అభివృద్ధి మంత్రమే మతం


Thu,April 28, 2016 12:57 AM

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడానికి బదులు సమాజంలోని అట్టడుగు వర్గాలు ప్రభుత్వ విధానాల ద్వారా, పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు కృషిచేయాలె.

జాతీయవాదం, లౌకికవాదాలపై చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ భిన్నత్వం వైషమ్యాలకు కారణం కాకూడదని స్పష్టం చేశారు. మన ప్రజలు అందరూ- హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, అత్యంత అల్ప సంఖ్యాకవర్గంగా ఉన్న పార్సీలు, ఆస్తికులు, నాస్తికులు అందరూ భారత దేశంలో అంతర్భాగమేనని మోదీ ఇటీవల ప్రపంచ సూఫీ సమావేశంలో అన్నారు. ఇటీవలి కాలంలో సామాజిక ఘర్షణలు రేగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకున్నది. ప్రధాని అన్నట్టు ఉగ్రవాదాన్ని మతానికి ముడిపెట్టే విధానాలను తిరస్కరించవలసి ఉన్నది. భిన్న మతాలకు చెందిన పండితులు కూడా ఇదే బోధిస్తున్నారు. అయినా కొందరు మతం పేరిట హింసావాదాన్ని చేపడుతున్నారు. వీరు దేవు డు ఒక్కడే అని, భిన్న పేర్లతో పూజిస్తుంటామని అర్థం చేసుకోవడం లేదు. జమ్ము విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చెప్పిన విషయాలు గమనార్హం.

మతాన్ని, రాజకీయాలను పూర్తి వేరు చేయ డం వల్ల ప్రజాస్వామ్యానికి ఉపయోగకరం కాకపోవచ్చు. భారతీయ పరిస్థితులలో రెండింటి మధ్య ఇటువంటి అడ్డుగోడ నిర్మించడం సాధ్యం కాదు. అన్ని మతాల మధ్య సమదూరం పాటించడం, వీలైనం త తక్కువ మత విషయాలలో తలదూర్చడమనేది ఇప్పుడున్న సవాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. హమీద్ అన్సారీ చెప్పినట్టు మత సూత్రాలను సాంస్కృతిక పరిస్థితుల నుంచి వేరు చేసి చూడాలె. ప్రతి మతం తమ సాంస్కృతిక ఆవరణాన్ని చాటుకుంటూ దానికి చారిత్రక ప్రాతిపదికత ఉన్నట్టు చెప్పుకుంటుంది. అం దువల్ల ఉపరాష్ట్రపతి చెప్పిన అంశాలు ప్రాధాన్యమైనవి.

భారతీయ ముస్లింలు దేశాన్ని ప్రేమిస్తారని, తమ జాతి పట్ల గర్వపడతారని ప్రధాని వ్యాఖ్యానించారు. భారతీయ ముస్లింలు ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఆకళింపు చేసుకున్నారు. దేశంలో ఆత్మవిశ్వాసంతో ఉం టూ, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారని మోదీ వివరించారు. ముస్లింలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. కొద్దిరోజుల కిందట ప్రధాని మోదీ బుద్ధపూర్ణిమ సందర్భంగా మాట్లాడుతూ తాను చాలాకాలం గా బౌద్ధ ఆరాధకుడినని వెల్లడించారు. యుద్ధాలతో నిం డి ఉన్న ఈ ప్రపంచాన్ని హింసా సంక్షోభాల నుంచి గట్టెక్కించేది బుద్ధుడి బోధనలేనని ఆయన అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దమని ప్రపంచమంతా అంటున్నది. కానీ ఇందుకు గల కారణాన్ని ఎవరూ గుర్తించడం లేదు. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కావడానికి బుద్ధుడే కారణంఅని మోదీ వివరించారు. ఈ ప్రపంచం హింసామార్గం వీడటానికి, ప్రేమ, కరుణా సందేశాన్ని వ్యాప్తిచేయడానికి ఆసియా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అందుకు కారణం బుద్ధుడని ఆయన అన్నారు. దేశం లో భిన్నత్వం ఉన్నప్పటికీ అంతర్లీనంగా ఐక్యం ఇమిడి ఉన్నదనే భరోసా ఇవ్వడానికి రాజకీయ నాయకులు ఇటువంటి సంకేతాలివ్వడం అవసరం.

మానవ జాతి విముక్తికి ఉత్తమ కర్మలు ఆచరించడం, అంకితభావం చాలునని నాస్తికులు భావిస్తారు, కానీ మతాలు మాత్రం పరమాత్ముడిని భిన్న మార్గాలలో ప్రార్థించాలని భావిస్తాయి. మతాలకు సంబంధించి మోదీ సరైన సందేశమే అందించారు. కానీ ఆయన పార్టీ, ఆరెస్సెస్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల భారత మాతా కీ జై విషయమై రాద్ధాంతం చేయడం ఇందుకు ఉదాహరణ. భారతీయులు అందరూ భారత మాతా కీ జై అనడం తప్పనిసరి అని ఆరెస్సెస్ అంటున్నది. ఈ దేశ పౌరులు గా అది రాజ్యాంగ బాధ్యత అనేది బీజేపీ వాదన. ఈ వాదనను కొన్ని సం స్థలు అభ్యంతరకరంగా భావిస్తున్నాయి.

మైనారిటీలు తమ మతంలో పాతకాలం నాటి ఆధునిక సమాజం అంగీకరించని, మహిళా వ్యతిరేకమైన విధానాలు ఉంటే వారు సంస్కరించుకోవాలె. అయితే ఆరెస్సెస్ మైనారిటీల ఆహారపు అలవాట్ల విషయమై అనుసరిస్తున్న విధానం సబబు కాదు.దాద్రిలో దాడి, జేఎన్‌యూలో దేశద్రోహ కార్యకలాపాలు సాగుతున్నాయ ని ఆరోపించడం మొదలైన ఇటీవలి దుర్ఘటనలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. విద్యాసంస్థలు దేశ ద్రోహ కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయని ఆరెస్సెస్ ఆరోపిస్తున్నది. నిజమైన లౌకికవాదం పాదుకొల్పడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా శంకిస్తున్నది. అసహనంపై ఇంత సుదీర్ఘ చర్చ సాగడం నిజానికి అవసరం లేదు. బీజేపీ, ప్రతిపక్షాలు ఈ వివాదాన్ని ఇంత గా సాగదీయకపోవలసింది.

ఈ దేశం అందరిది. ప్రతి వర్గానికి తమకు నచ్చి న మార్గంలో నడిచే హక్కు ఉంటుంది. ఒక వర్గం మరో వర్గంపై తమ అభిప్రాయాలను, నమ్మకాలను రుద్దకూడదు. ప్రతి మతస్తులు దేశ భిన్నత్వాన్ని ఆమోదించి ఒదిగిపోయే విధంగా ప్రయత్నించాలే తప్ప, ఇతరులపై ఆధిప త్యం చేయకూడదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాన హక్కులను పౌరులు అందరూ అనుభవించాలె. ఘనమైన భారతాన్ని నిర్మిస్తామనే, హిందు సంస్కృతిని పరిరక్షిస్తామనే ఆరెస్సెస్ లక్ష్యం మంచిదే. కానీ దానికోసం ఇతరులను బలవం తపెట్టవద్దు. హిందు సంస్కృతీ సంప్రదాయాలను ప్రచా రం చేసుకోవచ్చు. అయి తే ఇతర సంప్రదాయాల నుంచి కూడా నేర్చుకోవలసిన వి ఉంటాయని గ్రహించాలె.

లౌకికత్వాన్ని భారతీయ దృక్కోణంలో పునరావిష్కరించుకోవడం తక్షణావసరం. ఆధునికీకరణ వేగంగా సాగుతున్న ఈ ప్రపంచంలో మన దేశానికి విధేయత తెలుపడం, దేశ ప్రాధాన్యాన్ని గుర్తించడం అవసరం. మతావలంబన దేశ చట్టాలకు విరుద్ధంగా ఉండకూడదు. ఇతర మతాలతో ఘర్షణలు ఉండకూడదు. హిందు సం స్కృతి, ముస్లిం సంస్కృతి అంటూ ప్రచారం చేసేవారు ఆయా మతాలలోని ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఎట్లా మెరుగుపరచాలనేది ఆలోచించాలె. ఏవో కొ న్ని సంస్థలు మినహా మిగతావేవీ ఈ కోణంలో ఆలోచించడం లేదు. ముస్లింల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎం త దయనీయంగా ఉన్నాయో జస్టిస్ సచార్ కమిటీ నివేదికను చూస్తే అర్థమవుతుంది. మారుతున్న ప్రపంచంలో మత సంస్థలు కూడా తమ మతస్తుల విద్యా, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, బలహీనవర్గాలను బాగుచేయడానికి తమ వంతు పాత్ర పోషించవచ్చు. అన్ని సంస్థలు గిరి గీసుకొని ఉండకుండా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను విజయవంతం చేయడానికి కృషిచేయాలె.

అందుకే లౌకికత్వానికి సంప్రదాయ నిర్వచనం స్థానంలో మరింత ప్రభా వ వంతమైన, అన్ని మతాలకు ఆమోదయోగ్యమైన నిర్వచనం రూపొందించుకోవాలె. కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ , అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదా లు సృష్టించడానికి బదులు సమాజంలోని అట్టడుగు వర్గాలు ప్రభుత్వ విధానాల ద్వారా, పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు కృషి చేయాలె. నిరుద్యోగం ఇవాళ మనముందున్న పెద్ద సవాలు. ప్రభుత్వాలు ఉపాధి కల్పన పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలె. దీనివల్ల యువత తప్పుడు మార్గాలు పట్టకుండా, తమ శక్తియుక్తులను నిర్మాణాత్మక కార్యకలాపాలకు ఉపయోగిస్తారు.

1250

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన