నెరవేరనున్న నిరుద్యోగుల కల


Tue,June 9, 2015 01:33 AM

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో నిరుద్యోగుల ఆశలను, ఆకాంక్షలను
నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేయవలసి ఉంది.

తెలంగాణ రాష్ట్రం తనను తాను రచించుకుంటున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవతరణ కీలకమైనది. నీళ్లు, నిధులతో ఎగిసిన ఉద్యమానికి మా ఉద్యోగాలు మాకే అనే డిమాండ్ తెలంగాణ నేలపై కదం తొక్కింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మన చరిత్రను మనం చదువుకుంటూ, మన సంస్కృతిని మనం ఆకళింపు చేసుకుం టూ, నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసేందుకు మానవ వనరుల సైన్యాన్ని తయారుచేసే కేంద్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగంలో ఒక అంగం.

రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలు మూడు స్తంబాలు. శాసన వ్యవస్థను ప్రజలు ఎన్నుకుంటారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యం, పరిపాలన ఈ రెండూ వేర్వేరా? ఒకటేనా? అనే దానిపై సుదీర్ఘమైన చర్చ చేయటం జరిగింది. రాచరికమే లేదా రాజ్యమే పరిపాలనా వ్యవస్థ కూడా అయితే దానివల్ల వచ్చే ప్రమాదాలను అంబేద్కర్ చెప్పారు. కులం, మతం, ప్రాంతం, భాషా లాంటి అనేక సమస్యలున్నాయి. ఇందు కోసం ఒక నాడీ వ్యవస్థ కావాలి. ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ వ్యవస్థతో సంబంధంలేని పాల నా వ్యవస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమి షన్ ను ఏర్పాటు చేయ డం జరిగింది. ఆర్టికల్ 315, ఆర్టికల్ 316 ద్వారా రాజ్యాంగం లో పొందుపరచిన విధంగా అటానమస్‌గా, స్వతంత్రంగా నిలి చే రాజ్యాంగబద్ధమైన విధానం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది.

అదే సర్వస్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగా రూపొందించబడింది. అందుకే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎటువంటి రాజకీయ నీడలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేందుకు సమర్థుడైన వ్యక్తి చక్రపాణిని చైర్మన్‌గా ఎంపిక చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎవరు చెప్పినా వినని వ్యక్తి ఒక లక్ష్యంతో ముందుకు సాగే యువకుడినే ఈ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌గా ఎంపిక చేశామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ అంటే అదొక అవినీతి పాతాళం లాగా పేరుబడింది.

పాత బూజులు దులిపి, పాత సిలబస్‌లను పాతరేసి, ఈ నేల ప్రశస్తిని చాటి చెబుతూ, ఆధునిక సమాజాలను అం దుకుంటూ ముందుకు సాగే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తీర్చిదిద్దేపని దిగ్విజయంగా జరుగుతూ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 320 ద్వారా పూర్తి రాజ్యాంగపరమైనది. యిది న్యాయ వ్యవస్థకంటే కూడా రాజ్యాంగ బద్ధత కలిగి ఉంది. అందు కే రాజకీయ నేతలకు కమిషన్‌ను అపాయింట్ చేసే అధికారం ఉంటుంది కాని వారిని తొలగించే అధికారం మాత్రం ఉండదు.

జూలై 2, 2014న తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే ఆ ఏడాది డిసెంబర్ 18న పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ప్రకటించింది. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని, సభ్యులుగా విఠల్, చంద్రావతి, మహ్మద్ మతీనుద్దీన్‌లను నియమించింది. ఇందు కోసం అడ్డు వచ్చిన అనేక సాంకేతిక అంశాలను అధికమించవలసివచ్చింది.

ఈ క్రమంలో పాత విధానానికి భిన్నంగా తెలంగాణ అస్తిత్వంతో పరీక్షా విధానం రూపుదాల్చేందుకు చక్రపాణి ఎంతో కృషి చేశారు. గత పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చివేశారు. ఇందుకోసం ఆయన భారీగానే కసరత్తు చేయడం జరిగింది. నూతన పరీక్షా విధానాన్ని చేపట్టేందుకు ఆయన తెలంగాణ విద్యారంగంలో నిపుణులందరినీ ఒక దగ్గరకు చేర్చారు.చక్రపాణి ప్రొఫెసర్‌గానే గాక సామాజిక సమస్యలపై లోతైన అవగాహన వున్న వ్యక్తి కావడం వల్ల ఆయన పాత చరిత్రకు భిన్నంగా కొత్త చరిత్రతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థను తిరగరాశారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను 32 మందిని కమిటీగా వేసి పరీక్ష విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలలు ఈ కమిటి వివిధ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తయారుచేసింది. కమిషన్‌ను ప్రభుత్వం నియమించిన తక్కువ కాలంలోనే దీని పరిధిలోకి వచ్చే 300 రకాల డిపార్ట్‌మెంట్‌ల పరీక్షలను నిర్వహించడం జరిగింది.

shankar


నిరుద్యోగులైన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో తన పేరును నమోదు చేసుకోవచ్చును. ప్రపంచ వ్యాపితంగా బహుళజాతి కంపెనీలు అమలుపరిచే విధంగానే వన్‌టైం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరుద్యోగికి ఉచితంగా సమగ్ర సమాచారాన్ని పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైటులో వీక్షించవచ్చును. తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చును. ఆ దరఖాస్తు ఫారంలో ఆధార్ నెంబర్‌తో సహా, అన్ని రకాల క్వాలిఫికేషన్లు, అభ్యర్థికి ఏ రకమైన ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉందో తెలియజేయవచ్చును. పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్ ద్వారా సంపూర్ణ వివరాలను తెలుసుకోవచ్చును.

ఈ దరఖాస్తు ఫారంలో అభ్యర్థి మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబరు అడుగుతారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ అభ్యర్థి మొబైల్ టియస్ ద్వారా 10 డిజిటల్ నెంబర్లున్న కోడ్ నెంబర్‌ను యిస్తారు. నోటిఫికేషన్ విడుదలైనప్పుడు, ఉద్యోగాలలో ఖాళీలు ఏర్పడినప్పుడు, ఆ నోటిఫికేషన్ వివరాలను నమో దు చేసుకున్న వారికి ఎస్‌ఎవ్‌ుఎస్, ఈమెయిల్ రూపంలో అభ్యర్థికి సమాచారం పంపడం జరుగుతుంది. ఆ లింకును క్లిక్ చేస్తే ఒక విండో తెరుచుకుంటుంది. దాం ట్లో మొబైల్ టిఎస్ ద్వారా ఆ అభ్యర్థికి కేటాయించిన 10 అంకెల కోడ్ నెంబర్‌ను అడగటం జరుగుతుంది.

ఆ 10 అంకెల కోడ్ నెంబర్‌ను టైపు చేస్తే కంప్యూటర్‌లో అప్లికేషన్ ఫిలప్ అవుతుంది. దాన్ని అభ్యర్థి క్రాస్ చెక్ చేసుకోవాలి. 2వ సారి మీట నొక్కితే పరీక్షా రుసుము చెల్లించే మరో కిటికీ తెరుచుకుంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చును. మొబైల్ మనీ ద్వారా కూడా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చును. పరీక్షకు వారం రోజులు ముందు మరొక సమాచారం వస్తుంది. ఇంట్లో కూర్చుని అభ్యర్థి కంప్యూటర్ ద్వారా అప్లికేషన్ తీసుకొనవచ్చును. పరీక్ష రాసాక ఫలితాలు, మెమో కూడా మెయిల్, మొబైల్ ద్వారా పొందవచ్చును. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ కొత్త పరీక్ష విధానం దేశానికే ఆదర్శంగా నిలువనుంది. ఇలాంటి పరీక్షా విధానం కేరళ రాష్ట్రంలో ఉంది.

కేరళలో సర్వెంట్ నియామకం దగ్గరనుంచి సర్వీసు కమిషన్ నియామకం వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ విధానం కంటె కూడా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృషి చేస్తోంది. ఈమెయిల్ విధానం ద్వారా యిప్పటికే 80 వేల మంది అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

40 రోజులలో 25 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేశారు. అంటే రోజుకు సగటున 50 వేల మందికి పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వీక్షిస్తున్నారు.
ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో నిరుద్యోగుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేయవలసి ఉంది.
రచయిత: కవి, సీనియర్ జర్నలిస్టు

1211

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles