రాయినిగూడెం నుంచి బోధన్ వరకు


Mon,May 20, 2013 11:52 PM

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగాణ ఉద్యమకారులను, స్థానిక వనరుల రక్షణకు పోరాడుతున్న వారిని నిర్బంధాలకు గురిచేస్తున్నారు. విద్యార్థి, యువత, కార్మిక, కర్షక, మేధావులను అరె స్టు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా పోలీసులచే చిత్రహింసలకు గురిచేయడం పరిపాటి అయింది. బోధన్‌లో రైతు సదస్సులకు ముగింపు సదస్సు సందర్భంగా నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని, కార్మికులను, తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయించారు. ఈ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, చిత్రహింసలు కిరణ్‌కుమార్‌డ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2011లో వరంగల్ జిల్లా ములుగు మండలంలోని రాయిని గూడెం నుంచి మొదలయ్యాయి.

అటవీ గ్రామాల తాగు, సాగు నీరు, ఇతర మౌలిక సదుపాయాల పరిష్కారంలో మహిళల భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తున్నామనే పేరుతో మ్రహిళా సదస్సు పెట్టిన కిరణ్‌కుమర్ రెడ్డికి అక్కడి మహిళలు, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినులు తగు విధంగా గుణపాఠం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రశ్నిస్తూ ‘మీరు చేసిన బాగు మాకు చాలు, మా తెలంగాణ మాకు కావాలి’ అంటూ నినదించారు. దీంతో బిత్తరపోయిన పోలీసులు నిలదీసి న మహిళలను, విద్యార్థినులను తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించి రోజుల తరబడి జైల్లో బంధిచారు. ఆదివాసీ హిళలని కూడా లేకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి రేషన్ కార్డు, డ్వాక్రామహిళా రుణం, ప్రభుత్వ సౌకర్యాలను నిలిపి వేస్తామని బెదిరిం చి మహిళా చైతన్యాన్ని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేశారు. నాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి పర్యటించిన ప్రతిజిల్లాల్లో తెలంగాణవాదులను, ఉద్యమకారులను అరెస్టు చేయడం జరుగుతున్నది.

రాయినిగూడెం సంఘటన జరిగిన పదిరోజుల్లోనే కరీంనగర్ జిల్లా మహ ముత్తా రం మండలంలోని వల్లెంకుంట గ్రామంలో గ్రామంలో సాగు, తాగునీరు లేదని, రేషన్ అందడం లేదని, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని నినదించిన ప్రజలను గొడ్లను బాదినట్లు బాది కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో వారం రోజులు ప్రజల ను నిర్బంధించారు. నల్లగొండ జిల్లాలోని సూర్యపేట సదస్సులో ఫ్లోరైడ్ బాధితులు తాగునీరు కావాలని నినదించినందుకు ఆ ఉద్యమకారుల మీద పోలీసు అకృత్యాల కు అంతే లేకుండాపోయింది. ఇక పాలమూరు రైతు సదస్సు పేరుమీద మూడునెల ల క్రితం రైతు సదస్సుకు శ్రీకారం చుట్టిన సీఎం, ఆయన మంత్రి వర్గం ప్రజలమీద దండయాత్ర చేస్తున్నారు. ఈ దండయాత్ర పాలమూరు నుంచి మొదలైంది. పాలమూరు సదస్సుకు ముందు అక్కడి స్థానిక మంత్రి డి.కె.అరుణ జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులను వారం రోజుల ముందే అరెస్టు చేయించి నాన్ బెయిలబుల్ కేసు లు బనాయించి జిల్లా కేంద్ర కారాగారంలో బంధించారు.

ఇక సంగాడ్డిలో నైతే మెదక్ జిల్లాను మూడురోజుల ముందే అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లు చేసి ఉద్యమకారులను, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను బంధించారు. ఈవిధమైన దురహాంకారానికి నిరసనగా ఆ మరునాడే మెదక్ జిల్లా బంద్‌కు పిలుపునివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బోధన్‌లో అయితే మంత్రులు సుదర్శన్‌డ్డి, కన్నా లక్ష్మీనారాయణ, శ్రీధర్‌బాబు, సునితాలక్ష్మాడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి రైతు సదస్సు ముగింపు పేరుతో జిల్లా వ్యాప్తంగా నిజాంషగర్ పరిరక్షణ కమిటీ నాయకులను, సింగూరు జలాల పరిరక్షణ కమిటీ నాయకులను, నిజాంషుగర్ ఫ్యాక్టరీ కార్మికనాయకులను రెండురోజుల ముందే అరెస్టు చేశారు. బోధన్ నియోజక వర్గంలోని బోధ న్ అర్బన్, రూరల్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లోని వందలాది రైతులను, ఉద్యమకారులను అరెస్టు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రి 10గంటల వరకు మానసిక చిత్రహింసలకు గురిచేశారు. నిజామాబాద్‌లో వందలాది మందిని అరెస్టు చేసి రైతుసదస్సు ముగింపు కార్యవూకమం ముగిసిన తర్వాత వ్యక్తిగత పూచికత్తుతో వదిలి వేసారు.

ఈ ఉద్యమకారులంతా చేసిన నేరం ఏమంటే? దశాబ్దాల తరబడి రైతాంగానికి, కార్మిక లోకానికి పట్టెడు అన్నం పెట్టిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరవాలని అడగడం!, మెదక్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు కల్పించేందుకే నిర్మించిన సింగూరు ప్రాజెక్టు జలాలు నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజలకే కేటాయించాలని అనడం. 5 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును రోజుకు క్రషింగ్ చేయించే ఫ్యాక్టరీని నేడు 30,000 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్‌కు దిగజార్చి ఇటు రైతాంగం నోట్లో, అటు కార్మికుల నోట్లో మన్నుకొట్టిన ప్రైవేటీకరణనను వ్యతిరేకించడమే ప్రజలు చేసిన నేర మా? తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

గతంలో కూడా జన్మభూమి కార్యవూకమంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలా నే ప్రవర్తించాడు. తమ సమస్యలను విన్నవించడానికి ప్రయత్నించినందుకు వరంగల్ జిల్లా వంగపలి ్లనుంచి స్టేషన్ ఘన్‌పుర్ వరకు రైతాంగాన్ని ఈడ్చుకుంటూ వెళ్లా రు. అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు. చంద్రబాబు కూడా ఈ విధంగానే సమస్యల పరిష్కారం పేరుతో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను దబాయిస్తూ పోలీసు యంత్రాంగాన్ని ప్రజలమీదికి ఉసిగొలిపాడు. నాడు కూడా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మీద జరుగుతున్న దాడులను ఖండించక పోగా పోలీసు యంత్రాంగానికి, చంద్రబాబుకు వత్తాసు పలికారు. ఫలితంగా 10ఏళ్లుగా మాజీలుగా మిగిలారు. దీనిని నేడు కిరణ్‌కుమార్‌డ్డి కూడా అమలు చేస్తున్నారు. దీనికి రాబోయే రోజుల్లో నేటి మంత్రులు ఎమ్మెల్యేలు రేపు మాజీలుగానే మిగల వలసివస్తుంది. ఇప్పటికే తెలంగాణ సకల వనరులు సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసిన సీమాంధ్ర ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని, అటు బయ్యారం, గూడూరు, భీమదేవరపల్లి ఉక్కుగనులను సీమాంవూధకు కేటాయించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రాంతం కనీసం నీరు, బొగ్గు, విద్యుత్, ఉక్కు కూడా లేని ఏడారి ప్రాంతంగా మారబోతున్నది.

తెలంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది. నీళ్ళని దోచి పోలవరం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. తరతరాల వారసత్వ సంపదైన నిజాం షుగర్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న 50మిలియన్ల టన్నుల బొగ్గులో 70శాతం సీమాంవూధకే తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుతెరవరు. చివరికి కేంద్ర, రాష్ర్టవూపభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న సింగరేణిని నష్టాల ఊబిలోకి నెట్టేందుకు సీమాంధ్ర అధికారులు కుట్రలు పన్నుతున్నారు. ఆంధ్రాలో ప్రకృతి వైపరీత్యం ఏర్పడి రైతాంగం నష్టపోతే ఆగమేఘాల మీద కదిలే అధికారులు, నేతలు.., అదే తెలంగాణలో రైతాంగం నష్టపోతే పట్టించుకునే వారు కరువవుతారు.

ఇలాంటి వివక్షపై మాట్లాడలేని ఈ ప్రజావూపతినిధులు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నారో అర్థమవుతూనే ఉన్నది. ఇలాంటి ప్రాంతీయ ద్రోహుల అండతోనే సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర పార్టీల నేతలు తెలంగాణ ప్రజలపై అనేక రూపాల్లో దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ద్రోహాన్ని ప్రజలు సహించరు. ప్రజలు ఎదురుతిరిగిన రోజున నాటి నైజాం నుంచి నిన్నటి చంద్రబాబు వరకు, వారికి వత్తాసు పలికిన కాసీం రజ్వీ నుంచి నిన్నటి తెలంగాణ ప్రాంత టీడీపీ మంత్రులకు పట్టిన గతే.., నేడు ముఖ్యమంవూతితో కలిసి తెలంగాణ ప్రజలమీద దండయాత్ర చేస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు అదే గతి పడుతుంది.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘