గ్రామాన్ని బతికిద్దాం!!


Thu,July 18, 2013 12:39 AM

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది. వూరులో మంచినీళ్ల బావి, చింతచెట్లు, రకరకాల పండ్లచెట్లూ, మామిడిపూత, వేపకాయలు, తుమ్మచెట్లూ, మట్టిపొదలు, పుట్టలు, పాములూ, చెరువుగట్టూ, చిన్నబజారు, పెద్దబజారు, వడ్లబజారు, గౌండ్లోల్ల బజారు, గొల్లలవార్డు, చేనేతల కలతనేతల దారి, ఔసులాయిన, నాయివూబాహ్మలు, వూళ్లో దొర, మాలీప పోలీస్‌ప పెద్దడ్డి, పెద్ద వెలమ, కాపులు అన్ని కులవృత్తులతో కళకళలాడుతూ వుండేది. ప్యూడల్ వ్యవస్థ ఆధిపత్య అహంకారం బుసలు కొడుతుంటే వూరు బయట మాలవాడలు, మాదిగ గూడెంలు మూలుగుతూ వుండే వి. ఆ ప్యూడల్ వ్యవస్థను తెలంగాణ సాయుధ పోరాటం కూల్చివేసింది. దొర గడీలను నేలమట్టం చేసింది. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణకు తెలియదు. దొరల ఆధిపత్యాన్ని కూల్చివేసిన కడి కొమరయ్య, ఐలమ్మల త్యాగాల దారిలో మూడువేల గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరటమే తెలుసు.

గ్రామాలు స్వతంవూతంగా నిలడగలిగినప్పుడే దేశం పునాదులు పటిష్టంగా ఉంటాయన్న ఆలోచనలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వూరిలో అందరూ వరుసలు బెట్టిపిలుచుకోవటాలు, చెరువు పారే మత్తడి తొలకరి వర్షాలకు వాగుల్లో, చెరువుల్లో అలుగుల కాడ ప్రవహించే నీటిపైకి ఎదురీదుతూ ఎగిసిపడే చందమామ చేపలు కనిపించటంలేదు. ఆరోగ్యదేవతగా వున్న వూరు పూర్తిగా నీరసించిపోయింది. సకలసంపదల గుమ్మిగా ఉండే వూరు ఇప్పుడు దీనంగా వుంది. గ్రామ స్వరాజ్యం సంగతి గాంధీ కెరుకగానీ గ్రామం మాత్రం చలనం లేదిగా అయ్యింది. ఆప్యాయతలు తెగిపోయాయి. మా నడిగూడెంలో చినబాయి పెదబాయి, గరుకుబాయిలు దాదాపుగా ఎండిపోయాయి. వూరు మొత్తానికి నీళ్లనందించగలిగిన మా వడ్ల బజారులోని మంచినీళ్లబాయి ఉప్పుకశమయ్యింది. పొగాకు వెంకటరత్నం దుకాణం, జల్లా కేశయ్య, చెన్నూరి నారాయణల కిరాణకొట్లు, వందనపు వారి బట్టలకొట్లు కళతప్పాయి. పెద్దతోట రియల్‌ఎస్టేట్‌ల ప్లాట్‌లుగా మారింది. చిన్నతోట కూడా పోయింది. బీరోలు పాపిడ్డి బజారు, సిరిపురం దారికి పోయే బ్రహ్మంగారి గుడిబజారు, రాజానాయిని వెంకటరంగారావు నడిగూడెం గడి దివాలు తీసింది. గడీ వెనుక చినబజారు దిక్కులేనిదిలా ఉంది. హైస్కూల్ కళతప్పింది. కొల్లు పాప య్య చౌదరి కట్టించిన స్కూల్ ఎదురుగా వున్న హాస్టల్ పాకుడుబట్టి నల్లగా మారింది.

మా మచ్చయ్య కట్టించిన సినిమా థియేటర్ రియల్‌ఎస్టేట్ ప్లాట్‌గా మారింది.
నడిగూడెంకు కూతవేటుదూరంలో పచ్చగా పచ్చటి రంగేసినట్లుండే పంట పొలాలన్నీ బీళ్లుగా మారిపోతున్నాయి. మా వూర్లో మనుషులాసుపత్రి, పశవులాసుపత్రి ఏదో నామ్‌కేవాస్తేగా నడుస్తుంది. తెలంగాణ ముఖద్వారంలో ఇప్పుడున్న అతిపెద్ద పట్టణం కోదాడకంటే దాని పక్కనే వున్న మా నడిగూడెం గ్రామం. ఒకప్పుడు కళకళలాడుతూ ఆర్థిక స్థిరత్వంతో నిలబడింది. అలాంటి మా వూరు ఇప్పుడు జీవచ్ఛవంలాగా మారింది. మా వూరే కాదు సమస్త గ్రామాలు అట్లనే వున్నాయి. కాస్తంతా అటుఇటుగా ఉండవచ్చును. తాటికల్లు, ఈతకల్లు కరువైపోయే రోజులొచ్చాయి. వూరులో అప్పటి సారాజాడీలు జాడ లేవు. గానీ బజారుకొక బెల్టుషాపు వచ్చింది. కాపుసారాలు తాగి యువత చచ్చిపోతున్నారు. ఏ గ్రామం లెక్కతీసినా వితంతువుల సంఖ్య పెరిగింది. కాపుసారా కాచే గ్రామాల్లో విడో పెన్షన్ల లిస్టు తీస్తే అది వూర్లో 15 నుంచి 20 శాతంగా మారిపోయింది. మనుషులకు తాగునీరు లేక ఫ్లోరోసిస్ సమస్యతో నల్లగొండ జిల్లా వంకర్లు తిరిగిపోతుంది. ప్రకాశం జిల్లా ఫ్లోరోసిస్‌తో సతమతమవుతూ వుంది. గ్రామంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రభుత్వ వైద్యం కరువైపోయింది.

అటవీ ప్రాంతంలో వుండే గూడలలో, పల్లెల్లో వర్షాలు కురిస్తే విష జ్వరాలు తప్పటం లేదు. వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. గ్రామీణ వ్యవస్థ అతలాకుతలం కావటంతో పాలమూరు బిడ్డలు దేశమంతటికి కూలీలుగా మారి పొట్టపోసుకునేందుకు గ్రామాలను వదిలారు. పాలమూరు జిల్లాలో గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. హైదరాబాద్‌కు వలసవచ్చిన వారందరికీ పనులు దొరకక రైతులు బిచ్చగాళ్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు గ్రామం ఒక శాపంగా మారింది. గ్రామీణ జీవితమం ఎదుగుబొదుగులేని ఒక జడపదార్థంగా తయారయ్యింది. వేల పల్లెల్లో ఆకలి రాజ్యమేలుతుంది. దేశం జీడీపీ పెరుగుతుంది. కానీ గ్రామాలు మాత్రం మహాకాళ్ల రాక్షసి మార్కెట్ వ్యవస్థ పాదాల కింద నలిగిపోతున్నాయి. మన పాలకులు గ్రామాలను బతికించే దశలో లేరు. కానీ ఇంటింటికి ఒక బెల్టుషాపు తెరవమంటే వెంటనే తెరిచేస్తున్నారు. కులవృత్తుల చేతులు విరిగిపోయి ఆత్మహత్యలకు వేలాడుతున్నారు. పల్లెంటే పచ్చటి చెట్లనుకుంటే ఇపుడవి ఆకురాలిన అడవిగా మారాయి. గ్రామం విడవకుంటే ప్రాణం పోతుందేమో అనే దశకు గ్రామీ ణ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇది నేటి గ్రామాల దుస్థితి.

ఈ గ్రామీణ వ్యవసను మార్చి, దీన్ని ఆధునీకరించి మళ్లీ గ్రామాన్ని పచ్చగా నవ్వే పరిమళభరిత ప్రకృతి అందంగా మార్చాలి. గ్రామమే దేశపు పట్టుగొమ్మ అని నిరూపించగల నేతల కోసం గ్రామాలు గుక్కపట్టి ఏడుస్తున్నాయి. ఇపుడు గ్రామాలను బాగుపరచటానికి ఒక్క గాంధీ చాలడు. లక్షల మంది గాంధీలు కావాలి. మొదట గ్రామాలను దుస్థితికి తీసుకువచ్చిన భ్రష్టుపట్టిన మన రాజకీయ వ్యవస్థ సమూలంగా మారాలి. కొత్త రాజకీయ జవసత్త్వాలతో నవతరం చేతికి రాజకీయ పగ్గాలు రావాలి.

రాజకీయ పార్టీలు గ్రామాల్ని ధ్వంసం చేశాయి. ఇపుడు గ్రామాల్లో పార్టీలు డీలర్‌షిప్పులుగా, కార్యకర్తలను ఏజెన్సీలుగా, ఏజెంట్లుగా మార్చేసారు. సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అంతా మార్కెట్ రేట్ల ప్రకారమే ఎన్నుకోడుతున్నారు. ఓటుకు ఒక రేటును నిర్ధారించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఆ వూర్లో డబ్బులునోడు కొనుక్కునే సీటుగా మారింది. పాలకులు ఎన్నికలు ప్రకటించగానే అప్పటి వరకు ప్రశాంతంగా వున్న ఫాక్షనిస్టు ప్రదేశాలు తిరిగి పడగలు విప్పుతున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలంటే పట్టణాలలో వున్న ధనవంతులు, దొరలు తమ గ్రామాలలో తమకు అనుకూలమైన కీలుబొమ్మలను నిలబె డబ్బును వెదజల్లుతున్నారు. గ్రామాలకు నీళ్లందించి చెరువుల పూడికలు తీయించి బావుల్లో జలాలు పంచే రైతు నేతలు, నాయకులు కావాలి. గ్రామాలను రక్షించే రకరకలుగా గ్రామ సర్పంచ్‌లు ముందుకు రావా లి. గ్రామంలో వున్న ప్రభుత్వ స్కూల్‌ను, ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కాపాడే చేతులు కావాలి. వూరులో వృత్తులను ఆధునీకరించి కుటీర పరిక్షిశమలను నెలకొల్పేందుకు అండగా నిలిచే నేతలు రావాలి. అందుకోసం విజ్ఞులు ఆలోచించాలి. మన రాజకీయ వ్యవస్థను తుప్పుపడితే ఆ ప్రకాళన చేయాల్సిన విద్యారంగం నిర్వీర్యంగా వున్నంత కాలం గ్రామాలు ఇలాగే చిక్కిపోతాయి. ఇంజనీరింగ్ విద్య కులవృత్తులకు ప్రత్యామ్నాయాలు వెతకటం కంటే మించిన పని ఏం చేయగలదు చెప్పండి.

ఇక్కడ మనరాష్ట్రంలో వేలమంది వడ్రంగులు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చైనాకు పోయి తక్కువ ధరకు ఫర్నీచర్ కొనుక్కొని రావటంవిచారకరం. అందుకేనా ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నేలపై వెలసింది. గ్రామాల ఆత్మగౌరవం కాపాడి నిలబెట్టడానికి ఇంజనీరింగు కాలేజీలు పనిచేయవా? గ్రామాలను బతికించే పరిశోధనలు కాలేజీలు చేయవా? ఆత్మహత్యలను ఎవ రు ఆపాలి? అన్న ప్రశ్న లు వస్తున్నాయి. మన గ్రామీణ భారతాన్ని కాపాడుకోకపోతే దేశానికి మనుగడ ఉండదు.
పట్టణీకరణ జరగాల్సిందే కానీ వాటి పేరుతో మన పల్లెలను ధ్వంసం చేయకూడదు. పల్లె మన మూలం. పల్లెల్లోనే మన పునాదులున్నాయి. నగరాల్లో పట్టణాల్లో ఉండి పల్లెల గురించి మాట్లాడటం కాకుండ అవి మాటల కే పరిమితం కాకుండ పట్టెడన్నం పెట్టి పాలుదాపిన పల్లెలను రక్షించుకునేందుకు మనమంతా కదలాలి. పల్లెలను రక్షించేందుకు కదలాల్సిన రాజకీయపార్టీలు, ఓట్ల సమయంలోనే పల్లె దండం బెడుతున్నాయి. ఓట్ల పర్వం పూర్తి కాగానే పల్లెను విడిచేస్తున్నారు. కంచంలో బువ్వతింటున్నప్పుడు మన వూర్లు మనకు గుర్తుకు రావాలి. సమాజం క్రమంగా గ్రామాల్ని విడిచి పట్నం వైపుకు పోతుందిపపంచీకరణ మనందరి నరనరాల్లోకి వెళ్లింది.

మార్కెట్ వ్యవస్థ మాయాజాలంలో ఎవరిళ్లు వారిది, ఎవరిగూడు వారిది, పక్కవానితోటే పనిలేనప్పుడు? ఇంక గ్రామం గురించి ఎవరాలోచిస్తారు? గ్రామ స్వరాజ్యం ఎవరికి పట్టింది? ఇప్పటికైనా గ్రామాలను, గ్రామాల్లో విద్యను, వైద్యాన్ని అందించి వాటిని సమృద్ధిగా చేసుకోవాలి. గ్రామం ఛిద్రమైతే దేశం వెలుగొందదు. గ్రామాలు చెట్ల ఆకుల్లా రాలిపోతుంటే దేశం జీడీపీ పెరిగిందని లెక్కలు చెప్పుకోవటం విచారకరం. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు. గ్రామాలను మోడల్ విలేజ్‌లుగా మార్చటానికి మన పాలకల దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏమిటో పంచాయతీరాజ్ శాఖా మంత్రి కందూరు జానాడ్డి చెప్పాలి.

ప్రభుత్వానికి సక్రమమైన ఆలోచనలు లేకపోతే ప్రతిపక్షాలైనా గ్రామాల్ని కాపాడటానికి ఏం చేయాలో చెప్పాలి. ఎవరు? ఎక్కడ? ఎన్ని? పంచాయతీలను గెలిచి వస్తారనదే ముఖ్యమైనదిగా మారింది. ఎవరిపూక్కలు వారికున్నాయి. ఎన్నికల సందర్భంలో గెలుపు గుర్రాల పందెంలో పల్లెలు మరింత చితికిపోతున్నాయి. ఎన్నికల కోసం మెజార్టీ సీట్ల కోసం ప్రజలు చూడటం లేదు. గ్రామాన్ని బతికించే మృతసంజీవిని ఎవరు తీసుకువస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నా రు. గ్రామాలు బతకాలి. ఆ మూలా లే మన వ్యవస్థకు ప్రాణవూపదాలు. అవే మన సంస్కృతికి నిలువుటద్దాలు. గ్రామాలు వర్ధిల్లాలి. గ్రామాలను కన్న దేశం వర్ధిల్లాలి.

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

256

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Featured Articles