నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం


Fri,July 5, 2013 12:45 AM


నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి సంక్లిష్ట సమస్యగా అయ్యి కూర్చున్నది. గ్రామాలు, పట్టణాలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి. గుక్కెడు నీటి కోసం నానా అగచాట్లు పడే పరిస్థితి దాపురించింది. దీంతో దేశవ్యాప్తంగా నీటి సంబంధిత వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. దేశంలో మెజారిటీ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలోని 254 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఇనుప ఖనిజ ఆనవాళ్లు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. ఫ్లోరిన్ కూడా ప్రమాదకరస్థాయిలో 224 జిల్లాల్లో ఉన్నది. ఈ విషతుల్యమైన నీటినే తాగి ఆ ప్రాంత ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏమంటే.. 162 జిల్లాల్లోని తాగునీటిలో ఉండాల్సిన స్థాయిలో కన్నా ఎక్కువ స్థాయిలో ‘లవణ’ ఖనిజాలు ఉన్నాయి. ఈ ఉప్పునీటిని తాగడం అటుంచి పంటలకు కూడా ఉపయోగించలేని పరిస్థితి ఉన్నది. అంతేగాకుండా..34 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘ఆ్సనిక్’ ఉన్నది. రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో భూగర్భ జలాలన్నీ కాలుష్యమయమైపోయాయి.గుజరాత్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 21లోఅత్యంత ప్రమాదకర స్థాయిలో (ఉప్పు) లవణాలున్నాయి.18 జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రమాదస్థాయికి మించి ఉన్నది. కర్నాటక రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 21జిల్లాల్లో భూగర్భ జలాలన్నీ ఇనుప ఖనిజ అవశేషాలతో కాలుష్యమైపోయాయి. 20 జిల్లాలు ఫోరిన్‌తో ఉన్నాయి.

రాజస్థాన్‌లో 30 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో భూగర్భ జలాలన్నీ ఉప్పు మయమైపోయాయి. 20 జిల్లాలు ఇనుప ఖనిజ కాలుష్యంతో ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ ‘సెంవూటల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్’ (సీజీడబ్యూబీ) చెప్పినవే అంటే.. భూగర్భ జలాలు ఎంత తీవ్ర స్థాయిలో కాలుష్యమైపోయాయో ఊహించుకోవలసిందే. విషాదమేమంటే.. దేశరాజధాని ఢిల్లీ కూడా నీటి కాలుష్యంతో తంటాలు పడుతున్నది. ఢిల్లీ పరిసరాల్లోని ఐదు జిల్లాలు ఫ్లోరిన్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరో రెండు జిల్లాలు ఉప్పునీరుతో ఊసురుమంటున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని 12 జిల్లాల్లో ప్రమాదకరస్థాయిలో ఆర్సెనిక్ ఉన్నది. ఇలా దేశం లో ఉపయోగించలేని విధంగా భూగర్భ జలాలు లోహా లు, లవణాలతో కాలుష్యమై ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తుండగా.. పాలకులు అనుసరిస్తున్న విధానాలు కూడా భూగర్భ జలాలను చెరబడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారతదేశం పారిక్షిశామిక అభివృద్ధితో ముందుకుపోతున్న నేపథ్యంలో అంతకు మించి ప్రకృతికి, భూగర్భ జలాలకు చేటు జరుగుతున్నది.

పరిక్షిశమలు విడుదల చేస్తున్న కాలుష్యమయమైన నీరుతో భూ ఉపరితలంలోని నీటితోపాటు భూగర్భ జలాలు కూ డా కాలుష్యమైపోతున్నాయి. పరిక్షిశమలు నిబంధనల ప్రకారం నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటినే విడుదల చేయాలి. కానీ ఏ పరివూశమ కూడా నిబంధనలు పాటించకపోవడంతో.. పరిక్షిశమలన్నీ ప్రకృ తి పాలిట శాపాలైనాయి. దీంతో.. పరిక్షిశమలు విడుదలచేసిన కాలుష్యాలతో భూగర్భ జలాల్లో భారలోహాలతోపాటు విషతుల్యమైన పదార్థాలు చేరుతున్నాయి. అలాగే ప్రమాదకరమైన రంగులు కూడా నీటిలో కలిసిపోతున్నాయి. దీంతో మొక్కల్లో కిరణజ్యసంయోగ క్రియ కూడా జరగని పరిస్థితి వచ్చింది.జంతుజాలం, వృక్షజాతి అంతా నీటి కాలుష్యం తో ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో నగరాల్లోని మున్సిపాలిటీలన్నీ నీటిశుద్ధికే అధిక బడ్జెట్లను కేటాయించాల్సిన పరిస్థితి వస్తున్నది. నీటిశుద్ధికి కేటాయించిన స్థాయిలో ప్రజల నుంచి నీటి పన్నును వసూలు చేయలేక మున్సిపాలిటీలన్నీ అప్పుల ఊబిలో, లోటు బడ్జెట్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో మంచినీటి సమస్య మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉన్నది. దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలు రక్షిత మంచినీరుకోసం నోళ్లు తెరిచి ఆవురావురుమంటున్నాయి.అదే సమయంలో మనిషి సగటు నీటి వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యమయమైన వాతావరణం కారణంగా నీటి వాడకం కూడా ఎక్కువ అయ్యింది. 2000 సంవత్సరంలో సగటు మనిషి నీటి వాడకం 89 లీటర్లు ఉంటే.., నేడది రెండింతలు అయ్యింది. వచ్చే ఇరవై ఏళ్లలో అది167కు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే ఉంటే..రాబోయే కాలంలో మంచినీరు అన్నింటి కన్నా అతి ప్రియం అవుతుందని అంటున్నారు. ఉపయోగయోగ్యమైన భూ ఉపరితల నీరు సుమారు 690 బీసీఎంలు ఉన్నది. భూగర్భ జలాలు 422 బీసీఎంలు ఉన్నవి. ఇందులో పారిక్షిశామిక అవసరాలకు ఉపయోగిస్తున్న నీరు మొత్తం 522 బీసీఎంలనుంచి 750 పెరిగింది. మరో పదేళ్లలో పారిక్షిశామిక అవసరాలకు 1050 బీసీఎంల నీరు అవసరమవుతుంది.అలాగే అవసరాలకు ఉపయోగపడే మంచినీరు 40 శాతమే మిగిలింది.నీటిని శుద్ధి చేయకపోవడం ఫలితంగా దేశంలోని మంచినీటిలో మూడో వంతు వృథా అవుతున్నది. పెద్ద నగరాల్లో మురికి నీరుగా మారుతున్న దానిలో 30 శాతం మాత్రమే తిరిగి శుద్ధి చేస్తున్నారు. దీంతో నీటి వినియోగం పెరిగి నీటి కరువు ఏర్పడుతున్నది.

ప్రతి అవసరానికి భూగర్భ జలాలనే వాడటం మూలం గా భూగర్భ జలాల నీటి మట్టం పాతాళంలోకి పోతున్నది. దీనికి తోడు పారిక్షిశామిక వర్గాలు నీటిని శుద్ధి చేయడం అనేది మరిచిపోయి నిబంధనలకు తూట్లు పొడిచి కాలుష్యానికి కారకులవుతున్నారు. దేశంలో ప్రతిరోజు పరిక్షిశమల నుంచి 60 లక్షల లీటర్ల కాలుష్య నీరును విడుదల అవుతున్నది. ఈ కాలుష్యపు నీరు భూ ఉపరితలంలోని నదులు, కలువలు, చెరువులతో పాటు భూగర్భ జలాలను సైతం కాలుష్యం చేస్తున్నది. దీనికి తోడు దేశంలో నీటిని శుద్ధిచేసే సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో.. నీటిని శుద్ధిచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా మారుతున్నది. ఈ కారణంగా చాలా పారిక్షిశామిక సంస్థలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, నగరాలు, పట్టణాలు నీటిని శుద్ధిచేసే పనిని చేపట్టడం లేదు. దేశ వ్యాప్తంగా రక్షిత మంచినీరు అనేది పెద్ద సమస్య అయ్యింది. దీంతో నీటి సంబంధిత వ్యాధులు స్త్రీలు, పిల్లల్లో ఎక్కువవుతున్నాయి. 88 శాతం చిన్న పిల్లల మరణాలు నీటి కాలుష్యం, సరిపోయినంత రక్షిత మంచినీరు లభించకపోవడమేనని యూనిసెఫ్ అధ్యయనంలో తేలింది. ఏడున్నర కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందుబాటులో లేదు.24 కోట్ల మందికి సరియైన సాని సౌక ర్యం లేదు. దీంతో ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో వాటర్ మేనేజ్‌మెంట్‌పై అనేక అధ్యయనాలు జరిగాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగు సూచనలు చేయవలసిందిగా నిపుణులను కోరుతున్నది. ఈ క్రమంలోనే జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కత్తా ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్ట్ (కేఈఐపీ)చేసిన అధ్యయనాల ప్రకారం ప్రజలు ఇప్పుడు వాడుతున్న నీటివాడకాన్ని తగ్గించుకోని పక్షంలో రాబో యే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడికి గురికావలసి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.ఇప్పుడు దేశంలో ప్రతి వ్యక్తి రోజుకు 55 క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. దీన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరాల్లో నీటివాడకాన్ని, దుర్వినియోగాన్ని తగ్గించాలం టూ, నీటి పొదు పు గురించి ప్రజల్లో చైతన్యం తేవాలని అంటున్నారు. ఇలా బహుముఖాలుగా నీటి వినియోగం పై ప్రత్యేక కార్యక్షికమా న్ని చేపట్టి ప్రజలను చైతన్య పరిస్తే తప్ప వేసవీ కాలంలో నీటి ఎద్దడిని తట్టుకోలేమని అంటున్నారు. భూ ఉపరితలం పై, సహజ వనరుల్లో, భూ గర్భంలోని ఉపయోగపడే నీటికి, వర్షాలతో మళ్లీ భూ ఉపరితలంపై నీటి నిలువలను పెంపొందించే దాంట్లో సమతుల్యత ఉండేట్లు చూడాలి. లేనట్లైతే.. నీటి కరువు ఇలా పెరుగుతూ పోతే.. భవిష్యత్తులో నీరు అన్నింటికన్నా ఎక్కువ ధరతో కొనుక్కోవాల్సివస్తుంది. దేశంలో పెరిగిపోతున్న నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే.. ప్రత్యేక చర్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.

అలాగే వాటర్ మేనేజ్‌మెంట్ పై ప్రజలను చైతన్య పరుస్తూ.. నీటి విలువను తెలియ జేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. మొత్తంగా వాటర్ మేనేజ్‌మెంటు కోసం మొత్తం జాతీయాదాయంలో శాతం శాతం కేటాయిస్తున్నారు. అయినా ఇది ఏ మాత్రం సరిపోని పరిస్థితి ఉన్నది.ఈ పరిస్థితిలో..సాని నీటి సరఫరా, వినియోగంలో నాణ్యత పెంచి, నీటి శుద్ధి కార్యక్షికమాన్ని దేశవ్యాప్తంగా ఒక కార్యక్షికమంగా చేపట్టాలి. 2025 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పారిక్షిశామికీకరణతో జరుగుతున్న నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఈ క్రమంలో వాతావరణ సమ తూకాన్ని రక్షించడానికి ప్రత్యేక కార్యక్షికమాలు చేపట్టాలి. భూగర్భ జలాలను పెంపొందించేందుకు వాటర్ షెడ్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలి. ప్రకృతి సమతుల్యాన్ని విధిగా పాటించాలి. కాలుష్యాన్ని నియంవూతించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.నదులు, చెరువులు కాలుష్యం బారినపడకుండా.. వాటిని రక్షించుకోవాలి. కాలుష్యం కోరల్లో చిక్కి పనికి రాకుండా పోయిన నదులను తిరిగి సహజ స్థితిలోకి తీసుకురావాలి. వ్యవసాయం కోసమైనా.. సహజ వనరులైన నదులు, కాలువలపైనే ఆధారపడేట్లుగా ప్రోత్సహించాలి. భూగర్భ జలవనరులను సంరక్షిస్తూ.. భూమి పొరల్లోని ‘వాటర్ ను కాపాడాలి.

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన