రోడ్డు మార్గాల అనుసంధానం


Thu,November 3, 2016 01:19 AM

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతాయి. ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి నిర్మాణ రంగంలో వచ్చిన ఆధునిక శాస్త్ర సాంకేతికరంగ అభివృద్ధి ఆధారంగా రహదారి
వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయాలి. రహదారి వ్యవస్థ నాణ్యతపైనే మనిషి జీవన సాఫల్యాలు అధారపడి ఉన్నాయి.

ఎన్డీయే ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గ్రామీణ పల్లెలు, అభివృద్ధి చెందుతున్న చిన్న పట్టణాలు కలుపుతూ 44 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 27వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి పూనుకొని దేశంలో ఉన్న ఎకనామిక్ కారిడార్లను అనుసంధానం చేయడానికి సమాయత్తమవుతున్నది. దీంతో వస్తు రవాణా వాహనాల రాకపోకలు సులువుగా, సాఫీగా సాగి అభివృద్ధి వేగవంతం అవడమే గాకుండా ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని కేంద్రం భావిస్తున్నది. ఇది ఒక రకంగా చూస్తే దేశంలో అతి పెద్ద రహదారుల నిర్మాణ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. గతంలో వాజపేయి ప్రభుత్వ హయాంలో ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమర రహదారి కారిడార్లు నిర్మించారు. వాటి నిడివి 13వేల కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పొడువైన రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం పూనుకున్నది.

దీంతో దేశంలో పారిశ్రామిక నగరాల అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఎకనామిక్ కారిడార్ల నుంచి పోర్టులకు అనుసంధానం చేస్తూ మరో 15వేల కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. వీటిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్నది. ఈ జాతీయ రహదారుల నిర్మాణం కారణంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 44 ఎకనామిక్ కారిడార్లు అనుసంధానించబడుతాయి. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే దేశంలో 88 శాతం జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.

ఈ రహదారుల నిర్మాణంలో వివిధ దశలున్నా యి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి జాతీ య రహదారులు ఇవి పారిశ్రామిక, ఆర్థిక కారిడార్లను కలుపుతాయి. వీటికి ఫీడర్ రోడ్లు కూడా అవసరం. కాబట్టి వాటి నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ విధమైన రోడ్ల అనుసంధానాన్ని భారత మాలగా పిలుస్తున్నారు. భారత్‌మాల పథకం కింద దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తున్నారు. దీంతో దేశంలో వస్తు, ముడిసరుకు రవాణా వేగం పెరిగి అభివృద్ధి కూడా పరుగులు తీస్తుందని చెబుతున్నారు. కానీ ఈ పథకం పూర్తి కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సిఉన్నది. దేశ వ్యాప్తంగా ఉన్న 78 శాతం రోడ్లన్నీ ఒకటి, లేదా రెండు లైన్ల రోడ్లే ఉన్నాయి. మూడింట ఒక వంతు రోడ్లు రెం డు లైన్ల కన్నా తక్కువ ఉన్నాయి. వీటన్నింటినీ నాలుగు లైన్ల రోడ్లుగా మార్చడం అనేది బృహత్తర పథకమే కాకుండా కష్టసాధ్యమైనదే. దీనికి అనేక వందల వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. మరోవైపు చూస్తే.. చిన్న పట్టణాలు, గ్రామాలను కలిపే రోడ్లు అన్నీ ఎక్కువ భాగం మట్టి రోడ్లే. వీటిలో కూడా అనేక పరిమితులు ఉన్నాయి. వీటన్నింటినీ మంచి నాణ్యమైన పక్కా రోడ్లుగా నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

ఒకానొక అధ్యయనం ప్రకారం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అసోం లాంటి ఐదు రాష్ర్టాల్లో 43 శాతం మాత్రమే రోడ్డు నెట్‌వ ర్క్ ఉన్నది. అసోంలో 2.67లక్షల కిలోమీటర్ల రోడ్లు మట్టి రోడ్లే. దీని తర్వాత స్థానంలో పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. వీటన్నింటిలో నగరాలు, పట్టణాలను కలుపుతూ ఉన్న రోడ్లే అధికంగా ఉన్నాయి. ఈ రాష్ర్టాల్లో 87 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తలపెట్టి న రోడ్డు మార్గాల అభివృద్ధి పథకం ఎంత మేరకు విజయవంతం అవుతున్న ది ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇప్పటికీ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకా రం.. 2000-01లో 33.73 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉంటే, 2015 నాటికి అవి 54.72లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. ఈ రోడ్ల విస్తరణతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్డు అనుసంధానం ఉన్న దేశంగా తయారైంది. వీటిలో 61శాతం గ్రామీణ ప్రాంత రోడ్లే ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపైనే 60శాతం రవా ణా జరుగుతున్నది.

ఇప్పుడు ఈ రోడ్ల నిడివిని 1.05 లక్షల కిలోమీటర్ల నుంచి 1.40 లక్షల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభు త్వం తలపెట్టిన రోడ్ల విస్తరణ పథకం పూర్తి కావడం అనుకున్నంత సులువైన పనేమీ కాదు. దీనికి అనేక అవరోధాలూ ఉన్నాయి. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న రెండు లైన్ల రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగామార్చడం అన్నది ప్రధానం. దీంతోనే దేశవ్యాప్తంగా వస్తు రవాణ సులభమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదో లేదో తెలియదు. జాతీయ రహదారి వ్యవస్థలో పేరుకు పోయి న అవినీతి, అలసత్వాన్ని కూడా రూపుమాపినప్పుడే రహదారుల అనుసంధానం అనుకున్న రీతిలో సులభ సాధ్యమవుతుంది.
ఈ జాతీయ రోడ్ల విస్తరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. దీని కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్‌ఐఎఫ్)కింద కార్పస్ ఫండ్‌గా 40వేల కోట్లను కేటాయించింది. ఈ నిధులుతో రోడ్ల మరమ్మతులు, విస్తరణ కార్యక్రమం చేపట్టడానికి జవసత్వాలు సమకూర్చింది.

ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌లో రహదారుల నిర్మాణం, విస్తరణ కోసం 4వేల కోట్లను కేటాయించింది. అలాగే రోడ్ల విస్తరణ కోసం వివి ధ ఏజెన్సీల నుంచి కూడా నిధులను సమకూర్చడానికి పూనుకున్నది. ఉదాహరణకు అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, రష్యాకు చెందిన రుస్నా నో, ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్‌కు చెందిన జీహెచ్‌ఐసీ లాంటి సంస్థలున్నాయి. వీటి తో పోటు రాబోయే కాలంలో మరిన్ని ఆర్థిక సం స్థలు, నిర్మాణ సంస్థల నుంచి కూడా నిధులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న ది.

ఇక్కడనే కేంద్రం గతంలో అనుకున్న గ్రామీ ణ రోడ్ల అభివృద్ధి విస్తరణ పథకం(ఆర్‌ఆర్‌డీపీవీ) కింద రోడ్ల విస్తరణకు కేంద్ర చేపట్టిన కార్యక్రమాన్ని చెప్పుకోవాలి. ఈ పథకం కింద 2025 నాటికి గ్రామీణ ప్రాంతాలన్నింటినీ రోడ్లతో అనుసంధానించాలని కేంద్రం తలంచింది. ఈ క్రమం లో రోడ్ల నిర్వహణ, విస్తరణకు గాను ఏటా 11 వేల కోట్లకుగాను 29వేల కోట్లు అవసరమవుతాయి. ఆర్‌ఆర్‌డీపీవీ అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ రోడ్ల నిర్మాణం అంతా దేశంలోని వివిధ రాష్ర్టాల తోడ్పాటుతో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే దీనికోసం నిర్మాణ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవస రం ఉన్నది. ఈ విధమైన చర్యలు తీసుకుంటేనే రోడ్డు నిర్మాణ, విస్తరణ పనులు అనుకున్న విధం గా సాగుతాయి.

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతాయి. ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి నిర్మాణ రంగంలో వచ్చిన ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధి ఆధారంగా రహదారి వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయాలి. రహదారి వ్యవస్థ నాణ్యతపైనే మనిషి జీవన సాఫల్యాలు అధారపడి ఉన్నాయి. కాబట్టి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా తట్టుకుని నిలవ గలిగే రహదారుల నిర్మాణం చేపట్టడం ద్వారా అభివృద్ధి క్రమాన్ని, జీవన విధానాన్ని మెరుగు పర్చాలి.

1225

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Featured Articles