మన నేలపై మన చరిత్ర


Wed,July 2, 2014 01:05 AM

చుక్కా రామయ్య

తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్ని, ఈ నేల చరిత్రను కొత్తతరాలకు అందించాలి. ఎగిసిన ఈ పోరాటాల నుంచి జనించిన చైతన్యాన్ని కొత్తతరాలు అందిపుచ్చుకుని నవనిర్మాణాలు చేయాలి. ఈ సుదీర్ఘ ఉద్యమ సందర్భంగా కొనసాగిన సాం స్కతిక పోరాటం ప్రపంచానికే గొప్ప పాఠ్యాంశంగా నిలుస్తుంది.

ఈ ప్రపంచీకరణ ప్రపంచంలో, మార్కె ట్ సమాజంలో ఇక ఉద్యమాలకు కాలం చెల్లిందని పెట్టుబడీదారీ సమాజం ఢంకాబజాయిస్తుంటే ఆ ఆధిపత్య పెట్టుబడీదారి కోటలను పగులగొట్టగలిగింది ఒక్క తెలంగాణ రాష్ట్రసాధన పోరాటమే. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ఈ నేలకే కాదు అస్థిత్వ పోరాటాలతో మసలుతున్న ప్రపంచానికి ఒక సిద్ధాం త పునాదిగా నిలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం సందర్భంగా గొప్ప సాహిత్యం వచ్చింది. ఇది మామూలు విష యం కాదు. ఈ సాహిత్యం పోరాటాన్ని నిత్యం పదునెక్కించి ఉద్యమకుంపటిని రగిలించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ 134ఏళ్లలో వందల సం ఖ్యలో పాటలు పుట్టుకొచ్చాయి. గుట్టలకొద్ది పాటలు వచ్చాయి. కావల్సినంత వచన కవిత్వం వచ్చింది. వేల సంఖ్యలో వ్యాసాలు వచ్చాయి.

తెలంగాణ ఉద్య మ వ్యాసం లేకుండా పత్రికల ఎడిట్ పేజీలే లేవు. వాటి నిండా ఉద్యమ వ్యాసాలు వచ్చాయి. వందలమంది కవులు, వేలమంది కళాకారులు సాహిత్య, సాంస్కతిక సైన్యంగా రచయితలు ఎనలేని సాహి త్య సంపదను సష్టించారు. ఈ సాహిత్య సాం స్కతిక సంపదను చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి. 1940-1950కాలంలో తెలంగాణ నేలంతా భూమి కోసం పోరాటంగా ఎగిసిపడింది. భారతదేశానికే దున్నేవానిదే భూమి అన్న నినాదాన్ని అందించింది. ఆ పోరాటంలో 4వేల మందికి పైగా అసువులు బాశా రు. వేలాదిమంది ప్రజలు ఆ పోరులో దూకారు. ఆయుధులై సాయుధులై పోరాటం చేశారు. ఆ పోరా టం జరిగి 60 ఏళ్లు గడుస్తున్నప్పటికినీ దీనిపై సమగ్ర చరిత్ర రికార్డు కాలేదు.

కొందరు కమ్యూనిస్టు నేత లు,దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రపుల్లారెడ్డి లాంటి కొందరు మాత్రమే కొన్ని పుస్తకాలు రాశారు. ఒక సుదీర్ఘమైన భూమి పోరాటం చరిత్రను సమగ్రంగా రికార్డు చేసుకోలేకపోవటం బాధాకరం. 1969లో ఎగిసిపడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కూడా సమగ్రం గా రికార్డు చేసుకోలేకపోయాం. ఆనాటి ఉద్యమానికి సంబంధించి వచ్చిన సాహిత్యం, చరిత్ర చాలా తక్కు వ. రావల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు మలిదశ ఉద్యమం 1996 తర్వాత నుంచి మొదలైన తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ ప్రస్థానాన్ని సర్వసమగ్రం గా యదార్థ చరిత్రను లిఖించవలసి ఉన్నది.

తెలంగాణ భాష, యాస, సంస్కతి, 10 జిల్లాల ప్రత్యేక సంస్కతులు,ఈ10 జిల్లాల్లో కొనసాగిన ఉద్యమం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించిన తీరు, ప్రజలను ఉద్యమదారిపై నడిపించిన తీరునంతా క్షుణ్ణం గా రికార్డు చేయాలి. ప్రజాసంఘాల పాత్ర దగ్గర నుంచి రాజకీయపార్టీగా ప్రస్థానం కొనసాగించిన టీఆర్‌ఎస్ వరకు జరిపిన ఉద్యమాలను సర్వసమగ్రంగా చరిత్రలో పొందుపరచాలి. తెలంగాణ మట్టికున్న గొప్పతనంతో రాబోయే చరిత్ర పుష్పించాలి. కొత్త చరిత్రకు ద్వారాలు తెరిచేందుకు మన నేలపై మన చరిత్రను భావితరం చేతిలో పెట్టాలి.

మన నేలపై మన చరిత్రను రికార్డు చేసుకోవటానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అమెరికాలోని ఓహియా రాష్ట్రంలోని సిల్‌సినాటీలో ఫ్రీడవ్‌ుస్టాచ్యూను చూశాను. అక్కడికి వెళ్లి ఆ ఫ్రీడవ్‌ు స్టాచ్యూను చూస్తే ఆఫ్రో అమెరికన్స్ చేసిన పోరాటం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. సిల్‌సినాటీలో ఆ నేలపై జరిగిన పోరాటాన్ని భావితరాలకు అందించటంకోసం, అక్కడ జరిగిన ఉద్యమాలన్నింటిని రికార్డు చేసి భద్రపరిచారు. ఈ చరిత్రనంతా రికార్డు చేసి పదిలపరచటానికి ఆరంతస్థుల బిల్డింగ్‌ను ఇందుకు కేటాయించారు. అందులోకి వెళ్లిచూస్తే అక్కడ జరిగిన ప్రజాపోరాటాలన్నింటిని, నల్లజాతివారు తమ హక్కుల కోసం జరిపిన ఉద్యమాలన్నింటిని మనం కళ్లారా చూడవచ్చు.అందులో తేదీల వారీగా అక్కడ జరిగిన ఉద్యమాలను రికార్డు చేసి జాగ్రత్తగా పదిల పరిచారు.
అదే విధంగా తెలంగాణ నేలపై జరిగిన ఉద్యమాలను, పోరాటాలను, ఈనాటి చరిత్రను రికార్డు చేసేందుకు ఒక మ్యూజియంను నెలకొల్పుకోవాలి.

ఆనా టి తెలంగాణ పోరాటం నుంచి ఈనాటి మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా రాష్ట్రం సిద్ధించినంత వర కూ.. చరిత్రనంతా తేదీల వారీగా రికార్డు చేసి పెట్టా లి.ఆనాటి ఉద్యమాలలో జరిగిన సంఘటనలకు గుర్తుగా మ్యూజియం నెలకొల్పాలి. తెలంగాణ సాం స్కతిక ఆనవాళ్లను అందులో రికార్డు చేయాలి. ప్రజాపోరాటాల సాహత్యాన్ని గ్రంథస్థం చేయాలి. ఉద్యమ పాటలన్నింటిని పదిలం చేసుకోవాలి. తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి పల్లె గుండెను తొలుచుకొని పుట్టుకొచ్చిన సాహిత్యాన్నంతా చరిత్రలో నిక్షిప్తం చేసుకోవాలి. మన నేలపై మన చరిత్ర ను తెలుసుకునేందుకు ఈ మ్యూజియంను నెలకొల్పుకోవాలి. తెలంగాణలో వున్న వందలాది మంది కవులు, రచయితల చేతులతో ఈ బహత్తర కార్యక్రమం పూర్తి చేయాలి. తననేల మీద జరిగిన సామాజిక సంఘర్షణలు, సామాజిక మార్పులు తెలుసుకు న్న తరమే కొత్త చరిత్రను సష్టించగలుగుతుంది.

చుక్కా రామయ్య
(రచయిత విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు)
అమెరికా నుంచి

908

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ