సాహిత్యమూ.. జనహితమూ..


Tue,November 21, 2017 11:19 PM

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పునర్ముద్రించుకోవాలి. శతక పద్యాల్లాంటి వాటిని తిరిగి సిలబస్‌లో ప్రవేశపెట్టాలి. మళ్లీ కొత్తగా పాఠాలు రాయాలి. ప్రాచీన సాహిత్యాన్ని గౌరవిస్తూ అందులోని గొప్పసాహిత్యాన్ని ఈ తరం చదువుకునే విధంగా చేయాలి.

నాలుగున్నర గంటలపాటు సాహితీవేత్తలతో గడిపే ముఖ్యమంత్రెవరైనా ఉన్నారా? కేసీఆర్ ఆ పని చేయగలరు. చేశా రు. ఏ నాయకుడికైతే సాహిత్యంతో పరిచయం ఉంటుందో ఏ రాజుకైతే కళల పట్ల సంస్కృతి పట్ల అవగాహన ఉంటుందో ఏ పాలకుడికైతే సృజనాత్మక రంగం మీద పట్టు ఉంటుందో ఆ నాయకుడు జనహిత మార్గంలో నడువగలడన్నది నిజం. గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. గత ముఖ్యమంత్రులు నిధులిచ్చి సభలను ప్రారంభించి చేతులు దులుపుకొనేవారు. కానీ కేసీఆర్ ప్రపంచతెలుగు మహాసభలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించదలిచారు. ఇందులో భాగంగా ఆయన కవులు, రచయితలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని సుదీర్ఘంగా ఇష్టాగోష్ఠి జరిపారు. కవులు, రచయితలు స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పమని ఆయన కోరారు. తెలంగాణలో లబ్ధ ప్రతిష్టులైన కవులు, సాహితీవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తనచేత్తో ఆ అభిప్రాయాలను రికార్డు చేశారు. కవులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించారు.

ప్రపంచతెలుగు మహాసభల ద్వారా కేసీఆర్ అనేక కర్తవ్యాలను భుజం మీద వేసుకున్నారు. ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విధిగా తెలుగును చదువాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రపంచతెలుగు మహాసభల ద్వారా వేలాది తెలుగు పండితుల పోస్టులు త్వరలో ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. పండిత్ శిక్షణాకళాశాలలకు పురావైభవం రాబోతున్నది. గతంలో ఈ పండిట్ కోర్సు ద్వారా ఐదు నెలలు శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడది ఒకసంవత్సరం శిక్షణగా మారిం ది. తెలంగాణ సారస్వత పరిషత్‌తో పండిట్ ట్రైనింగ్ కాలేజీ ఉండేది. గతంలో దానికి జనం లేక ఎత్తివేశారు. ఈ సారస్వత పరిషత్‌లో ఆ రోజు ల్లో దేవులపల్లి రామానుజరావు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. ఈ పండిట్ ట్రైనింగ్‌కాలేజీకి తరిపల్లి విశ్వనాథశాస్త్రి తొలిప్రిన్సిపల్‌గా ఉన్నారు. మాసబ్‌ట్యాంక్‌లో ఒక పాత ఓరియంటల్ కాలేజీ ఉండేది. నల్లకుంటలో ఖండవల్లి లక్ష్మీరంజనం ఓరియంటల్ కాలేజీని స్థాపించారు. పాలెం ఓరియంటల్ కాలేజీకి గొప్ప చరిత్ర ఉంది. వరంగల్ పెద్దపల్లి, జనగామ, కోరుట్ల, గోదావరిఖని, హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్, సారస్వత పరిషత్‌లలో గత రెండేండ్లుగా ఈ కోర్సుల్లో పిల్లలు చేరక దాదాపుగా మూతబడ్డాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో మూతపడ్డ పండిట్ ట్రైనింగ్ కాలేజీలు తిరిగి కళకళలాడే స్థితికి వచ్చితీరుతాయి.

పండిట్ ట్రైనింగ్‌కాలేజీలో గతంలో ఐదు నెలల్లోనే ఆ కోర్సు పూర్తిచేసేవారు. పాత తెలుగుపండితులు అంతా ఆ ఐదు నెలలకాలంలోనే ఆ డిగ్రీ పూర్తిచేసేవారు. బీఈడీ శిక్షణ కోర్సు వచ్చిన తర్వాత ఈ పండిట్ కోర్సును ఒక ఏడాది కోర్సుగా మార్చారు. బీఈడీతో సమానంగా ఒక ఏడాది కోర్సుగా ఉండటం వల్ల స్కూల్ అసిస్టెంట్స్‌గా తెలుగు పండిట్‌ల నియమకాలు జరిగాయి. ఇలా సారస్వత పరిషత్, పండిత్ ట్రైనింగ్ కాలే జీ, ఖండవల్లి లక్ష్మీరంజనం పండిట్ ట్రైనింగ్ కాలేజీ, ఆంధ్ర మహిళాసభలో లాంగ్వేజ్ పండిట్, బీఈడీ, ఎంఈడీ కోర్సులున్నాయి. బీఈడీ కోర్సులో సోషల్, బయోలజీలతో పాటు సెకండ్ మెథడాలజీ కింద ఇంగ్లీ షు బదులు తెలుగు తీసుకుంటారు. దీనివల్ల తెలుగుకు ప్రత్యేకమైన ఫోక స్ లేకుండాపోయింది. పండిట్ ట్రైనింగ్ కోర్సులు ఒకవేళ వద్దనుకుంటే కొత్త కోర్సును ఆఫర్ చేయవచ్చు. లాంగ్వేజ్‌పండిట్ అనకుండా బీఏ లాం గ్వేజ్ ఎడ్యుకేషన్ అని పెట్టాలి. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో అక్కడ మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ బీఈడీ శిక్షణలో లాంగ్వేజ్‌ను ఫోకస్‌చేసి డిగ్రీ ఇస్తారు. బీఏ బీఈడీ లాంగ్వేజ్ కోర్సులలో మనం కూడా మన తెలుగుకు ప్రత్యేకమైన ఫోకస్ ఇవ్వాలి. ఇందుకు అధికార భాషాసంఘం, తెలంగాణ భాషాసాహిత్య అకాడమీ, తెలుగు యూనివర్శిటీ, సారస్వత పరిషత్‌లు కలిసి ఈ తెలుగు భాషకు ప్రత్యేక ఫోకస్ ఇచ్చే కోర్సులను డిజై న్ చేయవచ్చు.

గతంలో పాలకులుచేసిన పని లాంగ్వేజ్ పండిట్‌ను జీరో కోర్సుగా మార్చివేశారు. అది ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాల్లో జీరో అయ్యిం ది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కోర్సులు తిరిగిప్రాణం పోసుకోబోతున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు తెలుగు భాషపై పట్టుంది, తెలుగుభాషపై ప్రేముండేది. పీవీ బహుభాషాకోవిదుడు. కేసీఆర్‌కు స్వయంగా తెలుగు చదువుకొన్నారు. తెలుగు భాషపై ఏ ముఖ్యమంత్రికి లేనంత పట్టు కేసీఆర్‌కుంది. అన్ని సాహిత్య ప్రక్రియల గురించి ఆయనకు పరిపూర్ణ పరిజ్జానం ఉంది. తెలుగు భాషకు ప్రాణంపోసేందుకు ఒకటి నుంచి పన్నెండు తరగతుల వరకు విధిగా తెలుగు చదువాలనే చట్టం తేబోతున్నారు. నిరంతర అధ్యయనంకూడా ఆయన ను తెలుగు సాహిత్యపీఠంపై నిలబెట్టాయి. అందుకే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా కవులు, రచయితలతో కలిసిపోయి ఒక కవిగా, ఒక రచయితగా ఆలోచించారు. ఒక పనిని పూర్తిచేసేందుకు సిద్ధపడితే పట్టు వదులకుండా లక్ష్యాన్ని చేరడం ఆయనకు అలవాటు. తెలుగు భాష విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దమ్మున్న నిర్ణయం.
shenkar
అయితే ఇప్పుడున్న సిలబస్ మొత్తాన్ని కూడా కొత్తగా పునర్ నిర్వచ నం చేసుకోవాలి. తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పునర్ముద్రించుకోవాలి. శతక పద్యాల్లాంటి వాటిని తిరిగి సిలబస్‌లో ప్రవేశపెట్టాలి. మళ్లీ కొత్తగా పాఠాలు రాయాలి. ప్రాచీన సాహిత్యాన్ని గౌరవిస్తూ అందులోని గొప్పసాహిత్యాన్ని ఈ తరం చదువుకునే విధంగా చేయాలి. పాఠాలు సందేశాత్మకంగా ఉండాలి. సిలబస్‌లో కులాన్ని మెచ్చుకునేవి, రెచ్చగొట్టేవి ఉండకూడదు. పాఠం సందేశాత్మకంగా ఉండాలి. ఆత్మగౌరవం, అందరూ సమానంగా ఉండాలని విలువలను ప్రబోధించే పాఠాలు సిలబస్‌లో చేర్చాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

810

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల