నేను ఏ జాతి.. మాది ఏ కులం?


Fri,September 29, 2017 01:31 AM

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్కువ కులస్థులను కొందరు మనుషులుగా చూడని దశ ఉంది. అనేక పోరాట పొద్దుపొడుపుల నుంచి సమత్వపు సూరుళ్లు ఉదయించారు. మహాత్మాజ్యోతిబా పూలే, అంబేద్కర్, సావిత్రీబాయి పూలే లాంటి వ్యక్తుల జీవితకాలపు పోరాటాలతో భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. అందరికీ సమహక్కులనిచ్చింది, ఓటు హక్కునిచ్చింది కానీ, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినప్పటికీ పాలకులు ఏం చేశారో ఏమోకానీ కొందరు అట్టడుగు కులస్థులకు, ఆశ్రిత కులాల వారికి సంచారజాతుల వారికి కనీసంగా గుర్తించకపోవటం ఒక ఆశ్చర్యం.

సంచారజాతులకు సంబంధించి డి నోటిఫైడ్, అర్ధ సంచార తెగలు, సంచార జాతులవారున్నారు. ఇప్పటివరకు దేశంలో సంచారజాతుల సంఖ్య ఎంత అన్నది అస్పష్టం. 1931లో ఓటరు జాబితా ఆధారంగా వచ్చిన సమాచారాన్ని చూస్తేదేశవ్యాప్తంగా ఈ జనాభా 12 కోట్లకు పైన ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. 2011లో జనాభా లెక్కల సేకరణలో వీరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారా? లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.

తరతరాలుగా ఆశ్రిత కులస్థులుగా, సంచార జాతులుగాఉన్న కొన్ని కులాల వారిని వారే కులం వారో ఇప్పటికీ గుర్తించకపోవటం విచారకరం. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సంచారకులాల వారిని ఏ కులం వారో కేంద్రం గుర్తించలేదు. కాబట్టి వారికి కులం సర్టిఫికెట్లు లేవు. కులం సర్టిఫికెట్లు లేకపోవటంతో వారికి రిజర్వేషన్లు అందటం లేదు. రిజర్వేషన్ల సౌకర్యం ఉంటే ఈ సంచార కులాలకు ఎంతో ఆసరా ఉంటుండేది. అయ్యా మమ్ముల్ని, మా కులాన్ని గుర్తించి బీసీలోనో, ఎస్సీలోనో, ఎస్టీ జాబితాలోనో చేర్చండని కోరుతున్నారు. కుల సంస్కృతి, జీవనవిధానం, సాంస్కృతిక నేపథ్యం చూసి బీసీ కులా లు, సంచారజాతుల జాబితాలో చేర్చమని అడుగుతున్నారు. బీసీ కులా ల అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లిన బీసీ కమిషన్ దృష్టికి ఇలాంటి అనేక విషయాలు వచ్చాయి.
రాష్ట్రం అవతరించాక సంచారజాతుల పిల్లలను స్థానిక బీసీ వెల్ఫేర్ అధికారుల చొరవతో బడిలోకి, హాస్టల్స్‌లోకి చేర్చుతున్నారు. ఇది మం చి పరిణామం. కొన్ని సంచారజాతులు కొన్నిచోట్ల స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది పెద్ద మార్పు. స్థిరనివాసం కోసం ప్రయత్నం చేస్తుంటే కులపరమైన సర్టిఫికెట్లు లేకపోవటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ అందించే అనేక ఆసరా పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, బడుల్లో ప్రవేశాలు లాంటివి లభిస్తున్నాయి. కానీ మాకు కులం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు జం కుతున్నారని, అదే సమస్యగా మారిందని వాళ్లు బాధపడుతున్నారు.

నాటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అనేక క్రూర చట్టాల్లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఒకటి. ఆకలి బాధను తట్టుకోలేక తిండి గింజల కోసం జనం దాడులు చేశారు. రైల్వే వ్యాగిన్లను పగులకొట్టి ధాన్యం తీసుకపోయారు. దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబుల్స్ యాక్ట్ 1871 ను తీసుకువచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం వడ్డెర్లను క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్రవేసి హింసించింది. వడ్డెర్లతో రోడ్లు, రైల్వేలైన్లు వేయించి, ప్రభుత్వ కార్యాలయాల్లో నానా చాకిరీ చేయించుకొని కూలీ కూడా ఇచ్చేవారుకాదు. స్వాతంత్య్రం వచ్చాక అయ్యంగార్ కమిషన్ నివేదిక ఆధారంగా నెహ్రూ 1952లో ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను రద్దుచేశారు. టంగుటూ రు ప్రకాశం పంతులు, పీఏ రాఘవయ్య క్రిమినల్ ట్రైబ్స్‌పై అధ్యయనం చేశారు. అడవుల్లో ఉండేవారిని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా, మైదాన ప్రాంతంలో ఊరికి దూరంగా వెలివాడల్లో అంటరానివారుగా ఉన్నవారిని షెడ్యూల్డ్ కులాలుగా విభజించారు. సంచారజాతులను ఎస్టీలుగా గుర్తించలేదు. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్ అన్న క్యాటగిరీని ఏర్పరిచారు. కానీ వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో సంచారజాతులపై అధ్యయనం చేయించి కేంద్రానికి నివేదిక పంపాలి. దానికి కేంద్రం స్పందించాల్సి ఉంటుంది.

డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్, సెమి నొమాడిక్‌లను క్యాటగిరీలుగా విభజించటం జరిగింది. ఈ లెక్కలో కొన్ని జాతుల వారు బీసీలయ్యా రు. 1970లో లంబాడ, ఎరుకలను ఎస్టీలో చేర్చారు. ఈ సంచారజాతులపై సమగ్రమైన అధ్యయనం చేసేందుకు కేంద్రం 2004లో జస్టిస్ మోతిలాల్ రాథోడ్ కమిషన్, 2006లో జస్టిస్ బాలకృష్ణ రేణకే నేతృత్వంలో రెండో కమిషన్‌ను వేసింది. రేణకే కమిషన్ 76 సిఫార్సులతో 2008లో నివేదికను కేంద్రానికిచ్చింది. కానీ అది నేటికీ అమలుకు నోచుకోలేదు.

సంచార జాతులవారు కొందరు ఇప్పటికీ బీసీ కులాల జాబితాలో చేర్చబడలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న బీసీకులాల జాబితా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో ఈ రెండు రాష్ర్టాలను కలిపి జాబితా తయారుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలుండగా తెలంగాణ రాష్ట్రంలో 113 సామాజిక వర్గాలను బీసీల జాబితాలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ(ఏ) గ్రూపులో మూలవాసులైన గిరిజన తెగలు, విముక్త జాతులు, సంచార తెగలు, అర్ధ సంచార తెగలు చేర్చబడ్డాయి.

బీసీ(ఏ) గ్రూప్‌లో సంచారజాతులు: బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దొమ్మర, గంగిరెద్దుల, జంగం (భిక్షాటన వీరి సంప్రదాయవృ త్తి), జోగి, కాటిపాపల, లంబాడ లేదా బంజార, మొండివారు, మొండిబండ, బండ, మంగలి, మంగల, బజంత్రీ, వంశరాజ్/ పిచ్చకుంట్ల, పాముల, పర్ది (నిర్షికారి), పంబల, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, దమ్మలి/ దమ్మల/ దమ్ముల/ దమ ల, నెట్టికోటల, వీరభద్రీయ, గుడాల, కంజర -భట్ట, కెప్మర లేదా రెడ్డిక, మొండెపట్ట, నొక్కర, పరికి ముగ్గుల, యాట, చొపెమారి, కైకడి, జోషినందివాలరు, వడ్డే (ఒడ్డిలు, వడ్డి, వడ్డెలు), వడ్డెర, వడ్డబోవి, వడియరాజ్, మందుల, మెహతర్ (ముస్లిం), పత్ర, పాల-ఏకరి, ఎకిల, వ్యాకు ల, ఎకిరి, నాయనివారు, పాలెగారు, తొలగరి, కావలి, రాజన్నల, రాజన్నలు, గోత్రాల, కసికపాడి/కసికపూడి, సిద్దుల, సిక్లిగర్/సైకిల్‌గర్, పూసల, అనాద పిల్లలు.

ఇప్పటికీ 21కులాలు గుర్తింపు లేనివిగా ఉన్నట్లు తెలుస్తున్నది. వీరికి కుల సర్టిఫికెట్లు లేవు. వీరి పిల్లలను బడుల్లో చేర్చాలంటే పెద్ద సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో గుర్తింపులే ని కులాలవారు తమకు నూతన ప్రభుత్వం తమ సమస్యలను తీర్చడ మే గాక, కుల సర్టిఫికెట్లు అందిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. కులసర్టిఫికెట్ల సమస్యను పరిష్కరించాలని బీసీ కమిషన్‌ను కోరుతున్నారు. తెలంగాణలో గుర్తింపులేని కులాలు: బాగోతుల, శ్రీక్షత్రియరామజోగి , బైలుకమ్మర, గవులి, ఓడ్, కాకిపడిగెల. బొప్పల, గంజికూటివారు, ఏనూటి, గుర్రపువారు, అద్దపువారు, మాసయ్యలు, పఠంవారు, సాధనాసూరులు, రుంజ, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సన్నాయిల. సామాజిక జీవనాన్ని బట్టి వీరంతా సంచారజాతులు. బీసీల కిందకే వస్తారని కొన్ని కులాలు చెప్పవచ్చు. కొన్ని దశాబ్దాలుగా వీరు తమ కులాన్ని బీసీ కుల జాబితాలో చేర్చాలని వేడుకుంటున్నారు. ఈ 21 కులాలు తెలంగాణలోనే ఉన్నాయి. రామజోగి కులస్తులు బీసీ జాబితాలో చేర్చమని అడిగితే గతపాలకులు వీరిని జోగి కుల సర్టిఫికెట్ తీసుకోమని చెప్పారు. ఆ కులస్థులు అందుకు ఒప్పుకోవటంలేదు. తమకు జోగి కులానికి సంబంధం లేదని రామజోగులంటున్నారు. ఓడ్ కులస్థులు ఒడ్డెరకు ఉపకులాలుగా చేర్చవచ్చునంటున్నారు. వడ్డెర ఉపకులాలు రాయి పని, మట్టిపని చేస్తారు. ఈ ఓడ్ కులస్తులు కూడా మట్టిపనే చేస్తారు. ఉప్పర, సగర కులస్థులు మట్టి పనిచేస్తున్నప్పటికీ వారు వేర్వేరు కులాలు. ఈ మట్టి పని వారు తమను ఓడ్ కులస్తులను కూడా చేర్చమని కోరుతున్నారు.
shenkar
గతంలో ఎస్సీ, ఎస్టీల మీద లోకూర్ కమిటీ వేస్తే ఆ సందర్భంగా సం చారజాతుల చర్చ వచ్చింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఒకే వృత్తిలో పనిచేస్తూ, ఆ పనిలో సారూప్యత ఉంటే ఆ కుల జాబితాలో సంబంధిత సారూప్యత ఉన్న కులాన్ని కూడా చేర్చవచ్చునని తెలిపింది. దీని ఆధారంగా జోగిపక్కన తమ రామజోగి కులా న్ని కూడా చేర్చాలని, వడ్డెర్ల పక్కన ఓడ్ కులస్తులను చేర్చాలని ఆ సం బంధిత కులాలవారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే తెలంగాణలోని ఈ 21 కులాలవారు కొందరు తమను బీసీ కులజాబితాల్లో చేర్చాలనడిగితే, మరికొందరు ఎస్సీ కులజాబితాలో చేర్చాలని అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి వీరి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా నేపథ్యాలను సమగ్రంగా పరిశీలించవలసి ఉన్నది. తరతరాలుగా సంచారజాతులుగా ఉండటమే కాకుండా నేటికీ అదే సంచార వృత్తిని కొనసాగిస్తున్నవారి తీరును బట్టి కూడా వారి కులస్థానాన్ని నిర్ణయించా ల్సి ఉంటుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో సంచారకులాల సుస్థిరస్థాన నిర్మాణం కూడా జరుగాలని కోరుతున్నారు. త్యాగాలుచేసి గెలిచిన తెలంగాణ సమాజం తనలో అంతర్భాగంగా ఉన్న సంచారజాతుల గుండెదండోరాను సీఎం కేసీఆర్ విని నెరవేరుస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనైనా తమ జీవితాలు మారాలని వారు కోరుకుంటున్నారు. సంచారజాతుల జీవనవిధానం మార్పునకు జరిగే మహత్తర కృషిలో భాగంగానే బీసీ కమిషన్ అధ్యయనం కూడా ముందుకు సాగుతుంది.

సంచారజాతులకు సంబంధించి డి నోటిఫైడ్, అర్ధ సంచార తెగలు, సంచార జాతులవారున్నారు. ఇప్పటివరకు దేశంలో సంచారజాతుల సంఖ్య ఎంత అన్నది అస్పష్టం. 1931లో ఓటరు జాబితా ఆధారంగా వచ్చిన సమాచారాన్ని చూస్తే దేశవ్యాప్తంగా ఈ జనాభా 12 కోట్లకు పైన ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. 2011లో జనాభా లెక్కల సేకరణలో వీరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారా? లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.
(మిగతా రేపు)

3035

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల