎవరూ అడ్డు చెప్పరు. ఈ గురుకుల విద్యాలయాలు వయసు రీత్యా ఒక సంవత్సరం బిడ్డన్న విషయం మరువరా దు. ఇప్ప టివరకు బడిగడప తొక్కని అట్టడుగు వర్గాల పిల్ల లు గురుకుల విద్యాలయాల కు వస్తున్నారు. సంచారజాతు ల పిల్లలు, గంగిరెద్దులు ఆడించేవారి పిల్లలు, పటం కథలు చెప్పే వారి పిల్లలు, ఇప్పటివరకు ఈ ఆధునిక సమాజానికి తెలియని కొన్ని కులాలవారి పిల్లలు గురుకుల విద్యాలయాలకు వస్తున్నారు. ఇది పెద్దమార్పు. వెలివాడల్లో వెలివేతలకు గురైన ఏకలవ్యులు గురుకులాలకు వస్తున్నారు. ఇది నిశ్శబ్ద విప్లవం. రాబోయే కాలం తలరాతలను ఈ గురుకుల విద్యాలయాలు మార్చేదశకు వచ్చి తీరుతాయి. సమాజంలో ఇప్పటివరకు అడ్డుగా ఉన్న ఆధిపత్యవర్గాల అడ్డుగోడలను కూల్చే శక్తి సామర్థ్యాలు గురుకుల విద్యాలయాల పునాదు ల్లో ఉన్నాయి. ఈ విద్యాలయాలను బహుజన వర్గాలే సంరక్షించుకుంటాయి. సంచారజాతులు, ఎంబీసీలు, సబ్బండవర్ణాల పిల్లల చేయి పట్టుకొని గురుకులం వైపునకు నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఆ వర్గాలు ఎప్పటికీ కృతజ్ఞత గా ఉంటాయి. తెలంగాణలో మార్పు గురుకుల విద్యాలయాల గదుల నుంచే మొదలవుతున్నది. గురుకులాలు ఏర్పాటుచేసి ఏడాది కాలమే కాబట్టి కొన్నిచోట్ల కొన్ని సమస్యలున్నాయి. అత్యధిక గురుకులాల్లో మం చి భవనాలున్నాయి. వసతులున్నాయి. ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. అన్నీ ఒక్కసారే ఒనగూరకపోవచ్చును. అందుకు కొంత సమ యం పడుతుంది.
shenkar
చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటా యి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించా లన్న దానితో సమాజానికి ఒనగూరేదేమీ ఉండదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా బాగా డబ్బున్న పిల్లలకు అందే విద్యావసతులు తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో పేదలకు అందుతున్నది. దాన్ని కాదన లేరు. మంచిని మరింతగా ఉన్నతీకరించేందుకు సద్విమర్శలు ఎల్లప్పుడూ అవసరం. బాధ్యతాయుత భాగస్వామ్యం ప్రతిపనిలో ఉంటే తెలంగాణ ను మహోన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్ని అందరూ గుర్తించాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

588

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల