ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ


Thu,March 24, 2016 12:44 AM

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు రాబోయే పదేళ్లకు రాష్ట్రంలో జరుగబోయే అనేక రకాల సామాజిక మార్పులకు శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతారు.

ప్రభుత్వ కాలేజీలల్లో ప్రమాణాలు పడిపోయాయి అని మాట్లాడేవారికి నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీని చూపించాలి. ప్రభుత్వ కాలేజీల శక్తికి, సమర్థతకు, విద్యా ప్రమాణాలకు, ఆ కళాశాల ప్రతీకగా నిలుస్తుంది. నల్లగొండలో గిరుల మీద గిరులు భువన యాదగిరి లున్నాయి. దురాజుపల్లి గుట్టలున్నాయి. రాచకొండ కొండలున్నాయి. ఇదేవిధంగా చదువుల్లో కూడా నల్లగొండ వర్థిల్లుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులతో తులతూగుతున్న కళాశాలగా నల్లగొండ ఎన్జీ కాలేజీకి పేరుంది. ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. శక్తివంతమైన మానవసంపదను రాష్ర్టానికి, దేశానికి ఈ కళాశాల అందించింది. భారత పాలనారంగానికి ఎంతోమంది శక్తివంతులను ఈ కాలేజీ అందించింది. తెలంగాణలో ఎటుచూసినా కళాశాలలు కానరాని దశలో 1956లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ కళాశాలను ప్రారంభించారు. అప్పటికి తెలంగాణలో కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్‌లో నిజాం కళాశాలలు మాత్రమే ఉన్నా యి. 1956లో నాగార్జున సమితి పేరున నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైంది. 1989 వరకు బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ. సంప్రదాయ కోర్సులతో ఈవినింగ్ కాలేజీ, డే కాలేజీలు నడిచాయి. ఇప్పుడు నాగార్జున కాలేజీలో 23 కోర్సులున్నాయి. ఆల్ట్రా మోడ్రన్ కోర్సులు, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, హ్యూమన్ రైట్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్, బి.ఎస్సీ, బి.కాం. కంప్యూటర్ కోర్సులు, జాగ్రఫీ జియాలజీ లాంటి అనేక కోర్సులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జియాలజీ కోర్సు ఒక్క నల్గొండ నాగార్జున కాలేజీలోనే ఉంది. ఇప్ప టివరకు జియాలజీ కోర్సుకు సంబంధించిన అనేక మంది వ్యక్తులను ఈ కళాశాలే తయారుచేసింది. ఈ కాలేజీ నుంచి 25 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు వచ్చా రు. ఇప్పుడు ఈ కాలేజీలో 4,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం డిగ్రీ కళాశాల ఐదువేల మంది పైచిలుకు విద్యార్థులతో అగ్రస్థానంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్గొండ ఎన్‌జి కాలేజీనే విద్యార్థుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రధానంగా ఈ విద్యార్థులల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఎక్కు వ. వీరిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తా రు.

ప్రభుత్వ కాలేజీలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంటే నల్గొండ ఎన్జీ కాలేజీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ కాలేజీలో మెరిట్ లేకుండా సీటు దొరకడం కష్టం. వేలమంది విద్యార్థులు ఈ కాలేజీలో సీటుకోసం పోటీపడతారు. ఇక్కడ ఎవరూ పైరవీలు చేయరు. మెరిట్ ప్రకారం సీట్లిస్తారు. ప్రతి ఏడాది డిగ్రీ ప్రథమ సంవత్సరానికి 11 వందల సీట్లుంటాయి. అయితే ఈ 11 వందల సీట్ల కోసం 15,000 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. దీన్నిబట్టి ఈ కాలేజీలో సీట్లకోసం విద్యార్థులు ఎంత పోటీపడతారో తెలుస్తుంది. ఇంతమంది విద్యార్థులు పోటీ పడటానికి ప్రధాన కారణం విద్యా ప్రమాణాల విషయంలో కొలమానంగా నిలిచింది. నాలుగు దశాబ్దాలుగా అధ్యాపకులు చేసిన అవిరళ కృషి ఫలితంగా కాలేజీకి మంచి పేరొచ్చింది. తెలంగాణలోని 16 యూనివర్సిటీలలో మొదటి 5 ర్యాంకులలో ఎన్జీ కాలేజీ పిల్లలే ఉంటారు. ఈ కాలేజీలో 80 శాతం ఫలితాలు వస్తా యి. విద్యార్థులు ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు. క్షేత్ర పర్యటన చేస్తారు. రాష్ట్ర స్థాయి లో క్రీడలు, వ్యాసరచన, వక్తృత్వ తదితర అన్నిరకాల పోటీలలో ఎన్జీ కాలేజీ విద్యార్థులు ప్రథమస్థానంలో నిలబడతారు. మెరిట్ లేని విద్యార్థికి ఈ కాలేజీలో సీటు రాదు. అడ్మిషన్లు పూర్తి పారదర్శకంగా జరుగుతాయి. ఎంతో మంది ప్రఖ్యాతి వహించిన టీచర్లు ఈ కాలేజీలో పనిచేశారు. ఐఐటీ రామయ్య, ముదిగొండ వీరభద్రయ్య, ప్రొఫెసర్ చక్రధర్, నోముల సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వై.వి.రెడ్డి, అంపశయ్య నవీన్, బెల్లి యాదయ్య లాంటి ఎంతో మంది సమర్థులైన అధ్యాపకులు ఈ కాలేజీలో పనిచేశారు. ఈ కాలేజీకి పెద్ద శక్తి గ్రంథాలయం. ఎన్జీ కాలేజి లైబ్రరీలో సుమారు లక్ష వరకు పుస్తకాలుంటాయి. వీటికి ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంది. సోల్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ద్వారా పూర్తి కంప్యూటరీకరణ చేయబడిన లైబ్రరరీ ఇది. దీని అభివృద్ధి కోసం లైబ్రేరియన్ లక్ష్మారెడ్డి చేసిన కృషి మర్చిపోలేనిది. ఎందరో శక్తివంతులైన ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సమర్థులైన విద్యార్థుల కృషి వల్ల ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా నల్గొండ ఎన్జీ కాలేజి పచ్చపచ్చగా కళకళలాడుతుంది.
స్వాతంత్య్రం వచ్చాక మూడు తరాల దళిత బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు రాబోయే పదేళ్లకు రాష్ట్రంలో జరుగబోయే అనేక రకాల సామాజిక మార్పులకు శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతారు. డిగ్రీతోపాటు పీజీ కాలేజీ కూడా ఉంది. యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం, రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్)ల నుంచి వచ్చే నిధులు సక్రమంగా అమలు చేయబడుతున్నా యి. ఈ కాలేజీ 2008 నుంచి అటానమస్ కాలేజీగా మారింది. సొంత పాలన, పరీక్షలు, కరికులం, సిలబస్ రూపకల్పన చేసుకునే అవకాశం ఎన్జీ కాలేజీకి వచ్చింది.
shankar
నల్గొండ జిల్లా అవసరాలకనుగుణంగా, స్థానికత దృష్ట్యా 30 శాతం సిలబస్‌ను పెట్టుకోగలిగారు. జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై సిలబస్‌లో చేర్చటం జరిగింది. డిగ్రీ పరీక్షలు సెమిస్టర్ సిస్టంలో జరుగుతాయి. సంప్రదాయ డిగ్రీలతోపాటుగా సీబీఎస్‌ఈతో పదిరకాల ఐచ్ఛిక అంశాలను సంపూర్ణంగా నేర్చుకుని జీవితంలో స్థిరపడే కోర్సులు కూడా ఈ కాలేజీలో ఉన్నాయి. ఈ కాలేజీ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ పూర్వ విద్యార్థుల సంఘం చాలా శక్తివంతమైనది. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పని వేళలుంటాయి. ఇంత ప్రతిష్ఠాత్మకమైన ఈ కళాశాల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నది. మొత్తం 79 మంది అధ్యాపకులుండాలి. కానీ ఇందులో 30 మంది మాత్రమే పర్మినెంట్ వాళ్లున్నారు. మిగతా వాళ్లంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. విద్యార్థుల హాస్టల్ వసతి సౌకర్యాలు ఇంకా పెరగాలి. నూతన భవనాలు నిర్మించాలి. పరీక్షా సమయంలో నెలరోజులు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ పథకాన్ని నిరంతరంగా కొనసాగిస్తే విద్యార్థుల ఆకలి సమస్య కూడా తీరుతుంది. ప్రధానంగా ఎక్కువ శాతం మంది పిల్లలు ఉదయం 7.00 గంటల నుంచే గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ కాలేజీకి వస్తారు. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్లవుతుంది. ప్రతి ఏడాది ఈ కాలేజీలో వివిధ శాఖల నేపథ్యాలలో 100 వరకు సెమినార్లు జరుగుతాయి. ఈ జిల్లాకు చెందిన, ఉద్యమాల నుంచి ఎదిగొచ్చిన రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి శ్రద్ధ తీసుకుంటే ఈ కాలేజీ తెలంగాణ రాష్ట్రంలోనేకాదు దేశంలోనే ప్రతిష్ఠాత్మక కాలేజీగా నిలుస్తుంది.

1812

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల