మాటలు చాలు చేతలు కావాలి


Wed,August 26, 2015 01:46 AM

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ
ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార్యాచరణకు రూపకల్పన చేయాలి. సమాజంలోని అట్టడుగు స్థాయినుంచి జీవన ప్రమాణాల పెరుగుదలకు కృషిచేయాలి. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇదే
మోదీ పాలన చెబుతున్న సారాంశం.

దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తు త రాజకీయ పోకడలు చూసిన తర్వాత ప్రజలకు ముఖ్యంగా ఆమ్ ఆద్మీకి ఎవరి మీద విశ్వాసం కలగడం లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తన విశ్వసనీయతను కోల్పోయింది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కనుచూపు మేరలో ప్రభుత్వం తన పనితీరుతో ప్రజల నమ్మకాన్ని చూరగొంటుందనడానికి ఏ మాత్రం సానుకూలతలు కనిపించడం లే దు. ప్రజలకు ఎదురవుతున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దగ్గరి దారులేవీ లేవు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాలు తమ పంథాలను నెగ్గించుకున్న తీరును ప్రతిఫలించాయి. పార్లమెంటును యుద్ధరంగంగా మార్చి చివరికి సాధించేమీ లేదు. ఈ క్రమంలోనే చూస్తే.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వ్యవహరించిన తీరుకు సరైన కారణం కనిపిస్తూనే ఉన్నది. కానీ ఇలాంటి గందరగోళ, పార్లమెంటు స్తంభన సమస్య లు మన ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపక మానవు. ఇదే సందరర్భంలో మోదీ మౌనం గురించి తప్పక చెప్పుకోవాలి. ఆయన మౌనం అనేక అనర్థాలకు తావిస్తున్నది. సమర్థ నాయకుడిగా తనకు తాను చెప్పుకుని ఎదిగివచ్చిన మోదీ ఎవరూ ఊహించని విధంగా అన్ని విషయాలపై మౌనమే సమాధానంగా ఉంటున్నారు. మోదీ తన రాజకీయ ఆరంభాన్ని ఏ విధంగా మొదలుపెట్టారో దాన్ని కొనసాగించలేక పోతున్నారు.

సమర్థ నాయకత్వాన్ని అందించి అవినీతిని అంతమొందిస్తానన్న ఆయన మాటలకు తగ్గట్టుగా ఇప్పుడు వ్యవహరించలేకపోతున్నారు. ఈ పరిస్థితులే మన ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారబోతున్నది.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. రెండో దఫా వర్షాకాల సమావేశాలు నిర్వహించి తాను అనుకున్న బిల్లులను ఆమోదింపచేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది. వస్తు-సేవల పన్నుబిల్లును ఎలాగైనా పార్లమెంటులో ఆమోద ముద్ర వేయించుకోవాలన్న ఆలోచనతో బీజేపీ ఉన్నది. అయితే మోదీ స్వభావానికి భిన్నంగా ఆయన పార్లమెంటులో బిల్లులు ఆమోదింప చేసుకోవడంలో వ్యవహరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది మన ఆర్థిక విధానాలపై, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సం దే హం లేదు. దేశంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడంలో భాగంగా వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)బిల్లును తీసుకు రావాలనుకుంటున్నారు. ఇప్పుడు వివిధ రాష్ర్టాల్లో అనేక రూపాల్లో, అనేక విధాలుగా పన్నుల విధానం ఉన్నది.

దీంతో వస్తువుల చెలామ ణి, దిగుమతులు తగ్గి అంతిమంగా ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి జీఎస్టీ బిల్లును తేవాలని గత ఏడేళ్లుగా ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో జీఎస్టీ బిల్లును బీజేపీ అడ్డుకున్నది. ఇప్పుడు ప్రధాని మోదీ బిల్లును అడ్డుకుంటున్నదని కాంగ్రెస్‌పై నిం దలు వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే.. దేశంలో ఇప్పుడు సగటు మనిషికి ఉపయోగపడేలా పన్నుల విధానం ఉన్నది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల మోత పెద్దగా లేదు. ప్రజలకు మోయలేని భారంగా పన్నుల వ్యవస్థ లేదు. ఈ క్రమంలో జీఎస్టీ బిల్లుతో ప్రజలకు మరింత మేలు జరగాలి. కానీ దాన్ని ఏ ఉద్దేశంతో తేవాలనుకుంటున్నారో.., అది నెరవేరుతుం దా లేదా అన్నది కాలమే తేల్చాలి.

మోదీ తన వ్యవహార శైలితో నెహ్రూను అనుకరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. నెహ్రూలాంటి పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేస్తున్నట్లు అర్థమవుతున్నది. కానీ ఇక్కడ గమనించాల్సిందేమంటే.. నెహ్రూ గొప్ప దార్శనికుడు, విద్యావేత్త, లౌకికవాది అంతకన్నా ఆధునిక భావజాలానికి ప్రతీకగా నిలిచారు. కానీ మోదీ ఆర్‌ఎస్‌ఎస్ వెన్నుదన్నుతో ఉన్నవాడు. ఆయ న ఏం చేస్తాడు, ఎటు ప్రయాణిస్తాడని ఇప్పుడే చెప్ప డం కాదు, కానీ.. ఆయన చెప్పినట్లు.. అచ్చే దిన్ ఆయేగీ అన్నది ఎప్పుడొస్తుంది, కనుచూపు మేరలో ఉన్నదా? అలాగే.. మోదీ కూడా ఒకటి గుర్తించాలి.

ఎప్పుడైనా ఇతరుల గురించి మాట్లాడి ప్రజల్లో విశ్వసనీయతను పొందిన వ్యక్తులు, పార్టీలుకాని లేవు. ఇప్పుడు మోదీకి మద్దతు పలుకుతున్న పార్టీలన్నీ తమ తమ ప్రత్యేక పరిస్థితుల్లోనే చేస్తున్నాయి. తమవైన పరిధిల్లోంచే మద్దతు పలుకుతున్నాయి. ఇలాం టి పరిస్థితి ఇప్పుడు మాత్రమే వచ్చింది కాదు. గత కొన్నేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ఇదే కనిపిస్తున్నది. అయితే మోదీ తన విజయంలో, కేం ద్రంలో ప్రభుత్వాన్ని నడపడంలో పార్టీల మద్దతు తీసుకోవడంలో తనదైన మార్కును చాటుకున్నారు. అయితే.. అంత ఆరోగ్యకరమైన రాజకీయ విధానమే మీ కాదు.

ప్రధాని నరేంద్ర మోదీ అనేక కొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు, ప్రారంభించారు. కానీ ఆయన పథకాలను పెద్ద ప్రచార పటాటోపంతో ప్రవే శ పెట్టిన రీతిలో.., ఆ పథకాల అమలు పట్ల చూప డం లేదు. పథకాలను ప్రవేశ పెట్టడం మాత్రమే వాటి అమలులో కూడా శ్రద్ధ చూపాలి. ఉన్న పథకాలకు పేర్లు మార్చి, వాటినే కొత్తగా ప్రచారం చేసుకోవడం లో ఉపయోగం లేదు. వాటితో పేరు, ఖ్యాతికూడా రాదు. స్థూల జాతీయోత్పత్తిని పెంచడం కోసం పారిశ్రామికాభివృద్ధిని ఎంత వేగంగా పరిగెత్తిస్తే అంతగా అభివృద్ధి చెందుతాం. వీటన్నింటిని సరియైన దిశలో ప్రవేశపెట్టి కార్యరూపంలోకి తేకుంటే.. నిరుద్యోగం ప్రబలుతుంది. ఇదే అనేక సమస్యలకు ఆజ్యం పోస్తుంది. మోదీ మొదట చెప్పిన దాని ప్రకారం ఎనిమిది నుంచి పది మిలియన్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. జీడీపీలో ఒక శాతం అభివృద్ధి చెందితే 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, వీటికి అనుబంధంగా రెం డు, మూడు పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇది నిజం కావాలంటే చెప్పెదానికీ, కార్యాచరణకు పొంతన ఉం డాలి. అలా చేసినప్పుడే ఆచరణాత్మకమైప ఫలితాలుంటాయి.

రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నట్లు మోదీ జరుగుతున్న విషయాలు, అవసరమైన విషయాల పట్ల మౌనం వహిస్తూ.., మెజార్టీవాద దృక్పథంతో మైనార్టీలను భయపెట్టే విధానాలను అవలంబిస్తున్నా రు. ఈ క్రమంలోనే అనేక చోట్ల అనేక రూపాల్లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయ నిర్వహణలో కాషాయీకరణ జోక్యం పెరిగిపోతున్నది. మెజార్టీ భావజాల ఆధిపత్యాన్ని రుద్దడానికి ప్రయత్నం జరుగుతున్నది.
దేశంలో గత రెండు మూడేళ్లుగా వ్యవసాయ సం క్షోభం తీవ్రమవుతున్నది. అనుకున్న దానికన్నా వర్షాపాతం తక్కువ నమోదై ఆహార ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి.

దీంతో నిత్యావసర వస్తువు ల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధర ఎనభై రూపాయలకు కిలో అయ్యి సామాన్య ప్రజానీకాన్ని భయపెడుతున్నది. పరిస్థితులిలా ఉన్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తున్నదే గానీ చేసిందేమీ లేదు. దీంతో ప్రజల కష్టాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలేవీ లబ్ధిదారులకు చేరడం లేదు. ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. దేశంలో చాలా రాష్ర్టాలు వర్షాభా వ పరిస్థితుల్లో తల్లడిల్లుతుంటే.. మరికొన్ని భారీ వర్షాలతో, వరదలతో విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు గట్టెక్కడానికి కేంద్ర తీసుకుంటున్న చర్యలేవీ కనిపించడం లేదు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న ఆకర్షణీయ పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. స్వచ్ఛభారత్, నదుల శుద్ధీకరణ, నైపుణ్యాల పెంపుదల లాంటివన్నీ అందమైన నినాదాలుగా మారాయి.

ఈ ఏడాది కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలేవీ ఆశించిన ఫలితా లు సాధించినట్లు నివేదికలు లేవు. స్వచ్ఛభారత్ గురించి ఎంత చెప్పినా దేశంలో మెజార్టీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. కనీస మంచినీటి సౌకర్యం లేదు. ఒకానొక నివేదిక ప్రకారం దేశంలోని 13 రాష్ర్టాల్లో మెజార్టీ ప్రజానీకానికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ప్రజల దాహం తీర్చడానికి కుండెడు మంచినీరు అందుబాటులో లేని పరిస్థితి దేశమంతా ఉంటే.. ఇక సాగునీటి సౌకర్యం గురించి ఆలోచించే వారెవరు? ప్రధాని మోదీ ప్రణాళికా సంఘానికి పేరుమార్చి, నీతి ఆయోగ్ గ్రామీణాభివృద్ధి కోసం చేస్తు న్న కార్యక్రమాలేవో, వాటి ఫలితాలేవో రాబోయే కాలంలో తెలుస్తున్నది.

ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే.. రానున్న రోజులు మరింత దుర్భరంగా మారనున్నాయి. సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార్యాచరణకు రూపకల్పన చేయాలి. సమాజంలోని అట్టడుగు స్థాయినుంచి జీవన ప్రమాణాల పెరుగుదలకు కృషిచేయాలి. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఇదే మోదీ పాలన చెబుతున్న సారాంశం.

1331

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన