పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..


Sat,October 10, 2015 02:00 AM

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ చరిత్రను ఆమూలాగ్రం స్పృశించకుండానే సర్వీస్ కమిషన్ పరీక్షలు జరిగాయా అన్న సంశయం కలుగుతుంది. పిల్లలు తమ నేల చరిత్రను తాము చదువుకుంటూ తన దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తున్నారు.

ramayya


ఉద్యమాలు సమస్య పరిష్కారానికే కాదు, కార్యకర్తలకు కూడా శిక్షణనిస్తుంది. ఉద్యమాల్లో వచ్చిన అనుభవా లే కార్యకర్తలను గొప్ప పాలనాధీశులుగా మార్చుతుంది. ఇవాళ తెలంగాణలో వచ్చిన ఎంతో మంది కార్యకర్తలు ప్రభుత్వ పీఠంపై కూర్చొని పాలసీలు నిర్ణయిస్తుంటే వీరందరికీ ఇంత అనుభవం ఎలా వచ్చిందని నాకు నేను ఆలోచనలో పడ్డాను. ఉద్యమకాలంలో ఊరూరా తిరిగాను. మూలాలు అర్థం చేసుకున్నాను. ప్రవాహం వచ్చినప్పుడు కంకర రాళ్లు సాలగ్రామాలవుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఉద్యోగులను భర్తీ చేసే సంస్థ మాత్రమే అనుకుంటారు. మరికొందరు వచ్చే 30 సంవత్సరాలకు కావల్సిన సిబ్బంది ఎలా ఉండాల్నో పథక రచన చేసే సంస్థ అని గుర్తించాలి. రాబోయే ఉద్యోగులకు కానీ అది ఏ విషయాలు తెలిసి ఉంటే లక్ష్యం పూర్తవుతుందో ఆలోచిస్తారు. తెలంగాణ చరిత్ర అంటే కొంతమంది ప్రాంతీయ తత్త్వాన్ని ప్రజల్లో నింపటానికి ఇదొక ఎత్తుగడ అనుకున్నారు. తెలంగాణ చరిత్రలోని ఒక్కొక్క సం ఘటన, ఒక సామాజిక ఉద్యమాలకు బీజం. ఈ చరిత్ర చదివితే అసలు విషయం తెలుస్తుంది.

ఫ్యూడల్ తెలంగాణలో ఆనాటి ప్రజలకు ఆస్తిపై హక్కులేకుండా ఉంది. ప్రజలకు తాము సంపాదించుకున్న డబ్బు మీద, శ్రమ మీద హక్కులేకుండేది. చివరకు తమ జీవితంపైన కూడా హక్కులేదు. స్వాతంత్య్రం వచ్చిన అరవై సంవత్సరాలకు కూడా ఆ ఫలితాలు సామాన్యునికి అందక దుర్భరమైన జీవితం గడిపిన ప్రాంతమని తెలుసు కోవా లి. అది అర్థం చేసుకోవాలంటే ఆనాడున్న పరిస్థితులను రాబోయేతరానికి చెబితేనే ఈనాటి ప్రజల సమస్యలు అర్థమవుతాయని ఊహించారు. అందుకే తెలంగాణ చరిత్రను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌లో పెట్టడం జరిగింది. తెలంగాణలో బయటివారికి కేవలం ఇక్కడ ఉన్న పేదరికమే కనిపిస్తున్నది. కొందరు వనరులు లేవని వాదిస్తారు. మరికొందరు ఇక్కడి వారు అమాయకులని అంటారు. మరికొందరు ఫ్యూడల్ పునాదులున్నాయంటారు. కానీ లోతుగా చూస్తే ఎన్నో అవమానాలకు అణచివేతలకు గురైన ప్రాంతం ఇది. కొంతకాలం తమ దారిద్య్రానికి కారణం కర్మ సిద్ధాంతమని చెప్పారు.

దాని నుంచి బైటపడగానే ఈ ప్రాంత ప్రజలను పాలితులుగా చూసే యంత్రాంగాన్ని ప్రసాదించారు. తెలంగాణలో డబ్బు లేకపోవటం కాదు, అరవై సంవత్సరాలు ఇక్కడి ప్రజలను అవమానాలకు గురిచేశారు. ఈనాడు కనబడుతున్న ఆత్మహత్యలకు మూలాలు గతంలో ఉన్నాయి. పేరుకుపోయిన నిరాశ, నిస్పృ హలే ప్రపంచంలో ఎక్కడైనా విప్లవాలకు కారణభూతమైంది. ఒకసారి లాటిన్ అమెరికన్ దేశాల చరిత్ర చూస్తే మనకు ఈ పరిస్థితే కనపడుతుంది. కానీ ఏ దేశాలైతే పీడనకు గురవుతాయో ఆ దేశాల పోరాటపటిమ కూడా బాగా ఉంటుంది. అందుకే ఆ దేశాల్లో చావెజ్, క్యాస్ట్రో, చెగువేరాలు పుట్టారు. ఇట్లాం టి ఎంతో మంది ఈ గడ్డలో కనపడకుండా చనిపోయారు. ఒక దేశాన్ని నిర్వీ ర్యం చేయాలంటే మొదట వారికి చరిత్ర లేదని బుకాయింపు చేస్తారు. చరిత్ర పాత సంఘటనలు మాత్రమే చెప్పదు.

గత తరం వర్తమాన కాలానికి ఒక సందేశమిస్తుంది. అది గుర్తుంచే పాలకులు ఆ చరిత్రపై మన్నుగప్పుతారు. బహుశా దీనిని గుర్తించే ఈ ప్రాంతాన్ని మేలుకొలపాలంటే గత చరిత్రపై పరిశోధన చేయాలని ఆలోచించటమే గొప్ప విషయం. దీనికి అభినందనలు. కానీ ఇదొక భాగం మాత్రమే. దీన్ని ప్రజలకు వచ్చేతరానికి చెప్పాలంటే వచ్చే తరం ఉపాధ్యాయులకు కూడా స్ఫూర్తినివ్వాలి. ప్రతి సామాజిక కార్యకర్త ఆనాటి పరిస్థితులలోకి పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ఆ చరిత్ర ప్రస్తుత తరానికి ప్రేరణగా నిలుస్తుంది. అదే రాబోయే తరానికి మహత్తర సందేశంగా నిలుస్తుంది. ప్రతి సంఘటన వెనుక నేపథ్యం ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుంటేనే ఆ చరిత్ర సిలబస్‌లో పెట్టిన లక్ష్యం పూర్తవుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు ఒక పరిశోధకుడు కావాలి. సంఘటనలు చెప్పటం చరిత్ర కాదు. సంఘటనలను విశ్లేషణలు చేయటం, దాన్ని ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకోవటం ఒక భాగం.

అదే కాకుండా వచ్చే తరానికి అది సందేశం కావాలి. వచ్చేతరం ఎదుర్కొనే సమస్యలు గతంతోనైనా, వర్తమానంతోనైనా పోలిక ఉండదు. విభిన్నమైన పరిస్థితులే ఉంటాయి. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే శక్తి కలిగించాలే కానీ సంఘటను నూరిపోయటం కాదు. వచ్చే తరానికి ఆ పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం కలిగించాలి. అదే చావ్‌ుస్కీ చేశాడు. లాటిన్ ఆమెరికన్ దేశాల్లో ఫెర్రీ చేశాడు. అం దుకే వారిని గొప్ప ఉపాధ్యాయులుగా భావిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఉపాధ్యాయులందర్నీ చావ్‌ుస్కీ, ఫెర్రీలుగా మార్చాలనుకుంటున్నాడు. రాబో యే తరం చావెజ్‌లు, ఫాలో ఆఫ్ ఫెర్రీలు కావాలని ఆకాంక్ష.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్ల లు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ చరిత్రను ఆమూలాగ్రం స్పృశించకుండానే సర్వీస్ కమిషన్ పరీక్షలు జరిగాయా అన్న సంశయం కలుగుతుంది. పిల్లలు తమ నేల చరిత్రను తాము చదువుకుంటూ తన దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తున్నారు.

ఏ మట్టి మీద పుట్టామో ఆ మట్టి చరిత్రను విధిగా చదువు కోవాలన్న సోయిని కలిగించినందులకు ఘంటా చక్రపాణిని అభినందించాలి. ఆయన ఆలోచనల మేరకు ఈనాడు పిల్లల చేతుల్లోకి తెలంగాణ చరిత్ర వచ్చింది. ఆనాడు మేము పాల్గొన్న వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని పిల్లలు వెతుక్కుని చదువుకుంటున్నారు. ఆనాటి కన్నీటి కథలు తెలుసుకుంటున్నారు. గత చరిత్ర తెలిస్తేనే భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణా కేంద్రం మాత్రమే కాదు భవిష్యత్ సమాజాన్ని నడిపించేందుకు సుశిక్షితులైన పాలనా సారథులను అందించే సంస్థగా మలిచేందుకు చేస్తున్న కృషిని అభినందించాలి.
-(వ్యాసకర్త: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

1627

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ