బీసీల భవిష్యత్తు కోసం


Wed,October 18, 2017 01:25 AM

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించేందుకు ఆయాశాఖల అధిపతులతో బీసీ కమిషన్ చర్చించింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? ఆ ఉద్యోగుల్లో ఏయే కులాలవారు, ఏయే నిష్పత్తుల్లో ఉన్నారు? ప్రధానంగా బీసీ కులాల వాళ్లు ఎంత మంది?ఇందులో బీసీల్లో క్యాటగిరీల వారీగా ఏయే కులాల వాళ్లు ఎంతమంది? ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించవలసిందిగా బీసీ కమిషన్ కోరింది.

విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్న వారికి న్యాయం చేసేందుకు ఒక దారి ఏర్పడుతుంది. ఆ పని చేసేందుకు తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందుం డే స్థితి కల్పించటమే అందరి లక్ష్యం కావాలి. సీఎం కేసీఆర్ మొత్తం
బీసీకులాలకు సంబంధించి వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకపోయేందుకు ఇప్పటికే అనేక పథక రచనలు చేశారు. ఇందుకోసం ఈ వర్గాల పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ప్రమాణాలు గల చదువు అందించేందుకు ప్రభుత్వ
విద్యాలయాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అధ్యయనం అందుకు అక్షరరూపం.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో నియామకాల వివరాలు, కులాలు, ఉపకులాల వారీగా కావాలని కోరింది. ఈ లెక్కలు ఎలా తీయాలన్న ఫార్మట్‌ను కూడా ఆయా ప్రభుత్వశాఖలకు అందించటం జరిగింది. రాష్ట్ర ప్రభు త్వం జీఓఎంఎస్ నెం.9 ద్వారా టీఓఆర్ జారీచేసిన ఉత్తర్వు ఆధారంగా కమిషన్ అధ్యయనం మొదలుపెట్టింది. విద్యారంగానికి సంబంధించిన లెక్కలంటే సుమారు కోటిమంది వరకు సంబంధించిన సమాచారం సేకరించవలసి ఉన్నది.
ఇదొక బృహత్తరమైన పని. ఇప్పటివరకు ఈ రకమైన లెక్కలు తీయ లేదు. బీసీ కులాల లెక్క ఉండవచ్చును కానీ ఆ బీసీలలో తిరిగి ఏయే కులాలవాళ్లు ఎంతమంది అన్న లెక్కల్లేవు. అలాగే విద్యార్థుల సామాజి కవర్గాల వారీగా వివరాలను సేకరించవలసి ఉన్నది. అదికూడా ఉపకులాలతో సహా లెక్కలు బయటకు తీయాలి. ఈ అధ్యయనం జరిగితేనే అసలు బీసీల్లో ఏయే కులాలవారు లబ్ధి పొందుతున్నారు? ఏయే కులా ల వాళ్లు విద్యాపరంగా ఎంత శాతంగా ఎదిగారు? ఉద్యోగుల స్థాయికి ఇంకా వెళ్లని బీసీకులాలెన్ని? అసలు సంచారజాతులు, బీసీలోని ఉపకులాల పిల్లలు ఎంతమంది బడికి వస్తున్నారు? సంచారజాతుల్లో ఇప్పటిదాకా ఉద్యోగాలు పొందని కులాలెన్ని? తేటతెల్లమవుతుంది.
విద్యాపరంగా ఎదిగిన కులాల జీవనవిధానం, జీవనశైలిలో ఎంతో మార్పులు కన్పిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి కులాల జీవ న స్థితిగతులు పూర్తిగా మారిపోయి ఉంటాయి. ఈ అంచనాలు వేయకుండా వారి సామాజిక జీవితాలను అధ్యయనం చేయటం కష్టం. విద్యా సమాచారమే అన్నిరంగాలకు సంబంధించిన సమాచారానికి పునాది అవుతుంది.

దీనికోసం విద్యాపరమైన లెక్కలు తీసే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో 1-10 తరగతుల వరకు చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 58 లక్షల 60 వేలు. 2016-17 విద్యా సంవత్సరం ఆధారంగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర విద్యా సంబంధమైన లెక్కలు తీస్తు న్నది. సెప్టెంబర్ నుంచి ఈ లెక్కలు తీసే కార్యక్రమం మొదలైంది.1-10 తరగతుల వరకు ఉన్న 58 లక్షల 60 వేల మంది విద్యార్థుల్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మొత్తం 29,13,305 మంది ఉంటే బీసీ విద్యార్థులు 29,56,481 మంది ఉన్నారు. అంటే బీసీ విద్యార్థులు 51.35 శాతం. ఇందులో బీసీ కమిషన్ కులాలవారీగా వివరాలు సేకరిస్తున్నది.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు 41,337 వరకు ఉన్నా యి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, హైస్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 2016-17లో మొత్తం 2,21,202 మంది ఉన్నారు. ఇందులో పురుష ఉపాధ్యాయులు 1,11,4005 మంది, మహిళా ఉపాధ్యాయులు 1,09,797 మంది. ఇందులో ఓసీ ఉపాధ్యాయులు 13,8 50, ఎస్సీ-25,722, ఎస్టీ-16,711, ఓబీసీ-97,812 మంది ఉన్నా రు. సగానికి ఉన్న ఈ బీసీ ఉపాధ్యాయుల్లో కులాలు, ఉప కులాలవారీ గా లెక్కలు తీసేపనిలో స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. స్కూల్ ఎడ్యుకేషన్ ఈ లెక్కలన్నింటిని ఎన్‌ఐసి (నేషనల్ ఇన్‌ఫర్‌మ్యాటిక్ సెంటర్) ద్వారా సేకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల పట్టికలో మొత్తం 113 కులాలున్నాయి. ఈ పట్టికలో ఆశ్రిత కులాలు, సంచార కులాలున్నాయి. ఇంకా కొన్ని బీసీ కులాలవారు, సంచార జాతులవారు బీసీ కులాల పట్టికలోకి ఎక్కలేదు. బీసీ కులాల పట్టికలో లేని బీసీ కులాల వారీ పేర్లు ఆ విద్యార్థుల దగ్గర రాయవలసి ఉంది. ఈ లెక్కలన్నీ వచ్చినప్పుడే ఏయే కులాల పిల్లలు ఎంతమంది చదువుతున్నారో తెలుస్తున్నది. అలాగే ఏయే స్థాయి ల్లో విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారో కూడా లెక్క తీస్తున్నారు. అలాగే ఏ సామాజికవర్గాల పిల్లలు బడికి రాలేకపోతున్నారు. అందుకు కారణాలేమిటి? సమగ్రంగా లెక్కలు వస్తేనే దీనిపై అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో బీసీ కులాల జనాభా వివరాలు తీసుకోవటం ఒకెత్తయితే ఆయా కులాల పిల్లలు ఎంతవరకు చదువుతున్నారన్నది ముఖ్యాంశం. కొన్ని సర్వేల ఆధారంగా ముదిరాజ్‌లు 24 లక్షలు, యాద వ 20 లక్ష లు, గౌడ 16 లక్షలు, మున్నూరుకాపు 13 లక్ష ల 50 వేలు, పద్మశాలీ 12 లక్షలు, రజక 8 లక్షల 60 వేలు, బెస్త, గంగపుత్ర 4 లక్షల 25 వేలు, విశ్వకర్మలు 9 లక్షల పైచిలుకు వరకు ఉన్నారు. మిగితా కులా ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. వొడ్డెర 2 లక్షలకు పైగా ఉన్నారు. కుమ్మరులు 4 లక్షలు, ఉప్పర 1 లక్ష 70 వేలు, పెరిక 3 లక్ష లు, మం గలి 2 లక్షలు, దూదేకుల 3 లక్షలు, మేర్చ 1 లక్ష, దూదేకుల 3 లక్షలు జనాభా కలిగి ఉన్నారు. కొన్ని కులాలు ఉపకులాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. వీరభద్రీయ, వీరముష్టిలు కలిపి 17 వేలు, వీరశైవ 60 వేలు, సూర్యబలిజ, టికాపు, తలయారి, తంబోలి లాంటి వాళ్లకులాల సంఖ్య 3 నుంచి 6 వేల వరకే ఉన్నది. పాముల, పంబాల, పట్టపు, సాదుచెట్టి, సగరు, వక్కలిగర, వన్యకులక్షత్రియ, సెగిడి, సాలివాన్, దేవతికుల, ఆరె సూర్యవంశి, నెల్లి, నిషాది, కంజరభట్ట, జింగార్ లాంటి కులాల సంఖ్య వందల్లోనే ఉన్నది. కొన్ని సంచార, ఉపకులాలు, ఆశ్రిత కులాల సంఖ్య వేలల్లో ఉన్నది. ఈ మొత్తం కులాల వారి పిల్లలు ఎంతమంది బడిగడప తొక్కుతున్నారో సంపూర్ణంగా లెక్కలు తీయవలసి ఉన్నది.

రాష్ట్రంలో 6 లక్షల మంది డిగ్రీ చదివే విద్యార్థులున్నారు. డిగ్రీ కాలేజీల సంఖ్య 1,097, ఇందులో 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 941 ప్రైవేట్ కాలేజీలున్నాయి. 2017-18లో మొత్తం 214 ఇంజినీరింగ్ కాలేజీలుండగా అందులో 97,842 మంది విద్యార్థులు చదువుతున్నా రు. ఫార్మసీ కాలేజీలు 127 అందులో 9,888 విద్యార్థులు, ఫార్మా డి 54 కాలేజీలు ఉండగా 1,588 విద్యార్థులున్నారు. ఎంబీఏ 296 కాలేజీలుండగా అందులో 31,950 విద్యార్థులున్నారు.బీసీల సమగ్ర అధ్యయనానికి విద్యారంగం మూలస్తంభం లాంటిది. ఈ రంగం ద్వారా మొత్తం బీసీకులాల వెనుకబాటుతనాన్ని చాలావర కు వారి ఆర్థిక జీవన స్థితిగతులను కూడా అంచనా వేయవచ్చు. దీంతో పాటు తల్లిదండ్రుల చదువుల నేపథ్యం కూడా తీసుకోవాలి. దీనిద్వారా వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారా? లేక ఎగువన ఉన్నారా? కులం వల్ల, చదువు వల్ల మారిన సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. పిల్లల చదువులతో పాటుగా తల్లిదండ్రులు ఏం చదివారు? ఏ వృత్తిని చేస్తున్నారు? అన్నది కూడా తెలియాలి. ఏయే కులాల్లో చదువుకోని వారి సంఖ్య అధికంగా ఉంది కూడా తెలుస్తుంది. దీంతో విద్యాపరంగా వెనుకబాటుతనం అంచనా వేయటానికి దోహదపడుతుంది. ఈ లెక్కలు సక్రమంగా ఉంటేనే క్రిమిలేయర్ పాయింట్ తేటతేల్లమవుతుంది. అంటే 8 లక్షల ఆదాయానికి మించి ఉన్న కుటుంబాలు స్పష్టంగా తెలిస్తేనే వాళ్లు క్రిమిలేయర్ ఫ్యామిలీ లేక నాన్ క్రిమిలేయర్ ఫ్యామిలీ అన్నది తెలుస్తుంది.
shenkar

ఇప్పుడు విద్యాపరంగా బీసీ కమిషన్ చేపట్టిన సర్వే, అధ్యయనం ద్వారా సుమారు ముప్ఫై లక్షల కుటుంబాల సమగ్ర విద్యా సర్వే తెలుస్తుంది. తెలంగాణ, ఏపీలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో 29 శాతం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. బీసీ (ఎ) గ్రూపునకు 7 శాతం, (బి) గ్రూపునకు 10, (సి) గ్రూపునకు 1, (డి) గ్రూపు నకు 7, బీసీ (ఇ) గ్రూపునకు 4శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించబడి నాయి. అదే కర్ణాటకలో విద్యాఉద్యోగ రంగాల్లో 32 శాతం, కేరళలో 40, అదే తమిళనాడులో బీసీలకు 26.5, బీసీ ముస్లింలకు 3.5, బాగావెనుకబడిన బీసీలు, డీ నోటిఫైడ్ కమ్యూనిటీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ప్రత్యేక వెనుకబడిన కులాలకు 2 శాతం, ఓబీసీలకు 19 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇలా దేశంలోని 29 రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ఇచ్చేందుకు చేసిన సర్వేల్లో విద్యా విషయమైన సర్వే కీలకమైంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపుదలకు పునాదిగా కమిషన్ అధ్యయనం కొనసాగుతున్నది. దీనిద్వారా ఇప్పటివరకు విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్న వారికి న్యాయం చేసేందుకు ఒక దారి ఏర్పడుతుంది. ఆ పని చేసేందుకు తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందుం డే స్థితి కల్పించటమే అందరి లక్ష్యం కావాలి. సీఎం కేసీఆర్ మొత్తం బీసీకులాలకు సంబంధించి వారిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకపోయేందుకు ఇప్పటికే అనేక పథక రచనలు చేశారు. ఇందుకోసం ఈ వర్గాల పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ప్రమాణాలు గల చదువు అందించేందు కు ప్రభుత్వ విద్యాలయాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పు డు జరుగుతున్న అధ్యయనం అందుకు అక్షరరూపం.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

1193

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles