విడిపోయినా పరీక్ష ఒక్కటా?


Sat,October 18, 2014 02:57 AM

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా
విడిపోయాం కాబట్టి ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా వాళ్లు పనిచేసుకోవడమే ఉత్తమం. అందువలన సమస్యల్ని లోతుగా విశ్లేషిస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ తమ పరీక్షల్ని నిర్వహించుకోవడమే ఉత్తమం.

విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే దశ ఇంటర్మీడియట్ దశ. దాం తో పాటే అది విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధికే కాక రాష్ట్రాభివృద్ధికి దారితీస్తుంది. రాష్ట్రం విడిపోయిన దశ లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు తామే స్వతంవూతంగా పరీక్షలు నిర్వహించుకుంటామని అంటుంటే ఆంవూధవూపదేశ్ ప్రభు త్వం మాత్రం ఉమ్మడిగానే నిర్వహించాలని అంటున్నది. ఎవరి వాదనలు వారికి సరిగానే అనిపిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తన అస్తిత్వాన్ని పునర్నిర్మించుకోవడం ధ్యేయం గా పనిచేస్తున్నది. రాబోయే తరాన్ని తమ రాష్ట్ర ఆశల, ఆకాంక్షల నేపథ్యంలో తీర్చిదిద్దాలనుకుంటున్నది. అందుకు విద్యారంగాన్ని క్షేత్రంగా చేసుకుంటున్నది. ఇంటర్ విద్యలో సంస్కరణలు, మార్పులు కోరుకుంటున్నది. అందులో భాగం గా తన పరీక్షల్ని తనే నిర్వహించాలనుకుంటున్నది.

ఇవాళ రాష్ట్రంలో ఇంటర్ విద్యలో తనదైన ‘విజన్’తో ప్రవేశిస్తున్నది. అధిక సంఖ్యాకులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నది. దశాబ్దాలుగా ప్రాథమిక విద్యకు కూడా నోచుకోని ఈ వర్గాలు ఫస్ట్ లెర్నర్స్‌గా ఇంటర్‌లో ప్రవేశిస్తున్నారు. రెండవది- తెలంగాణలో ప్రైవేట్, కార్పోరే టు రంగంలోని విద్యా సంస్థలకన్నా ప్రభు త్వ ఆధీనంలోని కాలేజీలలోనే ఎక్కు వ శాతం మంది విద్యార్థులు చదువుతున్నా రు. ఈ దశలో ప్రభుత్వం అక్కడి చదువు ను సమీక్షించుకోవాలనుకుంటున్నది. ముఖ్యంగా విద్యారంగంలో టీచింగ్‌కు, లెర్నింగ్ ప్రాసెస్‌కు, మూల్యాంకనానికి మధ్య సంబంధం ఉంటుంది. ఫలితాలు వచ్చిన తర్వాత సమీక్షించుకుంటే ఎక్కడ లోపం ఉందో, దాన్ని ఎలా అధిగమించాలో తెలుస్తుంది. ప్రభుత్వం పునాది నుంచే పునర్నిర్మించుకోవాలని అనుకుంటున్నది.

కాబట్టి ప్రాథమిక విద్య నుంచి సంస్కరణలు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇంటర్‌లోనూ బోధనాభ్యాసన ప్రక్రియల్ని బలోపేతం చేయాలని, ప్రమాణాలను పెంచాలని, అఖిలభారత స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ నిర్వహించే పోటీ పరీక్షలకు తన విద్యార్థులను సంసిద్ధం చేయాలని యోచిస్తున్నది. అందుకనుగుణంగానే తమ పరీక్షల్ని తాము నిర్వహిస్తామని అంటున్నది. యిప్పటిదాకా ఇంటర్మీడియట్ విద్యలో తెలంగాణ బాగా వెనుకబడి వున్నది. ఇందుకు కారణాలను వెతికి ఇంటర్ విద్యను పటిష్టం చేసుకునేందుకు స్వరాష్ట్రంలో కృషి చేస్తున్నది. తెలంగాణలో ఇంటర్ విద్యకు కార్పొరేట్ వాసన అంతగా లేదు. తెలంగాణ పది జిల్లాల్లో కార్పొరేట్ విద్యావ్యవస్థ విస్తరించలేదు. ఎక్కువశాతం మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే చదువుకుంటున్నారు.

కాబటి టీచింగ్, లెర్నింగ్‌కు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర విద్యారంగం కసరత్తు చేస్తున్నది. అందుకే తన రాష్ట్రంలో తానే ఇంటర్ పరీక్షలను నిర్వహించుకుంటామని ప్రకటించుకోవడం సరైనది. ఎంసెట్ ఉమ్మడిగా చేస్తారా? ఇంటర్ మార్కులను వెయిటేజీగా తీసుకుంటారా? లేదా? అన్నది వేరే విషయం. తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాత్రం ఈ ఏడాది నుంచే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకుంటుందని తేల్చి చెప్పడం సరైనది.
అదే ఆంధ్రవూపదేశ్ విషయానికి వస్తే.. అది కంటిన్యూయింగ్ స్టేట్. ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రం. తల్లిదంవూడులు అక్షరాస్యులు. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రం. పబ్లిక్ రంగం కన్నా ప్రైవేట్, కార్పోరేటు రంగంలోనే అక్కడ అధిక సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వరంగ విద్యాసంస్థలకు కార్పోరేటు రంగ విద్యాసంస్థలకు లక్ష్యాలలో తేడాలుంటాయి.

కాబట్టి అక్కడి బోధనాభ్యసన ప్రక్రియలు ఇక్కడికి తేడా ఉంటుంది. పాలకవర్గాలు దశాబ్దాలుగా ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రాంతంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఇంతవరకు ఇంటర్‌విద్య స్థాయిలో ఎంత బలమైన పునాది పడాలో అంతబలమైన పునాది పడలేదు. ఈ పరిస్థితి సీమాంధ్ర ప్రాంతంలో లేదు. కాబట్టి ఎవరి పరీక్షలు వారు నిర్వహించుకోవడమే సబబుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం.. అందువల్లనే విద్యను రాష్ట్ర ఆధీనంలో ఉండాలని చెప్పింది. తమ తమ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యను గరుపుకోవచ్చని నిర్వచించింది. ఇలా కాకపోతే అకడమిక్ పరంగానే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగాను సమస్యలు తలెత్తుతాయి.

సాధారణంగా ఇంటర్ బోర్డు పరీక్షల కోసం ‘ఆగస్టు’ నెల నుంచి సన్నాహాలు మొదలవుతాయి. సెప్టెంబర్‌లో రాబోయే సమస్యల్ని విశ్లేషించుకొంటారు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్ని ఎత్తివేయాలని అనుకుంటున్నది.

chukkaramaiya

దీనిపై రెండు రాష్ట్రాలలో ఏకాభివూపాయం లేదు. సాధారణంగా ఇంటర్ పరీక్షలలో ఏదైనా తప్పు దొర్లితే సంబంధిత రాష్ట్ర విద్యామంత్రి బాధ్యత వహిస్తారు. ఉమ్మడిగా నిర్వహించినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే. గతంలో అనుకోని విధంగా ఇంటర్ పేపర్ లీకేజి అయ్యింది. అది అవిభక్త ఆంధ్రవూపదేశ్‌లో కాబట్టి ఆనాటి విద్యాశాఖామంత్రి బాధ్యత వహించాడు. యిప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక పరీక్షలు విషయంలో అవకతవకలు జరిగితే ఎవరు నైతిక బాధ్యత వహించాలి? నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా వాళ్లు పనిచేసుకోవడమే ఉత్తమం. అందువలన సమస్యల్ని లోతుగా విశ్లేషిస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ తమ పరీక్షల్ని నిర్వహించుకోవడమే ఉత్తమం.chukkaramaiya
(రచయిత: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)

550

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Featured Articles