బడులకు కొత్త కళ


Sun,January 17, 2016 12:57 AM

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా ఎక్కడికక్కడ సమావేశమై స్కూళ్లను ఆదుకునేందుకు అండగా నిలబడాలి. పూర్వ విద్యార్థి సమ్మేళనాలతో బడులకు కొత్త కళ రావాలి.

goury


అమెరికాలో తాను చదువుకున్న ప్రఖ్యాత విద్యాసంస్థ యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంటు కు ఆ సంస్థ పూర్వ విద్యారి పెప్సీ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఇంద్రానూ యీ 334 కోట్లకు పైగా భూరి విరాళాన్ని అందజేసి ఆ స్కూలుపై తనకున్న ప్రేమను చాటుకుంది. ఒక విద్యా సంస్థ నన్ను తీర్చి దిద్దటం వల్లనే నేనీస్థాయికి ఎదిగానని అందుకే ఆ స్కూలుకు ఇంత పెద్ద మొత్తంలో విరాళాన్ని యిచ్చినట్లు ఆమె ప్రకటించారు. నాయకత్వ లక్షణాలకు నిర్వచనాలను ఈ స్కూలే నాకు నేర్పింది. సమాజాన్ని, వ్యాపారాన్ని కలిసి చూసే అవకాశం ఈ బిజినెస్ స్కూలే నేర్పింది. అందుకే ఈ విరాళాన్ని ప్రకటించి తన రుణం తీర్చుకుంటున్నట్లు ఇంద్రానూయీ ప్రకటించింది.

తమకు తోచినంత వరకు, తమకు చేతనైన మేరకు తాము చదువుకున్న స్కూళ్లకు విరాళాలను ఇస్తే మరెంతో మంది సమర్థులను ఆ బడులు ప్రపంచానికి అందిస్తాయి. అందుకే వెనుకబడిన ప్రాంతాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కూళ్లను కాపాడుకోవటం కీలకమైనది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పాఠశాలను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న స్కూలుకు ఎంతో కొంత సాయం చేయాలి. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చదువుకున్న దుబ్బాకలోని స్కూలుకు కోట్ల రూపాయలు నిధులను ప్రకటించి ఆ స్కూలు ముఖచిత్రాన్ని మార్చబోతున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ఆదుకోవాలి. అందుకు పూర్వ విద్యార్థులే తమకు పాఠాలు చెప్పిన బడిని రక్షించుకునేందుకు ముందుకు వచ్చి రక్షకులుగా నిలవాలి.

స్కూల్ కులమతాలకు అతీతమైంది. ప్రాంతాలకు, దేశాలకు సమన్వయం చేయగలది. బాల్యంలో దేన్ని మర్చిపోయినా బడిని, బళ్లో పాఠాలు చెప్పిన పంతుళ్లను మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. అందుకే స్కూలు మీద ఉన్న ప్రేమతో వూరికి పోతే తీరిక చేసుకుని ఆ బడి అంతా కలియదిరిగి బాల్యాన్ని గుర్తుచేసుకుంటారు. అదే బాల్యంలో కలిసి దిరిగిన మిత్రులు, మనకు పాఠాలు చెప్పిన పంతుళ్లు అంతా ఒక్కసారిగా కలిస్తే అంతకంటే మహానందం మరేముంటుంది. ఇలా పూర్వ విద్యార్థులందర్ని కలిపే సమ్మేళనాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందుకే ఏ వూళ్లోనయితే పూర్వ విద్యార్థులు సమ్మేళనం అవుతున్నారంటే ఆ స్కూలు గతి మారుతుందని భావించాల్సిందే.

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట, కోనరావుపేట మండలాలకు ప్రత్యేకత వుంది. ఆ వూర్లు ఎంతో చైతన్యవంతమైనవి కూడా. అనేక రకాల ఆటుపోట్లు మధ్య నిలిచి, ఓడి, గెలిచిన వూళ్లవి. ఆ వూర్ల అనుభవాలు, ఆ స్కూళ్ల అనుభవాలు కూడా భిన్నం గా ఉంటాయి. 1969 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ మొదలైన దగ్గర నుంచి 2005 వరకు కొనసాగిన 35 బ్యాచ్‌లకు సంబంధించిన పూర్వ విద్యార్థులు కలువబోతున్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన 50 మంది ఉపాధ్యాయులకు కూడా భారీగా సన్మానం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీన ధర్మారం స్కూల్లో పూర్వవిద్యార్థులు ఏకమై తమ స్కూలుకు ఏదో ఒకటి చేయాలని తలంచుతున్నారు. ఇది ఆహ్వానించదగినది. బడి పాఠం చెబుతుంది కానీ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవలసింది ఎవరికి వారే.

ప్రపంచీకరణ జాడలలో బడిది బడిదిక్కు అయ్యింది. సమాజానిది సమాజం దిక్కైంది. బడి, వూరు వేర్వేరయిపోయాయి. ఇది చాల ప్రమాదకరమైన సంకేతం. ఒకప్పుడు బడిని, బడి బాగోగులను వూరు ఎప్పుడు విస్మరించలేదు. వూరు బాగోగులని బడి ఎప్పుడు మర్చిపోలేదు. తల్లిదండ్రులు చదువులేనివారైతే పిల్లల పరిస్థితి మరోరకంగా ఉంటుంది. వయోజన విద్యా కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యమై పోయింది. దీంతో 10వ తరగతి తర్వాత చదువులు మానేసిన పిల్లలు పలురకాల వ్యసనాలకు గురవుతున్నారు. యిప్పుడు పల్లెల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇది. అందుకే తల్లిదండ్రులకు చదువుపై అవగాహన కలగాలి.

ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు హరిత సంరక్షణ, పాల సంరక్షణ తదితర పనులలో నిమగ్నమవుతున్నారు. కాని ఈ అవగాహన బడి విషయంలో, చదువు విషయంలో అంతగా లేదు. దానిని పురికొల్పే కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు నడుంకట్టాలి. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు పనిచేస్తూనే వున్నారు. కాని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతో పాటు సమాజానికి, తల్లిదండ్రులకు మధ్య వారధిగా బడి పనిచేయాలి. అందుకు అందరూ చేతనైన సాయం చేయాలి. ధర్మా రం స్కూల్ ప్రాంగణం ఐదు ఎకరాల విస్తీర్ణంలో వున్నది. 15 గదులున్నా యి. సైన్స్‌ల్యాబ్ ఉంది. పిల్లలకు ఆటవస్తువులు వున్నాయి.స్కూలుకు వెనుకవైపు ప్రహ రి గోడ లేదు. ఇప్పుడు ఈ సమ్మేళనం ద్వారా బడికి కొత్త జవసత్వాలనందించాలి. బడిని బాగుచేస్తే ఊరు బాగుపడుతుంది. బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా ఎక్కడికక్కడ సమావేశమై స్కూళ్లను ఆదుకునేందుకు అండగా నిలబడాలి. పూర్వ విద్యార్థి సమ్మేళనాలతో బడులకు కొత్త కళ రావాలి. అప్పుడే ఈ తెలంగాణ జ్ఞాన తెలంగాణగా వర్ధిల్లుతుంది.

1081

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles