నరకవూపాయమవుతున్న నగరీకరణ


Sun,April 28, 2013 11:44 PM

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మునుపెన్నడూ లేనంతగా ఒక పెద్ద సవాల్‌గా మారింది. గ్రామీ ణ ప్రాంతాల నుంచి బతుకు దెరువు కోసం నగరాలకు వచ్చి చేరుతున్న ప్రజల తాకిడితో నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురికివాడలు వెలిసి నగర జీవితాన్ని మురికి మయం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నీ గ్రామీణ వలస తాకిడితో సతమతమవుతున్నాయి.మెకెన్సీ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం భారత నగరాలు ఈగ్రామీణ వలసలతో.. పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నాయి.గత దశాబ్దకాలంగా వేగంగా జరుగుతున్న నగరీకరణ కారణం గా.. నగర జీవితం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది.

గత పదేళ్ల కాలంలో... దేశంలోని 35 నగరాలు..కోటి జనాభా గల మహా నగరాలుగా పెరిగిపోయి అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామీణ వలసలతో జరుగుతు న్న నగరీకరణ నగరవాసులకు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నది. అలాగే నగరాల్లో, నగర పరిసర ప్రాంతాల్లో మురికివాడలు (స్లమ్‌లు) విపరీతంగా పెరిగిపోతున్నాయి. నగరాల్లో గత దశాబ్దకాలంలో 30 శాతం జనాభా పెరుగుదల నమోదు అయింది. నగరాల్లో 35నుంచి 40 శాతం ట్రాఫిక్ సమస్య పెరిగి నగర జీవితం నరకవూపాయమైయింది. నగరాల్లో ప్రతి ఒక్కరికీ నివాసానికి గాను అందుబాటులో ఉన్న 2000 వేల చదరపు అడుగుల స్థలం గణనీయంగా తగ్గిపోయి 80చదరపు అడుగులకు తగ్గిపోయింది. దీంతో.. మురికివాడలు కనీస సౌకర్యా లు లేక సకల సమస్యలతో సతమతమవుతున్నాయి. మురికివాడల్లో నివసించే జనాలు నివాసయోగ్యం కాని పరిస్థితుల్లో దుర్భర పరిస్థితుల్లో జీవనం వెల్లదీస్తున్నారు.

జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాలన్నీ మురికివాడల సమస్యల సుడిగుండంలో చిక్కిఉన్నాయి. 2001నుంచి 2011 నాటికి వచ్చేనాటికి నగరాల జనాభా వృద్ధిరేటు 36 శాతం పెరిగింది. దేశంలో నగర జనాభాలో 7.89 కోట్లలో.. 1.37 కోట్ల మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే..దేశంలో అత్యధికంగా ఆంధ్రవూపదేశ్‌లోనే అత్యధికంగా 35.7శాతం మం ది మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానాల్లో మధ్యవూపదేశ్-28.3శాతం, మహారాష్ట్ర-28.3,బెంగాల్‌లో 21.9 శాతం మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు.

జనాభా లెక్కల అధికారుల అధ్యయనం ప్రకారం మురికివాడల్లో నివాస యోగ్యం కాని ప్రదేశాల్లో లక్షలాది మంది పేద లు నివసిస్తున్నారని తెలిపారు.మురికివాడల్లో విపరీతమైన జనసాంవూదత కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ఇరుకు సందులు, మురికి కాల్వల నిర్మాణం లేకపోవడం, గజిబిజి నిర్మాణాలు, ఒక పద్ధతి, ప్రణాళికలేని కట్టడాలతో గాలి, వెలుతురులేని పరిస్థితుల్లో మురికివాడలన్నీ.. దుర్భరమైన జీవన పరిస్థితులకు సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. మురికివాడలన్నీ మాన వ ఆవాసానికి ఏమాత్రం పనికిరాని పరిస్థితుల తో.. సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. దీని కి తోడు మురికి వాడలు నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.


సగటు మనిషికి తాగడాని కి కూడా నీరు లభించని స్థితి ఉన్నది. నగరాల్లో ధనవంతుల కాలనీల్లో నీటిని వృధా చేస్తుంటే.., మురికివాడలు గుక్కెడు నీరు కోసం గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఉన్నది. ఇక సాని గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదియగామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలన్నీ సాని సమస్యను తీవ్రం గా ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏజెన్సీలు నీటి సరఫరా విషయంలో, తాగునీరు కల్పన విషయంలో చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నా.. అనుకు న్న ఫలితాలు లేవు. మెజారిటీ ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు.

నగరాలు, మున్సిపాలిటీలలో ప్రభుత్వం గుర్తించిన మురికవాడల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా.. సమస్య పరిష్కారం మాత్రం అడుగు కూడా కదలలేదు. ప్రజల అవసరాల కనుగుణంగా, డిమాండ్ కనుగుణంగా కావలసిన వసతులు, వనరుల కల్పన విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.దీంతోనే నగరాలన్నీ సమస్యల నిలయాలుగా మారాయి.నగరాల్లో ఆటస్థాలాలన్నీ మాయం అవుతున్నాయి. పార్కు లు, రిక్రియేషన్ క్లబ్బులు అందుబాటులో లేకుండా అవుతున్నాయి. దీంతో.. నగరజీవితం నరక ప్రాయ మై.. నగరానికి వెలుపల నివాసాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.నగరీకరణ కారణంగా మౌలిక వసతు లు, అవసరాలకు ఏర్పడుతున్న సమస్యలు ఎలా ఉన్నా, సామాజికంగా దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.నగరాలకు పోటెత్తుతున్న గ్రామీణులతో నిరుద్యోగం పెరిగిపోయింది.

జనసమ్మర్ధం పెరిగిపోయి సామాజిక అశాంతి చోటుచేసుకుంటున్నది. అసాంఘిక, నేర సావూమాజ్యాలు పెరిగి హింసాత్మక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సామాజిక హింసా దౌర్జన్యాలు పెరిగి అభద్రత చోటుచేసుకుంటున్నది. నగర జీవితం భద్రత లేని బతుకు అయ్యింది.

దేశవ్యాప్తంగా నగరీకరణ ఫలితంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పేదలకు, మురికివాడల వాసులకు గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏడబ్ల్యూ)ను ప్రారంభించి ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నది. పర్యావరణానికి హాని చేయని పరికరాలతో.. తక్కువ ఖర్చుతో పేదల ఇళ్ల నిర్మాణానికి పథకాలు రచించింది. నగర పరిసరాల్లో వెలసిన మురికివాడలతోపాటు ప్రభుత్వ భూముల్లో, రోడ్లపైన నివసిస్తున్న లక్షలాది పేదలకు నివాసాలు సమకూర్చే పని ఎప్పటికి పూర్తయ్యేనో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉన్నది.


ఇదిలా ఉంటే..నగరాల్లో లక్షలాదిగా ఉన్న నిలువ నీడలేని పేదలకు ఆవాసా లు ఏర్పర్చాలంటే.. ప్రభుత్వానికి భూమి సమస్య ముందుకు వస్తున్నది. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే.. భూమి కొరత తీవ్రంగా ఉన్నది. అలాగే.. ఫుట్‌పాత్‌లపై జీవిస్తూ..వాటిపైనే జీవనాధారం కోసం అనేక చిన్నా చితకా పను లు, వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న లక్షలాది మంది పేదలకు నివాసాలు ఏర్పర్చడమే ఒక సమస్య అయితే.., వారికి జీవనోపాధి కల్పించడం అంతకన్నా పెద్ద సమస్య. దీన్ని అదిగమించడం కోసం వారి నివాస సమూహాల దగ్గరలోనే జీవన వృత్తులను కొనసాగించేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తున్నారు. అయినా..ఇవన్నీ అనుకున్న ఫలితాలు సాధించిన దాఖలాలు కనిపించడం లేదు.

నగరాలు, నగరాల్లోనే పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే.పభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంతోపాటు.. దీర్ఘకాలిక ప్రణాళికతో కృషి చేయాలి. దీనిలో భాగంగా పాలకులు ప్రధానంగా ఆరు పనులను చేయాల్సి ఉంటుంది.

అందులో మొదటిది- అనధికారికంగా వెలసిన మురికి వాడలన్నింటినీ క్రమబద్ధీకరించాలి. క్రమబద్ధీకరించడం సాధ్యం కాని స్థితిలో.. మురికివాడలోని పేదలకు జీవినోపాధి కల్పించడంతోపాటు.. నివాసాల ఏర్పాటుకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రెండు-మురికివాడలను అభివృద్ధి చేస్తూ.. అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. మూడు- మురికి వాడల్లోని ప్రజలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించే పనులకు పూనుకోకుండా.. వారికి ఆవాస, జీవనోపాధిలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి ఆవాస ప్రాంతాలకు కావలసిన వసతుల కల్పనకు కృషి చేయాలి. నాలుగు- ప్రతి ఒక్కరికీ ఆవాస హక్కు ఉన్నదనే స్ఫృహతో నగరాల్లోని పేదలకు ఆవాసాలు ఏర్పాటు చేయాలి. అయిదు-నీరే జీవితం, సాని అనేది ఆత్మగౌరవ సమస్యగా చూసి వాటి కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలి.

ఆరు-ఫుట్‌పాత్‌లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జ్‌లు నివాసాలుగా చేసుకుని బతుకుతున్న పేదలకు అందుబాటులో ఉండే విధంగా.. మరుగుదొడ్లు,స్నానపు గదులు తదిర సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి సౌకర్యాలన్నీ.. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వెంటనే ఏర్పాటు చేయాలి. మౌలికమైన కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే నగర జీవితం భద్రంగా, శుభ్రంగా ఉంటుంది. దీనికోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కృషి చేయాలి. ఇలా సమాజంలోని అన్ని వర్గాలు, సెక్షన్ల ప్రజల సహకారంతోనే..నగరీకరణ సమస్యలను పారదోలగలుగుతాం. శాస్త్రీయమైన సూత్రబద్ధ ప్రణాళికతో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే.. నగరాలు సుందరంగా ఉండవు. నగరాలు నరకప్రాయంగా ఉంటాయి.
-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Featured Articles