గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి


Tue,August 11, 2015 12:04 AM

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందగలుగుతుంది. గ్రామ అభివృద్ధిలో, నిర్మాణాత్మాకమైన కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు భాగస్వాములు కావాలి. ఇందుకు గ్రామ పంచాయతీ పెద్దన్న పాత్ర పోషించా లి.

టీఆర్‌ఎస్ ప్రభత్వం చేపట్టిన కాకతీయ మిషన్, ఇంటింటికి వాటర్‌గ్రిడ్ పథకం భవిష్యత్ తెలంగాణ సమాజం సమున్నతంగా నిలబడేందుకు దోహదం చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వీటితో పాటుగా గ్రామ పంచాయతీలను శక్తివంతం చేస్తూ పాలనను ప్రతి పౌరుని దగ్గరకు తీసుకపోయేందుకు గ్రామజో తి పథకం ప్రవేశపెట్టనున్నారు.
గ్రామజ్యోతి పథకం విప్లవాత్మకమైనదిగా చరిత్రలో నిలవాలంటే ఆచరణే ప్రాతిపదిక కావాలి. స్థాని క ప్రజాప్రతినిధులు, పాలనా యంత్రాంగం కలిసి ప్రజలను భాగస్వాములుగా చేయగలగాలి. ఇది విజ యం సాధిస్తే గ్రామజ్యోతి గ్రామ రాజ్యాంగంగా నిలుస్తుంది. ఈ పథకం తల్లడిల్లుతున్న గ్రామాన్ని ఆదుకునే పథకంగా కాకుండా గ్రామ వ్యవస్థనే సమూలంగా మార్చేందుకు దోహదపడుతుంది. పల్లె కన్నీరు పెట్టకుండా ఉండేందుకు తక్షణంగా ఏంచేయాలి?

shankar


పల్లె లు సమున్నతంగా నిలవటానికి చేపట్టాల్సిన చర్య లు? గ్రామంలోని సర్వరంగాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికా విధానం ఎలా రూపొందించుకోవాలి? విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందించే విధంగా చేయాల్సిన కృషికి విధి విధానాలు రూపొందించుకుని ఆచరణలో గెలవాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని పరిశుభ్ర తెలంగాణ నిర్మాణానికి నడుం కట్టాలి. హరి త తెలంగాణను నిర్మించేందుకు గ్రామాలను తిరిగి పచ్చదనంతో నింపేందుకు ప్రణాళికాబద్ధమైన రూపకల్పనలు చేయాలి. గ్రామాల్లో యువతను నైపుణ్యమున్న మానవ వనరుగా మార్చేందుకు కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి. సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలోని భూములు ఏ పంటలకు అనుకూలమో నిర్ధారించుకుని ఆ పంటలే వేసేందుకు రైతాంగాన్ని సన్నద్ధం చేయాలి. అందుకు వ్యవసాయాధికారులు, రైతాంగంతో కలిపి ప్రత్యేకంగా కమిటీలు వేయాలి. ఆ కమిటీ నిర్ధారించిన పంటలనే రైతాంగమే వేయాలి. ఇలా అనేనేక సమస్యలకు పరిష్కారం చూపే కేంద్రం గా గ్రామ సచివాలయం మారాలంటే ఇందుకు చిత్తశుద్ధి కావాలి. మొదట గ్రామాన్ని పలురకాల రుగ్మతల నుంచి బయటపడవేయాలి.

గత పాలకులు గ్రామ పంచాయతీ అంటే గ్రామ స్వరాజ్య స్థాపనాకేంద్రం అన్న అర్థం మార్చి సంపూర్ణ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చివేశారు. గ్రామంలో యువతను తమ అనుబంధ పార్టీ సరుకు గా మార్చివేసే పనిచేశారు. పేదల కష్టాలు కన్నీళ్లు తుడి చి వారిని అన్ని రంగాలలో ఆత్మగౌరవంతో నిలబెట్టే దశకు తీసుకపోవాల్సిన గ్రామ పంచాయతీలకు చెద లు పట్టే విధంగా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య రాజ్యాంగాన్ని తయారు చేసే సాహసోపేతమైన చర్యలకు సిద్ధపడింది. ప్రభుత్వం చేసే పనులపై న, పథకాలపైన విమర్శలు సహజంగా ఉంటాయి. ప్రజల పక్షం వహించే ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు, విమర్శలు చేస్తే మంచిది. అడ్డగోలు విమర్శలు చేయటం మంచిది కాదు.

పేదవానికి నాణ్యమైన విద్య, వైద్యం తక్షణం అం దాలి. న్యాయబద్ధంగా అన్ని రకాల ప్రభుత్వ సేవలు పేదల వాకిళ్ల దగ్గరకు పోవాలి. ఇందుకు గ్రామ జ్యో తి పథకం ఈసీజేగా పనిచేయాలన్నది కేసీఆర్ ధ్యేయం. రేషన్ కార్డు దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డు వరకు, కేజీ టు పీజీ చదువుకు వెళ్లేందుకు, విలేజ్ నుం చి గ్లోబల్ విలేజ్‌లోకి అడుగుపెట్టేందుకు ఒక పునాది గా, ప్రాతిపదికగా, ఒక కార్యక్షేత్రంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ మారాలి. అందుకు ప్రతి రూపంగా గ్రామజ్యోతి పథకాన్ని తయారుచేసుకోవాలి. గ్రామ స్వరాజ్యాన్ని నినాదాల దశ నుంచి, ఆచరణాత్మకంగా మలచటమే ఈ శతాబ్దంలో ఆధునిక విప్లవంగా మిగిలి పోతుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తపనపడుతూ భవిష్యత్తును తీర్చిదిద్దే కృషికి ప్రతి ఒక్కరూ సాయపడాలి. ఇది ప్రభుత్వం పని కాదు. ఇది మనందరి సామూహిక పని. గ్రామజ్యోతులను వెలిగిద్దాం పదం డి ముందుకు.

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందగలుగుతుంది. గ్రామ అభివృద్ధిలో, నిర్మాణాత్మాకమైన కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు భాగస్వాములు కావాలి. ఇందుకు గ్రామ పంచాయతీ పెద్దన్న పాత్ర పోషించా లి. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం గుక్కపట్టి ఏడ్వటానికి కారణాలు కూడా బలమైనవి. గ్రామ సచివాలయం ప్రజలందరి సామూహిక ఆలోచనాలయం గా తీర్చిదిద్దుకోవాలి. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి మనందరి అభివృద్ధి. అది ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్నది క్రమంగా కనుమరుగవుతూ వచ్చిం ది. గ్రామీణ జీవన వ్యవస్థను చిన్నాభిన్నం అవుతూ రావటాన్ని సమాజం మౌనంగా చూస్తూ ఉండటం ఒక ప్రమాదకర సంకేతంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం విచారకరమైనది.

దీనిపై ప్రజలందరూ ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామాన్ని బతికించుకోవాలి. గ్రామాన్ని బతికించుకోవటమంటే జన్మనిచ్చిన తల్లిని కాపాడుకుంటూ అమ్మ రుణం తీర్చుకోవటం లాంటిదన్న భావన ఈ తరం నరనరాల్లోకి ఎక్కాలి. ప్రాథమిక విద్య నుంచి కళాశాలల చదువు వరకు యువత కు గ్రామ సంరక్షణపై చెప్పాలి. ఒకనాడు పాడిపంటలతో విలసిల్లిన గ్రామాలు నేడు ఈ క్షీణదశకు రావటానికి కారణాలు బేరీజు వేయాలి. చివరకు గ్రామం అం టే అంతా గ్రామ పంచాయితీదే అన్న భావనకు తీసుకురావటం జరిగింది. గ్రామాన్ని వీడి దాన్ని ఒక పం చాయితీగా, అదీ ఒక రాజకీయ పంచాయితీగా, రాజకీయ రచ్చబండగా మార్చేశారు. అదే నేడు మన గ్రామాలకు శాపంగా మారింది. దీన్ని మనం యుద్ధ ప్రాతిపదికన తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటికీ సుమారు డ్బ్భై శాతం ప్రజలు గ్రామ జీవితంలోనే ఉన్నారు.

ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు గ్రామాన్ని అన్ని రం గాలలో తీర్చిదిద్దుకోవటానికి ముందుకు తీసుకురావ టం, గ్రామమే దేశానికి ప్రాణమన్న భావనను కలిగించేందుకు, గ్రామాభివృద్ధి స్ఫూర్తి రగిలించేందుకే ప్రత్య క్ష కార్యాచరణకు అత్యవసరంగా దిగాలి. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, రోడ్లను నిర్మించుకోవటం, ఇంటింటికి మం చినీళ్లు అందే విధంగా చూడటం, ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి ధనిక బీద తేడా లేకుండా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించటం, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా చేయటం, మొక్క లు నాటడం, చెట్లను పెంచటం పర్యావరణాన్ని కాపాడుకోవటం చేయాలి.
రాజ్యాంగం అనేక హక్కులు ప్రసాదించింది. వాటి ని సక్రమంగా అమలు చేసేందుకు గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దుకొనే దిశగా మళ్లీ మన ప్రయాణం మొదలు పెట్టాలి. అందుకు సన్నద్ధం అయ్యేందుకు సూచికగా మనందరి విస్తృత వేదికగా గ్రామ జ్యోతి ని ప్రతి ఊరిలో వెలిగించాలి. సహృదయంతో ప్రతి ఒక్కరం ఇందులో భాగస్వాములమవుతూ కొంతకాలం కృషిచేస్తే గ్రామాలు తప్పకుండా మళ్లీ చిగురిస్తాయి. పచ్చటి పర్యావరణ కేంద్రాలుగా మారుతా యి. గ్రామాన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం కావాలి.

గ్రామాల్ని సాంకేతిక శిక్షణాకేంద్రాలుగా మార్చుకుని గ్లోబల్ విలేజ్‌లో మన గ్రామం వెలుగులు విరజిమ్మాలి. ఇందుకు ప్రభుత్వం గ్రామ జ్యోతిని పెట్టింది. ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. దీనికి ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు భాగస్వామ్యం కావటంతోపాటుగా ఈ గ్రామజ్యోతి దేదీప్యమానంగా అది మన అభివృద్ధి దీపంగా వెలుగొందటానికి ఏం చేయాలన్న సూచనలు గ్రామ పంచాయితీలకు అందించాలి. ఈ అరవయ్యేళ్లుగా పాతుకుపోయిన పాకుడును, చెత్తను ఒక్కసారిగా దులపటం ఎవరివల్లా కాదు. మనందరం తలా ఓ చేయి వేసి దీన్ని ముందుకు నడిపించేందుకు కొంతకాలం శ్రమకోడ్చి నిలిస్తే మాత్రమే ప్రతి ఊరిని ఒక మోడల్ విలేజీగా, సర్వసమృద్ధిగా తీర్చిదిద్దుకోగలుగుతాం. ఈ దిశగా అడుగులు వేసేందుకు గ్రామాన్ని సర్వసమృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ సహాయమందిచాలి.

ప్రతి ఊరు ఒక ప్రపంచం. మనందరికి తొలి జ్ఞానకేంద్రమైన అమ్మ ఒడిలాంటి గ్రామాన్ని కంటికి రెప్ప లా కాపాడుకుందాం. అన్ని శక్తులను ఒడ్డి అన్ని రంగాలను తీర్చిదిద్దుకునే గ్రామ సంరక్షకులుగా ప్రతి ఒక్క రూ తయారు కావాలి. ఈ గ్రామజ్యోతి పథకంగా కాకుండా అది మన గ్రామాల గతిని మార్చే జీవనజ్యోతిగా తీర్చిదిద్దుకుందాం. గ్రామ రుణం తీర్చుకునే బిడ్డలుగా నిలుద్దాం.

-పంచాయితీల సాధారణ అధికారములు కృత్యములు
1. వ్యవసాయ విస్తరణతో సహా వ్యవసాయం, 2.భూమి అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, భూముల ఏకీకరణ, భూసార రక్షణ, 3. చిన్నతరహా నీటిపారుదల, నీటి నిర్వహణ, నీటి వాలను అభివృద్ధి చేయుట, 4. పశు సంవర్ధన, పాడిపరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, 5.మత్స్య పరిశ్రమలు, 6.సాంఘికంగా చెట్లు పెంచడం, పొలాల్లో చెట్లు పెంచడం, 7.చిన్నతరహా అటవీ ఉత్పత్తులు, 8. ఆహారం ప్రాసెస్ చేసే పరిశ్రమలతో సహా లఘు పరిశ్రముల, 9.ఖాదీ, గ్రామ కుటీర పరిశ్రమలు, 10.గ్రామీణ గృహ నిర్మాణం, 11. తాగు నీరు, 12. ఇంధనం (వంట చెరకు), పశుగ్రాసం, 13. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, ఫెర్రీలు, జలమార్గాలు, ఇతర రాకపోకల సాధనాలు, 14.విద్యుచ్ఛక్తి పంపకం తో సహా గ్రామీణ విద్యుద్దీకరణ, 15.సంప్రదాయేతర విద్యుచ్ఛక్తి వనరులు, 16. దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమం, 17.ప్రాథమిక, సెకండరీ పాఠశాలల తో సహా విద్య, 18.సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య, 19. వయోజన, అనియత విద్య,

20. గ్రంథాలయాలు, 21.సాంస్కృతిక కార్యకలాపములు, 23.ఆసుపత్రు లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు, ఔషధ శాలలతో సహా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, 24. కుటుంబ సంక్షేమం, 25.స్త్రీ, శిశు అభివృద్ధి, 26.వికలాంగుల, బుద్ధి మాంద్యం కలవారి సంక్షేమంతో సహా, సాంఘిక సం క్షేమం, 27.బలహీన వర్గాల, ప్రత్యేకించి, అనుసూచి త కులాల, అనుసూచిత జనజాతుల సంక్షేమం, 28. ప్రజా పంపిణీ వ్యవస్థ, 29.సామాజిక సంపత్తుల నిర్వహణ.

2130

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల