మరువలేని రోజు...


Fri,June 20, 2014 11:25 PM

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర్మాతలు. వీళ్లందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశాభివృద్ధిలో, రాష్ర్టాభివద్ధిలో పాలుపంచుకున్న దేశభక్తులు. ప్రకతి వనరులకు, మానవ వనరులను అనుసంధానం చేసే జ్ఞాన సంపద కావాలి. దూరదృష్టి శాశ్వత ప్రయోజనం కలిగించే లక్ష్యం గల నాయకత్వం అవసరం.

Chukka-Ramaiah2014 జూన్ మొదటి తారీఖు నా జీవితంలో మరువలేని రోజు. గత ముప్ఫై ఏళ్లుగా ఉదయాన్నే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేయడం నాకు అలవాటు. నాలాగే అనేక మంది రోజూ వస్తుంటా రు. వాళ్ళందరిని కలుసుకోవడం, అప్పుడప్పుడు అక్కడ కొత్తవాళ్ళతో పరిచయం ఏర్పడడం, వాళ్ళందరిని చూస్తూ ఎన్నో కొత్తఆలోచనలు, భావాలు నాలో రూపుదిద్దుకుంటాయి. అలాగే ఆయా సందర్భాల లో సుళ్ళు తిరిగే నా ఆలోచనలకు, భావాలకు అక్షర రూపమిస్తూ వచ్చాను. ఇదీ నా సహజ దినచర్య. ఈ మధ్య నాకు ఆరోగ్యం సహకరించకపోవడం వలన ఇటీవల కొంతకాలంగా వాకింగ్ మానేశాను. ఇవాళ ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో తెలియదు నడకను మళ్ళీ సాగించాను. కూడళ్లలో ఎక్కడ చూచినా తెలంగాణ ఆవిర్భావ ప్రకటనలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మనుషుల ముఖాల మీద కళ కనబడుతుంది. దీనికి కారణాలు అన్వేషిస్తూ బోతే నాకు అరవైఏళ్ళ కిందినాటి స్మతులు జ్ఞప్తికి వచ్చాయి.

అది 1947 ఆగస్టు ఏడో తేది.ఆంధ్ర మహా సభ కార్యకర్తలుగా ఐదుగురం మిత్రులం రఘునాధపల్లి దగ్గర గల వెల్ది గ్రామం చేరుకు న్నాం. అక్కడ ఒక సభ నిర్వహించాలని పార్టీ ఆదేశం. ఆ మేరకు మేము అక్కడికి వెళ్తే సమావేశం నిర్వహిస్తే అక్కడి పోలీసు పటేలు మాపై కేసు బనాయించారు. ఆ తర్వాత ఆ మాదిరిగా మా పై రోజు కో కేసు పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా మమ్మల్ని రఘునాథపల్లి, జన గాం, నల్లగొండ, చంచల్‌గూడ, అక్కడి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాదు జైలుకు తరలించారు. ఈలోపే ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకుం టుంటే మేమూ జరుపుకున్నాం. అదొక వర్ణనాతీతమైన మానసికానందం. అది బాహ్యప్రేరితం కాదు. అంతర్ప్రేరితం. ఇవాళ నాకు యూనివర్సిటీలో అదే వాతావరణం కనిపించింది. ఒక ఆధిపత్య, భావజాలం నుంచి నా తెలంగాణ దాస్యశంఖలాలను తెంచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ శక్తులు వివిధ రూపాల్లో ఉండవచ్చు. జైలులో నుంచి యావజ్జీవ ఖైదీలను విడుదల చేస్తుంటే వాళ్లలో ఏ ఆనందం కనబడుతుందో ఇవాళ అదే ఆనందం. అతనికి భార్యాపిల్లలు లేకపోవచ్చు. ఆస్తిపాస్తులు లేకపోవ చ్చు.ఉపాధి అవకాశాలు లేకపోవచ్చు. కాని పంజ రం నుంచి విడుదలయిన పక్షి, స్వేచ్ఛ ఉంది. సంతోషం ఉంది. అందుకే అందరూ తెలంగాణ వచ్చింది కదా సార్ అన్నారు. అందులో కొందరు విద్యార్థులున్నారు.కొందరు ఆడవాళ్లున్నారు. కొంద రు రిటైర్డు ఉద్యోగులు ఉన్నారు.

ముఖ్యంగా నాకు ఈ రోజు తారసపడిన వారిలో ఇద్దరు విద్యార్థులున్నారు. నాకు వారెవరో అంతకు ముందు కూడా అంతగా పరిచయమూ లేదు. అం దులో ఒకమ్మాయి అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పి.జి. పూర్తి చేసి ఇండియాకు వచ్చింది. మరొకతను బి.టెక్. పూర్తి చేసి పి.జి. కోసమై విదేశాలకు వెళ్తున్నాడు. అందులో అమ్మాయిని పి.జి. పూర్తిచేసి వచ్చావు కదా ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. దానికి ఆమె ప్రొఫెసర్‌ను కావాలనుంది అంది. మరి తెలంగాణ వచ్చిందికదా! నేను ఈ ప్రాంతానికి సేవ చేయవచ్చు కదా అన్నాను. మన రాష్ట్రంలో ఎన్నో వనరులున్నాయి. ప్రకతి సంపద ఉంది. వీటిని ఎవరు ఇంతవరకు డాటాబేస్ చేయలేదు. ఆ పని చెయ్యి బాగుంటుదన్నాను. ఇవాళ పరిశోధన ఎంత అవసరమో దాని కి అవసరమైన డాటాబేస్ కూడా అంత ముఖ్యమైనదన్నాను. దీనివల్ల పరిశోధకులు పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వస్తారు. అంతేకాదు ఉభయుల స్ఫూర్తి పొంది దానిని వినియోగవస్తువుగా మలిచే అవకాశం ఉందన్నాను. దానితోపాటు మనదేశ జి.డి.పి. కూడా పెరుగుతుంది. దాని కి ఆ అమ్మాయి ఈ పనిపైననే దష్టి పెడతానన్న ది.ండో విద్యార్థిని ఉద్దేశించి అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని స్వదేశానికి తిరిగిరా అన్నా ను. అలా కొంత ముందుకు నడవగానే మహిళల గుంపు ఎదురుగా వస్తున్నారు.

సార్! ఈ మధ్య వాకింగుకు రావడం లేదు ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. వాళ్లందరు పరామర్శి స్తుంటే ఒక తండ్రిని తన బిడ్డలు అనునయిస్తుంటే ఎలా ఉం టుందో అలాంటి అనుభూతి కలిగింది. అందులో కొంతమంది అడ్వకేట్లుగా, లెక్చరర్లుగా, బ్యాంకు అధికారులుగా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పా లంటే ఇవాళ వాళ్ళు దేశ ఆర్థిక సంపద పెంపులో భాగమయ్యారు.దీనినే భాగస్వామ్య ప్రజాస్వా మ్యం అంటారు. రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీ కావడమే ప్రజాస్వామ్యం కాదు. దేశ సంపద ఉత్పత్తిలో భాగస్వామి అయితేనే ప్రజాస్వామ్య అవుతుం ది. ఇంకా కొంత ముందుకుపోతే రిటైర్డు భాగస్వా మ్య అధికారులు కనబడ్డారు. ఇవాళ దేశ జనాభా లో 15% రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరు పాత రోజుల్లాగా గతాన్ని నెమరు వేసుకొంటూ కూర్చోవడం లేదు. ఈ ప్రాంత పునర్నిర్మాణంలో తామెలా భాగస్వాములు కావాలో ఆలోచిస్తున్నా రు. చైనాలో అరవై ఏళ్లు దాటిన వాళ్ళు ఏదో ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని ఆల్విన్, వరంగల్లులోని ఆజాంజాహి మిల్లుల నుం చి రిటైరైన ఉద్యోగులు ఆయా కంపెనీలకు అవసరమైన చిన్న చిన్న పనిముట్లు తయారు చేసే చిన్నతరహా పరిశ్రమల్ని నెలకొల్పి పలువురికి ఉపాధి అవకాశం కల్పిస్తూనే పరోక్షంగా దేశ ఆర్థిక సంపద పటిష్టతకు కషి చేస్తున్నారు.

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర్మాతలు. వీళ్లందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశాభివద్ధిలో, రాష్ర్టాభివద్ధిలో పాలుపంచుకున్న దేశభక్తులు. ప్రకతి వనరులకు, మానవ వనరులను అనుసంధానం చేసే జ్ఞాన సంపద కావాలి. దూరదష్టి శాశ్వత ప్రయోజనం కలిగించే లక్ష్యం గల నాయకత్వం అవసరం. ఇటీవలి సాధారణ ఎన్నికలలో పాలక పక్షానికి ప్రజలు సంపూర్ణ అధికారమిచ్చారు. దానిని సోపానంగా చేసుకొని దేశంలో అభివద్ధి చెందిన రాష్ర్టాలకు దీటుగా మన తెలంగాణ రాష్ర్టాన్ని కూడా అభివ ద్ధిపరచుకునే అవకాశం ఉంది. అందుకు ఈ సంబురాలు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను. ఇస్తారనే నా సంబరం.

627

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Featured Articles