ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు


Wed,November 26, 2014 02:54 AM

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయి. రాజకీయ నేతలు, అత్యున్న త అధికార యంత్రాంగం కుమ్మక్కయిన ఫలితంగా వ్యవస్థ అంతా అవినీతి ఊబిలో చిక్కుకున్నది. మరోవైపు క్రోనీ క్యాపిటలిజం విశ్వరూపం ప్రదర్శించి వ్యవస్థనంతా అవినీతిమయం చేసింది.

కొన్నేళ్లుగా విశ్లేషకులు, మేధావు లు ప్రైవేటీకరణ గురించి తెగ మెచ్చుకుంటున్నారు. మన పాలనా వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ప్రైవేటీకరణ తథ్యమని అంటున్నారు. అంతే కాదు, నేడు వ్యవస్థాగతంగా ఉన్న అనేకకానేక సమస్యలకు పరిష్కారం ప్రైవేటైజేషన్ మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. అయితే.. వీరు అంటున్న ట్లు పైవేటురంగం, దాని అసలు లక్ష్యం.. అనుభవాలు, ఫలితాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ప్రైవేటురంగం అం టేనే లాభాల పునాదిగా పనిచేస్తుంది. గరిష్ఠ లాభాల కోసం ప్రైవేటురంగ అధిపతులు ఎంతకైనా దిగజారిన దుష్టాంతాలు చాలా ఉన్నాయి.

తమ లాభాల కోసం నియమాలు, నిబంధనలన్నింటినీ ఉల్లంఘించిన ఉదంతాలున్నాయి. తమకు అనుకూలతను సృష్టించుకోవటం కోసం అధికారయంత్రాంగంలో తిమ్మిని బమ్మిని చేసి వ్యవస్థనే నీరుగారుస్తారు. మొత్తంగా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తారు. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే ముంబాయి హైకో ర్టు డివిజన్ బెంచ్ ప్రైవేటు హాస్పిటల్స్ గురించి సంచలానాత్మక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రజలకు (రోగులకు)సేవ చేయడాన్ని వ్యాపారాత్మకంగా మార్చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ముంబాయిలోని సెవెన్‌హిల్స్ హాస్పిటల్ వారు ఇద్దరు రోగులను వైద్య బిల్లులు చెల్లించలేదని అక్రమంగా నిర్బంధించారని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఒక్కఘటనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం రోజూ జరుగుతూనే ఉన్నాయి. ప్రజల అనారోగ్యాన్ని పెట్టుబడిగా మలుచుకుంటున్న హాస్పిటళ్లు సర్వత్రా ఉన్నా యి.

ఇటీవలి పరిణామాలు చూస్తే.. దేశంలో వైద్యరం గం, ఉన్నత విద్య పూర్తిగా ప్రైవేటుపరం అయిపో యి, వ్యాపార మయం అయ్యింది. మఖ్యం గా వృత్తి విద్యాకోర్సుల పేర వెలిసిన విద్యాలయాలన్నీ వ్యాపా ర కేంద్రాలుగా మారిపోయాయి. విద్యపట్ల, ఆరో గ్యం పట్ల ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకున్న ఆలోచనలు, అపోహలను ఆసరా చేసుకుని ప్రైవేటురంగం కొల్లగొడుతున్నది. విద్యాలయాల్లో కనీస వసతులు, అవసరమైన నిపుణులైన బోధకు లు లేకుండానే విద్యాలయాలు నిర్వహిస్తూ అటు ప్రజలను, యూనివర్సిటీలను మోసం చేస్తున్నారు. లక్షలాది ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక్కడ రెండు విధాల ప్రైవేటు యాజమాన్యాలు లబ్ధి పొందుతున్నాయి. హాస్పిటళ్లు, కళాశాలలు సబ్సిడీల రూపంలో ప్రభుత్వంనుంచి భూమి, ఇతర మౌలిక సదుపాయాలను, వనరులను పొందుతున్నాయి. ప్రభుత్వం నుంచి పొందిన రాయితీకి అనుగుణంగా ప్రజలకు సేవ అందిస్తున్నాయా? అంటే లేదనే చెప్పా లి. దీంతో ప్రైవేటురంగ యాజమానులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. సేవారంగాన్ని వ్యాపారమయం చేస్తున్నారు.

ఇలా అక్రమంగా ప్రజాసేవ మరిచి, అస లు లక్ష్యాలను తుంగలో తొక్కి పన్నులు ఎగవేసి కోట్లకు కోట్లు గడిస్తున్నారు. ఒకానొక అంచనా ప్రకా రం అక్రమార్జన మనదేశ స్థూల జాతీయోత్పత్తిలో నాలుగో వంతు ఉంటుందని అంటున్నారు. అంటే సుమారు 500 బిలియన్ల దాకా ఉంటుందని చెబుతున్నారు. ఇలా వెనకేసిన సొమ్మునే నల్లధనంగా ఈ మధ్యన చెబుతూ విదేశీ బ్యాంకుల్లో దాచిని దాన్ని వెనక్కి తేవాలని అంటున్నారు. నల్లధనాన్ని వెలికి తీస్తే దేశీయంగా ఎదుర్కొంటున్న చాలా సమస్యల ను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ నల్లధనం విదేశాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఎలా, ఎందుకు పోగుపడిందో ఎవరూ మాట్లాడటం లేదు. చట్టవ్యతిరేకంగా, అనైతికంగా కూడబెట్టిన సొమ్మే నల్లధనంగా చెప్పడం లేదు. ఏదేమైనా ఇన్నాళ్లకైనా నల్లధనాన్ని వెలికి తీసి ప్రజావసరాల కోసం ఖర్చు చేయాలన్న ఆలోచన రావడం ముదావహం.

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతి లో కూరుకుపోయాయి. రాజకీయ నేతలు, అత్యున్న త అధికార యంత్రాంగం కుమ్మక్కయిన ఫలితం గా వ్యవస్థ అంతా అవినీతి ఊబిలో చిక్కుకున్నది. మరోవైపు క్రోనీ క్యాపిటలిజం విశ్వరూపం ప్రదర్శించి వ్యవస్థనంతా అవినీతిమయం చేసింది. మొత్తంగా వ్యవస్థను కుంభకోణాలతో కుళ్లిపోయేలా చేసింది. మరో వైపు ప్రైవేటు రంగ యజమానులు ప్రభుత్వ యంత్రాంగాన్ని లోబర్చుకునేందుకు ఇచ్చే ముడుపులు ప్రభుత్వ యంత్రాంగాన్నే నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలోనే నెలకొని, వెలుగు చూసిన కుంభకోణాలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలు.. బొగ్గు అనుమతుల కుంభకోణం, శారదా కుంభకోణం దాకా ఎన్నో ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తు ల కేసులో జైలుకు వెళ్లిన తమిళనాడు సీఎం జయలలిత మొదలు గతంలో జైలుకు పోయినవారూ, ఇంకా పోవలసిన వారూ ఎందరో ఉన్నారు. ఇదంతా ప్రైవేటు రంగానికి అనుకూలంగా వ్యవహరిం చడమ నే కారణంగానే జరిగింది.

మరో మాటలో చెప్పాలంటే ఈ వ్యవస్థలోని అవినీతి అంతా ప్రైవేటురంగానికి దోచిపెట్టడానికి జరిగిన తతంగమే. ఈ పరిస్థితుల్లోంచే ఈ మధ్యన సుప్రీంకోర్టు అవినీతిపై తీవ్రమైన చర్యలకు ఉపక్రమించింది. కుంభకోణాలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవడమే కాదు, దానికి సంబంధించిన పనులను కూడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలోంచే బొగ్గు కేటాయింపులను నిలిపివేసింది. సహజ వనరులను ప్రైవే టు వ్యక్తులు కాజేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలను జాతివ్యతిరేక చర్యలుగా అభివర్ణించింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే మన పాలకు లు ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేస్తామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రైవేటు రంగానికి అనుకూలమైన విధానాలను అవలంబిస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ విధమైన ప్రైవే టు పెట్టుబడుల అనుకూల విధానంతో దేశ, విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు పాలకులు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.

బ్యాంకింగ్ రంగం చూసినా ఇదే తంతు కనిపిస్తున్నది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు మొం డి బకాయిలుగా తేలినవన్నీ ప్రైవేటు రంగానికి చెందిన బడా కంపెనీలే. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండి యా డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి చెప్పిన ప్రకారం ప్రైవేటు కంపెనీలు జాతీయ బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. 13ఏళ్లుగా బడా కార్పొరేట్ సంస్థలన్నీ రుణాలు చెల్లించకుండా బ్యాంకులు దివాలా తీయడానికి కారణమవుతున్నాయి.

మరోవైపు బ్యాంకింగ్ రంగంలోని లంచగొండుల కారణంగా కూడా బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే కోవలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కథ అందరూ ఎరిగినదే. ఇలా ప్రైవేటు యజమానులు ప్రభుత్వ వ్యవస్థలను అవినీతి మయం చేసి, జాతి సంపదను కొల్లగొట్టిన ఉదంతాలు లెక్కకు మించి ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటురంగం, దాని యజమాన్యాలు వ్యాపారాలు చేస్తే దేశాభివృద్ధిలో భాగస్తులవుతారు. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవ్వాళ్టి రాజకీయ వాతావరణంలో ప్రతిదీ ప్రైవేటీకరణ అంటు న్న పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలు అనేది అర్థంలేని మాట కారాదు. సంస్కరణలన్నీ దేశ, ప్రజా ప్రయోజానాలకు అనుగుణంగా ఉండాలి. దేశీయ ప్రయోజనాలను బలిపెట్టే విధంగా ఉండరాదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నియో లిబరల్ సాంస్కృతిక ఆర్థిక విధానాలు, సంస్కరణల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు కొంతైనా కాపాడబడాలంటే సమా జం చైతన్యవంతంగా హక్కుల కోసం పోరాడాలి. ప్రైవేటు రంగం నిబంధనలకనుగుణంగా నడిచి లాభాల శాతాన్ని కొంత తగ్గించుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే ప్రజల హక్కులకు రక్షణ, సాంఘిక భద్రత ఉంటుందిఅని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. ఆ దిశగా మన పాలకుల అడుగులు, ప్రైవేటురంగం ఆలోచనలు ఉంటాయని ఆశించవచ్చా.


1208

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Featured Articles