అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ


Thu,December 13, 2012 04:21 PM

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు. అప్పటికే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడుతున్న సింగరేణి కార్మిక నాయకత్వం ‘సకలజనుల సమ్మె’లో మేము ముందుంటామని గర్జించారు. సింగరేణిలోని 64 వేల మంది కార్మికులు 13 తేదీ మొదటి షిప్ట్ నుంచే సమ్మెలోకి దిగారు. ఈ తెలంగాణ ఉద్యోగులకు, కార్మికులకు అండగా ఆర్టీసీ జాక్ 19వ తేదీ (అర్ధరాత్రి) మొదటి షిప్ట్ నుంచి సకల జనుల సమ్మెలో పాల్గొంటామని ప్రకటించింది. సింగరేణి సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ నాయకత్వంలో 15వ తేదీన సింగరేణి ప్రాంతంలోని శ్రీరాంపూర్, రామగుండం, భూపాల్‌పల్లిలో చేపట్టిన విస్తృత పర్యటన కార్మికులకు మరింత స్ఫూర్తి నిచ్చింది. మరోవైపు సింగరేణి, ఆర్టీసీ జాక్‌ల నాయకత్వంలో వివిధ డిపోల, గనుల దగ్గర మీటింగ్‌లు పెట్టి తెలంగా ణ ఉద్యమంలో వారి క్రియశీలక పాత్రను వివరించారు. మొక్కవోని ధైర్యంతో తెలంగాణ పోరాటం ఉధృతం చేయాలని ముందుకు కదిలారు.

13 వ తేదీ నుంచే మొదలు పెట్టిన సింగరేణి సమ్మెతో దిమ్మ తిరిగిన సీమాం ధ్ర ప్రభుత్వం సింగరేణి కార్మిక వాడలను సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసు బలగాలతో నింపింది. సింగరేణి ప్రాం తంలో పోలీసు బలగాల కవాతులకు గని కార్మికులు చెదరలేదు. బెదరలేదు. కార్మిక సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం, అధికారపార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టియుసి నాయకత్వంలోని కొంతమంది తెలంగాణ ద్రోహులు కలిసి మణుగూరు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులను నడిపించేందుకు చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ఉద్యమకారుల సహాయంతో కార్మికులు ఎదిరించారు. ఈ సీమాంధ్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని పాశవిక నిర్బంధంతో అణచివేయాలని శ్రీ కృష్ణ కమిటీలోని ఎనిమిదవ చాప్టర్‌ను అమలు పరుస్తూ సకల జనుల సమ్మె మీద కూడ తన ప్రతాపం చూపిస్తున్నది.

అలాగే విద్యుత్తు, నగేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రకటించి అత్యవసర సేవలు మినహా మిగతా పనులన్నింటిని బహిష్కరించారు.
17వ తేదీన ఉదయం నుంచే కార్మికులను తప్పుదోవ పట్టించేందుకు సమ్మె ను విరమించామని కార్మిక సంఘాల పేరుతో సింగరేణి యాజమాన్యం కరపవూతాలను ముద్రించింది. అయితే కార్మిక నాయకులు ప్రభుత్వ కుట్రలను ఛేదిస్తూ వాటిని కాల్చివేశారు. యాజమాన్యం కార్మికుల పోరాటాన్ని గతంలో అణిచివేసిన విధంగానే 17వ తేదీన అర్ధరాత్రి కార్మిక వాడలను పూర్తిగా దిగ్బంధించింది. కార్మికులను ఇండ్లనుంచి తీసుకెళ్ళి 18వ తేదీ ఉదయం 6 గంటలకు మొదటి షిప్ట్‌లో బావుల్లో దించాలని యత్నించింది. దీన్ని కార్మికులు, వారి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఈ సంఘటనల వివరాలు తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం సింగరేణి సమ్మెకు అండగా మేమున్నామని, తెలంగాణ పోరాటంలోని క్రియశీలక పాత్ర వహిస్తున్న ఉద్య మ సంఘాలను, ఆయా రాజకీయ పార్టీలను, వివిధ కార్మిక జాక్ లను కలిపి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది.

సీమాంధ్ర ప్రభుత్వం ‘సింగరేణి సమ్మె’ మీద చేస్తున్న దుర్మార్గ దమనకాండను ముక్తకం ఖండించేలా చొరవ చూపింది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ నాయకత్వంలో ముఖ్యమంత్రిని కలిసి కార్మికవాడలపై ‘ఆంబోతుల్లా కాలుదువుతున్న పోలీసు బలగాలను’ అదుపులో పెట్టాలని కోరగా, సీమాంధ్ర భూస్వా మ్య పెట్టుబడిదారులకు ప్రతినిధిగా ఉన్న కిరణ్‌కుమార్‌డ్డి తన అధికార దర్పం చూపారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన రాష్ట్ర ఏర్పాటు ఉద్య మంపై అమానవీయ దాడిని నిరసిస్తూ, సింగరేణి ప్రాంతానికి తరలుతామని అఖిలపక్షం స్పష్టం చేసింది. అక్కడ ఎటువంటి పరిణామాలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ అఖిల పక్ష బృందం ముఖ్యమంత్రి ప్రవర్తనకు తీవ్ర నిరసనను తెలిపింది.

‘తెలంగాణ నహీ దియే తో బస్ కా పయ్యా నహీ చెలేగా’ నహీ చెలేగా బస్ కా పయ్య నహీ చెలేగా’ అనే నినాదాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఒంటినిండా అద్దుకొని 19వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. 18 వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలోనే సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించిన సీమాంధ్ర మీడియాకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కొద్ది గంటల్లో సమ్మె సైరన్ మోగించారు.

19వ తేదీ మొదటి షిప్ట్ నుంచి ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోయి బస్‌లన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. టీటీల నుంచి మొదలుకొని డైరెక్టర్‌ల వరకు సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగుతున్నది. వీరు ఆర్టీసీని నాశనం చేసి సీమాంధ్ర పెట్టుబడిదారులకు ప్రతి సంవత్సరం వెయ్యికోట్ల రూపాయాలు దోచిపెడుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికార వర్గం ఈ సమ్మెను విఫలం చేసేందుకు 18వ తేదీ అర్ధరావూతికే నెల్లూరు, కర్నూలు, నుంచి తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు 300 అద్దె బస్సులను తెప్పించింది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, హైటెక్ పార్క్‌లలో నిలిపి బస్‌లను నడిపించేందుకు సీమాంధ్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఆర్టీసీ కార్మికులంతా ఏకమై అడ్డుకున్నారు. యూనియన్‌లన్నీ ఏకమై ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేశారు. ఎస్మా, మీసా చట్టాలతో కార్మికులను బెదిరించాలని చూసిన సీమాంధ్ర ప్రభుత్వ కుట్రలను మరోసారి భగ్నం చేశారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం అనుభవంలేని పోలీసులను, హోంగార్డులను, పోలీసు వ్యాను డ్రైవర్లను బస్సుల డ్రైవర్లుగా మార్చి హైదరాబాద్ నగరంలో బస్సులను తిప్పే ప్రయత్నం చేసింది.

22 తేదీన కృష్ణానగర్‌లో ప్రజల మీదికి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ మల్లేష్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురి ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పవూతిలో చేరారు. సంఘటనకు తీవ్రంగా స్పందించిన తెలంగాణలోని వివిధ వర్గా లు ఈ బస్ భవన్ ముట్టడించాయి. రాత్రి యాజమాన్యం విడుదల చేసిన కాంట్రాక్టు కార్మికుల ‘టెర్మినేషన్’ వెంటనే రద్దు చేయాలని, మల్లేష్ కుటుంబానికి పదిలక్షల ఎక్స్‌క్షిగేషియా ఇవ్వాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చిస్తామని హామీ ఇచ్చిన ఎం.డి తన పోలీసు బుద్ధిని చాటుకొని తెలంగాణ జేఏసీ ఆర్టీసీ జేఏసీ నాయకులను, ఎమ్మెల్యేలను, తెలంగాణ వాదులను అరెస్టు చేయించారు. అయితే కార్మికుల పోరా ట ఫలితంగా ప్రభుత్వం తరఫున రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలకు పిలిచింది. ప్రభుత్వం రాత్రి విడుదల చేసిన కాంట్రాక్టు కార్మికుల టర్మినేషన్ రద్దు చేస్తున్నామని హామీ ఇచ్చి సమ్మెను విరమించాల్సిందిగా కోరింది.

కానీ తెలంగాణ అంశం తేలేదాకా సమ్మె విరమణకు కార్మి కులు ససేమిరా అన్నా రు. తెలంగాణ ప్రాంతంలోని సుమారు పదివేల బస్సులు బస్ డిపోల నుంచి బయటికి రాలేదు. దీంతో మరోసారి యా జమాన్యం 25వ తేదీన ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచింది. చర్చలకు వెళ్ళిన ఆర్టీసీ నాయకులకు సంస్థ ఈ సమ్మె వల్ల ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయాల నష్టం వాటిల్లిందని ‘పవర్ ప్రజెం ద్వారా తెలిపింది. సమ్మెను విరమించి సంస్థను కాపాడుకోవల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యానికి తగిన సమాధానం ఇచ్చారు. ఐదున్నర దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా సంస్థ మనుగడ తీవ్రమైన సంక్షోభంలోకి ఎలా నెట్టబడిందో వివరాలతో సహా చెప్పారు.

నేడు సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో వివిధ రంగాలు పాల్గొంటున్నాయి. కాబట్టి మేము కూడా పాల్గొంటున్నాం. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడమే కాకుండా, పండుగ అడ్వాన్సులు కూడా చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు సింగరేణి యాజమాన్యం 24వ తేదీన ‘మస్టర్’కు డబుల్ వేతనం చెల్లిస్తామని ప్రకటిస్తూ కార్మికులను ప్రలోభాలకు గురిచేసి సకల జనుల సమ్మెను నీరు కార్చే ప్రయత్నం చేసింది. యాజమాన్య కుట్రలను బహిర్గత పరుస్తూ సింగరేణి జాక్, తెలంగాణ ప్రజావూఫంట్ నాయకత్వాలు కార్మికులను మరింత చైతన్యవంతం చేసి ఆ చర్యలను తిప్పికొట్టాయి. అయితే ఇప్పుడు సమ్మె చేస్తు న్న ఉద్యోగులకు, కార్మికులకు అండగా నిలబడుతూనే మిగతా రంగాలలోని లక్షల ఉద్యోగులను, కార్మికులను సమ్మెలోకి దించాల్సిన బాధ్యత ఉద్యమ నాయక త్వంపై ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు సమ్మె కొనసాగించాలి.

-చిక్కుడు ప్రభాకర్


35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles