వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు


Thu,April 11, 2013 11:33 PM


ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) చేసిన అధ్యయనం, అంచనాలో కూడా వెనుకబడిన రాష్ట్రాలన్నీ అభివృద్ధిబాటపట్టాయి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 2012-13 అధ్యయనం ప్రకారం మధ్యవూపదేశ్ అభివృద్ధి పరుగులో బీహార్‌ను వెనకబడేసింది. స్థూల తలసరి ఉత్పత్తిలో కూడా బీహార్‌ను అధిగమించింది. 2008-09నుంచి బీహార్ వృద్ధిరేటు 12 శాతంగా ఉండింది. ఈవిధమైన వృద్ధిరేటు 2011-12నాటికి గరిష ్ఠస్థాయికి చేరుకుని 13.26 శాతానికి చేరుకున్నది. అయితే గత కొంతకాలంగా మందగమనంలో ఉన్న బీహార్‌లో వృద్ధిరేటు తగ్గిపోతున్నది. ఇది చివరికి బీహార్‌లో 9.48 గా ఉంటే.. మధ్యవూపదేశ్‌లో పదిశాతం వృద్ధిరేటు నమోదై దూసుకుపోతున్నది. అయితే..ఈ మధ్య జరిగిన పరిణామాలు పరిశీలించినట్లైతే.. ఇప్పటిదాకా వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న రాష్ట్రాల వృద్ధిరేటుకు సంబంధించిన గణాంకాలు అందిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి వృద్ధిగణాంకాలు రావలసి ఉన్నది. ఇవి అందితే గానీ.. ఏ రాష్ట్రం ఏ స్థితిలో ఉన్నదో తెలుస్తుంది.

బీహార్‌కు సంబంధించినంత వరకు అది సాధించిన అభివృద్ధిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. ఎవరూ ఊహించని విధంగా వృద్ధిరేటుతో మందుకుపోయిం ది. దాని జీడీపీకి 13,679 కోట్ల రూపాయలను చేర్చింది. ఆర్థిక వ్యవస్థను కూడా 144,278 కోట్లు ఉన్న దాన్ని 2011-12నాటికి 157, 957 కోట్లకు చేర్చింది. ఇదిలా ఉంటే.. మధ్యవూపదేశ్ కూడా ఇంతకంటే ఎక్కువగా 20 వేల కోట్ల రూపాయలను గత సంవత్సరంలోనే అధికంగా ఆర్థిక ప్రణాళికలో చేర్చగలిగింది. అలా గే జీడీపీలో కూడా గణనీయమైన వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. అయితే.. తలసరి ఆదాయం విషయంలో బీహార్ చాలా రాష్ట్రాల కన్నా వెనుకబ డి ఉన్నది. 2012-13లో కూడా తలసరి ఆదాయం 1009 రూపాయలు మాత్రమే ఉన్నది. జార్ఖండ్, మధ్యవూపదేశ్‌లో కూడా బీహార్ కన్నా ఎక్కువ రెండువేలుగా తలసరి ఆదాయం ఉన్నది. ఎన్నో ఒడిదొడుకు లు,అవాంతరాల మధ్యనే ఒడిషా తలసరి ఆదా యం 1450గా సాధించింది. ఈ అర్థంలో చూసినట్లయితే..జార్ఖండ్, మధ్యవూపదేశ్, ఒడిషా రాష్ట్రా ల కన్నా బీహార్‌లో తలసరి ఆదా యం తక్కువగా ఉన్నది. ఈవిధమైన గణాంకాలు చెబుతున్నదేమంటే..ఈమధ్య వెనుకబడిన రాష్ట్రాలు అన్నీ అభివృద్ధిబాటను పట్టాయి. ఇంకా రాబోయే కాలంలో ఈరాష్ట్రాలన్నీ ఊహించని విధంగాఅభివృద్ధి చెందడానికి అవకాశాలున్నా యి.

దీన్నిబట్టి ఒకప్పుడు అభివృద్ధి విషయంలో జబ్బుపడ్డ రాష్ట్రాలుగా చెప్పుకున్న రాష్ట్రాలన్నీ.. నేడు వెలుగు బాటలు పడుతున్నట్లు తెలుస్తున్నది. బీహార్, మధ్యవూపదేశ్,రాజస్థాన్, ఉత్తరవూపదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి విషయంలో కుంటుపడిన రాష్ట్రాలుగా చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య జాతీయ అభివృద్ధి మండలి చేసిన సర్వే ప్రకారం ఈ జబ్బుపడిన రాష్ట్రాలన్నీ వృద్ధిబాటలో పరుగులు తీస్తున్నాయి. అయితే.. ఈ అభివృద్ధికి ఒకటే ప్రధాన కారణం. ఒక రాజస్థాన్ మినహా మిగతా రాష్ట్రాల్లో కొత్తగా పాక్షిక హరిత విప్లవమే కారణం. దీంతో.. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ లాంటి రాష్ట్రా ల్లో వ్యవసాయోత్పుత్తులు బాగా పెరిగాయి. రైతులంతా అధికోత్పత్తులను సాధిం చి వృద్ధిని సాధించారు. మధ్యవూపదేశ్‌నే చూస్తే.. 2011-12లో వ్యవసాయంలో 18 శాతం వృద్ధిరేటును సాధించారు. ఇప్పుడు దేశంలో అతి ఎక్కువ గోదుమలు పండించే రాష్ట్రంగా అగ్రభాగాన ఉన్నది. అలాగే బీహార్, ఉత్తరవూపదేశ్‌లు కూడా వ్యవసాయోత్పత్తిలో 15 శాతం వృద్ధిని సాధించాయి. అలాగే ఈ మధ్యన దేశంలో వ్యవసాయ రంగంపై పెట్టుబడులు పెరుగుతున్న తీరును గమనిస్తే.., వ్యవసాయ రంగం మంచి అభివృద్ధిబాట పట్టినట్లుగా చెప్పవచ్చు. ఉత్తర భారత రాష్ట్రాలల్లో హరిత విప్లవానికి గాను కేటాయించిన నిధులు, చేపట్టిన చర్యలు మిగతారాష్ట్రాల్లో కూడా వ్యవసాయం వృద్ధిచెందడానికి కారణమవుతున్నది. గతంతో పోల్చితే.. వ్యవసాయరంగంలో పెట్టుబడులు పెరుగుతున్నా.., ఇంకా వెయ్య కోట్ల దాకా అవసరం ఉన్నది. ఇవి కూడా వ్యవసాయరంగానికి అందుబాటులోకి వస్తే.. వ్యవసాయోత్పత్తులు పెరిగి దేశమే అభివృద్ధిబాటలో పయనించడానికి వీలవుతుంది. ఈ పరిస్థితుల్లోనే బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాష్ట్రాలన్నీ.. తమ ప్రణాళికల్లో వ్యవసాయ ప్రణాళిక పెట్టుబడులను గణనీయంగా పెంచారు. దీనికితోడు కేంద్రం నుంచి కూడా నిధులు అందే పరిస్థితులు ఉంటే.. ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చు. రాష్ట్రాలన్నీ అభివృద్ధిబాటలో పయనించవచ్చు. దీంతో మౌలిక వనరుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చి విద్యుచ్చక్తి, రోడ్లు తదితరాలను అందరికీ అందుబాటులో తీసుకురావచ్చు. ఇందుకు గాను రాష్ట్రాలకు తోడుగా కేంద్రం కూడా తగిన విధంగా స్పందిస్తే.. రాష్ట్రాలన్నీ పరుగు పరుగున అభిదృద్ధి చెందుతాయి. అలాగే.. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎం)ను అభివృద్ధి చేసి గ్రామ గ్రామాన బ్రాడ్ బ్యాం డ్‌ను అందుబాటులోకి తేవాలి. దేశంలోని అన్ని గ్రామాలను అనుసంధానం చేయాలి.

వ్యవసాయరంగంలో వచ్చిన అభివృద్ధితో రాష్ట్రాలు ముందుకు పోతుంటే.. మరో వైపు ఈ రాష్ట్రాల్లో పారిక్షిశామికాభివృద్ధికూడా చెప్పుకో తగ్గ రీతిలో పురోగమిస్తున్నది. ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాలు కూడా పారిక్షిశామికాభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పరిక్షిశమల అభివృద్ధికి, ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను, భూమిని ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చి పారిక్షిశామిక ప్రాంతాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించింది.
రాష్ట్రాలన్నీ అభివృద్ధిబాటలో వ్యవసాయం కేంద్రంగా వృద్ధిని సాధించి అభివృద్ధిబాటలో పయనిస్తుంటే.. వీటికితోడు తగిన నిధులు అందుబాటులో ఉం పారిక్షిశామికంగా కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తాయి. అయితే అందుబాటులో ఉన్న నిధులన్నీ సద్వినియోగం అవుతున్నాయా అన్నది కూడా సమస్యే. ఉన్న నిధులనైనా సక్రమంగా ఉపయోగిస్తే.. ఆశించిన మేర అభివృద్ధి సాధించవచ్చు. అయితే.. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన అవరోధంగా అప్పులు తయారయ్యా యి. బెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి.. తీవ్రమైన సమస్యపూదుర్కొంటున్నాయి. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం 2012-13లో చాలా రాష్ట్రాలు చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమబెంగాల్ అయితే.. అత్యధిక అప్పుతో చెల్లింపులు చేయలేని పరిస్థితిలో ఉన్నది. గుజరాత్, కేరళ, బెంగాల్, పంజా బ్ కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నా యి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ 27.2 శాతం ఐపీ-ఆర్‌ఆర్ నిష్పత్తి కలిగి ఉండగా..,ఛత్తీస్‌గఢ్ అత్యల్ప ఐపీ-ఆర్‌ఆర్ శాతం కలిగిఉన్నది.

ఎక్కడైనా.. అప్పులు వృద్ధిబాటను అడ్డుకుంటాయి. దీంతో.. ప్రధానంగా గ్రామాలు, పేదలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. పశ్చిమబెంగాల్ 2.26 లక్షల కోట్ల అప్పులకు గాను 24వేల కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లించాలి. ఈ అప్పులన్నీ కేంద్ర నిధులు, తాత్కాలిక సాయాలు కాకుండా బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పులు. దీంతో బెంగాల్‌లో ఉద్యోగుల నెల జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నది. ఆతర్వాత కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అప్పుల కారణంగా ఉద్యోగులకు జీత భత్యాలను కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుల కారణంగా చెల్లింపులు చేయలేని స్థితిలోఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి సత్వర సమస్యలను పరిష్కరించాలి. మమతా బెనర్జీ చెబుతున్నట్లుగా గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చిన అప్పుల కారణంగా ఇప్పుటి ప్రభుత్వం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నదని విమర్శిస్తున్నారు. లెఫ్ట్ ప్రభుత్వం చేసిన అప్పులే తనకు గుదిబండగా తయారయ్యాయని అంటూ.., వీటిని కేంద్రం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న కేరళ, పంజాబ్ రాష్ట్రాలను కూడా కేంద్రం ఆదుకోవాలి. అప్పుల బాధతో సమస్యలనెదుర్కొంటున్న రాష్ట్రాలను గట్టెక్కించటం కోసం కేంద్రమే ఆలోచించాలి. తగు విధంగా సాయం చేసి అవసరమైన కార్యాచరణను ప్రకటించాలి. రాష్ట్రాలను సమస్యల నుంచి గట్టెకించి దేశాన్ని అభివృద్ధిబాటలో తీసుకుపోవాలి.

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Featured Articles