గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి


Thu,May 11, 2017 11:45 PM

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో నిలిచింది. కానీ మనకన్నా చాలా వెనుకబడి ఉన్నదని చెప్పుకుంటున్న శ్రీలంక మెరుగైన స్థానంలో 73వ స్థానంలో నిలిచింది. అలాగే చైనా 90వ స్థానం దక్కించుకున్నది. ఇలా భారత్ వెనుకబడిపోవటానికి దేశంలో నెలకొని ఉన్న పేదరికం, లింగవివక్ష ఇంకా ఇతర సామాజిక కారణాలుగా ఉంటున్నాయి.

ఇప్పటికైనా మన నేతలు విశాల గ్రామీణ భారత అవసరాలు, ప్రజల జీవన విధానాలు మెరుగుపర్చేందుకు కృషిచేయాలి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి అన్నివిధాలుగా అండగా నిలువాలి. ఈ విధమైన గ్రామీణ క్షేత్రస్థాయి ఆచరణాత్మక విధానాలతోనే దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుంది. ఈ దిశగా మన నేతలు ఆలోచించాలి. అడుగులు వేయాలి.

ఐరాస నివేదిక ప్రకారం దేశ జనాభాలో 55 శాతం మంది ప్రజలు పేదరికంతో సతమతమవుతున్నారు. దీంతో ఆయా సామాజిక సమూహాలు సరైన విద్య, వైద్యం పొందలేకపోతున్నా రు. కనీస అవసరాలు తీర్చుకోలేని జీవన విధానంలో మగ్గిపోతున్నారు. దేశంలో లింగ వివక్ష, అణచివేత అనేక రూపాల్లో తీవ్రస్థాయిలో కొనసాగుతున్నది. ఇలాంటి సామాజిక స్థితిగతులే మహిళా సాధికారతలో భారత్‌ను 159 దేశాల్లో 125 స్థానంలో నిలిపాయి. ఐరాస అధ్యయనంలో తేలిన విషయం ప్రకారం కూడా లింగ వివక్ష, అణచివేతలో స్త్రీ అనేకవిధాలుగా పనిభారంతో, దోపిడీ పీడనలకు గురవుతున్నది. ఇలాంటి సామాజిక నేపథ్యానికి తోడు పితృస్వామిక సంస్కృతి కూడా స్త్రీపై అనేక విధాలుగా హిం సకు కారణమవుతున్నది.

యూఎన్‌ఓ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం భారతదేశంలో ఇంకా 35 శాతం మంది మహిళలు మాధ్యమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోయారు. అదే సమయంలో మహిళల అక్షరాస్యత 65 శాతం ఉన్న ది. ఉద్యోగాల విషయం చూసినా మహిళల దుస్థితి మరింతగా అర్థమవుతుంది. ఉత్పాదక శ్రమలో మహిళల శాతం 27 ఉంటే, పురుషులు 80 శాతం ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో స్త్రీ అభ్యున్నతికి, వివిధ సామాజిక సమూహాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా స్త్రీల జీవితాల్లో గుణాత్మక మార్పులు కనిపించటం లేదని ఈ నివేదికను చూస్తే తెలుస్తున్నది. ఈ క్రమంలోంచే. యూఎన్‌ఓ రిపో ర్టు భారత సామాజిక జీవనం, అభివృద్ధిపై చాలా విషాదకరమైన వ్యాఖ్యానం చేసింది. ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధి వికాసాలకు, ప్రజల నిజ జీవితాలకు సంబంధం ఉండటం లేదని ఎత్తి పొడిచింది. అలాగే దేశంలో మహిళలపై సాగుతున్న లింగ వివక్ష, అణచివేతల గురిం చి యూఎన్‌ఓ అధ్యయనమే గాకుండా అనేక అధ్యయనాలు తేల్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనికితోడు దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై జరుగుతున్న దాడుల విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నది.

దేశంలో ముస్లింలు అనేక రూపాల్లో వివక్ష, అణచివేతలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నది. ఈ మధ్యనే జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. కానీ గెలిచిన బీజేపీ అభ్యర్థుల్లో ఒక ముస్లిం ప్రతినిధి కూడా లేడు. ఇదిలా ఉంటే యూపీ సీఎంగా హిందుత్వవాదుల్లో తీవ్రవాదిగా ముద్రపడిన వ్యక్తి అధికారం హస్తగతం చేసుకుంటే, పాలనారంగంలో ఒక ముస్లిం అభ్యర్థికూడా లేని పరిస్థితి దేన్ని సూచిస్తున్నది? ఇది ముస్లిం మైనారిటీల పట్ల వివక్ష, అణచివేతలకు సంకేతం కాదా? ఈ నేపథ్యంలోనే.. దేశంలో అనే క ప్రాంతాల్లో ముస్లింలు, దళితులకు వ్యతిరేకంగా అనేకం జరుగుతున్నాయి.

దళితులు, ముస్లింలను అనేక రూపాల్లో అవమానపరస్తున్నా రు. దాడులకు పాల్పడుతున్నారు. నిజానికి ఏ సామాజిక జీవనమైన బహుముఖంగా అభివృద్ధి చెందాలంటే సామాజిక సమూహాలన్నీ ఐక్యం గా ఉత్పత్తిలో పాలుపంచుకోవాలి. అప్పుడే గ్రామీణ సమాజం సమగ్రాభివృద్ధి పథంలో పయనిస్తుంది. కొంతమంది సామాజికవేత్తల అభిప్రా యం ప్రకారం బీజేపీ అవలంబిస్తున్న విధానాల కారణంగా సామాజికాభివృద్ధి, ఉత్పత్తి క్రమం కుంటుపడిపోతున్నది. బీజేపీ నేతలు అభివృ ద్ధి గురించి ఎంతచెప్పినా, వారు అనుసరిస్తున్న హిందుత్వ రాజకీయాల కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతున్నది. ఒకరకంగా చెప్పాలం టే.. హిందుత్వమే అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నది.

ఇక గుజరాత్ మోడల్ అభివృద్ధి అనేది గ్రామీణ ప్రాంత ప్రజలకు, నిరుద్యోగులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పారిశ్రామికీకరణ కారణంగా సామాజిక, ఆర్థిక స్థితిలో ఏ విధమైన గుణాత్మకమార్పు జరుగలేదు. కనీసం పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉన్నదని చెబుతున్న పశ్చిమబెంగాల్ కన్నా గుజరాత్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛభారత్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, స్కిల్ ఇండియా లాంటి పథకాలతో ఏ మార్పు జరుగుతున్నదో దాని ఆనవాళ్లు కనిపించడం లేదు. కానీ ఆ పథకాల ప్రచారం కోసం, అమలు కోసమని కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్నది. పెద్ద ప్రచారంతో ప్రారంభమైన ఏ కొత్త పథకమూ ప్రజల భాగస్వామ్యంతో నడువటం లేదు. అనుకున్న ఫలితాలు సాధించటం లేదు. మన దేశంలో ఒకప్పుడు సోషలిజం పేర పథకాల రూపకల్పన, పాలన సాగింది. అదే ఎమర్జెన్సీ కాలం తర్వాత జనతాపార్టీ హయాంలో సోషలిజం అధికార నినాదంగా మారిపోయింది. విచిత్రమేమంటే.. హిందుత్వశక్తులతో కూడిన ఆ పార్టీ సోషలిజం నినాదం మీద నడువటం. ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఇందిరాగాంధీ 20 పాయింట్ ప్రోగ్రాం పేరిట అభివృద్ధి గురించి చెబితే, హిందుత్వవాదులు సోషలిజం పేరుతో ముందుకువచ్చారు.

ఈ క్రమంలో జరిగిందేమంటే గాంధీయిజం చెప్పిన వికేంద్రీకరణను పక్కనబెట్టి పెట్టుబడి కేంద్రీకరణకు తోడ్పడింది. కానీ గ్రామీణ ప్రజల జీవనం కేంద్రంగా పాలనావిధానాలు రూపొందించబడి, వారి సమగ్రాభివృద్ధికి ఏ పథకమూ తోడ్పడలేదు. రాజ్య నియంత్రణలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండదనేది తెలిసిందే. ఎందుకంటే అధికారమంతా అధికారుల చేతుల్లో ఉండి పథకాల అమలులో ప్రజలు, సామాన్యులకు స్థానం లేకపోవటంతో అవేవీ విజయవంతం కావు. ఈ క్రమంలోనే వ్యక్తిస్వామ్య విధానం ఉనికిలోకి వచ్చి అది గ్రామీణ జీవితం దాకా విస్తరించి గ్రామీణ ప్రజా జీవనాన్ని పూర్తిగా మార్చివేసింది. ప్రభుత్వరంగం కన్నా, ప్రైవేటు రంగమే చాలా నైపుణ్యంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తుందనే ఒక మిథ్యావాదాన్ని ప్రజల్లో చొప్పించారు. ప్రభుత్వ రంగమంటే నాణ్యత ఉండదని, లంచగొండితనం, బాధ్యతారాహిత్యం నిండిన కాలం చెల్లిన విధానమనే స్థితి వచ్చింది. ఈ క్రమంలోంచే మరోవైపు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో పథకాలన్నీ ముందుకువస్తున్నాయి.

అయితే దేనికైనా నియమబద్ధమైన విధివిధానాలు ఉండొద్దని అర్థం కాదు. అవన్నీ సమగ్రాభివృద్ధికి దోహదపడేవిగా ఉండాలి. సహకారిగా తోడ్పడాలి. విధివిధానాలే ప్రతిబంధకాలుగా తయారవరాదు. నిబంధనల పేర పబ్లిక్ రంగం చేస్తున్నది ఇదేననే అపవాదున్నది. కాబట్టి ప్రైవేటు రంగమే అన్నింటికి పరిష్కారమన్న వాదమొకటి ముందుకొచ్చి ఇవ్వాళ రాజ్యమేలుతున్నది. ఈ క్రమంలోంచే విద్య మొదలు వైద్యం దాకా అన్ని రంగాలు ప్రైవేటు రంగంలోకి చేరిపోతున్నాయి. నిర్ణీత కాలంలో లక్ష్యం సాధించేందుకు ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అనేది నేటి విధానమైంది.

నవతరం బీజేపీ నేతల విధానాలు కూడా ఈ దిశలోనే వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోంచే సంఘ్‌పరివార్ శక్తులు కూడా బహుళజాతి కంపెనీల తోడ్పాటును తీసుకోవటాన్ని గొప్ప అభివృద్ధిగా చెబుతున్నాయి. మరోవైపు ఒక సామాజిక సమూహంలో పుట్టని వారంతా ఇతరులను వెలివేసే విధానానికి పాల్పడుతున్నాయి. ఇదే తర హా బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం ప్రవర్తించింది. తమ పార్టీకి చెంద ని, అనుకూలురు కానీ ప్రజలను ఇతరులుగా చూసిన నేపథ్యంలోంచే వామపక్ష ప్రభుత్వం ప్రజలకు దూరమైంది. సరిగ్గా ఈ మార్గంలోనే పయనిస్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా అనేక ప్రజాసమూహాలను పరాయివారుగా చూసే విధానం అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నది.

ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఏమంటే.. ప్రజలందరి సమగ్రాభివృద్ధిని ఏ మార్గంలో సాధించాలనేదే. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే విద్య, వైద్య రంగాన్ని ప్రైవేటు రంగం చేతిలో పెట్టి అం దరికీ ఆరోగ్యం ఎలా సాధిస్తారో అర్థంకావటం లేదు. ప్రైవేటు రంగాని కి పెద్దపీట వేసి నిరుద్యోగ నిర్మూలనకు ఎలా బాటలు వేస్తారో చెప్పటం లేదు. పెట్టుబడులు, వనరులను ప్రజలందరి ప్రయోజనాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసమే వినియోగించబడుతున్నప్పు డు సమగ్రాభివృద్ధి ఎలా సాధ్యం? ఈ క్రమంలో చూస్తే దేశ గ్రామీణ ప్రజా జీవనాన్ని ప్రభావితం చేయగలిగే రీతిలో పథకాల రచన ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యమంతా గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి నిర్దేశించినవిగా ఉండాలి. కాని విషాదమేమంటే మన నేతలంతా కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు.

చిన్నచిన్న వ్యాపారస్థుల ప్రయోజనాలను మరిచిపోతున్నా రు. కాబట్టి నేడు గ్రామీణ నేపథ్యమున్న నాయకత్వం కావాలి. వారు మాత్రమే గ్రామీణ పేద ప్రజల అవసరాలు గుర్తించి, వాటికి అనుగుణం గా పథకాలు రూపొందిస్తారు. ఈ మధ్య బీజేపీ గెలుపుతోనైనా గ్రామీణ భారతాన్ని పట్టించుకోవాలి. లేకుంటే బీజేపీ ఎంత గొప్పగా హిందుత్వవాదాన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మన నేతలు విశాల గ్రామీణ భారత అవసరాలు, ప్రజల జీవన విధానాలు మెరుగుపర్చేందుకు కృషిచేయాలి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి అన్నివిధాలుగా అండగా నిలువాలి. ఈ విధమైన గ్రామీణ క్షేత్రస్థాయి ఆచరణాత్మక విధానాలతోనే దేశం సమగ్రాభివృద్ధి సాధిస్తుం ది. ఈ దిశగా మన నేతలు ఆలోచించాలి. అడుగులు వేయాలి.

-ధూర్జటి ముఖర్జీ
-(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

403

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన