పునర్నిర్మాణమే సమాధానం


Sun,January 21, 2018 01:10 AM

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాలి. అందుకోసం ఇంకెంతో శ్రమించాలి. అందుకు కేసీఆర్ ముందుకువచ్చారు. అందుకు ఆయన చేపట్టే పునర్నిర్మాణంలో జాతి అంతా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం బాధ్యత వహించి పనిచేస్తున్న చారిత్రక కర్తవ్యం. సమాజంలో కటిక దరిద్రంలో జీవించే నిరుపేదలకు రాజ్యాంగ హక్కులను అందించే పని చేపట్టి అందుకోసం ముందుకుసాగుతున్న కేసీఆర్ కృషి ఫలించాలని ఆశిద్దాం.

వ్యక్తి మానవీయ కోణంలో ఆలోచించి తన జీవితాన్ని సంఘానికి అంకితం చేయటం ఎంత ఉన్నతమైందో, అట్లే ప్రభుత్వానికి కూడా మానవీయకోణం ఉంటే మొత్తంగా ఆ వ్యవస్థే సం పూర్ణ మార్పునకు దోహదకారి అవుతుంది. అసమతుల్యతకు ముఖ్యకారణం కొందరిని పట్టించుకోవటం, కొందరి ని విస్మరించటం. సమాజంలో కీలకమైన ఉత్పత్తిలో భాగస్వామ్యశక్తులను విస్మరించిన పార్టీలు కూడా గెలుస్తూ ఉం డవచ్చు. కానీ, గెలిచిన ఆ పార్టీలకు మానవీయకోణం ఏ మాత్రం ఉన్నదో శాస్త్రీయంగా విశ్లేషించాలి. తెలంగాణ రాష్ర్టావతరణకు ముందున్న ప్రభుత్వాలు ఈ మానవీయ కోణంలో ఏ మేరకు నిలిచాయన్నదాన్ని ఇప్పుడు పునః సమీక్ష చేసుకోవాలి.

సామాజిక మార్పునకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే సంస్థలైనా, వ్యక్తులైనా, మానవీయ కోణాన్ని ఎలా అంచనా వేస్తారు..? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశం చూపంతా తెలంగాణ వైపే ఉన్నది. తెలంగాణలోని ఆలోచనాపరులంతా రాష్ట్ర ప్రభుత్వంవైపే చూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ ఎలా తీర్చిదిద్దుతున్నారన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. దీనికి సమాధానంగా రాష్ట్ర పునర్నిర్మాణం ఆచరణాత్మకంగా, వేగవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ దశలో జరుగుతున్న అభివృద్ధిపై, తెలంగాణ అవతరణ తర్వాత తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న చర్చలో భాగంగానే ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ కార్యక్రమాన్ని చూడాలి. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇండియా టుడే చేసిన చర్చ రాష్ట్ర అవతరణకు ముందు/ అవతరణ తర్వాత అన్న విషయం చరిత్రలో ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా కేసీఆర్ చెప్పుకుంటూపోయిన సమాధానాలు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఒక వైట్‌పేపర్‌ను, ప్రభుత్వ భావనలను, తన పని విధానాన్ని ప్రపంచం ముందు బాహాటంగా ప్రకటించినట్లయింది. ఒకరకంగా కేసీఆర్ పాలనపై చాలా మంది సంధిస్తున్న విమర్శలకు నిలువెత్తు ప్రశ్నల రూపంగా సర్దేశాయ్ నిలువగా మొత్తం తెలంగాణ సమాజం తరపున ఒకే ఒక్కడుగా కేసీఆర్ చెప్పిన జవాబులు చరిత్రలో నిలిచిపోతాయి. రాష్ట్రసాధన ఉద్యమంలో జయుడుగా నిలిచిన వ్యక్తే పునర్నిర్మాణంలో విజయుడుగా నిలువటం చారిత్రకాంశం. ఈ చర్చలో బాధాకరమైన రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా స్పందించిన తీరు, వారిని ఆదుకోవటమే ప్రభుత్వ ప్రాథమిక విధి అని చెప్పటంతో పాటు, ప్రధానంగా సంక్షేమ రంగానికి సంబంధించి చేస్తున్న కృషిని తెలిపారు. నిర్మాణాత్మకంగా బహుజనులకు అండగా నిలువడమే గాదు, వారిని సొంతకాళ్లపై నిలబెట్టడం కోసం జరుగుతున్న కసరత్తు కూడా చరిత్రాత్మకం.

తెలంగాణ రాష్ట్రం అవతరించాక గతం కంటే భిన్నంగా ఆలోచించటం, ప్రతిరంగాన్ని వినూత్నంగా తీర్చిదిద్దుకునే పని మొదలైంది. విద్యుత్‌రంగంలో విప్లవంలాగా అన్నిరంగాల్లో వెలుగులు విరజిమ్మే పని ఒక్కపూటలో అయ్యేది కాదు. అందుకుగాను ఒక చక్కటిదారి, గెలువవలసిన లక్ష్యాలను చేరుకునేందుకు గమనం ముఖ్యమైనది. వీటన్నింటికంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వానికైనా మానవీయకోణం ఉండాలి. అదే లేకపోతే ఆ పాలన నిరర్థకం. కొందరు మాత్ర మే కాకుండా అందరూ సుఖంగా ఉండాలన్న దాన్ని ఏ పేరుతో పిలిచినా దాన్ని సాధించుకోవటం ముఖ్యం. భిన్న చైతన్యాల, విభిన్న ఆలోచనల సంఘర్షణలు కలగల్సిన నేల తెలంగాణ. నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సం ఘర్షించనీ అన్న భావ సంఘర్షణలున్న క్షేత్రంలో అభివృద్ధిలో తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దీక్ష వహించటం అసాధారణం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ పనికి సన్నద్ధమైంది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బీసీ (ఈ) గ్రూపులోని పేద ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన విషయంపై కేంద్రం సమాధానం చెప్పాలి. లేకుంటే ఈ విషయంపై ముందుగానే కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణతో కలి సి ఇతర రాష్ర్టాలు ఒక వేదిక మీదకు రావటం ఖాయం. అందుకు తిరిగి తెలంగాణనే నాయకత్వం వహిస్తుంది. ఇంకా ఒక్క అడుగు ముందుకువేస్తే తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ర్టానికి కూడా పేదలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని కేసీఆర్ గొంతెత్తితే దేశంలోని సగానికిపైగా ఉన్న బీసీలు గొంతు కలుపుతారు.

అభివృద్ధి వేగంగా జరుగాల్సిందే. ఆర్థికాభివృద్ధి సాధించాల్సిందే, నిరుద్యోగానికి చరమగీతం పాడాల్సిందే. ప్రాజెక్టులు కట్టాల్సిందే, మన నెర్రలు బాసిన నేలల్లో నీళ్లు పారాల్సిందే అన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని నిత్యసాధన చేస్తున్నది. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోని సామాజిక సమస్యలను అంతరాలను సరిచేసే పనికి కేసీఆర్ ముందుకు రావటం మొత్తం సమాజం ఆహ్వానిస్తున్నది. నాగరిక సమాజానికి దూరంగా ఉన్న సంచారజాతుల గురించి మాట్లాడింది కేసీఆరే. మాట్లాడటమే కాదు వారి కోసం అనేక పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మానవీయకోణం. రాష్ట్రంలో ఉన్న సుమారు 35 లక్షల మంది సంచారజాతుల వారిని సమున్నతంగా నిలబెట్టడం తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకమైనది. ముఖ్యంగా బాగా వెనుకబడిన ఎంబీసీల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ ఫెడరేషన్ పెట్టి అందుకు 1000 కోట్లు కేటాయించడం విశేషం. పేపర్లు ఏరుకొని జీవించే సంచారజాతులవాళ్లు ఉద్యమ సమయంలో ఒక రోజు ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేశారు. వాళ్లందరు ఏం ఆశించి ఆ ధర్నాలో పాల్గొన్నారన్నది నాడు అందరినీ కదిలించింది. కేసీఆర్ ఉద్యమం నుంచి వచ్చిన పాలకుడు కాబట్టి ఆ పేపర్లు ఏరుకొని జీవిస్తున్న సంచారజాతుల వారిని ఆధునిక వృత్తుల్లోకి తీసుకురావటం కోసం బీసీ కమిషన్‌తో, అధికారులతో చర్చించారు. అలాగే అన్నిపార్టీల బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల తో మూడురోజుల పాటు చర్చలు జరిపారు. తెలంగాణలో ఉన్న సగం జనాభా అయిన బీసీలకు సమన్యాయం జరిగినప్పుడే అది అసమతుల్యంకాని సమా జం అవుతుంది. బీసీలలో సగం జనాభా ఉన్న సంచారజాతులు, ఎంబీసీలకు ఇందులో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన పేదలందరూ రిజర్వేషన్లు పొందేందుకు ఎక్కడిదాకానైనా వెళ్తానని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకు వస్తానని అందుకోసం తిరిగి ఉద్యమిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వానికి ఉండే మానవీయ కోణం అంటే అట్టడుగున ఉన్నవారిని గుర్తించి వారికోసం నడుంకట్టి పనిచేయటం.
shenkar
నెత్తురును చెమట చేసి సమాజ నిర్మాణం చేస్తున్న ఉత్పత్తిశక్తులకు అండగా నిలిచి వారిని స్వతంత్రులుగా నిలుపటం కోసం తెలంగాణ పునర్నిర్మాణాన్ని మలుచటం మానవీయ సంక్షేమ పాలనకు ప్రతీక. జీవన సమరం చేస్తున్న వారి కోసం ఏ ప్రభుత్వమైనా బాధ్యత తీసుకోవాలి. మరి ఇన్నేండ్లు మమ్ముల్ని ఎవరు పట్టించుకున్నరయ్యా? మా బాధలు ఎవరు విన్నారయ్యా? అంటున్న దీనులకు అండగా నిలువటమే ప్రభుత్వానికి ఉండాల్సిన మానవీయ కోణం. ఎంబీసీలు, సంచారజాతుల వారి చేతికి కాలాన్నే అందిస్తామని వారికి స్నేహ హస్తాన్ని అందిస్తూ , వారిని పైకి తెచ్చే పని చేపట్టడం మొదలైంది. తెలంగాణ వస్తే ఏమొస్తదంటే అట్టడుగునున్న సంచారజాతులు, ఎంబీసీల బిడ్డలు గురుకులాలకు వెళ్తారు. వృత్తులు చితికిపోయి రోడ్డుమీద పడ్డ చేతివృత్తుల వారు ఆధునిక వృత్తుల్లోకి వెళ్తారు. వృత్తిపనులు నడిచే అవకాశం ఉన్నవారు ఆధుని క ఉత్పత్తుల్లోకి వెళ్తారు.

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొం దాలి. అందుకోసం ఇంకెంతో శ్రమించాలి. అందుకు కేసీఆర్ ముందుకువచ్చా రు. అందుకు ఆయన చేపట్టే పునర్నిర్మాణంలో జాతి అంతా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం బాధ్య త వహించి పనిచేస్తున్న చారిత్రక కర్తవ్యం. సమాజంలో కటిక దరిద్రంలో జీవించే నిరుపేదలకు రాజ్యాంగహక్కులను అందించే పని చేపట్టి అందుకో సం ముందుకుసాగుతున్న కేసీఆర్ కృషి ఫలించాలని ఆశిద్దాం. అందుకు కేసీఆ ర్ తలపెట్టిన సంక్షేమ పాలనాయజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవు దాం. పైరు పచ్చల, సుఖశాంతుల తెలంగాణ ఆవిష్కరించుకుందాం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

622

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles