సంక్షేమంలో కేసీయారే ఆదర్శం


Wed,April 13, 2016 01:22 AM

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిసిపోతుంది. సంపన్న రాష్ట్రాలుగా పేరొందిన గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్నాట క, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మహారాష్ర్ట సంక్షేమం కోసం, మానవాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను చూస్తే నిరాశే ఎదురయింది. ఇతర రాష్ట్రాలు ప్రతి ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును గణనీయంగా సాధించామని చెప్పుకున్నాయి. కానీ అదే స్థాయిలో జనాభా నిష్పత్తి మేరకు బలహీనవర్గాలకు బడ్జెట్‌లలో కేటాయింపులు పెంచిన దాఖలాలు లేవు.
తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం 32 వేల కోట్ల కు పైగా నిధులను కేటాయించింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద బడ్జెట్ ఉన్నా ఇం త భారీ మొత్తంలో సంక్షేమం కోసం ఇన్ని నిధులు కేటాయించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహి ళా సంక్షేమం కోసం 2016-17 బడ్జెట్‌లో 13,412 కోట్లు ఖర్చు పెడుతున్నది. ప్రతి వ్యక్తిపై సంక్షేమ రంగానికి ఇంత ఖర్చు చేస్తున్న రాష్ర్టం దేశంలో మరొకటి లేదు. ఎస్సీ సంక్షేమానికి 7,122 కోట్లు, ఎస్టీ -3,75 2 కోట్లు, బీసీ 2,538 కోట్లు, మైనారిటీ-1,204 కోట్లు, మహిళా-1,553కోట్లు, ఆసరా-4,693 కోట్లు, కళ్యాణలక్ష్మి-738 కోట్లు కేటాయించింది. దీం తో పాటుగా పేద బ్రాహ్మణ సమాజానికి-100 కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుండే మైనారిటీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే బకాయిపడ్డ వర్సిటీల మెస్ బిల్లులకు 7 కోట్లు మంజూరు చేశారు. ఏండ్ల తరబడిగా బకాయి పడ్డ రీయింబర్స్‌మెంట్ కోసం 3,061 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిం ది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి బడుగు, బలహీన వర్గాల మీదున్న స్పష్టమైన వైఖరి.

పారిశ్రామికాభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న గుజరాత్, మహారాష్ర్టలోనే సంక్షేమం, మానవాభివృద్ది కోసం కేటాయించిన నిధులు జనాభా రీత్యా చూస్తే తక్కువ. తెలంగాణ రాష్ర్టంలో పేదలందరికీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా వివాహాలకు 51 వేల రూపాయలు ఇస్తుంటే, ధనిక రాష్ట్రమైన పంజాబ్ రూ. 15,000/- మాత్రమే ఇస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, బీడీ కార్మికుల ఆసరా నెలకు రూ. 1000/-, వికలాంగులకు రూ. 1,500/- ఇస్తున్నది. కాగా పంజాబ్‌లో వృద్ధాప్య పింఛన్ రూ. 500/- ఈ ఏడాది నుంచి యివ్వడానికి ప్రతిపాదించింది. గుజరాత్‌లో నెలకు ఐదు వందల చొప్పున పదిహేడు లక్షలమందికి యివ్వడానికి బడ్జెట్ కేటాయించినట్లు ప్రకటించారు.
ప్రజల సంక్షేమం కోసం కాకుండా అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు, మధ్యతరగతికి ప్రయోజనాలు చేకూరే ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని ఇతర రాష్ర్టాల బడ్జెట్ కేటాయింపులను బట్టి తెలుస్తున్నది. అందుకే ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆదివాసీలు అరవై ఏళ్లుగా అభివృద్ధి చెందడం లేదు. పైగా అభివృద్ధి పేరిట వారిని నిర్వాసితులను చేస్తూన్నారు. స్వదేశంలో కాందిశీకులుగా పుట్టిపెరిగిన ఊరు, ప్రాం తం వదిలి కూలీలుగా, రిక్షా కార్మికులుగా మట్టి పని, రోడ్లపని వంటి పనుల కోసం ఎక్కడికక్కడ వలసలు వెళ్ళి భద్రత లేని జీవితం గడుపుతున్నారు. ఇలాంటి పేదవర్గాల ఉపాధి కల్పన గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి బడ్జెట్లలో నామమాత్రం. ప్రత్యేక శ్రద్ధతో ప్రజల జీవన ప్రమాణాల వృద్ధి కోసం, నైపుణ్యాల అభివృద్ధి కోసం, వారి పిల్లల చదువుల కోసం, వైద్యం కోసం, గృహ వసతి కోసం బడ్జెట్ కేటాయించడం గానీ, దాన్ని చిత్తశుద్ధితో అమలు జరపడం గానీ జరిగి ఉంటే ఆ రాష్ర్టాల్లోని పేదలు ఇలా దేశాలు పట్టుకొని తిరిగేవారు కాదు.

ప్రజాస్వామ్యంలో సోషలిస్టు సమాజం ఏర్పడాల ని జీవితమంతా పరితపించిన రామ్‌మనోహర్ లోహి యా ఆలోచనల నుంచి, ఉద్యమాల నుంచి ఎదిగిన నాయకులు గల బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లను పరిశీలించినప్పుడు లోహియా విజన్ ఏ మాత్రం కనిపించక పోవడం విచారం కలిగిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదని తేలుతున్నది. అం దుకే బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ నుంచి లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీనాలి చేసుకొని బతుకులీడుస్తున్నారు. తెలంగాణలో కూడా మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి లక్షలాది ప్రజలు ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చడానికి ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. తెలంగాణ రాష్ర్టంలో లోహియా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టారు. రూపాయికి కిలో బియ్యం కుటుంబంలో ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున ఇవ్వ డం, డబుల్ బెడ్‌రూం ఇల్లు ఉచితంగా కట్టివ్వడం, మిషన్ భగీరథ పేరిట ఇంటింటికి నల్లా నీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి వ్యవసాయానికి, ఇతర వృత్తులకు పునర్జీవనం కల్పించడం గమనించవచ్చు. దేశం ఆసక్తిగా ఈ పథకాల వైపు చూస్తున్నది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని అమ లు పర్చడానికి సిద్ధమవుతున్నాయి.

జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక వర్గాలకు బడ్జె ట్ కేటాయించాలనే దృష్టి ఉండి ఉంటే దేశంలో ఇంత పేదరికం ఉండేది కాదు. రోడ్లు, రైళ్ళు, విమానాశ్రయా లు మొదలైనవి పేద ప్రజల కన్నా మధ్యతరగతికి, ఉన్నత వర్గాలకు ఉపయోగపడేవే. పేదలకు ఇళ్లు, ఉపాధి కల్పన, తక్కువ ధరలో నిత్యావసర సరుకు లు, సాగుభూమి, పనిచేయడానికి తగిన వసతి సౌకర్యాలు, పరికరాలు మొదలైనవి అవసరము. ఆదివాసులకు అడవిపై హక్కు ఇచ్చి దాని ఆదాయం వారి అభివృద్ధికే కేటాయిస్తే ఆదివాసీలు మిగతా సమాజం కన్నా ఉన్నతంగా మధ్య తరగతిగా, విద్యావంతులుగా ఎదిగి ఉండేవారు. కాగా బడ్జెట్‌లను పెట్టుబడిదారుల కోసం మధ్య తరగతి కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పేరిట అనేక రూపాలలో వృథా వ్యయం జరుగుతున్నది. అవినీతి పెరుగుతున్న ది. పారదర్శకత లోపిస్తున్నది.

చాలా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లలో ఒక లోపం కనబడుతుంది. వాళ్లు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు బడ్జెట్‌లో ప్రతిఫలించకపోవడం కొట్టొచ్చినట్టు కనబడే లోపం. ఇందుకు కారణం మేధావుల, సామాజిక శాస్త్రవేత్తల సూచనలను తీసుకోకపోవడం లేదా చిత్తశుద్ధి లేకపోవడం. కానీ కేసీఆర్ ఉద్యమ అనుభవంతో ఎన్నికలకు ముందే తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడానికి మేధోమథనం చేశారు. ఆ ప్రణాళికలలోని అంశాలను నేడు ప్రభుత్వ అధినేతగా దశలవారీగా అమలు చేయడం గమనించవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదే ఒరవడితో పదకొం డు నియోజకవర్గాల్లో సదస్సులు పెట్టి ప్రజల అవసరాలు ఏమున్నాయో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో విజ్ఞప్తులు స్వీకరించారు. వేలాది విజ్ఞప్తులను, సామాజిక శాస్త్రవేత్తల సూచనలను క్రోడీకరించి బడ్జెట్‌ను రూపొందించే కృషిచేశారు.
తెలంగాణ రాష్ట్ర పనితీరును ఇపుడిప్పుడే ప్రపంచ విశ్లేషకులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు ఉత్త మ పురస్కారాలు అందజేయడం చూశాం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతోపాటు, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకునిగా నిలిచారు

vakulabaranamగుజరాత్ సంపన్న రాష్ట్రం అయినప్పటికీ ప్రభుత్వ ఆదాయం చాలా తక్కువ. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల నుంచి ఇతోధికమైన పన్నులు సేకరిస్తే ప్రస్తుత 1,51,137 కోట్ల బడ్జెట్ 50 శాతానికి పైగా పెరుగుతుంది. అనగా 2,30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. ధనికులకు మేలు చేయడానికే పన్నులు చాలా తక్కువగా ఉన్నాయని భావించవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేదు. కాగా మమతా బెనర్జీ ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో 650 కోట్లు కేటాయించింది. 97 శాతానికి పైగా ముస్లిం జనాభాను ఓబీసీ కేటగిరిలోకి తీసుకురావడం జరిగిందని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. అదే తెలంగాణ ప్రభుత్వం జనాభా దామాషా ప్రకా రం ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేస్తున్నది. అతిపెద్ద రాష్ర్టమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ పింఛన్ కింద ఈ ఏడాది మైనారిటీలకు 537 కోట్లు కేటాయించింది. బీహార్‌లో బీసీలకు, ఎంబీసీలకు గత ఏడాది 1975 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం 1497 కోట్లు, మైనారిటీలకు 299 కోట్లు కేటాయించారు. గుజరాత్ రాష్ర్టం అభివృద్ధి చెందుతున్న కులాల (డెవలపింగ్ కాస్ట్స్) సంక్షేమం కింద బీసీ, ఈబీసీ, మైనారిటీ, నొమడిక్, డినోటిఫైడ్, నోటిఫైడ్ ట్రైబ్స్ వర్గాలన్నింటికి బడ్జెట్‌లో 512 కోట్లు మాత్రమే కేటాయించింది.

అనేక రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సం క్షేమం కోసం బడ్జెట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు బడ్జెట్లలో చూపుతున్నాయి గానీ, ఖర్చు చేయడంలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మొదలగు రాష్ట్రాల లో కేంద్ర ప్రభుత్వం అందించే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా వారి సంక్షేమానికి ఖర్చు చేయడం లేదు. ఇతర కార్యక్రమాలకు ఈ నిధులను మళ్ళిస్తున్నట్టు బడ్జెట్ లెక్కలు తెలుపుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని పథకాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలి. ఉదాహరణకు హైస్కూల్ బాలికలకు సైకిల్‌కొనిచ్చే పథకం కొన్ని రాష్ర్టాలలో ఉన్నది. ఆడపిల్ల చదువును ప్రోత్సహించడం కోసం ఇలాంటివి మరికొన్ని ప్రవేశపెట్టడం అవసరం. అయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో అనేక విశేషాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉండటం అభినందనీయం.

1265

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల