ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!


Sat,July 27, 2013 12:51 AM

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తే సమ్మె చేస్తామనడం మానవత్వాన్ని దేశ సమక్షిగతను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. మనుషులుగా మనం మొదట మానవ విలువలకు, ప్రజాస్వామిక, రాజ్యాంగవిలువలకు కట్టుబడి ఉండాలి. విద్యావంతులుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ ప్రజల ప్రజస్వామిక హక్కు గురించి ఆలోచించాలి. ప్రపంచ, దేశ చరివూతలో, తెలుగు నేలలో ఎన్జీవోలు పెట్టుబడిదారులకు, భూస్వాములకు, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా సమ్మెలు ఎప్పుడు చేయలేదు. కానీ మొదటిసారిగా ఏపీ ఎన్జీవోలు ఆపని చేయాలనుకుంటు న్నారు.

అయిదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అన్నిరకాల వనరుల దోపిడీకి గురైంది. ఈ దోపిడీ చేస్తున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు అనతి కాలంలోనే కోట్లరూపాయలకు అధిపతులుగా మారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా సకల విధాల ప్రయత్నం చేస్తున్నారు. 1972లో ఇందిరాగాంధీ దగ్గర, 2000 సంవత్సరంలో చంద్ర బాబుద్వారా ఎల్‌కే అద్వానీ దగ్గర, 2009 డిసెంబర్ 23న, సోనియా గాంధీ దగ్గర తమ ప్రయోజనాల కోసం తెలంగాణను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర పెట్టుబడిదారులకు, రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయించుకోవల్సిన బాధ్యత బుద్ధిజీవులైన ఏపీ ఎన్జీవోలపై ఉన్నది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏపీ ఎన్జీవోలుగా నాయకత్వానికి వ్యతిరేకంగా విశాల సీమాంధ్ర ఉద్యోగులు ఆలోచించాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి తిరుపతి, అనంతపురం వరకు కోట్లాది మంది ప్రజలు హైదరాబాద్ నగరం రాజధానిగా ఉండడం వల్ల వారుపడుతున్న బాధలు వర్ణనాతీతం. అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతాన్ని దోచుకుంటున్న పెట్టుబడిదారులే సీమాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని, స్వరాష్ర్టం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్నారనే విషయం అక్కడి ప్రజలకు అర్థమైంది. అందుకే సమైక్యాంవూధవూపదేశ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటును ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ,సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నడవాల్సిన ఏపీ ఎన్జీవోల నాయకత్వం అందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు అడ్డుపడుతున్న తీరును సీమాంధ్ర ప్రజలు సహించరు. వూపజల ప్రయోజనానికి విరుద్ధంగా నడుస్తూ ఆ ప్రజలనే దోచుకున్న, పక్కవూపాంత ప్రజలను దోచుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనానికి అనుగుణంగా సమ్మె చేస్తామని ప్రకటించడం ‘తిన్నింటి వాసాలు లెక్కపెడ్డడమే’ అవుతుంది. సీమాంధ్ర పెట్టుబడిదారులకు వంతపాడుతూ సకల జనుల సమ్మెకు మించి న సమ్మె తెలంగాణ రాష్ట్రాన్ని. ఏర్పాటు చేస్తే చేస్తామని ప్రకటించడం అంటే సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేయడమే.

సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ర్టం ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రజలకు నీరు రాదని, హైదరాబాద్ నగరంలో రక్షణ ఉండదని, తెలంగాణ ప్రాంతం లో నక్సలిజం పెరుగుతుందని ‘గోబెల్స్’వూపచారాన్ని అందుకున్నారు.. ఇవేవీ కాంగ్రెస్ దగ్గర పని చేయక పోవడంతో నేడు ఎన్జీవోలను సమ్మెకు దించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని దోచుకొని అక్రమ భూ అక్రమణలు చేసుకున్న వారికి మాత్రమే రక్షణ గురించి ఆందోళన. కానీ సీమాం ధ్ర ప్రజలకు ఎటువంటి ఆందోళన లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా సీమాంవూధకు ప్రత్యేక రాజధాని ఏర్పడడం వలన కొత్త ఉద్యోగాలు లక్షలాదిగా ఉత్పన్నం అవుతాయి. కొత్త రాజధాని నిర్మాణంలో పెట్టుబడిదారులనుంచి మొదలుకొని సామన్య కూలి వరకు లక్షలాది మందికి ఉపాధి, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి, అనంతపురం వరకు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే రాజధాని నగరాన్ని పొందగల్గుతారు. దాదాపు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 900 కి.మీ. పొడవు కలిగిన సముద్ర తీరంలో అపారమైన పరిక్షిశమలను ఏర్పాటు చేసుకొని లక్షలాదిమంది యువతకు భవిష్యత్ తరాలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. ఈ విషయా న్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతూ భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు సీమాంధ్రనేతలు, ఏపీ ఎన్జీవోలు.

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఆహ్వానించడం ద్వారా సీమాంవూధలో ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాలను మరింత అభివృద్ధికి, దుర్భిక్షంగా ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేసుకోవచ్చును . ఈ అమోఘమైన అవకాశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం వలననే సాధ్యమవుతుంది. అంతేతప్ప రెండు ప్రాంతాలను దోచుకున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల దుర్మార్గపు ఆలోచనైన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకించడం ద్వారా సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమంటే రెండువూపాంతాల అభివృద్ధిని వేగిరపరచడమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడమంటే ఈ రెండు ప్రాంతాల అభివృద్ధిని అధఃపాతాళానికి తొక్కి సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల అభివృద్ధిని కోరడమే అనే విషయాన్ని ఏపీ ఎన్జీవోలు గ్రహిం చాలి. సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కుట్రలను వ్యతిరేకించి సీమాంధ్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సీమాంధ్ర ప్రజలలో ఒకరిగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఆహ్వానిస్తారని ఆశిద్దాం.

-చిక్కుడు ప్రభాకర్

177

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘