పిల్లల చేతికి మన చరిత్ర


Thu,May 28, 2015 01:47 AM

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా సమగ్ర తెలుగు సాహిత్యంపై అవగాహనను పెంచుతూ మన చరిత్ర, మన సాహిత్యం చదువు కునేందుకు పునాదులు వేయబడ్డాయి. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలను చూస్తుంటే.. మన సాహి త్య సంస్కృతిక రంగాలను సంపూర్ణంగా అవలోకనం చేసుకున్నట్లుగా ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం అవతరించి జూన్ 2కు సంవత్సరకాలం పూర్తికావిస్తున్న తరుణంలో తెలంగాణ అస్తిత్వ అంశాలు తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించుకోబోతున్నాయి. తన నేలపై జరిగిన పోరాటాలను, తన మట్టి ప్రశస్తిని చెప్పే విషయాలన్నీ తొలిసారిగా తరగతి గదిలోకి పాఠ్యాంశాలుగా రాబోతున్నాయి. ఇప్పటి వరకు కనుమరుగు చేయబడ్డ తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలు, రాజకీయ చైతన్యాలు, సామాజిక మార్పులు పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కా యి. ఆధిపత్య సంస్కృతిపై తిరుగబడ్డ తెలంగాణ మట్టి బిడ్డల చరిత్ర పాఠ్యాంశం కావటం ఆనందకరమైన విష యం. తరగతిగదిలోనే ప్రపంచం రూపుదాల్చుతుందని కొఠారీ చెప్పాడు. కానీ తెలంగాణ చరిత్ర, సం స్కృతిని మాత్రం ఆధిపత్యవాదులు తొక్కివేశారు. ఇపుడు నవ తెలంగాణ రాష్ట్రం అవతరించాక తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలు, మన చరిత్ర, మన సంస్కృతి, మన పండుగలు,ఆటలు,పాటలు, మనం చేసిన పోరాటాలన్నీ సిలబస్‌లోకి ఎక్కాయి. తెలంగాణ పలుకుబళ్లతో, తెలంగాణ పదబంధాలతో, తెలంగాణ సామెతలు నానుడులతో పాఠ్యపుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది.

juluru


1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా సమగ్ర తెలుగు సాహిత్యంపై అవగాహనను పెంచుతూ మన చరిత్ర, మన సాహిత్యం చదువు కునేందుకు పునాదులు వేయబడ్డాయి. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలను చూస్తుంటే తెలంగాణ సాహి త్య సంస్కృతిక రంగాలను సంపూర్ణంగా అవలోకనం చేసుకున్నట్లుగా ఉన్నది. విస్తృత తెలంగాణ సాహిత్యం ఇపుడు పాఠ్యాంశంగా, బోధనాంశాలుగా విద్యార్థుల చేతుల్లోకి రాబోతున్నది.
తరగతి గదిలో చెప్పబడే పాఠం వల్లనే పిల్లల్లో సంబంధిత అంశాలపై పరిశోధనాశక్తి కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడ్డ 1నుంచి 10 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలను చూస్తే ఆ విషయం అవగతమవుతుంది. పలు అంశాలపై పిల్లల్లో పరిశీలించే తత్వాన్ని, పరిశోధించే ఆలోచనలను తట్టిలేపటమే సిలబస్ ఉద్దేశం. ఈ తెలుగు పాఠ్యపుస్తకాలు పిల్లలు టీచర్లలో పరిశోధనా తత్త్వాన్ని పెంచేందుకు దోహదపడుతాయి. ఒక పాఠ్యాంశాన్ని విన్న తర్వాత పిల్లలు వేసే ప్రశ్నలవల్ల తెలంగాణకు సంబంధించిన సమగ్రసాహిత్య సాంస్కృతిక రూపం బైటకు వస్తుంది. ఈ పాఠ్యపుస్తకాలలో విస్తృతంగా తెలుగు సాహిత్యం ఉన్నది. దాంతో పాటుగా విస్తృత తెలంగాణ సాహి త్యం తెలుసుకుంటారు. ఇదే నూతన ఆలోచనలకు పునాదులు వేస్తుంది.

ఇంతకు ముందు పాఠ్యపుస్తకాలలో ఆంధ్రా యాస తో, రెండున్నర జిల్లాల ఆధిపత్య భాషలో పదాలుండేవి. ఇప్పుడవి కనిపించవు. 1వ తరగతి తెలుగు పుస్త కం చూస్తే నిత్య వ్యవహారిక తెలంగాణ తెలుగుపదాలతో ప్రాథమిక వాచకాలు తయారు చేయటం జరిగింది. 1వ తరగతి పిల్లలకు తాము తమ ఇంటి దగ్గర మాట్లాడుకునే ఇంటి భాషను, తెలంగాణ భాషను పెట్టారు.మూకిట్ల ముగ్గేసినట్లుంది, సకినాలు, సోప తి, సోపతోళ్లు, మూకుడు, బువ్వ, తొవ్వల, కావలి, సత్తువ, ఎముడాల, ఉంగరం, దోస్తులు, పెంకాసు, పచ్చీసు, అంగి, అర్రలు, కమ్ముకొచ్చాయి, అలుగులు దుంకాయి లాంటి తెలంగాణ పదాలు అడుగడుగునా 1వ తరగతి వాచకంలో ఉన్నాయి.

రెండవ తరగతిలో బతుకమ్మ పాఠం పెట్టారు. ఈ పాఠం ప్రయోగాత్మకంగా ఉన్నది. పిల్లలకు దృశ్యరూపంగా పాఠం అర్థం కావాలి. ఆ దృశ్య రూపాలను అందమైన చిత్రాలలో చూపారు. పిల్లలకు గేయాలు తొందరగా అర్థమవుతాయి. పాటలు గుర్తుండి పోతా యి. అందుకే బతుకమ్మ పాఠాన్ని గేయంగా మలిచి చెప్పటం జరిగింది. దీని ద్వారా పిల్లలు అచ్చులు, హల్లులు రెండూ నేర్చుకోవాలి. దీనికి ఆ బొమ్మల ద్వారా పూలను సేకరించటం రంగు రంగుల పూలు, బతుకమ్మను పూలతో పేర్చటాన్ని ఆ గేయంలో నేర్పటం ఉన్నది. ఈ పదాలు నేర్పుతో చెప్పా లి. బతుకమ్మను ఎత్తుకు పోయేటప్పుడు దృశ్యాన్ని చూపాలి. నీళ్లల్లో చివరకు బతుకమ్మను వదులుతూ పోయిరా గౌరమ్మ.. అంటూ గేయం ముగుస్తుంది. ఇదంతా ఏకసూత్ర ప్రయోగం. దీనిద్వారా పిల్లలకు రకరకాల రంగులు, పూలు వాటి విశిష్టత, దానితోపాటు బతుకమ్మ కథ, హల్లులు, అచ్చులు అన్నీ తెలుస్తాయి.

మూడవ తరగతిలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను చెప్పటం జరిగింది. పాఠంలో వాటి విశిష్టతను చెబుతారు. రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడు పూవును ఇందులో విశ్లేషించి చూపారు. తెలంగాణలోని నీటి అందాలను వర్ణించటం జరిగింది. నీటి అందాలు పాఠంలో వరంగల్ జల్లా ములుగులో కాకతీయుల కాలంలో తవ్వించిన లక్నవరం చెరువు, తెలంగాణ కాశ్మీరంగా చెప్పబడుతున్న ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం, మానవ నిర్మిత మహాసాగరం నాగార్జునసాగరం లాంటి నీటి అందాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా పెట్టటం జరిగింది.
4వ తరగతిలో తెలంగాణ సంస్కృతి మన పండుగలు పై పాఠ్యాంశం ఉన్నది. నేను గోదావరిని అన్న పాఠంలో గోదావరి నది ప్రవహిస్తున్న ప్రదేశాలలో వున్న బాసర, ధర్మపురి, కోటిలింగాల గుడి, రామగుం డం విద్యుత్‌కేంద్రం, సింగరేణి బొగ్గుగనులు, కాళేశ్వరం, భద్రాచలం మొదలగు ప్రాంతాల ప్రశస్తి చెప్పబడింది. ఈ పాఠ్యాంశం ద్వారా తెలంగాణ నదీ పరివాహక ప్రాంతంలో వున్న విశిష్టతలన్నీ వివరించబడ్డా యి. అదే విధంగా కళారత్నాలు అన్న పాఠంలో మన పేర్నినాట్యం, నటరాజు రామకృష్ణయ్య, కొండపల్లి శేషగిరిరావు, కాపురాజయ్య, చిందు ఎల్లమ్మ, మిద్దెరాములును గురించి చెప్పడం, వీరు వేసిన చిత్రాల ను, వారి కళలను చెప్పటం జరిగింది. వీరు తమ కుంచెద్వారా, తమ కళానైపుణ్యం ద్వారా తెలంగాణ గొప్పదనాన్ని కళాప్రతిభతో ప్రపంచానికి చాటిచెప్పిన విధానాన్ని, కళాకారుల గురించి సవివరంగా వివరించారు.ఇది పిల్లలలో కళాత్మకతను ప్రతిష్ఠిస్తుంది. రంజాన్, క్రిస్మస్, బంజారాల పండుగ తీజ్ తదితర పండుగలు వాటి ప్రశస్తి ఇందులో ఉంది. తెలంగాణ వైభవం పాఠ్యభాగంలో తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు ఎలా నిలయమో తెలంగాణ వైభవం పాఠ్యాంశంలో పిల్లలు చదువుకుంటారు. పోతన, రుద్రమదేవి, పాల్కురికి, రామదా సు, వేములవాడ శివుడు, జానపాడు సైదులు, మెదక్ చర్చి, రామప్ప శిల్పాలు, చార్మినార్, భద్రాద్రి రాము డు, కొమురం భీవ్‌ుల గురించి గత వైభవమంతా తెలంగాణ వైభవంలో ఉంటుంది.

5వ తరగతిలో యాదగిరిగుట్ట, సాలార్‌జంగ్ మ్యూజియంలపై పాఠాలున్నాయి. ఇప్పటి వరకు తిరుపతి గురించి చెప్పటం జరిగింది కానీ యాదాద్రి గురిం చి చెప్పలేదు. ఇది తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్లనే సాధ్యమైంది. హైదరాబాద్‌ను వర్ణిస్తూ ప్యారా హైదరాబాద్ అన్న గీతం ఉంది. ఇందులో హైద్రాబాద్ విశిష్టత ఉంది.

మల్లేష్, మస్తాన్ భాయీ భాయీ
ఏక్‌మే దో పియా ఇరానీచాయి అంటూ చెప్పిన గేయంలో మత సామరస్యం ఉంది. ఈ పాఠం ద్వారా తరతరాలుగా హైద్రాబాద్‌లో విలసిల్లిన మతసామరస్యాన్ని, లౌకికత్వాన్ని పిల్లలకు సందేశంగా వివరించా రు. తెలంగాణకు ప్రాణాధారమైన చెరువుపై పాఠం ఉంది. చింతచెట్టు, బోనాలపై పిల్లలు చదువుకుంటారు. మొత్తం 10జిల్లాల్లో వున్న ప్రముఖ స్థలాలను, వాటి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునేందుకు, పిల్లలకు లేఖ అనే పాఠం ద్వారా చెప్పటం జరిగింది. ఇది 6వ తరగతి పిల్లలకు ఒక స్నేహితురాలు రాసిన లేఖ ద్వారా ఈ యాత్రా విశేషాలుంటాయి. నాగార్జునసాగర్, నాగార్జునకొండ, హనుమకొండ, వేయిస్తంబాల గుడి, భద్రకాళి దేవాలయం, కాకతీయ శిలాతోరణం, రామప్పగుడి, కోటిలింగాల,చార్మినార్, గోల కొండ, ట్యాంక్‌బండ్, బుద్ధ విగ్రహం, గద్వాలకోట, పాలమూరు పిల్లలమర్రి లాంటి యాత్రా స్థలాలున్నాయి. వీటన్నింటిని ఈ పాఠంలో పొందుపర్చారు.

4నుంచి 10తరగతుల తెలుగు పుస్తకాలలో ఇప్పటి వరకు వెలుగుచూడని తెలంగాణ శతక కవులు కొంద ర్ని ఈ తరం వారికి పరిచయం చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో వున్న శతక కవులు ఉమ్మడి రాష్ట్రంలో వెలుగుచూడలేదు.మన నేల గర్వించదగ్గ శతక కవులు మనకున్నారు. రావికంటి రామ య్య గుప్త, కాకుత్సం శేషప్పకవి, డాక్టర్ ఆడేపు చంద్రమౌళి, ధూపాటి సంపత్కుమారాచార్య, ఆచార్య మరింగంటి పురుషోత్తమాచార్యులు, సూరోజు బాల నర్సింహాచారి, డాక్టర్ టి.వి. నారాయణ, కౌకుంట్ల నారాయణరావు, శిరశినగల్ కృష్ణమాచార్యులు, పం డిత రామనర్సింహ్మాకవి, ఉప్పల సత్యనారాయణాచార్య, గౌరీభట్ల రఘురామశాస్త్రి, అందె వెంకటరాజం, యిమ్మడిసెట్టి చంద్రయ్య, గుమ్మనగారి లక్ష్మినర్సింహాశర్మ, నంబి శ్రీధర్‌రావు తదితర శతక కవులను పరిచయం చేశారు.

ఆరు దశాబ్దాల కిందట అంతర్జాతీయ మానవతా గీతాన్ని ప్రపంచానికి అందించిన సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా/పసులగాసే మొనగాడా/పాలు మరిచి ఎన్నాళ్లయ్యిందో/ఓ పాలబుగ్గల జీతగాడా అన్న పాటను 6వ తరగతి విద్యార్థులకు సిలబస్‌లో పెట్టారు. పొట్లపల్లి రామారావు రాసిన చీమలబారు అన్న వచన కవిత ఉంది. మన జాతర, జనజాతర అయిన సమ్మక్మసారక్కల మేడారం జాతర, తెలంగాణ పల్లెలు, సంస్కృతి సవివరంగా పాఠాల నిండా ఉన్నాయి.
(మిగతా రేపు)

3296

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles