మన రాష్ట్రం మన పరీక్షలు


Sat,November 1, 2014 03:38 AM

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల మద్దతు, విద్యారంగ నిపుణుల మద్దతూ ఉంటుంది.
ఇపుడు మన రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మనమే నిర్వహించుకుంటేనే తెలంగాణ విద్యకు మనుగడ ఉంటుంది.

మా ఇంటర్మీడియట్ పరీక్షలు మేమే నిర్వహించుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే ఉమ్మడిగానే నిర్వహించుదామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మా పరీక్షలు మేం నిర్వహించుతామంటుందోనన్న వాదన స్పష్టంగా అందరికీ అర్థమవుతూ వుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగానే నిర్వహించుదామనే విషయంపైననే పలు అనుమానాలకు తావిస్తున్నట్లుగా ఉంది. తెలంగాణ విద్యారంగం స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించుకుంటామని కరాఖండిగా చెప్పటం వెనుక గతం, గత అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్య వెనుక కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం బలంగా ఉన్నది. ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులు సవాల్ చేసే దశకు వచ్చాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ శక్తులు ఆడింది ఆటగా పాడింది పాటగా పరిస్థితి తయారయ్యింది. ఇపుడు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కూడా కార్పొరేట్ రంగం తెలంగాణ ప్రభుత్వంపై పెత్తనం చేయకుండా చూడాలని ఇక్కడి విద్యారంగం నిపుణులు అంటున్నారు.

ChukkaRamaiah

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎగిసిపడిన సమయంలో విద్యారంగం కీలకపాత్ర పోషించింది. ప్రధానంగా విద్యార్థులు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణ విద్యపై కార్పొరేట్ రంగం కోరలు దిగ టం కళ్లారా చూసిన విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ విద్యారంగం స్వేచ్ఛగా శిరసెత్తుకు ని నిలుస్తుందని భావించారు. రాష్ట్రం వచ్చిన తర్వా త కూడా కార్పొరేట్ రంగం ఉక్కుపాదం ఇంటర్ బోర్డుపై ఉండటం ఎంతవరకు సమంజసమో విజ్ఞు లే ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను చూడవలసి ఉంది. హైదరాబా ద్ నగరంలో కార్పొరేట్ విద్యారంగం పాతుకుపోయింది. ఇంటర్ పరీక్షల ఫలితాలను కార్పొరేట్ రంగం ర్యాంకుల మాయాజాలంగా వ్యాపార పంటగా మార్చుకుంది. హైదరాబాద్‌లో కార్పొరేట్ రంగం పునాదులను కదలకుండా చూసుకునేందుకు ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా జరుపుకుందామని పాటను పదేపదే వల్లెవేస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూనారిల్లుతున్న ప్రభుత్వ విద్యారంగం తిరిగి పూర్వవైభవాన్ని పొందాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు కళకళలాడితేనే సబ్బండ వర్ణాలకు విద్య సమానంగా అందుతుంది.

ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ దృష్టితోనే చూడవలసి ఉంది. తమ చదువును ఎలా సమర్థవంతం చేసుకోవాలో తెలంగాణకు తెలుసు. టీచింగ్,వెర్నింగ్‌కు సంబంధించి తెలంగాణకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంట ర్ పరీక్షలను తనకు తాను నిర్వహించుకుంటానంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక కార్పొరేట్ సంస్థలు కోట్లాదిరూపాయలు ఒక్క వ్యాపార ప్రకటనలకే గుప్పిస్తున్నారంటే దాని వెనుకవున్న అసలు కథను అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల మైండ్‌సెట్ అంతా పిల్లల ర్యాంకుల వైపు కు మళ్లేటట్లు చేసి మొత్తం విద్యారంగాన్నే తమ కబంధహ స్తాలలోకి తీసుకున్న కార్పొరేట్ రంగం అసలు రూపాన్ని అర్థం చేసుకోకపోవటం చేయాలి.

ప్రైవేటీకరణ వల్ల విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయాన్ని గమనించటం వల్లనే రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, విద్యారంగ నిపుణులు కార్పొరేట్ రంగంపై గురిపెట్టే లక్ష్యాలను రచించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ విద్యారంగాన్ని అక్షరాలా కాపాడాలన్న ధ్యేయంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీనికి ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలు జరుపుకుందామని అడ్డుపడుతున్నారు. ఇక్కడ ఇద్దరు విద్యామంత్రుల సంవాదం వెనుక వున్న అసలు రహస్యాన్ని గమనించకపోతే నిజాలు బైటపడవు.
హైదరాబాద్‌లో వున్న కార్పొరేట్ విద్యా రంగం ఇంటర్మీడియట్ పరీక్ష ఉమ్మడిగా ఉంటేనే బతికి బట్టకట్ట కలుగుతుంది. పిల్లలకు, బోధనకు, వెర్నింగ్‌కు, పరీక్షలకు సంబంధం ఉంది కాబట్టి తెలంగాణ ప్రాం తంలో ప్రత్యేకంగా పరీక్షలు జరగాలని పట్టుపడుతున్నారు.

మా చదువును మేం చెప్పుకుంటాం, మా పరీక్షలు మేం నిర్వహించుకుంటాం అంటున్నప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షలు ఎలా నిర్వహించగలుగుతారు. ఇంటర్ పరీక్షలు ఎవరికివారు నిర్వహించుకుంటే మా బడులు, కాలేజీలు బాగుపడతాయని తెలంగాణ విద్యావేత్తలు అంటున్నారు. కార్పొరేటు శక్తులు బలంగా ఉన్నాయి. విద్యా రంగం నుం చి కార్పొరేట్ శక్తులను వేరుచేయాలంటే ఎవరికి వారుగా పరీక్షలు నిర్వహించుకోవటం జరగాలి. పరీక్ష లో ఇచ్చే క్వశ్చన్ బ్యాంక్‌తో కార్పొరేట్ వ్యవస్థ బతుకుతుంది. దీంతోటే కార్పొరేట్ వ్యవస్థ ఇంటర్ బోర్డును శాసించే దశకు వచ్చింది. పరీక్షలు ఎలా ఉండాలి? చివరకు ప్రశ్నాపత్రాలు ఎలా ఉండాలి? చివరకు సిలబస్‌లు ఎలా ఉండా లి? అన్న విషయంలోకి కూడా కార్పొరేట్ రంగం జొరబడిందంటే దాని వ్రేళ్లు ఎంత బలంగా ఉన్నా యో అర్థమవుతుంది.

ఇంటర్ పరీక్షల ఫలితాలను కార్పొరేట్ కాలేజీల ఫలితాలుగా మార్చివేశారు. అసలు తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక అంశం విద్యారంగమేనన్నది మరువరాదు. కార్పొరేట్ విద్యారంగాన్ని తెలంగాణ కబంధ హస్తాల నుంచి బయటపడేందుకే తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. తెలంగాణ ప్రజల వాకిళ్ల దగ్గరకు చదువు వెళ్లాలంటే ఇంటర్మీడియట్ ఎవరి పరీక్షలు వాళ్లే వేర్వేరుగా నిర్వహించుకోవాలి.ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా ఎందుకు జరపాలని ఒత్తిడి చేస్తున్నారోనన్న అసలు చిదంబర రహస్యం తెలుసుకోకపోతే కష్టం, తెలంగాణలోని సామాజిక స్థితిగతులు, ఇక్కడ టీచింగ్, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించుకోవటం సముచితం గా ఉంటుంది. విద్యను ఖరీదైన సరుకుగా మార్కెట్ వ్యవస్థగా మార్చిన కార్పొరేట్ రంగాన్ని ఎంత తొందరగా వొదిలించుకుంటేనే విద్యారంగం ప్రక్షాళన జరుగుతున్నది.తెలంగాణ తరతరాలుగా చదువుకు దూర మైన వర్గాలు ఇప్పుడిప్పుడే ఉన్న విద్యా రంగంలోకి అడుగుపెడుతున్నారు.

కార్పొరేట్ రంగం వల్ల అట్టడుగు వర్గాలకు చదువు అందకుండా పోయే ప్రమాదముంది.ప్రధానంగా ప్రాథమిక అవసరమైన విద్యా రంగాన్ని సంరక్షించుకోవాలి. గత పాలకులు ప్రభు త్వ విద్యారంగాన్ని నీరుగార్చాయి. కార్పొరేట్ రంగం బలపడటానికి గత పాలనలోని పాలకులతోపాటు బ్యూరొక్రసీ కూడా అం దుకు దోహదపడింది. కార్పొరేట్ రంగం బలహీనపడితేనే ఈ రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలకు విద్య అందుతుంది. తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల మద్దతు, విద్యారంగ నిపుణుల మద్దతూ ఉంటుంది. ఇపుడు మన రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మనమే నిర్వహించుకుంటేనే తెలంగాణ విద్యకు మనుగడ ఉంటుంది.
(రచయిత:్ర పముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

3588

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Featured Articles