హరిత విప్లవం-ఆహార భద్రత


Thu,June 12, 2014 11:43 PM


ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగానే పెరిగాయని చెబుతున్నారు. అయితే..ఈ హరిత విప్ల వం సస్యపరిణామంగా గాకుండా అమలులోకి తీసుకురావడం కారణంగా హరితవిప్లవం ఆహారోత్పత్తులతో పాటు మరి కొన్ని సమస్యలను తీసుకొచ్చింది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సేంద్రీయ ఎరువుల స్థానంలో రసాయన ఎరువుల వాడకం కారణంగా సారవంతమైన భూములు వట్టిపోయాయి. సౌడు భూములయ్యాయి.

అంతేకాదు పర్యారణం సమతుల్యం దెబ్బతిన్నది. కాలుష్యం పెరిగిపోయింది. మరోవైపు కాలుష్య నియంత్రణకు శిలాజ ఇంధనాలకు బదులు జీవ ఇంధనాల వాడకమే పరిష్కారమనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యన పర్యావరణ సమస్యలు, కాలుష్యంతో సతమతమవుతున్న ప్రపంచ పెద్దలు బయో ఫ్యూయల్(జీవ ఇంధనాలు) వాడకాన్ని తీవ్రం చేశారు. దీంతో మనుషుల ఆకలిని తీర్చే ఆహార ధాన్యాలు ఇంజన్‌ల ఆకలిని ఇంధనాల రూపంలో తీరుస్తున్నది. ఈ పరిణామాలను గమనించిన శాస్త్రవేత్తలు జీవ ఇంధనాల వాడకంతో ప్రపంచంలో ఆహార కొరత పెరిగే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు.

మనిషి ఆధునిక జీవనంలో ఇంధనాల వాడకం పెరిగి కార్బన్‌డై ఆక్సైడ్‌ను వాతావరణంలోకి విపరీతంగా విడుదల చేస్తున్నారు. ఈ కాలు ష్యం కూడా ఆహారపంటల ఉత్పత్తిని కుంటుపరుస్తున్నది. అలాగే జీవ ఇంధనాల కారణంగా ఆహారభద్రతకు ముప్పువాటిల్లుతున్నది. మనుషుల ఆకలిని తీర్చాల్సిన గింజలను వాహనాలకు ఇంధనం ఇవ్వడానికి ఉపయోగించడం కారణంగా ఆహారధాన్యాల కొరత ఏర్పడుతున్నది. ఈ పరిస్థితులను గమనించిన ఇటలీ మాజీ ప్రధాని రోమానో ప్రోడి అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ జీవ ఇంధనాల వాడకంపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సూచించారు. ఈ సందర్భంగానే ఐక్యరాజ్యసమితి కూడా బయో ఇంధనాల వాడకంపై ఆందోళనను వెలుబుచ్చింది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి బదులు ఆహారపదార్థాలను ఇంధనంగా వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే వాతావరణ కాలుష్యంతో ఆహారోత్పత్తుల ఉత్పత్తిలో రెండు శాతం తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార అవసరాలు తీరాలంటే.. 14 శాతం పెరగా ల్సి ఉంది. కానీ ఆ స్థాయిలో ఆహారోత్పత్తులు ఉండటం లేదు. దీంతో దేశ దేశాల్లో ప్రజలు ఆకలి బారిన పడుతున్నారు.

మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆసియాదేశాల్లో ఆహార పంటల ఉత్పత్తులను దెబ్బతీశాయి. 2.5 డిగ్రీలు పెరిగిన ఊష్ణోగ్రతలు గోధుమ, జొన్న, మక్కజొన్న తదితర పంటల దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆసియా ఖండంలోని దేశాలన్నీ ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. అంతేగాకుండా.. తీవ్రమైన వాతవరణ సమస్యలు, ప్రక తి వైపరిత్యాలతో తల్లడిల్లుతున్నాయి. అయితే కరువు, కాకుంటే భయానక తుఫానులతో కరువు కోర ల్లో చిక్కుకుంటున్నాయి.

అభివద్ధి చెందుతున్న ఆసియా ఖండ దేశాల్లో తీవ్రమైన ఆహార కొర త ఉన్న ది. దీనికి ప్రధాన కారణం కరువు కాటకాలేనని చెప్పక తప్పదు. ఇలాంటి కరువు పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 30 లక్షల మంది చనిపోతున్నారు. మరోవైపు అభివద్ధి చెందుతున్న ఆసియా దేశాలన్నీ ఆహార దిగుబడుల కోసం అభివద్ధి చెందిన దేశాల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి వ్యవసాయ సమాజాలైన ఆసియా దేశాలు ఆహార కొరతను ఎదుర్కొవడానికి ప్రధా న కారణం అభివద్ధి చెందిన దేశాల పోకడలే ప్రధాన కారణం. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చిన యూరప్‌దేశాల అమానవీయ విధానాలే ఆకలి చావులకు కారణాలని అర్థమవుతున్నది. ఈ ఆకలిచావులకు, కరువు కాటకాలకు మనిషి చేసుకున్న స్వయంకతాపరాధమేనని ప్రక తి ప్రేమికులు, సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరోవైపు భారత దేశంతో సహా ఆసియా ఖండంలోని దేశాలన్నీ నేటికీ వ్యవసాయక దేశాలే. ఈ దేశాలన్నీ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నాయి. రోజుకు 40రూపాయాల ఆదాయం లేనివారు జనాభాలో సగానికి పైగా ఉన్నారు. ఈ స్థితిలో ఆసియా ఖండపు దేశాల్లో జనాభాలో ఎక్కువ శాతం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత 1970లోనే శిలాజ ఇంధనాలకు బయో ఇంధనాల వాడకం, ఆహార ఉత్పత్తుల తగ్గుదల వచ్చే కాలంలో ప్రపంచాన్ని ఆకలిదప్పులు ముంచెత్తుతాయని హెచ్చరించారు. సరిగ్గా ఆయన చెప్పినట్లుగానే నేడు ప్రపంచాన్ని ఆకలి పట్టి పీడిస్తున్నది. నేడు వ్యవసాయ రంగంలో విపరీతంగా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి, పర్యావరణ రక్షణకు పూనుకోవాలి. కానీ ఆదిశగా ఎవరూ ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి బాధ్యతారాహిత్యం నుంచే ఇవ్వాళ.. ఆహారభద్రతకు ముప్పు వచ్చింది.

అంతటా ఆకలిజ్వాల విస్తరిస్తున్నది. ప్రపంచంలో 30 శాతానికి పైగా ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. 30 లక్షల మంది పిల్లలు, మూడుకోట్ల మంది స్త్రీలు ప్రతియేటా పౌష్టికాహారలోపంతో చనిపోతున్నారు.అంతేకాదు ప్రపంచంలోని సగం మంది ప్రజలు ఆర్దాకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు చుక్కలంటుతున్నాయి. గోధుమల ధరలు వందశాతం పెరిగాయి. ఆసియా ఖండంలోని అన్ని దేశల్లో బియ్యం ధరలు రెండు రెట్లు పెరిగాయి. దీంతో ప్రజలకు కొనుగోలు శక్తిలేక అర్ధాకలితో కాలే కడుపులతో కాలం వెల్లబుచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే మూడో ప్రపంచ దేశాల్లో ఆకలి చావులు, ఆత్మహత్యలు, సామాజిక హింస పెరిగిపోయాయి.

ఆసియా అభివద్ధి బ్యాంకు అంచనా ప్రకారం ఆసియా దేశాల్లో సగానికంటే ఎక్కువ మంది ఒక పూట తిండి కోసం తిప్పలు పడుతున్నారు. రోజుకు 40 రూపాయల ఆదాయం లేని వారు జనాభాలో సగానికి మించిపోయారు. అంతేకాదు 40కోట్ల మంది దారిద్య్రరేఖకు అటు ఇటు గా జీవిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే.. ఆయా సమాజాల్లో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా మారుతుంది. ప్రపంచంలో డజనుకు పైగా దేశాలు ఈజిప్టు, హైతీ, కామరూన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా లాంటి దేశాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోంచే అంతర్గత జాతి కలహాలు పెరిగిపోతున్నాయి. టెర్రరిజం పురుడు పోసుకుంటున్నది. ఆహార కొరత, ఆహార సరఫరాల తీరు ఇలా గే ఉంటే.. ప్రపంచంలోని 30కి పైగా దేశాలు తీవ్రమైన అంతరంగిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు రాబర్ట్ బి. జోల్లిక్ హెచ్చరించాడు.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆహార ఉత్పత్తికి తగు చర్యలు తీసుకునే బదులు బయో ఇంధనాల పేరుతో తిండిగింజలను తగలేయడం తీవ్రమైన విషయంగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.మనుషులు ఆకలితో అలమటిస్తుంటే.. విలాసాల కోసం ఆహారాన్ని ఇంధన అవసరాలకు వాడటం సామాజిక నేరమని అంటున్నారు. ఈ పరిస్థితులు మారినప్పుడే ప్రపంచ పురోగతి సాధ్యమంటున్నారు. దేశంలో వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం ఎస్‌స్వామినాథన్ చెప్పిన బాటలో నడిచి ఆహార కొరతను తీర్చడానికి తగు ప్రణాళికలతో ముందుకు పోయినప్పుడే ఆకలిని పారదోల కలుగుతాము. ఈ దిశగా పాలకులు చిత్తశుద్ధితో అడుగులు వేయాలి.

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)


248

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన