ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?


Thu,October 11, 2012 05:56 PM

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెల్లబుచ్చుతున్నారు. దేశంలో సగటు మనిషి జీవనం గురించి పట్టించుకునే తీరిక మన పాలకులకు లేదు. దీంతో.. మునుపెన్నడూ లేనంత గడ్డు పరిస్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నది. దేశంలో ధనికులు, పేదల మధ్య అగాథం పెరుగుతున్నది. ఈ ఆర్థిక వ్యత్యాసాలతో పేదలు తీవ్రమైన సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ పరిస్థితి ఏదో రాజకీయ దృక్కోణం నుంచి అంటున్న మాటలు కాదు. సాక్షా త్తూ 68వ నేషనల్ శాంపుల్ సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)నే ఈ నిజాలను నిగ్గుతేల్చింది. గ్రామీణ భారతంలోని పేదవాడు సరాసరిగా రోజుకు 16.78 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలుతూ బతుకులీడుస్తున్నాడు. అలాగే గ్రామాల్లోని సగానికి పైగా జనం 35 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. ఈ కనీస ఆదాయంతోనే గ్రామీణ పేదలు తమ ఆహారం, ఆరోగ్యం, విద్య, వైద్య లాంటి అత్యావసరాలన్నీ తీర్చుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది.

గ్రామీణ పరిస్థితి ఇలా ఉంటే.. మన ఆర్థిక వేత్తలంతా కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెబుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా ఇతోధికంగా పెంచుతున్నామని అంటున్నా రు. ఈ ఆర్థికవేత్తల అధ్యయనం ప్రకారం గ్రామాల్లోని 90 శాతంపైగా ప్రజలు సరాసరిగా రోజుకు ఒక వ్యక్తి 68.47 రూపాయలను ఖర్చు చేయగలుగుతున్నాడు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో 90 శాతం మంది రోజుకు 142.70 రూపాయలను మాత్రమే ఖర్చు చుయగలుగుతున్నాడు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఈ దినసరి ఆదాయంతో ఎలా బతుకులీడుస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు. అయితే.. రెండు సంవత్సరాల కిందట చేసిన సర్వే ప్రకారం గ్రామీణ భారతంలో ప్రతిరోజుకు 55 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 122 రూపాయలు ఖర్చు చేసే స్థితి ఉండేది. అయితే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం రెండంకెలు దాటిన పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే.. గతంలో కంటే ఆదాయం తగ్గినట్లుగానే చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన పరిస్థితులు నానాటికీ దిగజారుతూనే ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతంలో ఉన్న పది శాతం ప్రజలు మాత్రం అభివృద్ధి ఫలాలన్నింటినీ సొంతం చేసుకుని.. భోగాలను అనుభవిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రజ ల జీవన ప్రమాణాలు, విధానాలు చూస్తే.. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు అద్దం పడుతున్నాయి. గ్రామాల్లోని 90 శాతం మంది పేదలు పట్టణ ప్రాంత ధనికులు ఖర్చు చేస్తున్న దాంట్లో 15 రెట్లు తక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఈ పది శాతంగా ఉన్న పట్టణ ధనికులు గ్రామీణ ప్రజల కన్నా 221 రెట్లు ధనరాసులతో తులతూగుతున్నారు.

ప్రభుత్వాలు, పాలకులు ఎంత దాయాలనుకున్నా దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలను దాచిపెట్టలేకపోయారు. ప్రభుత్వ సర్వేలు, ఆర్థికవేత్తల అధ్యయనాలు కూడా పెరుగుతున్న ఆర్థిక అంతరాల గుట్టును రట్టు చేస్తున్నాయి. అలాగే.. దేశంలో జరుగుతున్న అసమ అభివృద్ధిని చాటి చెబుతున్నాయి. అభివృద్ధి విధానాల పక్షపాతం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. కొంత కాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు గ్రామీణులను సవతి తల్లి ప్రేమతోనే చూశాయి. గ్రామీ ణ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పూనుకోలేదు. దీంతో.. గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రజల జీవన స్థితిగతులు కూడా కనీస వృద్ధికి నోచుకో క కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థికవేత్త డాక్టర్ సి. రాంగరాజన్ పేదరికాన్ని అంచనావేసే కొత్త సూచిని తయారు చేశారు. పట్టణ ప్రాంతంలో 32, గ్రామీణ ప్రాంతంలో 28 రూపాయల కన్నా తక్కువ ఆదాయం గల వారు మాత్రమే పేదలని నిర్వచించాడు. కేవలం పేదరికాన్ని అంకెల్లో తగ్గించేందుకు జీవన ఆదాయాన్ని కుదించి చెప్పడం పట్ల దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.తీవ్రమైన విమర్శలూ వచ్చాయి. ప్రభుత్వం అంకెల గారడీతో.. పేదల సంఖ్యను తగ్గించేందుకు దరిద్య్ర రేఖ ను నేలబారుకు నడిపిస్తున్నది.

ఈ విధంగా దేశంలో ప్రజలు, రైతులు అప్పులతో బలవన్మరణాలకు, ఆకలిచావులకు బలవుతుంటే.. పేదరికాన్ని నిర్వచించడంపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. దారిద్య్రరేఖను గీయడంపైనే తమ నైపుణ్యాన్నంతా వెచ్చిస్తున్నారు. నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్న గ్రామీణ ప్రజల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ వికాసానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపు లు జరగాలి. ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలి. వనరుల సద్వినియోగానికి రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వమే వడ్డీలేని రుణసాయం అందించాలి. అప్పుడే గ్రామీణ భారతం ప్రగతి పట్టాపూక్కుతుంది. అలాగే అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వ్యవసాయోత్పత్తులు పెంచేందుకు అన్ని విధాలుగా రైతులకు అండగా నిలవాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని వ్యవసా య రంగంలో ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. వ్యవసాయ దారుని నిత్యజీవితంలో నేటి టెక్నాలజీ భాగస్వామ్యం కావాలి. వ్యవసాయోత్పత్తులు, ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలి. అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రైతులకు ఉచితంగా సరఫరా చేయాలి. సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తూ పెట్టుబడులను తగ్గించే ప్రకృతి, సహజ వ్యవసాయ విధానాల ను ప్రోత్సహించాలి. గ్రామీణ భారతంలో చిన్న కమతాల్లో చిక్కుకున్న వ్యవసాయాన్ని సమష్టి క్షేత్రాల్లో ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అలాగే హర్టీ కల్చర్, పూలు, పండ్ల తోటల పెంపకంతో రైతులకు వచ్చే మేలును తెలియజెప్పాలి.

పదకొండవ పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కంకణం కట్టుకున్నది. ప్రతి ఏడాది నాలుగు శాతం వృద్ధిరేటుతో గ్రామీణ పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రణాళికను రచించింది. దీనికి అనుగుణంగా తక్కువ ధరలతో వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చి ఉత్పత్తిని పెంచేందుకు పూనుకోవాలి. అలాగే.. భూసారాన్ని సంరక్షి స్తూ.. భూమిని పోషిస్తూ.. ముందుకు సాగాలి. వర్షపు నీరు నిలువ చేయడం, వాటర్ షెడ్ కార్యక్షికమాలను విస్తృతంగా నిర్వహించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలి. అలాగే రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, పంటల నిల్వకు గిడ్డంగులను నిర్మించాలి.అలాగే.. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, పారిక్షిశామిక రంగాల అభివృద్ధికి వినియోగించరాదు. పంట భూములను పరిక్షిశమలకు అప్పగించడం అంటే.. దేశ ప్రజలను ఆకలి చావులకు ఎరవేయడమే.ఇలాంటి విధానాలు విడనాడి మార్కెట్ మోసాలకు తెరదించి రైతుక్షేత్రం కేంద్రంగా వ్యవసాయ విధానాల రూపకల్పన జరగాలి. అప్పుడు మాత్రమే గ్రామీణ పేదరికం తగ్గుముఖం పడుతుంది.

అబ్దుల్ కలాం మొదలు మన్మోహన్‌సింగ్ దాకా చెబుతున్న ప్రకారం జాతీయ ఆదాయంలో వ్యవసాయ వాట గణనీయంగా తగ్గుతున్నది. ఇది దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు మాత్రమే కాదు, రాబోయే కాలానికి ప్రమాదకర సంకేతాలు. ఇప్పటికైనా టెక్నాలజీ, సైన్స్ వ్యవసాయరంగం కేంద్రంగా పనిచేయాలి. ఆ దిశగా పరిశోధనలు జరిగి వ్యవసాయోత్పత్తులను పెంచాలి. ఆకలి భారతాన్ని అన్నపూర్ణగా మార్చాలి. ఇది జరగాలంటే.. దేశం లో రెండోహరిత విప్లవం రావాలి. దీనికోసం ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు గ్రామీ ణ రైతు కేంద్రంగా రూపొందాలి. వ్యసాయం ఇరుసుగా భారత ప్రగతి చక్రాలు నడిచిన నాడే.. దేశం నిజమైన అభివృద్ధి పట్టాలపై పరుగులు తీస్తుంది. రైతు రాజుగా, ఆత్మగౌరవంతో నిలబడి అందరికీ అన్నం పెడతాడు. వ్యవసాయ గ్రామాల్లో వెలుగులు నిండుతాయి. గ్రామీణ భారతం అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం!

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)


35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన