ఆర్సెనిక్ కాలుష్యం కాటు


Sat,October 6, 2012 03:19 PM

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మానవాళికి ముప్పుగా తయారైంది. మిగతా లోహాల మాదిరిగానే సహజంగా భూమి పొరల్లో ఉండే ఆర్సెనిక్ కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఉన్నది. దీనికి తోడు భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల అరుగుదల, అగ్నిపర్వతాల పేలుడుతో వాతావరణంలోకి, నీటిలోకి ఈ ఆర్సెనిక్ వచ్చి చేరుతున్నది. భూగర్భ జలాల్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంటోంది. దీంతో.. ఆ ప్రదేశాల్లోని సమస్త ప్రాణికోటి ఆర్సెనిక్ ప్రభావానికి లోనై ప్రాణాంతకమైన రోగాలకు గురవుతున్నది.

దేశరాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు, యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం ఎక్కువగా ఉన్నదని ఈమధ్యనే భూగర్భశాస్త్రవేత్తలు, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తెలిపారు. సహజంగా యమునానదీ పరివాహక ప్రాంతాల్లో ని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ శాతం సాధారణస్థాయి కంటే ఎక్కువ మోతాదులో ఉండి, ప్రాణులకు హానికరంగా తయారైంది.ఇలా ఆర్సెనిక్ ఎక్కువగా ఉండటానికి కారణం సహజ భౌగోళిక కారణాలు ఒకటైతే, వాతావరణంలోకి వచ్చి చేరుతున్న బూ డిద, పవర్ ప్లాంట్లనుంచి విడుదలవుతున్న బూడి ద, కాలుషితనీరు ప్రధాన కారణాలని అంటున్నా రు. ఢిల్లీ పరిసర ప్రాంతంలోనే ఉన్న బాదర్‌పూ ర్, రాజ్‌ఘాట్ పవర్ ప్లాంట్ల కారణంగానే ఆర్సెనిక్ శాతం మరింత ప్రమాదకరంగా తయారైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ పవర్ ప్లాంట్లనుంచి విడుదలవుతున్న కలుషిత నీరు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భూగర్భజలాలను ఆర్సెనిక్ మయం చేసి విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ పరిసర భూగ ర్భ జలాల్లో ఆర్సెనిక్ 180 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) ఉన్నది. ఒక్కోసారి 2000 పీపీబీకి చేరుతున్నది. అలాగే.. ఢిల్లీ వాతావరణంలోని గాలిలో 3200 పీపీబీ బూడిద ఉన్నది.

ఇది హానికరమని శాస్త్రవేత్తలు, వైద్యులు అంటున్నారు. ఈ ఆర్సెనిక్ భూతం ఏకంగా దేశరాజధాని ఢిల్లీనే వణికిస్తుండటంతో.. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అధ్యయనం మొదలైంది. ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఆర్సెనిక్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. పశ్చిమబెంగాల్‌లోని 12 జిల్లాల్లో లక్షా యాభైవేల మంది ప్రజలు ఆర్సెనిక్ ప్రభావంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా చర్మ సంబంధమైన రోగాలతో సతమతమవుతున్నారు.ఆర్సెనిక్‌తో కలుషితమైన నీరు తాగి కలకత్తా నగరంలో ని 78 వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసియా ఖండంలో ని 30 దేశాల్లో భూగర్భ జలాలు ఆర్సెనిక్ కాలుష్యంతో పీడింప బడుతున్నాయి. వీటిలో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, చైనా, తైవాన్ తదితర దేశాలున్నాయి. వియ త్నాం కూడా తీవ్రమైన ఆర్సెనిక్ ప్రభావంతో ఉన్నదని పరిశోధనలు తెలుపుతున్నాయి. లక్షలాది మంది అనేక రకాల రోగాలబారిన పడుతున్నారు. అలా గే.. లావోస్, కాంబోడియా, మైన్మార్, పాకిస్థాన్, నేపాల్, అర్జెంటీనా, మెక్సికో, చీలీ తదితర దేశాల్లో కూడా భూగర్భ జలాలు ఆర్సెనిక్‌తో కలుషితమైనాయి. ఈ విధంగానే.. ఆసియా ఖండంలోని పలుదేశాల్లో ఆరు కోట్ల మంది ప్రజలు ఆర్సెనిక్ బారిన పడి అల్లాడుతున్నారు.

ప్రపంచ బ్యాంకు, పశ్చిమబెంగాల్ యూనివర్సిటీ, ఎనిమల్ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ సంస్థలు చేసిన అధ్యయనంలో అనేక వాస్తవాలు వెలుగు చూశా యి. వాతావరణంలోని ఆర్సెనిక్, భూగర్భ జలకాలుష్యం కారణంగా.. మనం తింటున్న ఆహార పదార్థాలన్నీ కలుషితమయ్యాయి. చివరికి ఆవు పాలల్లో కూడా ఆర్సెనిక్ శాతం ఉన్నది. మనం తింటున్న ఆకుకూరలు, కూరగాయల్లో ఆర్సెనిక్ ఉంటోంది. దీంతో.. మనుషులకు ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా చర్మసంబంధమైన రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. చర్మంపై పుళ్లు ఏర్పడి మానని గాయాలవుతున్నాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, జీర్ణసమస్యలు, మూత్ర పిండాల సమస్యలు ఒక శరీరంలోని సకల అవయవాలు ఆర్సెనిక్ ప్రభావంతో చెడిపోయి రోగాలు వస్తున్నాయి. చిన్న పిల్లల్లో అయితే.. తల్లి పాలనుంచి కూడా ఆర్సెనిక్ బారిన పడి శ్వాస, జీర్ణావయవ సంబంధమైన క్యాన్సర్ రోగాలకు బలిఅవుతున్నారు. నాడి వ్యవస్థ కూడా ఆర్సెనిక్ ప్రభావంతో మానసిక సంబంధమైన రోగాలు వస్తున్నాయి. ఆర్సెనిక్ ప్రభావంతో భారతదేశంలో ప్రతి వేయి మందిలో 50 మంది రోగాలబారిన పడుతున్నారు. వీరిలో 13మంది క్యాన్సర్‌తో మృత్యువాత పడుతున్నారు.

ఆర్సెనిక్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ వ్యాప్తం గా కృషి జరుగుతున్నది. ఆర్సెనిక్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్సెనిక్‌ను నీటినుంచి, ఆహారపదార్థాల నుంచి తీసివేసే ప్రక్రియ గురించి పరిశోధనలు తీవ్రమయ్యాయి. ఖరగ్ పూర్ ఐఐటీ వారు ఆర్సెనిక్‌ను నీటినుంచి ఫిల్టర్‌చేసే ఒక యంత్రాన్ని (ఫిల్టర్) తయారు చేశారు. కానీ.. అది ఎంతో ధనవంతులకు తప్ప, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నది. దీంతో ఒక రూపాయి ఖర్చుతో 30లీటర్ల నీటిని శుద్ధిచేసే విధానాన్ని వాడుకలోకి తెస్తున్నారు. అలాగే బెంగాల్ ప్రభుత్వం కూడా భూగర్భ నీటినుంచి ఆర్సెనిక్‌ను గ్రహించనటువంటి వరి వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నది. అలాగే పాలల్లో ఉంటున్న ఆర్సెనిక్‌ను తగ్గించేందుకు పశువులకు గడ్డితో పాటు సోడియం థయోసల్ఫేట్ ఇస్తున్నారు. సోడియం థయోసల్ఫేట్ పాలల్లోని ఆర్సెనిక్ శాతాన్ని తగ్గిస్తుంది. గ్రామీణ పేద ప్రజలను ఆర్సెనిక్ బారినుంచి విముక్తి కలిగించేందుకు ప్రకృతి సిద్ధపదార్థాలతో ఆర్సెనిక్‌ను ఒడపోసే విధానాన్ని బెంగాల్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ కనుగొన్నది. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే లాటిరైట్ (ఎపూరగా చిన్నరాళ్లతో కూడి ఉండే మట్టి)ను నీటిలో కరిగిఉండే ఆర్సెనిక్‌ను శుద్ధిచేసేందుకు వాడుతున్నారు. ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఆర్సెనిక్‌ను శుద్ధి చేసే ట్లు ప్రోత్సహిస్తున్నారు.

దర్బాంగా వైద్యకళాశాల వారు కూడా మరో ఆర్సెనిక్ వడపోత విధానాన్ని కనుగొన్నారు. తినే పదార్థాలలో వాడే ‘పట్టిక’ ఆర్సెనిక్‌ను శుద్ధిచేస్తుందని ప్రయోగపూర్వకంగా రుజువుచేశారు. కేవలం రెండు మూడు పైసల విలువ చేసే పట్టికతో.. లీటర్‌నీటిని శుద్ధిచేయవచ్చని తెలిపారు.ఈ విధానాలన్నింటినీ ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాలి. సరళమైన పద్దతులతో ఆర్సెనిక్ కలుషిత నీటిని శుద్ధిచేసే విధానాలను పాటించేట్లు చేయాలి. అలాగే.. మారుమూల ప్రాంతాల్లో కూడా పట్టికను అందుబాటులోకి తెచ్చేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలి. ఇది ఎంత యుద్ధవూపాతిపదికన చేస్తే.. అంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుంది.

- ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత