చదువు సమాజ పునాది..


Sat,September 19, 2015 11:05 PM

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల 3 -6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక,శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యాలను నిర్ణయించటంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉన్నది.

chukka


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీర్ఘాలోచనలు చేసి చర్చలు జరిపి విద్యా పాలసీని ప్రకటించారు. దాంతో సహా ఆ పాలసీని అమలు చేయడానికి ఒక కమిటీ కూడా వేశారు. దానిలో పాల్గొనే అవకాశం దొరికింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీ కేజీ టు పీజీ విద్యారంగంలో ఇలాంటి నినాదం దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేదు. ఇది అందరూ ఆహ్వానించవలసింది. కేజీ విద్య పేరుతో ప్రైవేట్ సంస్థలు భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కేజీ విద్యను చేపట్టబోతుందని ప్రకటించటంతో విద్యారంగ కార్యకర్తగా సంతోషపడిన మాట వాస్తవ మే.

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల 3 -6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక, శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యాలను నిర్ణయించటంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉన్నది. విదేశాల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లాను. చాలా మంది విద్యావేత్తలతో కలసి మాట్లాడాను. ముఖ్యంగా చికాగో నగరంలో ఒక సంస్థ ఏర్పడింది. అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్‌టైనబుల్ సొసైటీ అనేది ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకులతో మాట్లాడాను. సాంకేతికమైన మార్పుల వల్ల విద్యారంగంలో తీవ్రమైన కదలికలు తీసుకువచ్చింది.

దీంతో అందరికీ చదువు అనే భావన కూడా కలిగింది. చదువు వల్ల ఆధిక్యత వస్తున్నది కాబట్టి ఆ చదువును అందరికీ అందించగలిగితే కొన్నివర్గాలలో విముక్తి కలుగుతుంది. సమాజ పరివర్తన జరుగుతుంది. సామాజిక పరిణామాల నుంచి చదువును విడదీయలేరు.21వ శతాబ్దంలో సమాచార రంగంలో వచ్చిన మార్పులు చిన్నవి కావు. దీనివల్ల ఉద్యోగభృతి అవకాశాలు పెరగటమే గాకుండా ఆర్థిక వ్యవస్థకు విద్య ఒక ప్రధాన అంగంగా మారింది. నేడు అక్షరం కన్నా భావన చాలా ప్రధా నం. ఆ ఆలోచనలు బాల్యంలో ఉత్పత్తయ్యేది ఇంద్రియాల చైతన్యం వల్లే. శిశువు దేహంలో ప్రధానమైన మార్పు ఇంద్రియాల వల్లనే ఏర్పడుతూ వచ్చింది. శిశువు తనంతట తాను ఆలోచించడు. ఇంద్రియాల ప్రేరణే శిశువు ఆలోచనలకు మూలం.

దాన్నే బుద్ధి అంటారు. ఇంద్రియాలు ఈ బుద్ధికి పునాది. 3-6 సంవత్సరాల మధ్యన ఇంద్రియాలకిచ్చే శిక్షణే బిడ్డల ఆలోచనలకు పునాది. ఆలోచనా విధానాన్ని నియమబద్ధంగా ఉంచాలంటే సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్చాలన్నా, వ్యక్తిగత అవసరాలకు మార్చాలన్నా శిశువుకు ఈ దశే చాలా ప్రధానం. ఈ దశలో విద్యార్థిని ఎంత జాగ్రత్తగా మనం తీర్చిదిద్దగలిగితే అదే స్థాయిలో ఉత్తమమైన పౌరుడుగా ఉత్తమ పౌరురాలుగా రూపొందుతారు. కానీ శిశువులో ఏ అవగాహన కలిగించదలుచుకున్నా తల్లికి ఉండే క్షణాలు ఆ ఉపాధ్యాయునికి ఉంటేనే ఆ లక్ష్యసాధన జరుగుతుంది. ఆర్థికరంగంలో వచ్చిన మార్పుల వలన శిశువుపై ఎంతో శ్రద్ధ వహించాలి. అది జరగకపోతే శిశువు పెరిగాక పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.

తల్లీ తండ్రీ చేయవలసిన పనిని సమాజమే చేయవలసిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి ఒక పౌర సమాజం కోసమై వ్యవస్థ ఏర్పడింది. ఇది కొందరి కే కాదు అందరికీ అన్నది అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్‌టైనబుల్ సొసైటీ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ పని మాత్రం ఆచరణలో అంత సులభమైనది కాదు. తల్లి మాదిరిగా శిశువుతో సాన్నిహిత్యం పెంచుకునే వ్యక్తి ఎడ్యుకేటర్ కావాలి. తల్లి చేసే పని పవిత్రమైనది. శిశువుకు శారీరక అవసరాలుంటాయి. పిల్లలకు పౌష్ఠిక ఆహారాన్ని ఇవ్వటం జరగాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రేమను కలిపి తినిపిస్తే అది పిల్లలకు శక్తినిస్తుం ది.శిశువు ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వటానికి వనరులు కూడా ఎంతో అవస రం. శిశువు రంగులను గుర్తించటం, రంగులలో తేడాలను గుర్తించటం.

ఉపాధ్యాయుడు పిల్లల భాషలో మాట్లాడాలి. ఉపాధ్యాయుని దగ్గరకు శిశువు తల్లి దగ్గరకు వచ్చినట్లుగా పరుగెత్తుక రావాలి. ఇందుకు ఎలాంటి భాష కావాలో ఆలోచించాలి. ఆ శిశువు కల్చర్ తెలియాలి. అమెరికాలో వున్న ఆఫ్రో అమెరికన్స్ శిశువులకు శిక్షణనిచ్చేందుకు అక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సామాజిక సుస్థిరత కోసం ఆ శోధనలు జరుగుతున్నాయి. కేజీ చదువు వెనుక ఇంత పెద్ద పరిశ్రమ ఉన్నది. భాష, మాటలు ఎదుటివారిని గౌరవించే విధంగా ఉండాలి. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయుల ప్రవర్తనతో వస్తుం ది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే రావాలి.అమెరికాలో ఆ కేజీ స్కూలుకు పోతే నేను చంటిబిడ్డనయ్యాను.
-(రచయిత: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

1565

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ