అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే


Wed,August 10, 2016 01:42 AM

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. వికేంద్రీకరణకు సంబంధించిన మన అవగాహనలో మార్పు రావాలె. ఈ కేంద్రీకృత పోకడలను ఎట్లా అరికట్టాలనే విషయమై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు ఆలోచించాలె. తమ పరిపాలన, పార్టీ వ్యవస్థలపై నియంత్రణను కాపాడుకుంటూనే, తమ పరిధిలో రాజకీయ స్వేచ్ఛ మనగలిగే విధంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలె.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాలు చర్చానీయాంశంగానే ఉంటున్నవి. ఇటీవల అంతర్రాష్ట మండలి సమావేశం జరిగినప్పుడు, కొంత మంది ముఖ్యమంత్రులు రాష్ర్టాల అధికారాలను కేంద్రం హరిస్తున్నదనే ఆరోపణలు చేశారు. ఇటీవలికాలంలో కేంద్రీకృత పోకడలు ఎక్కువయ్యాయనడంలో సందేహం లేదు. జాతీయ అంశాల సంగతి సరేసరి, కనీసం రాష్ర్టాలకు సంబంధించిన అం శాలపైన కూడా వాటికి అధికారం లేకుండాపోయింది. రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి, ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితాలోకి అంశాలను మార్చడం క్రమంగా సాగుతున్నదనే ఆరోపణ ఉన్నది. ఇది వాస్తవం కూడా.

ప్రధాని మోదీ సహకార సమాఖ్య సూత్రాన్ని ప్రవచించిన మాట నిజమే. కానీ వాస్తవిత మాత్రం రాష్ర్టాలను సంప్రదించడం మాత్రం జరుగడం లేదు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం పదేండ్ల తరువాత జరుపడం గమనార్హం. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తరువాత నీతి ఆయోగ్ రాష్ర్టాల డిమాండ్లను తెలుసుకోవడమే లేదు. ఇది చాలదన్నట్టు కేంద్రం రాష్ర్టాల అభిప్రాయాలనే కాదు, నీతి ఆయోగ్ సూచనలను కూడా పట్టించుకోవడం లేదని కొన్ని రాష్ర్టాలు ఆరోపించాయి.

గవర్నర్ల పాత్రపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీయేతర రాష్ర్టాలు గవర్నర్ పాత్ర పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. పశ్చి మ బెంగాల్‌తో పాటు బిహార్, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ర్టాలు కేంద్రం తమను సంప్రదించడం లేదని విమర్శించాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్నది బీజేపీ మిత్రపక్షమే కావడం విశే షం. సమావేశ ఎజెండాను ఖరారు చేసే ముందు కూడా రాష్ర్టాలను సంప్రదించలేదు. తమిళనాడు మొదలైన రాష్ర్టాలు విద్యారంగానికి నిధుల కొరత ఉందని తెలిపాయి. పాఠ్య పుస్తకాలను మెరుగు పరచడం పేరుతో సిలబస్‌లో ఏవైనా సిద్ధాంతాలను జోడించకూడదని పశ్చిమ బెంగాల్ హెచ్చరించింది. కేంద్రం సర్వశిక్షా అభియాన్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ఇంత గొప్ప పథకానికి నిధుల కొరత ఉండకూదని అభిప్రాయపడ్డది.

అంతర్రాష్ట్ర మండలిలో అత్యంత వివాదాస్పదమైన పుంచి కమిషన్ సూచనలు చర్చకు వచ్చాయి. కల్లోల భరితమైన రాష్ర్టాలను కొంతకాలం కేంద్రం అధీనంలో పెట్టుకునే 355, 356 అధికరణలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర ఆమోదం లేకుండానే, కేంద్ర దళాలను మోహరించే బిల్లు కూడా వివాదాస్పదమైంది. ఇది రాష్ర్టాల అధికారాలను కేంద్రం హరించడమేననే విమర్శ వెల్లువెత్తింది. అయితే ఇక్కడొక అంశం చర్చించుకోవలసి ఉన్నది. కేంద్రం తోడ్పాటు లేకుండానే రాష్ర్టాలు అంతర్గత భద్రతను కాపాడుతాయా? వాటికి ఆ స్థోమత ఉన్నదా?

రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. రుణాల చెల్లింపు భారంతో రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఉన్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివరించారు. ఆమె మాటలకు ఇతర ముఖ్యమంత్రులు మద్దతు పలికారు. అందరూ సమాఖ్య వ్యవస్థను సమర్థించా రు. ఈ ప్రతిష్టంభనకు కేంద్రమే పరిష్కారం చూపాలని అన్నారు. దేశ సమాఖ్య స్వరూపం పుస్తకాలకే పరిమితమైపోయింది. న్యాయ వ్యవస్థ బలంగా లేకపోతే, కేంద్రం ప్రతిపక్షాలు పాలించే రాష్ట్ర ప్రభుత్వాలను పడకొడుతూ పోతుందని అరుణాచల్‌ప్రదేశ్ ఉదంతాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నది. మన రాజకీయ వ్యవస్థలో కేంద్రీకృత పోకడలు పెరుగడం ఇవాళ కొత్త కాదు. ఇందిరా గాంధీ హయాంలోనే ప్రారంభమైంది. ఈ కేంద్రీకృత విధానాలు చివరికి ప్రతిపక్షాల ఏకీకరణకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాగతంగా బలహీనపరిచింది. ఇటీవలి యూపీఏ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ర్టాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నది. మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ర్టాలను పాలించడానికి, పృథ్వీరాజ్ చవాన్, విదర్భ సింగ్ వంటి బలహీనమైన నాయకులను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం అనుసరించిన ఈ విధానాల వల్ల, రాష్ర్టాలలో రాజకీయ సమతౌల్యం దెబ్బతిన్నది. పార్టీ రాష్ట్ర విభాగాలు బలహీనపడ్డాయి. ఇది పార్టీలో ముఠా కలహాలకు దారి తీసింది. అధిష్టానవర్గం ముందు సాగిలపడే సంస్కృతి వల్ల, కేంద్ర నాయకత్వానికి, స్థానిక విభాగాలకు అనుసంధానం లేకుండా పోయిం ది. ఇది క్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కారణమైం ది. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమిదే.

కాంగ్రెస్ పార్టీ పోకడ ఈ విధంగా ఉంటే, ప్రధాని మోదీ తరహా కూడా అదే విధంగా ఉన్నది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం అమలు చేసిన వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. మోదీ వ్యవహార సరళి అంతా ఇందిరాగాంధీని పోలి ఉందనే మాట వినబడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారాలన్నీ ప్రధాని కార్యాలయం వద్దనే కేంద్రీకృతమయ్యాయి. మన దేశ రాజకీ య వ్యవస్థలోనే ఇటువంటి కేంద్రీకృత పోకడలు ఎక్కువయ్యాయి. కేంద్రం సం గతే కాదు, రాష్ర్టాలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. చాలా రాష్ర్టాలలో ముఖ్యమంత్రి దగ్గరే అధికారాలు కేంద్రీకృతమై ఉంటున్నాయి. ఆయా రాష్ర్టాల్లో మమ తా బెనర్జీ, జయ లలిత, బాదల్ కుటుంబం, నవీన్ పట్నాయ క్‌చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లోనైతే యాదవ్ పరివారం గుప్పెట్లో అధికారం ఉన్నది.

రాజ్యాంగంలోని కట్టుబాట్లను తెంచివేయడానికి కేంద్రం ఆదాయపు పన్ను కు పైన మళ్ళా సూపర్ టాక్స్‌ను వసూలు చేస్తుంది. అది ఆదాయపు పన్నులో భాగం కాదంటూ, మొత్తం తానే తీసుకుంటుంది. అప్పుడప్పు డూ అదనపు లేదా ప్రత్యేక ఎక్సైజ్ సుంకం విధిస్తుంది. ఇది ఫైనా న్స్ కమిషన్ అవార్డు కిందికి వస్తుందంటూ దానిని మొత్తం సొం తం చేసుకుంటుంది. రాష్ర్టాలు కేంద్రీకృత పోకడలను తప్పు పడుతున్నాయి. కానీ అంతర్రాష్ట్ర మండలిలో కూడా ఈ పోకడపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో ఇదే పోకడలు పోతున్నాయి. చాలావరకు రాష్ర్టా లు పంచాయతీల, మున్సిపాలిటీల అధికారాలను హరిస్తున్నాయి. ప్రాజెక్టులు అవే నిర్దేశిస్తున్నాయి. ఇదేవిధంగా జిల్లా పరిషత్‌లు కూడా పంచాయతీలను పట్టించుకోవడం లేదు. పంచాయతీలను, గ్రామాలను సంప్రదించ డం లేదు. ఒక ఏడాది కాలంలో కింది స్థాయిలో వాటికి ఏయే అవసరాలు ఉన్నాయీ, ఏ పథకాలు చేపట్టాలనేది తెలుసుకోవడం లేదు. గ్రామ పంచాయతీలు కూడా తమ నిర్ణయాలలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడం లేదు. రాష్ట్ర యంత్రాంగంలో ఏ స్థాయిలోనూ సమాజాన్ని భాగస్వామిని చేయడమే లేదు. చాలా రాష్ర్టాలలో ఇదే పరిస్థితి ఉన్నది. ఈవిధంగా ఆర్థిక వికేంద్రీకరణ అనేది దేశంలో ఏ స్థాయిలోనూ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ గాంధీజీ ఆశించిన ప్రజా భాగస్వామ్యం, వికేంద్రీకరణ ఆచరణకు నోచుకోవడం లేదు. ఇదొక విషాదకర వాస్తవం.

వివిధ రాష్ర్టాలలో పరిస్థితి ఎట్లా ఉన్నదీ అంటే- రాజకీయ నాయకులు తమ కోణంలో తమ ప్రయోజనాలకు అనుగుణమైన ప్రాజెక్టులను చేపడుతూ, ఇతరులను పట్టించుకోవడం లేదు. కేంద్రం కూడా రాష్ర్టాలను పట్టించుకోవడం లేదు. అంతర్గత భద్రత, విద్య, ఆరోగ్యం మొదలైన రంగాల్లో రాష్ర్టాలను సంప్రదించడం లేదు. రాష్ర్టాలలో ప్రతిపక్షంగా ఉండి, పార్లమెంటులో బలంగా ఉన్న రాజకీయ పార్టీలు కొంత వరకు తమను సంప్రదించేలా చేయగలుగుతున్నాయి. గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. వికేంద్రీకరణకు సంబంధించిన మన అవగాహనలో మార్పు రావాలె. ఈ కేంద్రీకృత పోకడలను ఎట్లా అరికట్టాలనే విషయమై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు ఆలోచించాలె. తమ పరిపాలన, పార్టీ వ్యవస్థలపై నియంత్రణను కాపాడుకుంటూనే, తమ పరిధిలో రాజకీయ స్వేచ్ఛ మనగలిగే విధంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలె.
- ధూర్జటి ముఖర్జీ
(ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్)

471

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన