రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ


Fri,December 7, 2012 03:08 PM

small-retail-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్ లో 100 శాతం పెట్టుబడులు పెట్టవచ్చని క్యాబినేట్ తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ అండ్ కామర్స్ ఆఫ్ ఇండియా (ఫిక్కి) స్వాగతించింది. అయితే కాన్పడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ స్ట్రీ (సిఐఐ)తో పాటు, యూపీఏ భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలు అధికారం లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ తాజా నిర్ణ యంతో ఇంతకాలం అర్థవలస రాజ్యంగా కొనసాగుతున్న మన దేశసార్వభౌమత్వం పూర్తిగా అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టబడింది.

బహుళజాతి సంస్థల, విదేశీ గుత్తపెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలన్నీ భారతదేశం ఒక ‘సూపర్ మార్కెట్’గా భావించాయి. దేశంలోని సంపదను దోచుకునేందుకు విదేశీ గుత్త పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ఇప్పటికే భారత ప్రభుత్వంతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. లక్షలాది కోట్ల డాలర్ల ఎం.ఓ.యులు దేశీయ పారిక్షిశామిక రంగాన్ని కుదేలు చేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్యసమితి ముసుగులో వివిధ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా, దాని మిత్రదేశాలు భారత పాలకవర్గాన్ని నేరుగా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం 1950 జనవరి 26 నుంచే మొదలయింది.

భారత కంపెనీల చట్టం 1956లోని వివిధ నిబంధనల ప్రకా రం మన దేశం పౌరునితో సంబంధం కలిగి, ఆ వ్యక్తి భాగస్వామ్యంతో కంపెనీ నమోదు చేసుకుని, తన కార్యకలాపాలను కొనసాగించవచ్చు. ఇక్కడి సంపదంతా ఆ ముసుగులో దోచుకోవ చ్చు. ఈ చట్టం ముసుగులోనే లక్షలాది విదేశీ కంపెనీలు దేశంలో స్థాపించబడ్డాయి. ఇందులో యూనియన్ కారై్బడ్ లాంటి దుర్మార్గ కంపెనీలు వేలకొలది ఉన్నాయి. ఇప్పటికే టెలికం, ఆటోమొబైల్, విద్యుత్, ఆగ్రో, అణుశక్తి రంగాలను పూర్తి విదేశీ పెట్టుబడులతో నింపారు. ప్రభుత్వాలు నేడు రిటైల్ రంగాన్ని కూడ ఆ పెట్టుబడులతో నింపేందుకు తీర్మానించడం సరైంది కాదని వామపక్షాలు వాదిస్తూ, ఆ రంగాలతో రిటైల్ రంగాన్ని పోల్చడం కూడా సరియైంది కాదని చెప్తున్నాయి. ఈ రంగంలో విదేశీపెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర దుష్పలితాలు వస్తాయనేది వాస్తవం.

1978లో డంకెల్ నాయకత్వంలో జరిగిన ‘గాట్’ ఒప్పందం వల్ల దేశీ వ్యవసాయ రంగం పూర్తిగా సామ్రాజ్యవాద దేశాల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఒప్పందంతో దేశీయ వ్యవసాయ రంగంలోని విత్తనాలు, పురుగుమందులు, ఇత ర రసాయన మందులు పూర్తిగా సామ్రాజ్యవాద అనుకూల కంపెనీలతో ముడిపడి వ్యవసాయం కుచించుకుపోయింది. ప్రపంచబ్యాంకు ఆదేశాలతోనడుస్తున్న సబ్సీడీల ఉపసంహరణ వల్ల విత్తనాలు, పురుగుమందులు, యూరియా ధరలు అధికమై, ఆ కంపెనీల నకిలి ఉత్పతుల వల్ల దేశంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివిధ సర్వేలు తెలుపుతున్నాయి.
1991సంవత్సరం తర్వాత ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలతో దేశంలోని 120 కోట్ల జనాభాలో 10 శాతం అత్యంత ధనికులు తప్ప మిగతా 90 శాతం ప్రజానీకం జీవితం సంక్షోభంలో పడింది. ప్రతీ రంగం ప్రైవేటీకరణకు దారితీసింది.

లక్షల కోట్ల డాలర్ల సంపదను తన్నుకుపోయేందుకు ఉత్తర, మధ్య దక్షిణ భారతదేశంలోని సహజ సంపదను దోచుకునేందుకు అన్ని రకాల చట్టాలను తుంగలోకి తొక్కారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ, ఆదివాసేతర ప్రజలను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ముసుగులో నిర్వాసితులను చేస్తూ, గెంటేస్తున్నారు. లాల్‌గఢ్, సింగూర్, నందిక్షిగామ్, కళింగనగర్ లాంటి ప్రాంతా ల్లో బహుళ జాతి కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహత్తర పోరాటాలు నిర్వహించారు.

దేశంలోని కార్మిక చట్టాలన్నీ తుంగలో తొక్కి, అన్ని రకాల సంపదలను దోచిపె బహుళజాతి కంపెనీలకు, విదేశీ పెట్టుబడిదారులకు వారితో మిలాఖత్ అయ్యే దేశీయ పెట్టుబడిదారులకు దశాబ్దాల తరబడి అన్ని రకాల రాయితీ లు కల్పించారు. ప్రత్యేక అర్థిక మండళ్ల చట్టం యూపీఏ ప్రభుత్వం తీసుకురావడంతో దేశంలోని సంపదను విదేశీయలు దోచుకునేందుకు హద్దే లేకుండా పోయింది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 678 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో కేవలం 14 మాత్రమే ప్రజా పోరాటాలకు తలొగ్గి రద్దు చేశాయి. ఇక వేదాంతకు కేటాయించిన వేలాది ఎకరాల భూమిలోని ఇనుపరాతి ఖనిజం వెలికితీత వల్ల డంగ్రియాకంద్ తెగకు చెందిన గుట్టల మీద నివసించే ఆదివాసుల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులు రద్దు చేసింది.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేదాంత కంపెనీ సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది.దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఛిన్నాభిన్నమైంది. చేతి వృత్తులు పూర్తిగా నాశనం అయిపోయాయి. వ్యవసాయరంగం దిక్కుతోచని స్థితికి చేరిపోయింది. దీంతో ధనిక, మధ్యతరగతి రైతులతోసహా భూమిలేని నిరుపేదలు పట్టణాల బాట పడుతున్నారు. చిల్లర దుకాణాలు పెట్టుకొని కలో, గంజో తాగుతూ బతుకుతున్నారు. ఇంకోవైపు దేశంలోని అధికార, ప్రతిపక్షాలలోని ముఖ్యమంవూతులు, మంత్రులు, ఉన్నతాధికారులు బహుళజాతి కంపెనీలతో కుమ్మకై్క లక్షలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నందుకు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. దేశీయ బ్యాంకుల్లోనే కాకుండా స్విస్ బ్యాంకుల్లో కూడా దేశ రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల, ఉన్నతాధికార వార్గాలు దోచుకుని దాచుకున్న సంపద 80 లక్షల కోట్లకు చేరుకున్నది.

ఆరు దశాబ్దాలుగా పాలకులు అమలు చేస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పేదవాడు మరింత పేదవాడుగా మారి, బలవన్మరణం పొందుతున్నాడు. దేశంలోని రిటైల్ రంగంలో కోట్లాది మంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విధానాలు అమలవుతున్న గత మూడు దశాబ్దాలుగా దేశంలోని అన్నిరంగాల ప్రజలు అధోగతి పాలయ్యారు. కాగా ఇప్పుడు రిటైల్ రంగంలోకి ప్రత్యక్షంగా పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా 20 కోట్ల మందిని బజారు పాలు చేయడానికి ప్రయత్నా లు మొదలయ్యాయి. ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోనే దేశం ఎక్కువ కుంభకోణాలు, దేశసంపదను విదేశీ బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడాలు, నల్ల చట్టాల అమ లు, రాజకీయ హత్యలు, కోట్లాది మంది ప్రజ లు నిర్వాసితులు కావడం ఎక్కువైంది. ఇదం తా ప్రధాని మన్‌మోహన్ ప్రపంచ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి, ఇప్పుడు దాని ఏజెంటుగా పనిచేస్తున్న కారణంగానే జరుగుతున్నది. తాను సచ్ఛీలుడనని చెప్పుకుంటున్నా.., మంత్రివర్గం నిర్ణాయాలకు నైతిక బాధ్యత వహించవలిందే. కుంభకోణాలలో కూడా ప్రధాని పాత్ర ఉన్నట్లే.

ఎఫ్‌డీఐల నిర్ణయం కారణంగా.. దేశంలోని 10 లక్షలకు పైగా మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ నగరాలలో విదేశీ పెట్టుబడులతో పెద్ద పెద్ద మాల్స్ వెలుస్తాయి. ప్రారంభంలో తక్కువ ధర కు వస్తువులు అమ్మినట్లు నటించి, చిన్నచిన్న దుకాణాలన్నీ మూతపడ్డ తరువాత పెద్ద ఎత్తు న ధరలు పెంచి కోట్లాది రూపాయలు భారం ప్రజల మీద ప్రత్యక్షంగా వేస్తాయి.

దేశంలో ప్రస్తుతం రిటేల్ రంగంలో సాలీనా 25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. 2020 వరకు ఈ వ్యాపారం దాదాపు 70 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. మొత్తం విదేశీ గుత్త పెట్టుబడి దారులకు, బహుళజాతి సంస్థలకు దోచిపె కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పతనావస్థలో ఉన్న వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేటీకరణ జరిగి పెద్ద పెద్ద కమతాలుగా ఏర్పడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుంది. యాంత్రీకరణ పెరిగి భూమిలేని నిరుపేద సన్న,చిన్నకారు రైతాంగ జీవితం మరింత ఛిద్రం అవుతుంది. ఆంధ్రవూపదేశ్, తెలంగాణ ప్రజల జీవితాలలో మరింతగా చీకటి చేరుతుంది. తెలంగాణలోని సకల వనరులను దోచుకుంటున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడి దారుడు అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారులతో , బహుళజాతి సంస్థలతో మిలాఖత్ అయి స్థానిక వనరులను కొల్లగొడుతున్నారు. ఫలితంగాతెలంగాణ జిల్లాల్లోని సాధారణ రైతాంగం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని రైతాంగం అంతా ప్రభుత్వ విధానాలతో.. మరిం త కష్టాల పాలవుతారు. పండిస్తున్న పంటలు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడి జీవనోపాధి కోల్పోయి నగరంలో కూలీలుగా మారే పరిస్థితి దాపురిస్తుంది.

ప్రజలంతా ఏకమై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే మనగలుగుతాము.రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశ నిర్ణయా న్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకునేదాకా దేశవూపజలంతా ఏకమై పోరాడాలి. లేకుంటే.. మెజారిటీ ప్రజలు బహుళజాతి కంపెనీల దోపిడీ కోరల్లో చిక్కి బలి కాక తప్పదు.
-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘