గుట్టల గుండెల్లో చరిత్ర


Wed,December 10, 2014 11:28 PM

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెలికితీస్తున్నారు. ప్రజలే తమ చరిత్రను తాము వెలికితీస్తారు. ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ తన చరిత్రను తాను లిఖించుకుంటుంది.ఆ చరిత్రే ఆ ప్రాంతం ప్రజలను ప్రేరేపిస్తుంది.

ఒక ప్రాంతం వైశిష్ట్యాన్ని పుస్తకాలలో, కావ్యాలలో లిఖించకపోతే అది ఆ ప్రాంతంలోని మట్టి తన గర్భం లో దాచుకుని చరిత్ర కు అందిస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని చరిత్రంతా కావ్యాలలో కన్నా అది ప్రజల నాల్కలపైననే లిఖించబడి ఉన్నది. అది మౌఖిక సాహిత్యంగానే వర్థిల్లుతున్నది. ఆ మౌఖిక సాహిత్యం ద్వారానే తరతరాలకు ఈ నేల చరిత్ర అందిస్తూ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని గుట్టలు, నదీనదాల పరివాహక ప్రాంతాల్లో కూడా చరిత్ర నిక్షిప్తమై ఉంది. తెలంగాణలోని గుట్టలను తొలుచుకుపోతుంటే ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేసేదీ ఎందుకంటే ఈ గుట్టలు కనుమరుగైతే ఈ ప్రాంతం చరిత్ర కూడా కనుమరుగవుతుందన్న బాధ వెంటాడుతున్నది.

chukka


చాలా గుట్టలలో చరిత్ర నిక్షిప్తమై ఉందని చెప్పటానికి మా వూరును ఆనుకుని వున్న పాలకుర్తిలోని సోమన్న గుట్టనే తెలంగాణ చరిత్ర అంటే పాల్కురికి సోమనాథుడు రాసిన ఆదికా వ్యం నుంచి మొదలవుతుంద ని చెప్పాలి. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణాన్ని రాశాడు. జనభాషలో ద్విపద లో కావ్యాన్ని అల్లాడు. స్వతంత్రంగా కావ్యాన్ని లిఖించి ఆదికవిగా నిలిచిపోయాడు. ఆ పాల్కురికి సోమనాథుని చరిత్ర ను మా వూరు పాలకుర్తి గుట్ట కాపాడింది. ఆ గుట్ట గుండెల్లోనే పాల్కురికి చరిత్ర చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ గుట్టను చూసినప్పుడల్లా నా తెలంగాణ చరిత్రంతా గుట్ట ల్లో, రాళ్లపై చెక్కబడిన శాసనాల్లోనే ఉందనిపించింది. హైదరాబాద్‌కు సమీపంలోని కీసరగుట్టలో బయల్పడిన విష్ణుకుండీన శాసనం, వరంగల్ మానకోట సమీపంలోని కొరవిలో చాళుక్య భీముడు వేయించిన గద్య శాసనం, కరీంనగర్ జిల్లా జినవల్లభుడు వేయించిన కుర్క్యాల బొమ్మలగుట్ట శాసనాల చరిత్రను తెలియజేస్తూ ఆచార్య ఎస్వీరామారావు రాసిన పరిశోధనాత్మక వ్యాసంలో తెలంగాణలో శాసనాలు 1వ శతాబ్ది నాటికే తెలంగాణ భాషా పరిణామాన్ని తెలియజేశాయని తెలిపారు.

మా గూడూరు గ్రామంలో విరియాల మల్లభూపతి (1005-45) వేయించిన శాసనంలోనూ మూడు చంపక మాలలు, రెండు ఉత్పల మాల లు ఉన్నాయని తెలుగులో లభించిన తొలి సంస్కృత వృత్త పద్య శాసనమని, ఇది నన్నయ్య కన్నా ముందుదని ఆచార్య ఎస్వీ రామారావు సాహిత్య చరిత్రను తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రం తా కీసరగుట్టల దగ్గరనో, కరీంనగర్‌లోని గుట్టల్లోనో, కోటి లింగాల భూముల్లోనో, పాలకుర్తి గుట్ట గుహల్లోనే నిక్షిప్తమై ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో కనిపించే గుట్టలన్నీ చరిత్రను నిక్షిప్తం చేసిన మహాకావ్యాల లాగా కనిపిస్తాయి. ఇటీవల మా పాలకుర్తి వెళితే సోమన్న గుట్ట చెబుతున్న చరిత్రను మళ్లొక్కసారి చెవిపెట్టి విన్నాను.

మా వూరు లోపల ఎవరింటికి వెళ్లినా ఒక సోమయ్య పేరు లేక సోమక్క పేరు తప్పకుండా ఉంటుంది. పాలకుర్తి పరిసరాల లోపల చాలా గ్రామాల్లో ఈ పేర్లు వినిపిస్తుంటాయి. పాలకుర్తి సోమనాథుని పేరున పెట్టుకుంటారు. ఈ మధ్య ప్రతి ఇంటికి పోయి మంచినూనె సేకరిస్తున్నారు. వీళ్ల ఉద్దేశ్యం ఏమిటంటే? సోమవారం నాడు పాలకుర్తి సోమనాథుని దేవాలయంలో కార్తీకపౌర్ణమి నాడు జ్యోతి వెలిగించేందుకు నూనె సేకరిస్తున్నారు. నేను ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. బసవపురాణం రాసిన సోమనాథుడు శైవమతానికి చెందినవాడు. ఆ మతధారల్లో తాత్త్విక చింతనను రాశాడు.

సోమనాథుడు పాలకుర్తికి చెందినవాడు. శైవమతానికి ఆ కవి పేరును సజీవంగా ఉంచటం కోసమై ఒక స్థిరమైన ప్రదేశంలో ఆయనను ప్రతిష్టించుకున్నారు. పాలకుర్తిలోని గుట్టలో ఆయన పేరున ఆ దేవాల యం 11వ శతాబ్దంలో నిర్మించారు. ఆ గుట్టను సోమన్న గుట్ట అంటారు. దానిలోని ఒక గుహలో ఆయన గుడిని కట్టారు. ఆయన శైవ మతస్తుడు కాబట్టి శివుని లింగప్రతిష్ఠ చేశారు. అది శైవ దేవాలయంగా ప్రతిష్ఠ పొందింది. ఇప్పుడు అదొక ఆధ్యాత్మిక పురాణ గాథ గా మారింది. ఇప్పుడు ఆ గుట్ట చరిత్రకు కారణభూతమైంది.

తెలంగాణ లోపల ఉన్నటువంటి పరిసరాలను, చెరువులను, నదులను గ్రామంలో వున్న ప్రసిద్ధి చెందిన వ్యక్తులతో జోడించి వాళ్లను చిరస్మరణీయులుగా చేస్తారు. అదే మాదిరిగా బయ్యన్నగుట్ట, బయ్యన్నవాగు, సోమ న్న గుట్ట అని వాడుకలోకి వచ్చాయి. సోమనాథుడు చెప్పిన బసవ పురాణం ఫిలాసఫీకి పాలకుర్తిలో గుట్ట ప్రతీకగా తయారయ్యింది. అదే దేవాలయంగా మారింది. ప్రతి ఏడాది కార్తీక మాసం నుంచి మొదలై శివరాత్రి వరకూ పూజలు జరుగుతుంటాయి. ఆ చరిత్రను మరిచిపోకూడదు.

అందుకే పాలకుర్తి చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఇంటి నుంచి నూనెను తీసుకుని శివరాత్రి దాకా జ్యోతిని వెలిగిస్తారు. ఇది సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యక్రమం అయిపోయిం ది. కానీ ఇది ఒక కవి సృష్టించిన కావ్యమే దీనికి కారణం. తెలంగాణలో తెలుగుభాషలో సోమనాథుడే ఆదికవి అని అంటారు. దానికి కారణం ఏమిటంటే నన్నయ్య సంస్కృతం నుంచి మహాభారతాన్ని అనువదించాడు కాబట్టి అది అనువాద కవిత్వం అయ్యింది.
పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలు గు కావ్యంగా నిలిచింది.

ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు తెలంగాణ ఉద్యమంలో భాగంగా వెలికి తీస్తున్నారు. ప్రజలే తమ చరిత్రను తాము వెలికితీస్తారు. ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ తన చరిత్రను తాను లిఖించుకుంటుంది. ఆ చరిత్రే ఆ ప్రాంతం ప్రజలను ప్రేరేపిస్తుంది. పరాయి పాలనలో తెలంగాణ చరిత్రంతా మరుగున పడింది. తెలంగాణ లో గ్రామ గ్రామానికొక చరిత్ర ఉంది. ప్రజలే తమ చరిత్రను తాను పునర్నిర్మించుకుంటారు. తెలంగాణలో నన్నయ్య, తిక్కనలను మించి న వారున్నారు. వారందరు మరుగునపడ్డారు. ఇప్పుడు వాళ్లను వెలికి తీయాలి. తెలంగాణ చరిత్రను ప్రజలే రాసుకుంటారు.

1155

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ