నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి


Sat,March 7, 2015 06:11 PM

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్రమల స్థాపన ఉంటుంది. కాబట్టి మనుషుల అవసరాలకోసమే కాకుండా, అభివృద్ధికి కూడా నీటి లభ్య త అనివార్యం. కాబట్టి నీటి నిలువలను కాపాడుకోవాలి. ధ్వంసమైన వాటిని పునరుద్ధరించుకోవాలి. నీటిని సంరక్షించుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా చేపట్టి నీటిని ఒడిసిపట్టాలి.

మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నీటి లభ్యతపైనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, వికసించిందని చరిత్ర చెబుతున్నది. మానవ మనుగుడకు అతి మఖ్యమైన నీటి లభ్యత రోజు రోజుకూ తక్కువ అవుతున్నది. కొన్ని దశాబ్దాలు గా గతి తప్పిన రుతువనాలు, వర్షాభావ పరిస్థితులతో నీటి కొరత దేశంలో తీవ్రం గా పెరిగిపోయింది.

అనేక రాష్ర్టాలు, జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లు గా ప్రభుత్వాలు నీరును సంరక్షించుకోవడం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. నీటిని నిల్వ చేసుకోవడం గురించి, నీటిని ఒడిసిపట్టుకోవడం గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా మన నీరు-మన జీవితంకార్యక్రమాన్ని నిర్వహించి దేశ వ్యాప్తంగా నీటిని సద్వినియోగం చేసుకోవడం గురించి, నిల్వ చేసుకోవడం గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది.

సమాజికావసరాలకు, పారిశ్రామికాభివృద్ధిలో నీటికి నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. కానీ నానాటికీ నీటి లభ్యత కృషించి పోతున్నది. అలాగే ప్రజలకు నిత్యావసరాలకు కూడా నీరు అందుబాటులో లేకుండా అయిపోయింది. ఫలితంగా గత కొన్నేళ్లుగా ప్రతి మనిషి నీటి వాడకం గణనీయంగా తగ్గిపోయిం ది. మరో వైపు దేశంలో నానాటికీ పెరుగుతున్న జనా భా, నగరీకరణల కారణంగా నీటి వినియోగం పెరిగిపోతున్నది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నీటి వినియోగం పెరిగిపోతున్నది. గతంలో మాదిరిగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో భూ గర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అటు వ్యవసాయానికీ, ఇటు నగరాల వినియోగానికి నీటి కరువు పెద్ద అవరోధంగా మారింది. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే కాలంలో గుక్కెడు నీటి కోసం అనేక కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడనున్న ది. టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం ప్రకారం కొన్నేళ్ల క్రితం దాకా దేశంలో ప్రతి మనిషి 6500 క్యూబిక్ మీటర్ల నీరు వాడేది. అదిప్పుడు 2500లకు కుదించుకుపోయింది.వాషింగ్టన్‌కు చెంది న వరల్డ్స్ వాచ్ సంస్థ అధ్యయనం ప్రకారం భారతదేశం 2020 నాటికి తీవ్ర నీటి కొరతను ఎదుర్కోబోతున్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రతి మనిషికి ఏటా కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

దేశంలో ఇప్పటికే అనేక రాష్ర్టాలు తీవ్రమైన నీటి కరువును ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకంగా తాగే నీరు కోసం ప్రజలు వెంపర్లాడుతున్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యయనం ప్రకారం ముంబాయి,ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, కాన్పూర్, మధురై లాంటి పెద్ద నగరాల్లో 50 లక్షల మంది కనీస నీటి అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి మనిషికి రోజుకొక్కంటికి కనీసం 100-200 లీటర్ల నీరు తప్పని సరిగా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలన్నింటా 90 లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఈ మధ్యనే చేసిన మరో అధ్యయనం ప్రకారం దేశం లో 300 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితిలో ఉన్నా యి. ఈ ఇరవై ఏళ్లలో ఈ జిలాల్లో నాలుగు మీటర్ల లోతుకు భూ గర్భ జలాలు అడుగంటి పోయాయి. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ర్టాల్లో పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరం గా తయారవుతున్నది.

గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఎదురవుతున్నది. దీనికి ప్రధాన కారణం దినదినం భూ గర్భ జలాలు అడుగంటిపోవడమే. నానాటికీ నీరు పాతాళానికి పడిపోతున్నది. వర్షాభావ పరిస్థితులతో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కోసం భూ గర్భ జలాల వాడకం పెరిగిపోయి భూ పటలంలో నీరు కిందికి పడిపోతున్నది. నగరాల్లో కూడా ప్రజల అవసరాల కోసం ఎక్కువ శాతం భూ గర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రతి ఏటా.. 5 నుంచి 10ఫీట్ల లోతుకు భూ గర్భ జలాలు పడిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లోనే నగరాల్లో ఉపయోగించిన నీటిని తిరిగి ఉపయోగించుకునే విధానం ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకునే విధానం అనివార్యం అవుతున్నది. కానీ ఈ విషయంలో మన దేశం చాలా వెనకబడి ఉన్నది.

అలాగే మురికి నీటిని శుద్ధి చేసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు. ఫలితంగా నీటి కొరతను ఎదుర్కోవడం అతి పెద్ద సవాలుగా మారుతున్నది. ఢిల్లీ లాంటి నగరాల్లో ఈ విధానాన్ని కొంత అమలులోకి తీసుకొచ్చినా అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. చాలినన్ని నిధుల కొరతతో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అనుకున్నన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం ప్రకారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్లు అనుకున్న లక్ష్యం లో 73 శాతమే విజయం సాధించాయి. అందులో దాదాపు పది శాతం దాకా పనిచేయలేదు. ఇలా నగరాల్లో నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకునే కార్యక్రమం నీరుగారి పోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో నీటిని నిలువ చేసుకోవడం, సంరక్షించుకోవడంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉన్నది. దీనికోసం వాటర్‌షెడ్‌లను విరివిగా నిర్మించుకోవాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వాటర్ షెడ్‌లను నిర్మించడమనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాలి. నదుల నుంచి నీటి సరఫరా కోసం కాలువల ను నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా తవ్వాలి. ఆ నీటి ని వ్యవసాయ భూములకు అందించాలి. ఇదే సందర్భంలో నగరాల్లోనుంచి వెలువడే మురికి నీరు తీవ్రంగా కాలుష్యమై పోయి నదులను, కాలువలను, వ్యవసాయ భూములను కూడా కాలుష్యమయం చేస్తున్నది. దీంతో స్వచ్ఛమైన గ్రామీణ ప్రాం తాలు, నదులు కూడా కాలుష్యకాసారంగా మారుతున్నా యి. కాబట్టి నగరాల నుంచి వెలువడే నీటిని శుద్ధి చేసి మాత్రమే నదులు, కాలువల్లోకి వదలాలి.

లేనట్లయితే.. నగరాలు విడుదల చేసే నీటితో మరిం త తీవ్ర నష్టం జరుగుతుంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే నీటి సరఫరా, సంరక్షణ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యం ఎజెండామీదికి వచ్చింది. పీపీపీ పద్ధతిలో నగరాల్లో నీటి సరఫరా చేయడం, నిర్వహణ ఇవ్వాళ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్వహణలో నీటి బిల్లుల వసూళ్లు నామమాత్రంగానే మారిపోయాయి. దీంతో పెద్ద నగరాల్లో నీటి సరఫరా అనేది మోయలేని భారంగా ప్రభుత్వానికి పరిణమించింది. నగరాల్లో నీటిసరఫాకు నామమాత్రంగా వసూలు చేస్తున్న బిల్లులు కూడా వసూలు కాక పెద్ద సంక్షోభాన్నే తెచ్చి పెడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో దేశంలో నీటి సమస్యను పరిష్కరించడాన్ని తీవ్రమైన విషయంగా తీసుకోవాలి. నిపుణులతో దేశ స్థాయిలో విధి విధానాలు రూపొందించాలి. వర్షపు నీరు, నీటి సంరక్షణ, భూ గర్భ జలాల సంరక్షణ, నగరాల్లోని మురికి నీటిని శుద్ధి చేసే ప్రక్రియలు అన్నీ ఏక కాలంలో సమన్వయంతో ముందుకు సాగాలి. నగరాల్లో ఉన్న ప్రధాన సమస్య అయిన నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. వీటన్నింటితో నీటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలి. నీటి శుద్ధీకరణ, తిరిగి ఉపయోగించుకోవడం అనే ప్రక్రియలు విరివిగా ఉపయోగంలోకి రావాలి. అలాగే నీటి సరఫరా, నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు కూడా పెరగాలి. ఇప్పుడు చాలా కనిష్ఠంగా బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నారు. ఈ స్థితి మారాలి. అప్పుడే నీటి సరఫరా, నిర్వహణ సామర్థ్యం పెరిగి నగరాలు, పల్లెల నీటికరువు తీరుతుంది.

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎం తో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పారిశ్రమల స్థాపన ఉంటుంది. కాబట్టి మనుషుల అవసరాలకోసమే కాకుండా, అభివృద్ధికి కూడా నీటి లభ్య త అనివార్యం. కాబట్టి నీటి నిలువలను కాపాడుకోవాలి. ధ్వంసమైన వాటిని పునరుద్ధరించుకోవాలి. నీటిని సంరక్షించుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా చేపట్టి నీటిని ఒడిసిపట్టాలి. నీటి కరువును తీర్చుకోవాలి. ఇలాంటి విధానాలతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.

835

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన