కుల భోజనాలు- జన భోజనాలు


Sun,December 1, 2013 12:52 AM

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉన్నా ఆ ధనానికి కూడా కులం ఉండటం స్పష్టంగా చూస్తున్నాం. ధనం కాదు కులమేరా అన్నింటికి మూలం అన్న స్థితిలో నేటి సమాజం ఉన్నది. మనుధర్మశాస్త్రం రూపం మార్చుకుని అత్యాధునిక మార్కెట్ సమాజంలో కూడా ఆధిపత్యకులాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. గ్రామ వాకిళ్ల నుంచి మహానగర సైబరాబాద్‌ల దాకా కులం విషపుకోరలు దిగి వున్నాయి. కులం, మతంతో ఏ సమాజాన్ని నిర్మించలేం కానీ మన సమాజం గోడలు మాత్రం కులం పునాదులపైననే నిలిచి ఉన్నాయి. సర్వ రంగాలను ప్రభావితం చేయగల రాజకీయరంగమే కులం సంకెళ్లలో బంధించబడి ఉంటే ఇంకా ఆ సమాజానికి దిక్కెవరు? పోలీసు లాఠీకి, న్యాయం చెప్పే ధర్మ పీఠానికి కులం సెగలు తగులుతుంటే సమాజం ఎంత ప్రమాదంలో ఉన్నట్లు! ప్రజలు చేసే ప్రతి ఉద్యమం, పోరాటాలను కూడా ఆధిపత్యకులాలే హస్తగతం చేసుకుని అధికారం లాయిస్తున్నాయి.

ఏ వర్గాలకైతే విముక్తి కావాలో, ఏ కుల సంకెళ్లనైతే బద్దలుకొట్టాలో అందుకోసం పోరాడుతున్న శక్తులను అణగవూదొక్కేస్తున్నారు. అందుకే మన చదువులలో కూడా అగ్రవర్ణతత్వం బలంగా వినిపిస్తుంది. సమస్త కళలు సాహిత్యం ఆధిపత్య సంస్కృతికి అద్దంప ఉన్నాయి. సమాజంలో మార్పు రావటమంటే కులం పునాదులను పెకలించివేయాలి. విప్లవాలకు పురుటిగడ్డలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి అగ్రవర్ణాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఆధిపత్య సంస్కృతి అన్ని జిల్లాల్లో విభిన్న రూపాలలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నవాళ్లంతా అగ్రవర్ణాల వాళ్లే. కార్పొరేట్ విద్యా వైద్యరంగాలు, పరివూశమలు మూడు అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. అన్ని రంగాలను శాసించే రాజకీయరంగం మూడు కులాల చేతుల్లోనే ఉంది.

విప్లవోద్యమాలు వామపక్ష ఉద్యమాల దగ్గర నుంచి పాలక పార్టీల వరకూ- అన్ని పార్టీ ల నేతలంతా ఆధిపత్యకులాలవాళ్లే ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఒక ఎర్రటి కమ్యూనిస్టు పార్టీ నుంచి ఒకే ఒక్కసారి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమున్న బహుజనవర్గాల వ్యక్తిని నిలబెడితే ఆ సొంతపార్టీలోని అగ్రవర్ణాల దగ్గర నుంచి ఆ నియోజక వర్గంలోని ఒక బలమైన అగ్రకులస్తులంతా కలిసి ఓడించారు. ఇట్లా వామపక్షాల విప్లవాలు ‘వ్ధల్లి’తున్నాయి. ఖమ్మం జిల్లాను చూస్తేనే ఎర్రజెండాలు గుర్తుకొస్తాయి. కానీ అక్కడి విప్లవోద్యమాలు, వామపక్ష ఉద్యమాలు ఒక కులం చేతుల్లోనే వుండటం ఏ చరిత్ర పరిణామవూకమమో విప్లవ పరిశీలకులే చెప్పాలి. ఆ జిల్లాలో అట్టడుగు కులసంఘాలకు ఆ ఒక్క ఆధిపత్య కులమే గౌరవాధ్యక్షత వహిస్తూన్నది. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో రెండు కులాల వారే రాజకీయ, వ్యాపార, పారివూశామిక రంగాల చక్రాలు తిప్పుతున్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక ఆధిపత్యకులం అధికారం చెలాయిస్తూ వుంటే నల్లగొండ జిల్లాలో ఇంకో ఆధిపత్య కులం అధికారం చెలయిస్తున్నది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో రెండు ఆధిపత్య కులాలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. రాయలసీమలో రెండు కులాలు ఆధిపత్య పోరు సాగిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లో రెండు కులాలు ఆధిపత్యంలో ఉన్నాయి. తెలంగాణ నేలపై తిరగబడ్డ చరిత్ర అంతా అట్టడుగువర్గాలది. ఉద్యమాల్లో చావులన్నీ దళిత బహుజన, మైనార్టీవర్గాలవి. అధికారం అగ్రవర్ణాలది. ఎన్నో విప్లవాలకు ఈ నేల జన్మస్థానమైంది కానీ కుల సంకెళ్లను తెంచలేకపోయింది. కులసంకెళ్లు తెగనంతకాలం సమాజానికి విముక్తి లభించదు. మార్క్స్, లెనిన్, మావోలాంటి విముక్తి ప్రవక్తలను ముందుపెట్టి అంబేద్కర్,ఫూలేలను వెనక్కు నెట్టేస్తున్నారు.

సమూహం కలిస్తే సమాజం కావాలి. కానీ మన దగ్గర ఓ సమూహం కలిస్తే అది కులంగా మారుతుంది. కష్టజీవుల కలనేతగా ఉండాల్సిన సమూహాన్ని కులం శాఖోపశాఖలుగా చీల్చింది. మనుషులు కలవాల్సిన సమూహం, మానవీయ గీతంగా గొంతువిప్పాల్సిన సమూహం కులాల మూసగా మారింది. మానవ సంబంధాలతో అల్లుకోవాల్సిన సమాజ గూడు కులతాళ్లతో ఎక్కడికక్కడ కట్టివేయబడింది.అందుకేవెనుకబడి వున్నాం. అభివృద్ధికి కూడా కులమువూదలు పడటంతో మనం అభివృద్ధిలో అధోగతిస్థాయికి నెట్టబడ్డాం.
కష్టపడే కులాల ప్రజలు నిత్యం కలిసే ఉంటారు. వీరిది ఉమ్మడి సంస్కృతి. ఈ ఉమ్మడి సంస్కృతి ఎంతగట్టిగా ఉంటే అట్టడుగు వర్గాలు అంత పటిష్టంగా ఉంటాయి. అందుకే అగ్రవర్ణం ఎప్పుడూ అట్టడుగు కులాల్ని ఏకం కానివ్వ దు. ఈ అట్టడుగు మహాజనావళి ఏకం కానంతవరకూ అగ్రవర్ణ నాయకత్వమే అధికారం చెలాయిస్తుంది. నవ సమాజ నిర్మాణం జరగాలంటే మొదట మన పునాదుల్లోవున్న కుల వ్యవస్థను ధ్వంసం చేయాలి.

ఆధిపత్యకుల ధ్వంసం జరిగాకే అట్టడుగు మహజనావళితో కొత్త సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు ఆచరణాత్మక భావజాలవ్యాప్తిజరగాలి. ఇప్పు డున్న పాత సిలబస్‌ను పూర్తిగా మార్చాలి. ఇందుకోసం నిరంతరంగా ఉద్యమించాలి.

డిసెంబర్‌లో విస్తృతంగా వనభోజనాలుజరుపుతారు. ఇవ్వాళ.. ఈ వనభోజనాలు కూడా కులభోజనాలుగా మారిపోతున్నాయి. ఈ కుల భోజనాలను బహిష్కరించాలని ఖమ్మం జిల్లాలో చిరు వూపయత్నం జరుగుతున్నది. ఖమ్మం పట్టణంలో రెండేళ్లుగా స్పర్శ సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జనభోజనాలను నిర్వహిస్తు న్నది. శ్రమ సంస్కృతిని నాటుకుంటూ అట్టడుగు వర్గాలను కదిలించుకుం టూ ముందుకు సాగవలసిన సందేశాన్ని జనభోజనాల కార్యవూకమం అందిస్తున్నది. వనభోజనాలను ఆధిపత్యకులాలు కుల భోజనాలుగా మార్చటాన్ని తిప్పికొడుతూ అట్టడుగు కులాలన్నీ ఐక్యం కావల్సిన సందర్భమిది. కులభోజనాలను బహిష్కరిద్దాం. జన సంస్కృతిని విస్తరింపచేద్దాం.

-జూలూరు గౌరీశంకర్


తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

498

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles