బీసీలపై సమగ్ర అధ్యయనం


Tue,August 29, 2017 11:30 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సిన వాటాలను అందజేసేందుకు అనేక పథకాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి బీసీ కమిషన్ వేశారు. దీనికి మొత్తం సమాజంలో 52 శాతంగా ఉన్న బీసీల జీవన స్థితిగతులను, క్షేత్రస్థాయిలో వారి జీవన విధానాన్ని తెలుసుకొనేందుకు కీలక బాధ్యతలను అప్పగించారు.

ఎం బీసీలుగా గుర్తించేటప్పుడు వారి కమ్యూనిటీ సోషల్ క్యాపిట్‌ను చూడాలి. ప్రభుత్వ లక్ష్యం, కేసీఆర్ ఆలోచనల దృష్టి, బీసీ కమిషన్ చేస్తున్న సమగ్ర అధ్యయనం-అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబహుజనులకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకే. తెలంగాణ బహుజనులు సుఖసంతోషాలతో వర్ధిల్లే విధంగా చేయడంలో ఈ కృషి పునాదిగా ఉంటుంది.

బీసీ (ఇ) గ్రూప్‌లో ఉన్న ముస్లింల దయనీయ పరిస్థితి చూసి వారి జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. వారి జీవన విధానాన్ని, స్థితిగతులను అధ్యయనం చేయాల్సిందిగా బీసీ కమిషన్‌ను ముఖ్యమంత్రి కోరారు. ఆయన ఆదేశానుసారం బీసీ కమిషన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి బీసీ(ఇ) గ్రూప్ సామాజిక వర్గానికి 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయిం చారు.

తెలంగాణ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు. వీరి సంఖ్య 85 శాతం అని, వీరి జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చగలిగినప్పుడే తెలంగాణ సమాజం అన్నిరంగాల్లో శిరస్సెత్తుకొని నిలబడగలుగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి కూడా కేసీఆరే. ఆయన బహుజన వర్గాలను అన్నిరంగాల్లో ఎదిగే విధంగా చేసేందుకు ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇది తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మార్పు. ఇప్పటిదాకా ఏ పాలకపక్షం ఆ పనిని సీరియస్‌గా తీసుకోలేదు. కేసీఆర్ బహుజన జీవితాలను తీర్చిదిద్దటాన్ని ఒక సవాల్‌గా స్వీకరించారు. అందులో భాగంగానే బీసీలపైన సమగ్ర అధ్యయనం కూడా మొదలు పెట్టించారు. బహుజన జీవితాల కులవృత్తులు, ఉత్పత్తి కులాల జీవన విధానం గురించి కేసీఆర్‌కు పరిపూర్ణ అవగాహన ఉన్నది. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఎంబీసీల కోసం వెయ్యికోట్లు ప్రకటించారు. సంచార జాతుల జీవనం చాలా దుర్భరమైనది. వారి జీవితాలను స్థిరపరుచ టం కోసం అసలు వారు ఎక్కడున్నారు? వారికి స్థిరనివాసం కలిగించటానికి ఏంచేయాలి? ఆ సంచారజాతుల పిల్లలు చదువుతున్నారా? అస లు సంచారవృత్తి ఈ ఆధునిక కాలంలో ఎలా నడుస్తున్నది? అనేది అధ్యయనం చేయాలి. ఈ సంచారజాతి ఒక ప్రత్యేకస్థితిని కలిగి ఉన్నది. ఈ కులా లవారికి కూడా ఒక స్థిర నివాసం ఏర్పాటుచేసి, అన్నిరంగాల్లోకి ఈ సంచారజాతుల వారు కూడా వచ్చేవిధంగా చేయాలన్న సంక ల్పం నెరవేర్చేందుకు బీసీ కమిషన్ అధ్యయనం ప్రారంభించింది.

ఈ లక్ష్య సాధనకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి బీసీ కమిషన్ సమాచారాన్ని సేకరిస్తున్నది. ఈ సమాచారంలో బీసీ కులాలు అంటూ ప్రత్యేకంగా లేవు. ఆ కులాల సంఖ్య ఎంతో తెలుసుకోవాలి. మొత్తం ప్రభుత్వ శాఖల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఉన్న బీసీలలో ఏయే కులా ల వారు ఉద్యోగాల్లో, కీలక రంగాల్లో ఉన్నారు? ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరని కులాల సంఖ్య కూడా ఎంత ఉన్నది? లాంటి సమగ్ర సమాచారం సేకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 113 బీసీ కులాలున్నాయని ప్రభుత్వం తేల్చింది. అయితే ఇందులో సంచార కులాలు లేవు. సంచార కులాల జనాభా ఎంతో కూడా స్పష్టంగా లేదు. ఆ సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నది.

బీసీల సమగ్ర జీవన విధానాన్ని అధ్యయనం చేయటానికి ప్రధానం గా జనాభా లెక్కలపైనే ఆధారపడాలి. అయితే 2011లో కేంద్ర ప్రభు త్వం చేసిన జనాభా గణనను ఆధారంగా తీసుకోవాలా? లేదా తెలంగా ణ ప్రభుత్వం ఒకేరోజు వినూత్నంగా జరిపిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా తీసుకోవాలా? లేక కొత్తగా మళ్లీ బీసీల జనాభా గణనను తీసుకోవాలా? అన్న అంశాలు ఇప్పుడు బీసీ కమిషన్ ముందున్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు, ప్రైవేట్ వ్యవస్థలు, ఐటీ రంగాల్లో అట్టడుగు కులాల వారు ఎంతమంది ఉన్నారు? అందులో బీసీలు ఎంత మంది? ఎంబీసీలు ఎంత మంది? సంచార జాతుల వారు ఎంతమంది? సమగ్రంగా ఈ లెక్కలు తీయాల్సి ఉన్నది. ఎంబీసీలుగా నిర్ణయించేటప్పుడు ఆయా కులాల చారిత్రక పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు జరిగే సమగ్ర సర్వేలో క్వాంటిటేటీవ్, క్వాలిటేటీ వ్ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే ఎంబీసీలకు సంబంధించి యూపీ, బీహార్, తమిళనాడులో ఒక వ్యవస్థ ఉన్నది. ఆ రాష్ట్రాలను అధ్యయనం చేయాల్సి ఉన్నది.విద్య, ఉద్యోగ విషయాల్లో ఈ 52 శాతానికి సంబంధించిన వారికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నది. కేసీఆర్ దీన్ని సవాల్‌గా తీసుకున్నారు. బీసీలలో అన్నివర్గాల వారికి అన్నిరంగాల్లో సమ ప్రాధాన్యం కల్పించాలన్న ఆలోచనతో ఆయన తెలంగాణ రాష్ట్ర బీసీ డిక్లరేషన్‌ను ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

పేదరికం నుంచి రిజర్వేషన్లను చూడకూడదన్న ఆలోచనలున్నాయి. ప్రజాస్వామ్యసారం ప్రాతినిధ్యతతో ఉంటుంది. అన్నివర్గాలకు, కులా లకు, లింగాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది సంక్లిష్ట సమాజం. అన్నిరం గాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలన్న కోణం నుంచి రిజర్వేషన్లను చూడాలి. మండల్ కమిషన్‌లో బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. కాని ఓబీ సీ అని అందులో స్పష్టంగా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు కూడా ఈ రిజర్వేషన్ల అంశం పెద్ద సవాల్‌గానే మిగిలింది. ఓబీసీ, మోస్ట్‌బ్యాక్‌వర్డ్ క్లాస్, ఎక్స్‌ట్రీమ్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్, నోమాడిక్, సెమి నోమాడిక్ కులాల విభజన చేయవలిసి ఉన్నది. దీనిలో ఎవరు ఓబీసీలు, ఎవరు ఎంబీసీలన్న విషయం తేల్చాల్సి ఉన్నది. బీసీలపై ఆధారపడ్డ ఆశ్రిత కులాలున్నాయి. వారిని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బీసీలుగా గుర్తించలేదు. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆశ్రిత కులాలను కూడా బీసీల్లో చేర్చేందుకు అధ్యయనం చేయమని బీసీ కమిషన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్య.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచార జాతులవారు 75 లక్షల మంది ఉన్నారని తెలుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచారజాతులు 35 లక్షల వరకు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. సంచార జాతులు 36 వరకు ఉన్నాయని వీటిపై అధ్యయనం చేసిన కొందరు చెబుతుంటే, 36 సంచార కులాలు మాత్రమే ఉన్నాయని మరికొందరు వాదిస్తున్నా రు. మొత్తమ్మీద ప్రభుత్వ బాబితాలో 23 సంచార జాతులు లేవని కొందరు వాదిస్తున్నారు. రామజోగి, మందెచ్చుల, బాగోతుల, రుంజ, పెక్కర, ఏదిలవారు, గౌడజెట్టిలు, బొప్పల, కడలిచివర, సరగాని, సన్నాయిలు, బైల్ కమ్మరుల వంటి కులాలు ఇప్పటివరకు బీసీకులాల జాబితాలో లేవు. బీసీలలోనే అథమస్థాయిలో ఉన్న మోస్ట్ బ్యాక్‌వర్డ్ కులాలను, సంచారజాతుల వారిని అక్కున చేర్చుకొని వారి గురించి ఆలోచించటమే కేసీఆర్ చేసిన గొప్ప పని. సంచారజాతుల వారిని విద్య, ఉద్యోగ రంగాల్లో నిలబెట్టాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
shankar
బీసీలకు, ఎంబీసీలకు రక్షణ ఉన్నది. కానీ, సంచార జాతులకు లేదు. వారికి సంపూర్ణమైన రక్షణ కల్పించాల్సి ఉన్నది. ఈ విషయాన్ని కాక కలేల్కర్ రిపోర్ట్‌లో స్పష్టంగా చెప్పారు. సంచారజాతులకు సంబంధించి అనంతరావ్‌ు కమిషన్‌లో కొంతమేరకు పరిశోధించటం జరిగింది. కాని కొత్త సంచార జాతులను గుర్తించలేదు. పాత ప్రభుత్వ జాబితాలనే వారు తీసుకొన్నారు. బీసీ(ఎ) గ్రూప్‌లో కొన్ని సంచార జాతుల వారున్నారు. అన్ని బీసీ కులాలవారు అన్నిరంగాల్లో ఎదుగాలంటే ఏం చేయాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అధ్యయనం చేస్తున్నది.

బీసీ, ఎంబీసీ, సంచారజాతుల వర్గీకరణ, ఇందుకు సంబంధించి బీసీ కులాల సమగ్ర సర్వే జరుగాల్సి ఉన్నది. ఈ అధ్యయనంలో విద్యా, ఉద్యోగ విషయాల్లోనే గాక సాంస్కృతిక, మత, జీవన విధానానికి సం బంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. ఎం బీసీలుగా గుర్తించేటప్పుడు వారి కమ్యూనిటీ సోషల్ క్యాపిట్‌ను చూడా లి. ప్రభుత్వ లక్ష్యం, కేసీఆర్ ఆలోచనల దృష్టి, బీసీ కమిషన్ చేస్తున్న సమగ్ర అధ్యయనం-అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకే. తెలంగాణ బహుజనులు సుఖసంతోషాలతో వర్ధిల్లేవిధంగా చేయడంలో ఈ కృషి పునాదిగా ఉంటుంది.
(వ్యాసకర్త: బీసీ కమిషన్ సభ్యులు)

910

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles