ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె


Fri,September 23, 2016 01:33 AM

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయన్నారు. జలాల పంపకం విషయంలో అమల్లో ఉన్న విధి విధానాల ప్రాతిపదికగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తేనే అందరికి మంచిది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చే స్థితిలో మన జలవనరులు లేవన్న సంగతి తెలుసుకుని మసలుకోవాలి. ఇదే అందరి శాంతి సౌభాగ్యాలకు పునాది.

ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న కావేరీ నదీజలాల వివాదం తీవ్రరూపం దాల్చింది. సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇరురాష్ర్టాలు అసంతృప్తితో రగిలిపోయాయి. కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ర్టాల్లోనూ నదీ జలాల కోసం నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. మొదట సుప్రీంకోర్టు రోజుకు 15వేల క్యూసెక్కుల నీరు తమిళనాడుకు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల కర్ణాటకలో రైతులు, కన్నడ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. బంద్‌లు, నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో సుప్రీంకోర్టు 15వేల క్యూసెక్కులకు బదులుగా 12వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. శాంతిభద్రతల పేరిట తీర్పులను ప్రభావితం చేయాలనుకోవడం మంచిది కాదని కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా కర్ణాటకలో పెద్దఎత్తున దహనకాండ జరిగింది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు, కార్యాలయాలు దహనమయ్యాయి. బెంగళూరులో మొదటిసారి మెజారిటీ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నిరసనోద్యమం కారణంగా కర్ణాటకలో 500కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా. మరోవైపు తమిళనాడులో కర్ణాటక తీరుపై నిరసనలు పెల్లుబికాయి. బంద్‌లు, ప్రదర్శనలు జరిగాయి. ఇరు రాష్ర్టాల్లోనూ కావేరీ నదీ జలాల కోసం ఉద్యమాలు తీవ్రరూపంలో జరిగాయి.

అయితే నీటి కోసం ఇరురాష్ర్టాలూ ఇంతగా పంతానికి పోవడం వెనుక, ఇంతగా హింసాత్మక ఆందోళనల వెనుక సుదీర్ఘ గాథనే ఉన్నది. కొంతకాలంగా సక్రమంగా రాని రుతుపవనాలు, సకాలంలో కురవని వర్షాలూ, తీవ్ర వర్షాభా వ పరిస్థితులూ ఈ ఆందోళనలకు కారణం. అలాగే ఈ వర్షాభావ పరిస్థితులతో కావేరీ నదిలో కనిష్ఠస్థాయిలో నీరు లభ్యమై రైతుల పంటలకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. కర్ణాటకలోని మాండ్యా ప్రాంతంలోనే పంటపొలాలకు నీరు అందక, తీవ్ర కరువు పరిస్థితులతో 400 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతులంతా వరి, చెరుకు పండించే రైతులు. మరోవైపు వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులంతా కావేరీ నదీజలాలపై ఆధారపడి సాగుచేసుకోవడం గత కొంత కాలంగా ఎక్కువైంది.

కొన్నేళ్లలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. నీటిపై ఆధారపడి పండే వరి, చెరుకులాంటి పంటలకు నీరులేక రైతులు తీవ్రం గా నష్టపోయారు. రుతుపవనాలపై ఆధారపడి సాగుచేసే స్థితి ఏనాడో పోయింది. కాబట్టి కావేరీ నదీజలాలే శరణ్యమనే స్థాయికి ఇరు రాష్ర్టాల్లోనూ ఏర్పడింది. ఈ పరిస్థితికి అనుగుణంగా పంటల సాగు విధానంలో మార్పులు చేయడం, తక్కువ నీటితో సాగుచేసే పంటలు పండించ టం లాంటి చర్యలేవీ లేకపోవడంతో రైతులు నదీజలాలపైనే ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితే ఈ ఆగ్రహజ్వాల లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

కానీ రైతులు తమ సంప్రదాయ సాగు పద్ధతులను మార్చుకోవడానికి సంసిద్ధంగా లేకపోవడం కూడా ఈ ఆందోళనల తీవ్రతకు ఒక కారణం. వ్యవసాయ శాస్త్రవేత్త ల అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా సాగు పద్ధతుల్లో నీటి లభ్యతకు అనుగుణంగా మార్పులు చేసుకుంటే ఇంతటి నష్టం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇరు రాష్ర్టాలకూ సంతృప్తికరంగా లేదు. రెండు రాష్ర్టాలూ తమకు న్యాయం దక్కడం లేదని భావించే స్థితి నెలకొన్నది. అయితే కావేరీ నదీజలాల పంపకం 2007లో జరిగింది కూడా స్వాతంత్య్రానికి పూర్వం చేసిన పంపకాల ఆధారంగానే చేయడం జరిగింది. కర్ణాటక, తమిళనాడుతో పాటు, పాండిచ్చేరీ, కేరళ రాష్ర్టాలకు కూడా నదీ జలాల పంపకం జరిగింది. గమనించదగిన విషయం ఏమంటే.. కావేరీ బేసిన్ చాలా ఎక్కువ భాగం కర్ణాటకలోనే ఉన్నది. ఈ వివాదం ఇలా ఉంటే.. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు కూడా ఎగువ రాష్ర్టాల్లో మహానదిపై నిర్మిస్తున్న బ్యారేజీలపై కినుకగా ఉన్నాయి.

అలాగే హిరాకుడ్ ప్రాజెక్టు కన్నా ముందు ప్రాజెక్టుల అవసరాల కోసమని నిర్మించిన ఆరు బ్యారేజీలు ఉన్నాయి. వీటితో సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నా యి. ఈ పరిస్థితుల్లోనే జాతీయ జల వనరుల శాఖతో మహానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో సమగ్ర అధ్యయనం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు కోరుతున్నాయి. అలాగే పంజాబ్, హర్యానా రాష్ర్టాల మధ్య సట్లేజ్-యమునా నదుల లింక్ కెనాల్‌ల విషయంలో తగాదా ఉన్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా అది ఇరు రాష్ర్టాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారంగా ముందుకు రాలేదు.

రాష్ర్టాల మధ్య జల వివాదాలు ఇలా ఉంటే.. పొరుగు దేశాలతో కూడా జలవివాదాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల పంపకం విషయంలో వివాదం చాలాఏళ్లుగా నానుతూనే ఉన్నది. 1960 పూర్వం ఈ నదీజలాల పంపకం విషయంలో చేసుకున్న ఒప్పందం భారత్‌కు ఆమోదయోగ్యం కాదని అంటున్నది. సింధూ నదిలో 19.48శాతం మాత్రమే జలాలు భారత్‌కు దక్కుతున్నాయి. సింధూ నదికి ఉన్న ఆరు ఉపనదుల విషయంలో భారత్‌కు ఎలాంటి జల వాటా దక్కడం లేదు. అయితే ఇరు దేశాల్లోనూ నీటి కొరత, పెరుగుతున్న సాగు అవసరాలు తదితర కారణాలరీత్యా నీటి కోసం తహతహలాడే పరిస్థితులు వస్తున్నాయి. రెండు దేశాల్లోనూ ఎక్కువ నీటి వాటా కోసం ఎదురుచూసే పరిస్థితి ఉన్నది. అలాగే జమ్మూకశ్మీర్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులెన్ని ఉన్నా.., పాకిస్థాన్‌లో నిర్మించిన 7000వేల మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేసే బుంజుయ్, 4500 మెగావాట్ల భాషా డ్యామ్ లాంటివి ఎక్కువ నీటిని వాడుకుంటున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం సింధూ నదిలో 80 శాతం నీటిని పాకిస్థాన్‌కు వదిలిపెట్టడం మూలంగానే భారత్‌లో నీటి కొరత ఏర్పడిందని అంటున్నారు. పంజాబ్, హర్యానాలో తరచుగా సాగునీటి కోసమే వివాదాలు చోటుచేసుకుంటున్న స్థితి ఉన్నది. చైనా నుంచి జల వివాదం ఉన్నది. బ్రహ్మపుత్ర నదిపై ఆనది భారత్ లో ప్రవేశించకముందే అనేక ప్రాజెక్టులు కట్టి చైనా బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని అడ్డు కుంటున్నది. దీంతో ఈశాన్య రాష్ర్టాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. బ్రహ్మపుత్ర నది నుంచి చైనాలోని దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగంలోని ఎల్లో నదిలోకి 200 బిలియన్ల క్యూబిక్ మీట ర్ల నీరు తరలిస్తున్నది. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో భారత్‌లోని ఈశాన్య ప్రాంతాలు తీవ్ర నీటి కొర త ఎదుర్కొంటాయి. చైనాలో మొత్తం నదీ ప్రవాహ నీరు 1900 బీసీఎంలు ఉంటే.. అందులో 600 బీసీఎంల నీరు బ్రహ్మపుత్ర నదీ నుంచే తరలిస్తున్నదంటే ఎంతగా నీటి మళ్లింపుకు చైనా పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్రహ్మపుత్ర నదిపై మరో మూడు డ్యామ్‌ల నిర్మాణానికి పూనుకున్నది. ఇదే జరిగితే భారత్‌తో పాటు టిబెట్ కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సమకాలీన ఆధునిక ప్రపంచంలో సర్వత్రా నీటి కొరత ఉన్నది. రాను రాను జల వనరులు కృషించుకుపోతున్నా యి. రుతుపవనాలు గతి తప్పి తీవ్ర వర్షాభావ పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. కరువు కాటకాలు సర్వసాధారణమయ్యాయి. ఈ స్థితి లో అందుబాటులో ఉన్న జలవనరులు, ముఖ్యంగా నదీ జలాలను అందరూ సమన్యాయం సూత్రం ఆధారంగా పంపకం చేసుకుంటేనే మేలు. ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూ భాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయన్నారు. జలాల పంపకం విషయంలో అమల్లో ఉన్న విధి విధానాల ప్రాతిపదికగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తేనే అందరికి మంచిది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చే స్థితిలో మన జలవనరులు లేవన్న సంగతి తెలుసుకుని మసలుకోవాలి. ఇదే అందరి శాంతి సౌభాగ్యాలకు పునాది.

737

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Featured Articles