చక్రపాణి పరీక్ష దార్శనికత


Thu,November 17, 2016 01:52 AM

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎంచుకోవడంలో చక్రపాణి ఒకరకంగా విజయం సాధించాడు. పరీక్షను నిర్వహించటం మాత్రమే కాదు ఆ పరీక్షా విధానానికి కావల్సిన పాలసీలను రూపొందించుకున్నాడు.

chukka
తరగతి గదిలో ప్రతి అసెస్‌మెంట్(మూల్యాంకనం)ఒకే లాగా ఉండదు. ఈ మూల్యాంక నం తరగతి గదిలో విద్యార్థుల స్థాయిని అం చనా వేసేందుకు జరుగుతుంది. మూల్యాంకనం ఒక లక్ష్యం కోసం జరుగుతుంది. ఇది ఒక్కొక్క సారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. తరగతి గదిలో జరిగే మూల్యాంకనం విద్యార్థులు, ఉపాధ్యాయుల బలం కోసం జరిగేది. ఉపాధ్యాయులకు తాను ఆశించింది ఏ మేరకు వచ్చిందో లేదో ఈ మూల్యాంకనం ద్వారా తెలుస్తుంది. అట్లాంటి సమయంలో ఉపాధ్యాయుడు దేన్ని మూల్యాంకనం చేయదల్చుకున్నాడో అది స్పష్టంగా మొదలే చెప్పాలి. దానికి కావల్సిన ప్రశ్నలకు రెండు మూడు ఉదాహరణలు కూడా ఇవ్వాలి. మూడవది కావల్సినటువంటి ఆధారాలు ఏముంటాయో స్పష్టంగా చెప్పాలి. ఇది తరగతిలో గది మూల్యాంకనం లక్ష్యం. అదే సంవత్సరం చివర చేసుకునే పరీక్ష లక్ష్యం వేరేగా ఉంటుంది. అదే ఒక మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలలో సీట్లు భర్తీ చేయటానికి నిర్వహించే పరీక్షా విధానం మరో రకంగా ఉంటుంది.

అదే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష లక్ష్యం మరో రకంగా ఉంటుంది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ఇది వరకటి పరీక్షల కంటే భిన్నమైనది. అలాగే ఈ పరీక్ష అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జరిగిం ది. అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడం దగ్గర్నుంచి పరీక్షలు రాయడం, ఫలితాలు పొందడం అంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోటే జరుగుతుండటం ఈ పరీక్షకు ఉన్న ప్రత్యేకత. ఈ పరీక్షకు లక్ష్యం ఏమిటని ఆ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కొంతకాలంగా తీవ్రంగా తపన చెందాడు. ఈ పరీక్షల విధానాన్ని రూపొందించటానికి ఒక తపస్సు లాగా చేశాడు. దేశంలో అన్నిరాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న విధానాలను ఆసక్తి తో చూస్తున్నాయి. దేశంలోనే సర్వీస్ కమిషన్లకు నియమితులైన ఛైర్మన్లలో అతి చిన్న వయస్కుడు ఘంటా చక్రపాణి. ఎంతో అనుభవం, పరీక్షల నిర్వహణ గురించి అపారమైన జ్ఞానమున్న ఇతర రాష్ర్టాలకు చెందిన ఛైర్మన్లు మన ఘంటా చక్రపాణి చేస్తున్న అత్యాధునిక మార్పులను చూసి ఆశ్యర్యపోయారు. మన రాష్ర్టానికొచ్చి ఈ విధానాలను పరిశీలించి వెళ్ళారు.

కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిరోజుల్లో నిర్వహించే ఈ పరీక్ష ఎలా ఉండాలో చక్రపాణి బాగా ఆలోచించాడు. రాబోయే 30 ఏళ్ల వరకు ఆ ఉద్యోగులు పనిచేయటానికి పరీక్ష ఎలా ఉండాలి? ఆ అభ్యర్థులకు ఏ రకమైన పరిజ్ఞానం, నైపుణ్యం ఉండాలో ఆలోచించి తన లక్ష్యాన్ని పరీక్ష నిర్వహించే అధికారులకు, అభ్యర్థులకు స్పష్టంగా స్పష్టీకరించాడు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ అవసరాలపై కేంద్రీకరించాలని పరీక్షా అధికారులకు, మూల్యాంకన రూపకర్తలకు చెప్పాడు. గత పరీక్షలకు భిన్నంగా పుస్తకాల్లో కన్నా సామాజిక సమస్యలపై చక్రపాణి ప్రత్యేక దృష్టి పెట్టాడు. మూల్యాంకనం చేసే మనిషి లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు. అదే విధంగా ఒక వృత్తి కళాశాలలో సీట్లు భర్తీ చేయటానికి ఒక విధానం ఉంటుంది. ఆ వృత్తి కళాశాలకు అవసరమైన విషయాలనే తీసుకుని పరీక్షా విధానం తయారవుతుంది. ఉన్నటువంటి వ్యవస్థను క్రమం తప్పకుండా నడిపించటానికి, రొటీన్ కార్యక్రమాల ను నిర్వహించటానికి, పాలనా రంగాన్ని పకడ్బందీగా నడిపించేటందుకు సన్నద్ధం చేస్తూ ఈ పరీక్ష విధానం రూపకల్పన జరగాలి. వ్యక్తులను తయారు చేయాలి.

అదే జాతీయ పరీక్ష అయితే జాతి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహిస్తారు. అదే ఐఐటి పరీక్ష అయితే ప్రపంచం అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రాబోయే కాలానికి ఏ రకమైన సాంకేతిక శాస్త్రవేత్తలు కావాలో ఆలోచించి పరీక్ష పత్రాలను రూపొందిస్తారు. అన్నిపరీక్షలు ఒక రకంగా ఉండవు. పరీక్షా లక్ష్యాలు, అవసరాలను బట్టి ఆ పరీక్ష విధానం తన లక్ష్యాన్ని ఎంచుకుంటుంది. ఈ కొత్త రాష్ర్టానికి ఏ విధమైన పరిజ్ఞానం ఉన్న వాళ్లు అవసరమో దానికోసం చక్రపాణి భారీ కసరత్తు చేశాడు. ప్రజల జీవన విధానం, ఇక్కడి సామాజిక పరిస్థితులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఈ నేల విశిష్టతకు సంబంధించిన అంశాలతో సిలబస్ తయారు చేశారు. ఆ సిలబస్ ఆధారంగా పరీక్షా రూపకల్పన కోసం భారీ కసరత్తు చేయటం జరిగిం ది. ఇప్పుడు కొత్త రాష్ట్రం అవసరాలు తీర్చే మానవ వనరులు కావాలి. కోచిం గ్ సెంటర్ల ఆలోచనలకు భిన్నంగా ఆయన దృష్టి సారించాడు. పాలసీ మేకర్‌గా ఏం చేయాలో చక్రపాణి బాగా ఆలోచించాడు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని జరిగిన తొలి పరీక్ష ఇది. దేశంలోనే ఇది పరీక్షా రంగంలో నూతన విప్లవం. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే ఈ పరీక్ష కోసం గత కొంత కాలంగా అభ్యర్థులను అందుకు సిద్ధం చేశాడు. పరీక్షా లక్ష్యాలను ముందుగానే వివరించాడు. తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్ష ను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎంచుకోవడంలో చక్రపాణి ఒకరకంగా విజయం సాధించాడు. పరీక్షను నిర్వహించటం మాత్రమే కాదు ఆ పరీక్షా విధానానికి కావల్సిన పాలసీలను రూపొందించుకున్నాడు.

1143

CHUKKA RAMAYYA

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ