ట్రంప్ తప్పుడు నిర్ణయం


Sun,June 11, 2017 01:38 AM

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్ల వైపరీత్యాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కిక్కిరిసిన, ఉక్కబోసే నగరాలు, ఎండిపోయే పంటలు, కరిగిపోతున్న హిమనదాలు, వరదలు, రోగాలు- వీటి బారిన మన పిల్లలు పడకూడదని కోరుకుందాం. కానీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకునే సూచనలు కనిపించడం లేదు.

ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగడం వాతావరణ మార్పు ను అరికట్టడానికి సాగుతున్న యత్నాలకు పెద్దదెబ్బ. వాతావరణ మార్పును అరికట్టడానికి వీలుగా ప్రపంచదేశాలు ప్రమాదకర వాయువులను విడుదల చేయకుండా నియంత్రించడానికి ప్యారిస్ ఒప్పందం కుదిరింది. దీని పై 195 దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా వైదొలిగినంత మాత్రాన ఈ ఒప్పందం రద్దు కాదు. కానీ అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవ స్థ. గ్రీన్‌హౌజ్ వాయువులను విడుదల చేసే దేశాలలో రెండవ స్థానంలో ఉన్నది. అమెరికా వైదొలుగడం వల్ల ఆ ప్రభావం భూగోళంపై పడనుంది. అమెరికా విడుదల చేసే హానికర వాయువుల వల్లనే కాకుండా, ఈ దేశం బయటికి పోవడం వల్ల ఆ దారిన కొన్ని ఇతర దేశాలు నడువవచ్చు. కొన్ని అమలు చేయకపోవచ్చు. ప్యారిస్ ఒప్పందంలో మళ్ళా చేరడానికి సంప్రదింపులు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అమెరికాకు అనుకూలమైన రీతిలో కొత్త ఒప్పందం ఉండాలని ట్రంప్ అంటున్నారు. ప్యారిస్ ఒప్పందం అమెరికా మీద భారీ ఆర్థిక భారం పడుతుంది కనుక, తాము దీని అమలును వెంటనే నిలిపివేస్తామని కూడా ఆయన ప్రకటించారు.

భారత్, చైనాకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలు గమనార్హమైనవి. బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ సహాయం లభిస్తేనే ఒప్పందంలో కొనసాగుతామని భారత్ అంటున్నది. భారత్‌కు తమ బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసుకు నే అవకాశం ఉన్నది. అమెరికా మాత్రం ఈ అవకాశం లేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయం పర్యావరణంపైనే కాదు, అంతకు మించి అమెరికా విదేశీ సంబంధాలపై కూడా పడుతుంది. ప్రపంచంలో అమెరికా పాత్ర ఏవిధంగా ఉండాలనే దానిపై అక్కడి రెండు పార్టీల నాయకులు ఏ విధంగా భావిస్తున్నాయో, దానిని బట్టి ప్యారిస్ ఒప్పందంపై వాటి వైఖరి ఆధారపడి ఉంటుంది. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు విద్యావేత్తలు, ఇతర వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అమెరికా తన వంతుగా గ్రీన్‌హౌజ్ వాయువుల విడుదలను తగ్గిస్తానని హామీ ఇవ్వడం వల్లనే భారత్, చైనా, పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాలు ప్యారిస్ ఒప్పందానికి అంగీకరించాయి. ఇప్పుడు అమెరికా ఇతర దేశాలను ప్రభావితం చేసే స్థితిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా విశ్వసనీయతను కోల్పోయింది. యూరప్ కూడా అమెరికాను నమ్మదగిన భాగస్వామిగా చూడలేకపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రా యం ట్రంప్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. యూరోపియన్ యూనియన్‌లోని 28 దేశాలు, చైనా తాము పూర్తిగా ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. చైనా, యూరోపియన్ యూనియన్ ఉమ్మడి ప్రకటన ఇవ్వడం ఇదే మొదటిసారి. శిలాజ ఇంధనాలను తగ్గించుకుంటామని, పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటామని, పేద దేశాలు గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను తగ్గించుకోవడానికి వీలుగా వంద బిలియన్ డాలర్ల నిధిని తయారు చేస్తామని చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు తమ ఉమ్మడి ప్రకటనలో వెల్లడించాయి.

ప్యారిస్ ఒప్పందం అనేది వాతావరణ మార్పును అరికట్టడానికి ప్రపంచ వ్యాప్త కృషికి నిదర్శనం. ఇదొక అంతర్జాతీయ బాధ్యత. స్వచ్ఛమైన ఇంధ నం వైపు ప్రయాణించడానికే ప్యారిస్ ఒప్పందం కుదిరిందని యూరోపియ న్ కౌన్సిల్ అధ్యక్షుడు, యూరోపియన్ కమిషన్ అధిపతి, చైనా ప్రధాని ప్రకటించారు. తాము ఈ ఒప్పందాన్ని అమలు చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఫ్రాన్స్, రష్యా ప్యారిస్ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి వల్ల నిరుత్సాహపడిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యాపారులు, బాధ్యత గల పౌరులు ఎవరై నా ఉంటే, వారికి ఫ్రాన్స్‌లో స్థానం ఉంటుంది అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం పలికారు.

భూగోళం అతివేగంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్యారిస్ ఒప్పందం ప్రాధాన్యాన్ని, దాని అమలుకు చూపవలసిన నిబద్ధతను గూర్చి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మానవాళి మనుగడకే ప్రమాదకరమైన రీతి లో గ్రీన్‌హౌజ్ వాయువులు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి మానవాళిని కాపాడటానికి గ్రీన్ హౌజ్ వాయువుల తగ్గింపు తప్పనిసరి అని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ తగ్గింపులో ప్యారిస్ ఒప్పందం ఒక ముందడుగే కాదు, కీలకమైన అడుగు. కొన్నేండ్ల పాటు దౌత్యవేత్తలు ఎంతో కృషిచేయడం వల్ల ఈ ఒప్పందం కుదిరింది. బుష్ ప్రభుత్వ నిర్వాకం వల్ల అమెరికా విశ్వసనీయత కోల్పోయిన తరుణంలో ఈ ఒప్పందం ఆశలు చిగురింపజే సింది. గ్రీన్‌హౌజ్ వాయువులు ఇదే రీతిలో వెలువడితే వాటి ప్రమాదకర ఫలితాలను నివారించడం అసాధ్యమని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే ప్రమాదం గురించి ఇరవై దేశాలు ఒక అధ్యయనం చేపట్టాయి. అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి.

వాతావరణ మార్పును అరికట్టకపోతే 2030 నాటికి పది కోట్ల మంది మరణిస్తారు. స్థూల దేశీయోత్పత్తి 3.2 శాతం తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మంచు చరియలు కరిగిపోతాయి. వాతావరణ వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. కరువు కాటకాలు సంభవిస్తాయి. ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది. ఈ వైపరీత్యాల మూలంగా మరణాలలో తొంభై శాతం పేద దేశాలలోనే చోటు చేసుకుంటాయి. 2010 నుంచి 2030 వరకు వాతావరణ మార్పు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది డారా అనే సంస్థ 184 దేశాలలో అధ్యయనాలు చేపట్టి వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పేదల పరిస్థితి భయానకంగా మారుతుంది. పదిహేనేండ్లలో అనే క దేశాలు పేదరికంలో మగ్గిపోతాయని ప్రపంచ బ్యాంకు అధ్యయనాలలో వెల్లడైంది. ఉష్ణ మండలాలలోని పేద దేశాలపై ఈ ప్రభా వం ఎక్కువగా ఉంటుందని ైక్లెమేట్ ఇంపాక్ట్ లాబ్ నివేదిక వెల్లడించింది. లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, సబ్‌సహారా ఆఫ్రికా ప్రాంతాలలో ఇప్పటికే పంట దిగుబడి పడిపోయింది. కరువుతో ఈ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. వాతావరణ మార్పు వల్ల ఈ ప్రాంతాల జీవన స్థితిగతులు మరీ దారుణంగా మారుతాయి. 2100 నాటికి వాతావరణ మార్పు వల్ల అత్యం త పేదలలో నలభై శాతం మంది ఆదాయం డెబ్బయి శాతం తగ్గిపోతుంది. సంపన్నమైన, శీతల ప్రాంతాలైన యూరప్ రాజ్యాలు బాగానే ఉంటాయి. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.

ప్యారిస్ ఒప్పందంలోని అనుకూలాంశం ఏమిటంటే- భారత్, చైనా దేశాలు మాత్రమే గ్రీన్ వాయువుల విడుదలను తగ్గించాలనే ఒత్తిడి తగ్గిపోతుంది. భారత్, చైనా దేశాలలో జనాభా ఎక్కువ. అందువల్ల గణాంకాలు చూస్తే ఈ వాయువుల విడుదల ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అమెరికాతో పోలిస్తే తలసరి లెక్కన ఈ వాయువుల విడుదల చాలా తక్కువ. అమెరికా విడుదల చేసే గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలలో భారత్, చైనా విడుదల చేస్తున్నది పది శాతం ఉండదు. ఈ రెండు దేశాలు హానికర వాయువుల విడుదలను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెంచుతున్నది. అయితే పేద దేశాలు గ్రీన్ హౌజ్ వాయువుల విడుదలను తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. ఈ దేశాలకు ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవసరం. ఈ నేపథ్యంలో అమెరికా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగడం వల్ల తాను ఏ విధంగా లబ్ధి పొందుతానని భావిస్తున్నదో అర్థం కాని విషయం. పైగా ఈ ఒప్పందం నుంచి వైదొలుగడం వల్ల ప్రపంచంలో ఏకాకిగా మారిపోతుంది.

అమెరికాలో భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభుత్వం ఏదైనా మళ్ళా సం ప్రదింపులు జరిపి ప్యారిస్ ఒప్పందంలో చేరినా (అది సాధ్యమనిపించడం లేదు) అది కూడా మరో రకంగా నష్టదాయకమే. భారత్, చైనా దేశాలపై కఠిన ఆంక్షలు విధించాలని అమెరికా కోరుతున్నది. అందువల్ల కొత్తగా సం ప్రదింపులు జరుపడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. 2009లో కోపెన్‌హేగెన్ సదస్సులో అంతర్జాతీయ ఒప్పందం కుదరకపోవడానికి కారణం యూరోపియన్, చైనా తదితర దేశాల పట్ల అమెరికాలోని ఒబామా ప్రభు త్వం అనుమానంగా చూడటమే. అంతకు ముందు బుష్ ప్రభుత్వం కూడా కాలుష్యాలు తగ్గించడం పట్ల వెనుకడుగు వేసింది. కొత్త తరాలకు మనం అందమైన స్వచ్ఛమైన లోకాన్ని అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చా రు. కానీ భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్ల వైపరీత్యాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కిక్కిరిసిన, ఉక్కబోసే నగరాలు, ఎండిపోయే పంటలు, కరిగిపోతున్న హిమనదాలు, వరదలు, రోగాలు- వీటి బారిన మన పిల్లలు పడకూడదని కోరుకుందాం. కానీ ఈ పరిస్థితి నుంచి తప్పించుకునే సూచనలు కనిపించడం లేదు.
-ధూర్జటి ముఖర్జీ

587

DHURJATI MUKHARJI

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన