పన్నులు సమస్యలను తీరుస్తాయా?


Sat,February 16, 2013 05:40 PM

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గుతున్న తరుణంలో దీనిని పూడ్చడానికి చివరికి చిదంబరం కఠిన నిర్ణయమే తీసుకున్నారు. వనరులు పెంచేందుకు ధనరాసులు పోగేసుకున్న కుబేరులంతా ఎక్కువ టాక్స్‌లు చెల్లించి దేశాన్ని గట్టెంకించాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలు కొనసాగించాలంటే.. ధనవంతులు టాక్స్‌లు ఎక్కువ కట్టి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అలాగే పేదలకు ఇస్తున్న రాయితీలు ఇంకా కొనసాగాలన్నా, సబ్సిడీలు ఉండాలన్నా ధనవంతులు టాక్స్‌లు ఎక్కువ కట్టక తప్పదని చెప్పుకొచ్చారు. దీనికంటే ముందు కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘమైన కసరత్తే జరిగినట్లు కనిపిస్తున్నది. అయితే దీనికంటే ముందు గత దశాబ్దకాలంగా కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వాటి ఫలితాలను సమీక్షించకుండా రాత్రికి రాత్రి ఆర్థిక వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయాలని చూస్తున్నారు.

బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థల అనుకూల ఆర్థిక విధానాలను అవలంభిస్తూనే.. ప్రజానుకూల విధానాలను కొనసాగించాలని తంటాలు పడుతున్నారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ బడా కంపెనీలకు బాసటగా నిలిచిన పాలకులు , ఇప్పుడు అదే పేదలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని సకల సహజ వన రులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పి, లాభాలు పోగేసుకునేందుకు విధాన పరంగా ప్రోత్సహిస్తున్న పాలకులకు ఇప్పుడు హటాత్తుగా ప్రజలు గుర్తుకు వచ్చారు. బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల సమయం దగ్గరకు తరుముకొస్తున్న కొద్దీ పాలకులకు ప్రజలపై ప్రేమ పుట్టుకొస్తున్నది. ఏ సాము గారడీలు చేసి అయినా ప్రజలను ప్ర సన్నం దీంతో దేశంలోని ధనవంతులు, కుబేరులు ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే.. దీంతో జాతీయంగా, అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగుతున్నది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆశిస్తున్న పాలకులు టాక్స్‌లు ఎక్కువ కట్టాలనే దాని ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోత్పత్తికి అనుగుణంగా టాక్స్ విధానం ఉండాలన్న దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రంగా చర్చ జరుగుతున్నది. మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. బడ్జెట్‌లో ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. ధనవంతులు, అత్యంత ధనవంతులు అన్న దానిలో స్పష్టమైన విభజన రేఖలు లేకుండా అందరినీ ఒకే గాటన కట్టి టాక్స్‌ల భారాన్ని మోపడం సముచితం కాదని కొన్ని వ్యాపార వర్గాలు వాదిస్తున్నాయి. అలాగే ధనిక వర్గాలు తమ సంపాదనలో టాక్స్‌ల రూపంలో చెల్లిస్తున్న దానిలోనే అవక తవకలకు తెరలేపినట్లు అవుతుందని మరి కొందరు భావిస్తున్నారు. ఇప్పుడున్న నియమ, నిబంధనల ప్రకారం తమ సంపాదనలో హేతుబద్ధంగా చెల్లిస్తున్న టాక్స్‌లకు మరింత పెంచితే ఆభారాన్ని ఎలా మోస్తారని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి 30 లక్షలు సంపాదిస్తున్న వాడు, 60 లక్షలు సంపాదిస్తున్న వారు ఒకే విధంగా టాక్స్‌లు చెల్లించాలనడం ఏ విధంగా సమంజసమని అడుగుతున్నారు. పేదల సబ్సిడీలకు గాను కుబేరులు ఎక్కువ పన్నులు చెల్లించాలని అనడంలో ఔచిత్యం ఉన్నా.. దానిని ఎలా నిర్ణయిస్తారు? దానికి ప్రమాణాలు ఏమిటనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే కార్పొరేట్ వ్యాపారస్తులు తమ ఆస్తులు పెంచుకునేందుకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. కానీ తాము వ్యాపారం చేసి ధనం సంపాదించి పేదలకు పంచిపెట్టడానికి ఇష్టపడతారా? తమ సంపాదనలో కొంత భాగం పంచి పెట్టడానికి సిద్ధమవుతారా? అనేది ఆలోచించాల్సిన విషయాలే. ఇది అంతిమంగా జాతీయోత్పత్తి, పెట్టుబడులు, అభివృద్ధిపై తిరోగమన ప్రభావాన్ని చూపుతుందా? అన్నది ఆలోచించాలని అంటున్నారు. అలాగే సోమరి తనాన్ని పెంచి పోషించదా అని ప్రశ్నిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతమున్న 5.3 ద్రవ్యలోటును తగ్గించేందుకు ప్రణాళికా వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. ఇది వచ్చే బడ్జెట్ నుంచి అమలులోకి వచ్చి ప్రభావం చూపబోతున్నది. బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్న తరుణంలో సబ్సిడీలు తగ్గించే ప్రక్రియకు పూనుకోవడానికి బదులు కుబేరులకు పన్నులు పెంచాలనే నిర్ణయం చేయడం రాజకీయ నిర్ణయంగా విమర్శిస్తున్నారు. ధనంవంతుల్లో కూడా రెండు మూడు రకాలుగా విభజన చేసి దానికనుగుణంగా పన్నులు రూపొందించాలని అంటున్నారు. 50 లక్షల నుంచి కోటి రూపాయలు, కోటికి పైన ఆదాయం గల వారు అనే విభాగాలుగా విభజన చేసి టాక్సేషన్ విధానాన్ని రూపొందించాలని అంటున్నా రు. గతాన్ని చూస్తే ప్రస్తుత ఆర్థిక మంత్రి కంటే ముందు 1997 నుంచి ఇప్పటి దాకా ఒకే విధమైన టాక్స్ విధానాన్ని అమలు చేశారు. నాలుగు ప్రభుత్వాలు, ముగ్గురు ఆర్థిక మంత్రులు మారినా పన్నుల విధానం స్థిరంగా అలాగే ఉన్నది. వ్యక్తిగత ఆస్తి పన్ను విధానంలో తగ్గింపులు చేసి రాయితీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా టాక్స్ లు పెంచాలని నిర్ణయిండం ప్రతికూల ఫలితాలు ఇస్తాయనే భయాలు ఉన్నాయి.

ఒకానొక అధ్యయనం ప్రకారం దేశంలో 10 లక్షల 80 వేల మంది మాత్రమే 45 లక్షల కంటే ఎక్కువ సంవత్సరాదాయం కలిగి ఉన్నారు. అదే సందర్భంలో 47 కోట్ల మంది 5 నుంచి 20 లక్షల సంవత్సరాదాయం కలిగి ఉన్నారు. దేశంలోని పెద్ద రైతులు, ధనిక భూస్వాములకు టాక్స్ లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరి మీద పన్నులు వేయాలి? ఎవరి మీద అధిక భారం మోపాలన్న దాంట్లో హేతుబద్ధత కనిపించడం లేదు. అలాగే డాక్టర్లు, వృత్తి నైపుణ్యం కలవారు ఎంతో మంది లెక్కకు మించి నాలు గు చేతులా సంపాదించి కోటీశ్వరులవుతున్నారు. ఆర్జిస్తున్న ఆదాయాలను తక్కువగా చూపి పన్నుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇంకా కంపెనీ ప్రమోటర్లు, మరి ఇతర నైపుణ్య నిపుణులు ఆదాయ పన్నుల నుంచి తప్పుడు లెక్కలతో పన్నులు ఎగవేస్తూ డెవిడెంట్లు పొందుతున్నారు.

ప్రస్థుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా చిన్న, మధ్య తరగతి వ్యాపారులంతా దివాలా బాటలో పయనిస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్ మొదలు యూరప్ దేశాలన్నీ ఈ సంక్షోభాన్ని నిలువరించేందుకు తంటలు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఏకంగా ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు తంటలుపడుతున్నాడు. బేల్ అవుట్‌లతో రక్షించేందుకు పూనుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే చిదంబరం ఏటికి ఎదురీదుతూ తీసుకున్న నిర్ణయం ఏ ఫలితాలు ఇస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. మన దేశంలో టాక్స్ టూ జీడీపీ నిష్పత్తి 17 శాతం కంటె తక్కువగా ఉన్నది. నార్వేలో 41 శాతం, జర్మనీలో 37, ఇంగ్లాడ్‌లో 34, అమెరికాలో 24 శాతం ఉన్నది. అదే చైనాలో 17.5 శాతం ఉన్నది. ఏ అభివృద్ధిచెందిన దేశం తీసుకున్నా 30 నుంచి 35 శాతం కంటే తక్కువ మంది దారిద్య్రరేఖకంటే దిగువన ఉన్నారు. ఈ దేశాల్లో కూడా ధనవంతులు, కుబేరుల మధ్య పెద్దగా పన్నుల చెల్లింపు విధానంలో చెప్పుకోదగ్గ తేడాలు ఏమీ లేవు.

కాబట్టి భారత్‌లో ఈ విధానం ఆశిస్తున్న ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలే ఇస్తాయేమోననే అనుమానాలు బలంగా ఉన్నాయి. పెద్ద చేపను పట్టేందుకు వేసిన వల చేపను పడుతుందా వల విసిరిన వాడినే తనలోకి లాక్కుంటుందా అనేదే ఇప్పుడున్న ప్రశ్న. మరో వైపు మన ఆర్థిక విధానాలేమో కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీలు పరుస్తూ విధానాలు రూపొందిస్తున్నది. అడిగిందే తడువుగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. కార్పొరేట్ కంపెనీలకు , డొమెస్టిక్ కంపెనీలకు సర్‌చార్జీల్లో 35 నుంచి 40 శాతం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు కార్పొరేట్ టాక్స్ కూడా 30 శాతం తగ్గించారు. ఈ విధానాలపై దేశ వ్యాప్తంగా అనేక విమర్శలు వచ్చాయి.

రాజకీయ నాయకులతో పాటు ఆర్థికవేత్తలు, మేధావులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు తాజాగా చిదంబరం తీసుకున్న నిర్ణయం ఒక చేత్తో ఉన్న దంతా దోచిపెట్టి, కొసరంత దానం చేయమన్నట్లుగా ఉన్నదని అంటున్నారు.
దేశంలో గుట్టలుగా పోగై ఉన్న నల్లధనం చెలామణిలోకి రాకుండా దేశ సమస్యలు పరిష్కరిస్తామనడం హాస్యాస్పదమే. ఈ నల్ల డబ్బును బయటకు గుంజకుం డా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యలోటు, ధరల నియంవూతణ, ఆర్థిక సంక్షోభం గాడిలో పడబోదు. కోట్లాది పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న సబ్సిడీలు కొనసాగించేందుకు పాలకులు దీర్ఘకాలిక వ్యూహాలు రచించాలి. ప్రజానుకూల ఆర్థిక విధానాలు అవలంభించాలి.

ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన