జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు


Sat,February 13, 2016 10:30 AM

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చిపారేయాలి. కనురెప్పపాటు విద్యుత్ పోకుండా చూస్తామని కేసీఆర్ చెప్పారు. పేద లు అందించిన ఈ విజయాన్ని వారి బతుకులు మార్చేవిధంగా ఆచరణలో చూపడంలోనే టీఆర్‌ఎస్ సంపూర్ణ విజయాన్ని సాధించినట్లవుతుంది.

shankar
వ్యక్తినై పోయాను, నేనిప్పుడు వ్యవ స్థ గురించి మాట్లాడలేను అనే మార్కె ట్ సమాజంలో ఒక రాజకీయపార్టీ ప్రజలందర్ని ఒక భావజాలం వైపు మళ్లించగలగటం నిశ్శబ్ద విప్లవమే. 16 ఏళ్లుగా తెలంగాణ ప్రజలందర్ని ఏకతాటిపై నడిపిస్తున్నది వారి ఆకాంక్షలే. రాష్ర్టాన్ని సాధించుకోవ టం, తొలి అసెంబ్లీ పీఠంపై కేసీఆర్ నేతృత్వంలో గులా బీ జెండా రెపరెపలాడటం ఆకాంక్షల ప్రతిఫలనమే. తిరిగి 16 నెలల తర్వాత నూతన చరిత్రను ఆవిష్కరి స్తూ కేసీఆర్ తనయుడు కేటీఆర్ సారథ్యంలో బల్దియా పీఠంపై సంపూర్ణ మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేయటం జరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. టీఆర్‌ఎస్ తెలంగాణ ఆత్మగా నిలవటమే ప్రధానమైనది.
తెలంగాణ తనను తాను నిర్మించుకుంటున్నది. తన చరిత్రను, సంస్కృతిని పునః ప్రతిష్ఠ చేసుకుని భవిష్యత్తు చరిత్రకు రూపకల్పన చేసుకునే పనిలో నిమగ్నమైంది.

భాగ్యనగరాన్ని తెలంగాణ భవిష్యత్ దీపంగా తీర్చిదిద్దుకొని, ఆ వెలుగులు విశ్వమంతా వ్యాపింపజేయటానికి విశ్వనగరంగా మార్చుకోవాలి. తెలంగాణకు గుండెలాంటి హైదరాబాద్ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి దోహదపడే వారి కే ఓటు వేయాలని, అది మాతోటే సాధ్యమవుతుంద ని నగర ప్రజలను టీఆర్‌ఎస్ కోరింది. ప్రజలు కూడా టీఆర్‌ఎస్ గెలుపును తక్షణావసరంగా భావించారు. దాని కనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. అల్లా! ఈ నగరం నదిలోని చేపల్లాగా జనంతో విలసిల్లాలని అని ఆఖరి నిజాం ఎలా కలగన్నాడో ఇప్పుడు అక్షరా లా ఈ నగరం కోటిమందితో కిటకిటలాడుతున్నది. గత పాలకులు భాగ్యనగరాన్ని చేయాల్సినంత దోపిడీ చేసి, ధ్వంసం చేసి, నింపాల్సినంత కాలుష్యం గుండెల నిండా నింపి, ఆక్రమణల దురాక్రమణల పర్వంగా మార్చివేసిన దశనుంచి నగరాన్ని తిరిగి తీర్చిదిద్దుకోవాలి.

ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే తప్పా ఇది జరుగదు. విశ్వనగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ నగరంలోని ప్రతి బిడ్డా భాగస్వామి కావాలి. కేసీఆర్‌కున్న దార్శనికతకు ఆచరణ రూపం రావాలి. ప్రతి ఒక్కరినీ విశ్వనగర నిర్మాణంలో భాగస్వాముల ను చేయాలి. భాగ్యనగర నమ్మకాన్ని నిజంచేసి కేసీఆర్ తన కర్తవ్యాన్ని పూర్తిచేయటమే నూతన చరిత్రకు ద్వారాలు తెరుస్తుంది.తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న పునర్నిర్మాణం లో భాగంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టాభిషేకం చేశారు. ఇందుకు కారణాలు అనేకం. ఒకప్పుడు నగరంలో పేదల వాడలంటే పీజేఆర్, అంజయ్య, కాకాల పేర్లు వినిపించేవి.

ఇప్పు డు ఆ పేదలవాడల్లో, మధ్యతరగతిలో స్పష్టంగా టీఆర్‌ఎస్ పేరు వినిపించింది. ఐదేళ్ల క్రితం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయని టీఆర్‌ఎస్ ఏకంగా ఆ పీఠాన్నే కైవసం చేసుకునే దశకు ఎదిగే స్థితి ఎట్లా రాగలిగిందన్నదే అసలు విషయం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎ స్ అజేయమైన శక్తిగా ఎదిగింది కానీ జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు అంతబలం లేదన్నదే మొదటి నుంచి చర్చ. దీన్నే కేసీఆర్ సవాల్‌గా తీసుకుని భాగ్యనగరంపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసేందుకు తద్వారా టీఆర్‌ఎ స్ బలం పెంచుకోవటంతో పాటుగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దవలసిన కర్తవ్యానికి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రచించారు. అదే టీఆర్‌ఎస్ కు రక్ష అయ్యింది. అదే నగరంలోని పేదలను, అన్ని వర్గాలను ఆకర్షించింది. ఈసారికి మాత్రం తొలి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ప్రతి ఒక్కరిలో కలిగింది.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవస్థ మార్పుపై దృష్టిపెట్టి కేసీఆర్ చెబుతున్న విషయాలను ఆకళింపు చేసుకుంటున్నారు. గత పాలకులు 60 ఏళ్ల లో బల్దియాకు చేసింది ఏమిటన్నది అందరి కళ్లకు కన్పిస్తున్నదే. విస్తరిస్తున్న భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలంటే అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలని కేసీఆర్, కేటీఆర్‌లు పదే పదే చెప్పటం టీఆర్‌ఎస్‌కు లాభించింది. విశ్వనగరం గా హైదరాబాద్ తీర్చిదిద్దబడితేనే మురికివాడల స్థానంలో పేదలకు రెండు పడక గదుల ఇండ్లు వస్తా యి. లోకల్ బాడీస్‌లో ఎవరు అధికారంలో ఉంటే వారికే ఓటువేస్తారనే వాదం ఎంతవరకు సరైందో తెలియదు. కానీ, బల్దియా ఎన్నికల విషయంలో కేసీఆర్ దార్శనికతకు మహానగర ప్రజలు అంగీకారం తెలిపా రు. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకం ఉందని వరంగల్ ఉప ఎన్నిక తేల్చిచెప్పింది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య బీజేపీ మెడకు చుట్టుకుం ది. దళిత బహుజన వర్గాలను ఆలోచనల్లో పడేసింది.

ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఎక్కడా సెటిల ర్లు అన్న పదం ఉపయోగించలేదు. ఈ నేలమీద పుట్టిన ప్రతిబిడ్డా హైదరాబాదీనే, ఇక్కడ నివసించే ప్రతి బిడ్డా హైదరాబాదీనే అని కేసీఆర్ చెప్పిన విషయంతో అన్ని వర్గాలు సంతృప్తి చెందాయి. టీడీపీ చాలావరకు దెబ్బతిన్నది. కాంగ్రెస్‌కు బహు నాయక త్వ సమస్య సంప్రదాయకంగానే వెంటాడుతూ వచ్చిం ది. తెలంగాణ పునర్నిర్మాణ సందర్భంలో పాత వ్యవస్థను సంపూర్ణంగా మార్చకపోతే మనుగడ కష్టమన్నది కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. నగరాన్ని వెం టాడుతున్న సమస్యలపై ఏళ్లుగా విసిగిపోయిన నగరవాసులు టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో ఓటేశారు.

బల్దియా ఎన్నికల్లో విజయం సాధించటంతోపాటు నూతన నాయకత్వం ఆవిష్కరించబడింది. టీఆర్‌ఎస్ లో యువ నాయకత్వానికి ద్వారాలు తెరిచినట్లయ్యిం ది. బల్దియా ఎన్నికలను భుజం మీద వేసుకుని ఒకే ఒక్కడిగా నగర ప్రజలను ఒప్పించి తిరుగులేని యువనాయకునిగా కేటీఆర్ ఎదిగివచ్చాడు. బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం కేటీఆర్ నాయకత్వానికి ఆవిష్కరణ కూడా జరిగింది. కేటీఆర్ ప్రచారంలో మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగటం, మహానగర సమస్యలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని అవగాహనతో కేటీఆర్ మాట్లాడిన తీరు ప్రజలను ఒప్పించటంలో నేర్పరితనం ఆకట్టుకుంది. ఎదుటి పక్షంపై విమర్శలు చేయకుండా తాము చేయబోయే పనులను మాత్రమే కేటీఆర్ చెప్పారు.

కేసీఆర్ దార్శనికతకు కేటీఆర్ ఒక సైనికునిలా దూసుకువచ్చి విస్తృ త ప్రచారం చేశారు. కేసీఆర్‌ను ప్రజలు ఎంత బలంగా నమ్ముతున్నారో బల్దియా ఎన్నికలు మరొకసారి తేల్చిచెప్పాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ విషయాన్ని ప్రత్యేక సందర్భంగా గుర్తుంచుకోకపోతే రాజకీయ విశ్లేషణలు తలకిందులవుతాయి. కేసీఆర్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయటానికి కేటీఆర్ ఆచరణధారిగా మారాలి. ప్రాంతాలకతీతంగా, కులమతాలకతీతంగా టీఆర్‌ఎస్‌పై నమ్మకముంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సబ్బండ వర్ణాలు జై కొట్టారు. 143 ఏళ్ల చరిత్రలో భాగ్యనగర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చి పులకించే విధంగా కొత్త చరిత్రను సృష్టించారు.
తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్న సంద ర్భ మిది. ఈ నేపథ్యంలో బల్దియా పీఠంపై గులాబీ జెం డా రెపరెపలాడింది. ఇది కేసీఆర్ పాలనా విధానానికి ప్రజలిచ్చిన బహుమానం.

తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల రణక్షేత్రంలో 18 రోజులు సుడిగాలి పర్యటనలు చేసిన కేసీఆర్ టీఆ ర్‌ఎస్‌కు తిరుగులేని రాజకీయశక్తిని అందించి కొత్త చరిత్రను ఆవిష్కరిస్తే, కేసీఆర్ తనయుడు కేటీఆర్ 30 రోజులు సుడిగాలి పర్యటనలు చేసి మహానగర ప్రజలను ఒప్పించి బల్దియా పీఠంపై టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసి చరిత్రను తిరగరాశాడు. పేదల ఏజెండా యే మా ఎజెండా అని ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించటం ఆయన నిబద్ధతకు అద్దం పడుతుంది. టీఆర్‌ఎస్ అజేయమైన శక్తిగా బల్ది యా పీఠంపై నిలవటంతోపాటు మరో సంకేతాన్ని చ్చింది. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ఆత్మ అని ప్రజ ల మదిలో ఉంది. అందుకే తెలంగాణకు గుండెకాయలాంటి భాగ్యనగరాన్ని ప్రజలు టీఆర్‌ఎస్ చేతిలో పెట్టారు.

విశ్వనగర బాధ్యతను అప్పగించారు.హైదరాబాద్ విశ్వనగరంగా ఎంతవేగంగా తీర్చిదిద్దబడితే అంతే వేగంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా అంతే రీతిలో పెరుగుతాయి. పేద ల పిల్లలు చదువుకునేందుకు కేజీ టు పీజీ వరకు ఉచి త విద్యను అందించే బృహత్తర పథకాన్ని కూడా ఆవిష్కరించాలి. పేదల ఓట్లతో గెలిచిన ఘనత టీఆర్‌ఎస్ ది. ఆ పార్టీకి భవిష్యత్తులో రక్షణ కవచంగా మారుతుం ది. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా నిలబడాలంటే పాతబస్తీ రూపురేఖలు సంపూర్ణంగా మార్చివేయాలి. ముస్లిం వర్గాల్లో ఉన్న పేదరికాన్ని పారదోలే విధంగా పథకాలను చేపట్టాలి.

ప్రతి పేదవానికి ఉచితంగా వైద్యం అందితే వారి బాధలు సగం తీరుతా యి. టీఆర్‌ఎస్ చెప్పినట్లుగా వేయి పడకల ఆసుపత్రు లు నూతనంగా నిర్మించాలి. గాంధీ, ఉస్మానియా ఆస్ప త్రులను సంపూర్ణంగా ఆధునీకరించాలి. కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చిపారేయాలి. కనురెప్పపాటు విద్యుత్ పోకుండా చూస్తామని కేసీఆర్ చెప్పారు. పేద లు అందించిన ఈ విజయాన్ని వారి బతుకులు మార్చేవిధంగా ఆచరణలో చూపడంలోనే టీఆర్‌ఎస్ సంపూర్ణ విజయాన్ని సాధించినట్లవుతుంది.

1063

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles