లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం


Sun,May 12, 2013 11:54 PM


విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా లేవు. దేశంలో విద్యా వూపమాణాలు పెంచేందుకు, అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యాహక్కు చట్టం తెస్తున్నామన్న ప్రభుత్వం దాని అమలు పట్ల శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఈ చట్టం ద్వారా దేశంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థు లు- ఉపాధ్యాయుల నిష్పత్తికి పలు మార్గదర్శకాలను సూచించింది. అలాగే.. అందరికీ అందుబాటులోకి విద్యను తెచ్చేందుకు గాను ప్రైవేటు పాఠశాలల్లోనూ 25 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయించాలని సూచించింది. విద్యా వూపమాణాలు, వసతుల కల్పన, పర్యవేక్షణకు గాను ‘స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ’లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ద్వారా సూచించింది. దీనికి సంబంధించి దేశమంతటా తీవ్రమైన చర్చోప చర్చలు జరుగుతున్నాయి. విద్యాహక్కు చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలు, ఆచరణాత్మక సమస్యల గురించి ఉన్న అడ్డంకుల గురించి పలువర్గాలు చర్చిస్తున్నాయి. ఇబ్బందులను ఎత్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం వెనుకబడిన తరగతుల పిల్లలకు సీట్లు రిజర్వ్ చేయాలన్న దాన్ని సవాల్ చేస్తూ ‘ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్’ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దీనిపై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు నిస్తూ..అభ్యంతరాలను తోసిపుచ్చింది. విద్యాహక్కు చట్టంలోని 25 శాతం సీట్లు పేద, వెనుకబడి న వర్గాలకు కేటాయించాలన్నది చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నది.

విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం 2013 నాటికి దేశంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని సూచించింది. ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 ఉండాలని ఆదేశించిం ది. ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఈ నిష్పత్తి 1:35 ఉండాలని సూచించింది. విద్యార్థుల చదువులు సజావుగా సాగాలంటే పాఠశాలల్లో ఆరు మౌలిక వసతులుండాలనీ, కానీ.. ఇవి 2012 నాటికి 8శాతం పాఠశాలల్లో మాత్రమే సమకూర్చారని తేలింది. ఈ మౌలిక వసతుల విషయానికి వస్తే.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతంలోని చాలా రాష్ట్రాలు పాఠశాల మౌలిక వసతుల విషయంలో చాలా వెనుకబడిఉన్నాయి. అలా గే.. ఒడిషా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో మరీ అధ్వాన్నంగా రెండుశాతం ప్రాథమిక పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు లేవు. అలాగే విద్యార్థులు- ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా అసంబద్ధంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలు అథమ స్థాయిలో ఉన్నాయి. ఇవికొంత కాలంగా ఇంకా పడిపోతున్నాయి. బహు శా ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ద్వారా పాఠశాలల్లో వసతుల కల్పనకు ఇచ్చినంత ప్రాధాన్యం విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోనందువల్లనే జరిగి ఉండవచ్చు. ప్రభుత్వాలు విద్యావూపమాణాలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న తరుణంలోనే విద్యార్థుల్లో విద్యా వూపమాణాలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్నది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో కనీస వసతులు లేవన్న విషయాన్ని ఏ ఒక్కరూ కాదనలేరు. చాలా పాఠశాలల్లో తరగ తి గదులు లేక చెట్ల కిందనే చదువులు సాగుతున్నాయి. టాయిపూట్స్, తాగునీరు అసలే లేవు. వీటి గురించి పట్టించుకోవడం ఎంత అత్యవసరంగా భావిస్తున్నా మో.., విద్యా ప్రమాణాలు గురించి పట్టించుకోవాలి. విద్యావ్యవస్థలో మౌలిక వసతుల విషయంలో చాలా అభివృద్ధి జరగాలి. దీనికిగాను విస్తారంగా నిధుల అవసరం ఉన్నది.

విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలకు అనుగుణంగా పఠన, రాత నైపుణ్యాలు చాలినంతగా ఉండాలంటే.. మొదట ఉపాధ్యాయులకు తగినస్థాయిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు ఓ మంచి ఉపాధ్యాయుడు గా రాణిస్తాడు. దీనికి తోడు ఉపాధ్యాయునికి వృత్తిపరమైన నిబద్ధత, విద్యార్థులపట్ల ప్రేమాభిమానాలు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, వెనుకబడిన వర్గా ల విద్యార్థులను సొంత బిడ్డల్లా ప్రేమించినప్పుడే వారికి సరైన పద్ధతిలో విద్యాబోధన చేయగలరు. అయితే.. ఈ వృత్తిపరమైన నిబద్ధత, విద్యార్థులను ప్రేమించడంలో ఉపాధాయులకు సామాజిక స్పృహ కొరవడిన స్థితి కనిపిస్తున్నది. దీని ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కనిష్ఠస్థాయిలో ఉంటున్నాయి. ఉపాధ్యాయులు కేవలం జీతం కోసం పనిచేసే వారుగా ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలల పనితీరు సంతృప్తికరమైన ఫలితాలు ఆశించలేము. కాబట్టి ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ, నిబద్ధత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకోవాలి. దీనికితోడు పాఠశాలల నిర్వహణకు సంబంధించి కొంత స్వయం ప్రతిపత్తి కూడా అవసరం. ఉదాహరణకు స్కూలు మేనేజ్‌మెంటు కమిటీలు (ఎస్‌ఎంసీ) స్వయం ప్రతిపత్తితో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పనిచేస్తే.. విద్యా ప్రమాణాలు పెరిగేందుకు తోడ్పడతాయి. కానీ వీటికి ఏ విధమైన అధికారాలు లేక నామమావూతంగానే మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం నామ మా త్రంగా వచ్చే 15-20 వేల నిధులను ఖర్చుచేసే అధికారం మాత్రమే పాఠశాల నిర్వహణ కమిటీలకు ఉన్నది. నిజానికి ఈ నిధులు పాఠశాలల అవసరాలను దృషిలో పెట్టుకుంటే ఏమూలకూ సరిపోవు. అలాగే ఈ కమిటీలకు విద్యాపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు, అవకాశం లేదు. కనీసం విద్యావూపమాణాలు పెంచేందుకు నియమించే విద్యా వాలంటీర్ల నియామకాలు వీరి చేతుల్లో లేవు. విద్యాబోధనలో విధులు సరిగా నిర్వహించని వారిని ప్రశ్నించడం, తొలగించడం లాంటి హక్కులేమీ వీరికి లేవు. కాబట్టి పాఠశాలల్లో విద్యావూపమాణాల్లో గుణాత్మక మార్పులు కనిపించడం లేదు. ఈ కమిటీలకు కొన్ని హక్కులు, బాధ్యతలు అప్పగించినప్పుడు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలున్నాయి.

అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో 70-75 శాతం పాఠశాలల్లో అవసరమైన సం ఖ్యలో ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయ నియామకాలకు నిధుల కొరత సాకు చూపుతూ అంతటా టీచర్ల నియామకాలను నిలిపేశారు. దీంతో సర్వత్రా టీచర్ల కొరతతో పాఠశాలలు సతమతమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాలకు బదులుగా కాంట్రాక్టు పద్ధతిలో స్థానిక యువతనే ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితులు దూరమయ్యాయి.అయితే ఆ కాంట్రాక్టు టీచర్ల నియామకాలు పాఠశాల నిర్వహణ కమిటీలకు ఇచ్చినట్లయితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అప్పు డు విద్యావూపమాణాలు పెరిగేందుకు వారే బాధ్యులుగా ఉండక తప్పదు.ఈనేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెరిగేందుకు అవకాశాలున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో తల్లిదంవూడుల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించే సంస్కృతి పెరిగింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల్లో మూడు శాతానికి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పడిపోయింది. ప్రాథమిక విద్యాస్థాయిలో ఉపాధ్యాయుల వృత్తినైపుణ్యాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకున్నా.. వారు నిరంతర పర్యవేక్షణ, నిర్బంధ పూర్వక పని విధానం ద్వారా ఫలితాలు రాబడుతున్నారు. ఇవి విద్యా ప్రమాణాలకు చేటుచేసేవే అయినా.. విద్యార్థుల తల్లిదంవూడులు ప్రైవేటు పాఠశాలలవైపే చూసే పరిస్థితి వచ్చింది.

సామాజిక అవసరాలను తీర్చే స్థాయిలో ప్రభు త్వ విద్యావ్యవస్థ లేకుంటే.., ప్రైవేటు పాఠశాలల భాగస్వామ్యంతో సామాజిక విద్యావసరాలను తీర్చవచ్చు. కానీ వీటి నిర్వహణపై ప్రభుత్వ అజ మాయిషీ నిరంతరం ఉండాలి. కేవలం 25 శాతం పేద విద్యార్థులకు ప్రవేశం ఇవ్వడం, ఇవ్వకపోవడంతోనే పాఠశాల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదు. అలాంటప్పుడు వెనుకబడిన పేద వర్గాల విద్యార్థులను 25 శాతం ప్రైవేటు పాఠశాలలు తీసుకున్నప్పుడు వాటికి తగిన రీతిలో ఆర్థిక సాయంకూడా ప్రభుత్వం నుంచి అందాలి. లేనట్లయతే.. ప్రైవేటు పాఠశాలలు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి పాఠశాలలు మూతపడే పరిస్థితులు వస్తాయి. గుజరాత్ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తున్నది. విద్యావిషయక ఫలితాలను ఆధారంగా వాటికి నిధులు అందజేస్తూ వాటికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇలాంటిదే కాకపోయినా.. ఏదో రూపంలో ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అండగా నిలిచి మంచి ఫలితాలను సాధిస్తే బాటుంటుంది. సామాజిక అవసరాలు తీరుతాయి. ప్రభు త్వం విద్యా వూపమాణాలను పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల నుంచి తదనుగుణమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. దీనికి సంబంధించి పాలకులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంయుక్తంగా సామాజిక నిబద్ధతతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలు మెరుగవుతాయి.

-ధూర్జటి ముఖర్జీ
ఇండియా న్యూస్ ఫీచర్ అలయెన్స్

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన