చదువే ప్రగతికి పెట్టుబడి


Tue,November 11, 2014 03:25 AM

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా మార్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకు ఈటెల రాజేందర్ శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుచున్న 1 నుంచి 5 తరగతులు చదువుకునే పేద విద్యార్థులకు భవిష్యత్‌పై చదువుల కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఆ డబ్బు వారు ఉన్నత చదువులకు పోయినప్పుడు ఉపయోగపడుతుంది.

తెలంగాణ మరొకసారి చరిత్ర ను సృష్టించింది. పోరాట వీరు లు, కార్యకర్తలు ప్రభు త్వ యంత్రాంగంలోకి రావటం చాలా అరు దు. ప్రజా ఉద్యమాల లో పాల్గొని త్యాగాలు చేసి, ప్రాణాల ను ఇచ్చి చరిత్రలో ఎందరెందరో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారుకన్న కలల్ని ప్రజలకు ఇచ్చిపోయారు. జనం కోసం పోరాడి, జనం నాడిని ఆవాహన చేసుకుని ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఆ ఉద్యమా ల్లో గెలిచి మళ్ళీ పాలనా యం త్రాంగానికి నాయకత్వం వహించడం అరుదైన విషయం. పోరాటాలలో గెలిచినవారే పార్లమెంటరీ పార్టీకి కూడా నాయకత్వం వహించి భేష్ అనిపించుకుని పాలనా యంత్రాంగానికి వచ్చిన వారిని అటు క్యూబాలో ఇటు ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నాం. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవకాశం తనకు లభించినందులకు తెలంగాణ ఆర్థికశాఖామంత్రి ఈటెల రాజేందర్ ఎంతో పులకరించాడు. ఉద్యమా న్ని పలవరిస్తూ పాలన రంగాన్ని పూయించటం క్యాస్ట్రో లాంటి వాళ్లకు దక్కింది.

దీంతో లాటిన్ అమెరికన్ దేశాలకంటే తెలంగాణ తక్కువదేం కాదని రుజువయ్యింది. ప్రపంచంలో విప్లవాల ద్వారా సమత్వం ఏ విధంగా తెచ్చారో భారత రాజ్యాంగం ద్వారా అదే విధంగా సమత్వం తేవాలన్నది మన రాజ్యాంగం ధ్యేయమని అంబేద్కర్ చెప్పాడు. ఈటెల రాజేందర్ 2014-15 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ విద్యారంగాన్నికుండే బాధ్యతను చెబుతూ విద్యారంగానిపైన చేసే వ్యయాన్ని ఖర్చుగా మేం చూడం. మానవ వనరుల అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం పెట్టుబడిగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అనటమే తన నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుంది. పెట్టుబడి అంటే వ్యాపారం లో పెట్టేలాంటిదేం కాదు.లేక ఎవరి జేబులో నింపే లాభార్జన వ్యవహారం అంతకన్నా కాదు. ఒక సమాజ నిర్మా ణం కోసమై పెట్టే పెట్టుబడిగా దాన్ని చూడాలి. ఈ పెట్టుబడి ఎన్నో బాధల కు ఓర్చి నవ తెలంగాణ కాంక్షలకు రూపునిచ్చే బడ్జెట్ ఇది అని ఈటెల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సగర్వం గా చెప్పాడు.

విద్యారంగం ద్వారా ఒక సమాజాన్ని నిర్మించాలనే కుతూహలాన్ని వెలిబుచ్చాడు. అది కూడా మార్జినలైజ్ సెక్షన్‌పైన ఖర్చుగా చెప్పాడు. ఈ విద్యా రంగం నుంచి వచ్చేవారే రాబో యే సమాజానికి పునాది అనటం చాలా గొప్ప విషయం. రోడ్డు పై నిలుచుండి నినాదాలు చేయటం లాఠీదెబ్బలు తినటం, ఉద్యమాలు చేయటం వేరు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి ఆర్థిక ఇబ్బందులను సవరిస్తూ ఈటెల తన ప్రాథమిక లక్ష్యాలను మరిచిపోకపోవటం కీలకమైన అంశంగా చూడాలి.

విద్యపై చేసే ఖర్చును పెట్టుబడి అనటంతో ఏ వర్గంపైనే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నామన్నది చూడాలి. ఈ పెట్టుబడిని పేదవర్గాల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్నారని అర్థం. సమాజంలోనున్న అసమానతలను తుడిచివేస్తేనే అది పెట్టుబడిగా మారుతుంది. ఆ పెట్టుబడిని విద్యాలయాల ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది. సర్కారీ బడులను పునర్నిర్మాణం చేస్తేనే అది అభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే పేద విద్యార్థులపై పెట్టే ఖర్చు రాష్ర్టానికి, దేశానికి పెట్టుబడిగా మారుతుంది. పెట్టుబడి అన్నప్పుడు ఖర్చుచేసే ప్రతిపైసకు జవాబుదారీతనం ఉంటుం ది. ఈ బడ్జెట్‌తో తల్లిదండ్రులు ఉపాధ్యాయ వర్గం సమాజం మీద పెద్ద బాధ్యత కూడా పెడుతున్నారు.

పెట్టే ప్రతిపైసా ఖర్చును సద్వినియోగపడే విధంగా చూడాలి. ఆశించిన ఫలితాలను రాబట్టే విధంగా చూసుకోవాలి. ఖర్చుకు జవాబుదారీతనం కూడా ఉండాలి. జవాబుదారీతనమంటే ఒకరిపై పెత్తనం చేయటంకాదు, ఇతరుల తప్పులను వెతకటం కాదు, ఈ పని లో నిమగ్నులయ్యే విధంగా భాగస్వాముల్ని చేసి వారు వేస్తున్న ప్రతి అడుగును సమీక్ష చేసుకోవటం జరగాలి.

ఉద్యమంలో ఏవిధంగా పాత్రధారి అయ్యారో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ప్రజలను పాత్రధారులుగా చేస్తున్నామని ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ఇప్పటి వరకు గత పాలకులు విద్యారంగం మీద ఖర్చు చేయలేదని కాదు. కానీ విద్య కోసం వెచ్చించిన ఖర్చు ఎటుబోయిందో మనం గమనిస్తూనే వచ్చాం. కాబట్టే ఆ ఖర్చును ఒక పెట్టుబడిగా గుర్తించండని ఈటెల రాజేందర్ హెచ్చరిక చేస్తున్నాడు. భవిష్యత్తు కోసమై ప్రస్తుత సమాజం త్యాగం చేసి ఆశించిన ఫలితాలు సాధించినప్పుడే విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా మారుతుంది. ఇప్పటి వరకు విద్యారంగంలో జరిగిన లోపాలను గుర్తించండి. విద్యారంగంలో డ్రాప్ అవుట్స్ పెద్దఎత్తున జరుగుతున్నాయి. దాన్ని సరిచేయా లి. మధ్యాహ్న భోజన పథకంపై ఖర్చు చేసే కోట్లాది రూపాయలు సద్వినియోగం కావాలి. పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నది తమ ప్రభుత్వ ధ్యే యమని ఈటెల బడ్జెట్ ప్రసంగంలో పదే పదే చెప్పాడు. ప్రతిపైసను జాగ్రత్తగా వినియోగించండని ఈటెల రాజేందర్ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాడు.

ChukkaRamaiah

అనగా మన పెట్టుబడిని సామాజి క సంపత్తుగా మార్చండి అని అడుగుతున్నాడు. విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా మారితే భవిష్యత్తుకు ఈ పిల్లలు దేశ సంపదగా మారతారు. ప్రాథమిక స్థాయి నుంచే ప్రభుత్వ బడిలో చదివే ప్రతి విద్యార్థిపై కొంత డబ్బును ఫిక్స్ డ్ చేయటం లేక ఎడ్యుకేషనల్ ఇన్స్యూరెన్సుగా చేస్తే అది వారి భవిష్యత్తుకే భరోసా కల్పిస్తుంది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా మార్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకు ఈటెల రాజేందర్ శ్రీకారం చుట్టాడు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుచున్న 1 నుంచి 5 తరగతులు చదువుకునే పేద విద్యార్థులకు భవిష్యత్‌పై చదువుల కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఆ డబ్బు వారు ఉన్నత చదువులకు పోయినప్పుడు ఉపయోగపడుతుంది. పిల్లలు ప్రాథమిక స్థాయిలో చదువు నుంచి డ్రాప్ అవుట్ కాకుండా చూడాలి.
(ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

590

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ