రాజకీయాల్లో విలువలు ఏవీ?


Mon,April 22, 2013 12:36 AM

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరు ఈ వేడుకలలో పాల్గొని ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నాడు అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో, హిందూ కోడ్ బిల్లును ఆమోదించడంలో ఆలస్యమవుతున్నందున, దీనివల్ల దేశ ప్రజలకు నష్టం వాటిల్లుతున్నదని, ప్రజలకు న్యాయశాఖమంవూతిగా న్యాయం చేయలేకపోతున్నందుకు బాధపడి 1951సెప్టెంబర్ 29న మంత్రి పదవికి రాజీనామా చేశారు. లాల్‌బహదూర్ శాస్త్రి 1956లో జరిగిన రైలు ప్రమాదానికి బాధపడుతూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంబేద్కర్ రాజీనామాను నాడే ఆమోదించిన నాటి ప్రధాని నెహ్రూ, లాల్ బహదూర్ రాజీనామాను ఆమోదించకుండా, మూడు నెలల తర్వాత ఆమోదించారు. ఇటువంటి విలువలు కల్గిన నాయకులు నేడు రాజకీయాలలో భూతద్దం పెట్టి వెతికినా కనపడని పరిస్థితి నేడు నెలకొన్నది.

జగన్ ఆక్రమాస్తుల కేసులో రాష్ర్ట హోంమంత్రి సబితా ఇంద్రాడ్డిని నాలుగవ నిందితురాలిగా సీబీఐ చేర్చింది. అంతకు ముందు మంత్రి మోపిదేవి వెంకట రమణను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత ధర్మాన ప్రసాద్‌రావు వంతు వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్ జైలు ఊచలు లెక్కపెడుతున్నా నేటికి తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ధర్మాన రాజీనామా చేసినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఆయన రాజీనామాను ఆమోదించలేదు. నేడు సబితా ఇంద్రాడ్డి రాజీనామా చేసినా ఆమోదించే అవకాశం అగుపడడం లేదు. దీనికి వితండ కారణాలు చూపెడుతూ తాము ఏమీ తప్పు చేయలేదని, ఒకవేళ ఏమైనా చేసినా అది నాటి వైస్ మంత్రివర్గ సమష్టి నిర్ణయం కాబట్టి తమ తప్పు ఏమీలేదని బుకాయిస్తున్నారు.

ప్రపంచంలోనే మన రాజకీయ నాయకులకు తెలిసినంతగా బుకాయింపు ఏ దేశ రాజకీయ నాయకులకు కూడా తెలువదు. జపాన్‌లో, ఇంగ్లాండ్‌లో, జర్మనీ లాంటి దేశాలలో కూడా ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణలు వచ్చిందే తడువుగా వాటి బాధ్యులు రాజీనామాలు చేశారు. పక్కనే ఉన్న ఇండోనేషియాలో ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు నలభై శాతం తిన్నందుకు ఆ దేశ ప్రధానమంత్రి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ మన దేశంలో రాజీవ్‌గాంధీ మొదలుకొని నేటిదాకా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా పదవులు వదలడం లేదు. రాజీనామాలు చేయడం లేదు.

నేటి రాజకీయ నాయకులకు ప్రజల ప్రాణ, మాన రక్షణ కంటే వాటి భక్షణనే ప్రధానమై ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 42 లక్షల కోట్ల రూపాయల మేర ఈ రాజకీయ నాయకుల అక్రమార్జన స్విస్ బ్యాంకులో మూలుగుతున్నాయి. ఇక వీరి అవినీతి సామ్రాజ్యం దేశ ప్రజల మూలుగులను పీల్చి వేస్తున్నది. ఇంకోవైపు ఈ రాజకీయ నాయకుల అండదండలతో ప్రజల ఆస్తులను బహుళ జాతి సంస్థలకు, గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న ఉన్నతాధికారులు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. మరో వైపు దేశ సంపదను అప్పనంగా బహుళజాతి సంస్థలకు, గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతూ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు. ప్రజలను ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలిచేస్తున్నారు. దేశంలో 110 కోట్ల జనాభాలో కేవలం వెయ్యి మంది పారివూశామికవేత్తలు కుబేరులయ్యారు. ఎంతోమంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడినా వారి ఆస్తులు లక్షల కోట్లకు ఎగబాకినా శిక్ష ఎవరికీ పడలేదు.

1996లో పశువుల దాణా కేసులో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న బీహార్ నాటి ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా నుంచి ఆ తరువాత వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు మాయావతి మొదలు కొని జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా వరకు అందరూ బాహటంగానే ధన రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ విధంగానే ఎంతో మంది ముఖ్యమంత్రులు, వారి సహచర మం త్రులు, కేంద్ర మంత్రుల నుంచి 2జి స్పెక్ట్రమ్‌లో అవినీతికి పాల్పడిన రాజా, దయానిధి మారన్, కనిమొళి లాంటి కేంద్ర మంవూతులు, వారి పుత్రరత్నాలు ప్రజల సొమ్మును దోచుకున్నారు. కర్ణాటకలోని నాటి ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ, యడ్యూరప్ప లాగానే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మైనింగ్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని వేలాది కోట్ల రూపాయలతో అవినీతి రారాజులుగా వెలుగొందుతూనే ఉన్నా రు. మరోవైపు ప్రధాన మంత్రి కార్యాలయమే కోల్‌గేట్ కుంభకోణంలో ఇరుక్కోగా, ఇందులో ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గడ్కారీ ఇందులో భాగస్వాములయ్యారు.

వై.ఎస్‌రాజశేఖర్‌డ్డి అధికారం దక్కిందే తడవుగా లక్షలాది కోట్ల రూపాయలను ముడుపులుగా తీసుకొని తన ఆస్తిని లక్ష కోట్లకు పెంచుకున్నారు. ఇందుకు సహకరించి, తమ వాటా తాము పొందిన తన మంత్రివర్గంలోని సహచరులు నాటి ప్రభుత్వ ఉన్నతాధికారులు నేడు అక్రమాస్తుల కేసులో ఊచలు లెక్కబెడుతుండగా, రోజుకొకరు నాటి మంత్రులు నేడు ఈ కేసుల్లో నిందితులుగా చేరుతున్నారు. నాటి ప్రభుత్వంలో 26 జీవోలు విడుదల చేసిన ఎనిమిది మంది మంత్రులకు ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసింది. చార్జిషీట్‌లో పేర్లు నమోదైనా రాజీనామాలు చేయకుండా, తామేం తప్పు చేయలేదని చిలుకపలుకులు పలుకుతూ, మంత్రివర్గ సమష్టి నిర్ణయమని బుకాయిస్తున్నారు. రాజ్యాంగ అధికరణం 14 చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతున్నది. నాటి మంత్రివర్గంలో వ్యక్తిగతంగా తప్పు చేసినా, సమష్టి గా తప్పు చేసినా, తప్పు తప్పే. చట్టం అందరికీ సమానమే. ఈ 26 జీవోలు విడుదల చేసిన మంత్రివర్గ సభ్యులందరు దోషులే. దానికి నాయకత్వం వహించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రధాన దోషి. ఆ అవినీతిలో పొందిన అక్రమ సొమ్మును దక్కించుకున్న వారి కుటుంబ సభ్యులందరు కూడా దోషులే.

అనేక మంది నాయకుల పుత్ర రత్నాలు ఇప్పటికే రాజకీయాలలోకి వచ్చి ప్రజలను పీడించుకొని తింటున్నారు. ఓ మం త్రి కుటుంబం తెలంగాణలో రౌడీజాన్ని సృష్టిస్తున్నది. వీరందరికి అధికారమే అండగా నిలబడుతున్నది. ఒకసారి నేరారోపణ వచ్చి కేసు నమోదయిందంటే ఆ కేసులోని నేర నిరూపణకు ఉన్న అవకాశాలన్నీ సంపూర్ణంగా సేకరించేందుకు కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి స్వేచ్ఛ ఉండాలని చట్టం చెప్పడంతో పాటు, 1992లో భజన్‌లాల్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం (సువూపీంకోర్టు) తీర్పును కూడా ఇచ్చింది. కాని రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమ లు చేస్తామని బాధ్యతలు స్వీకరించిన మం త్రులు నేరారోపణలు రాగానే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్ష్యాలను తారుమారు చేస్తూ కేసుల నుంచి బయటపడుతున్నారు.

దేశంలో ఐదు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు లక్షలాది కోట్ల రూపాయాల అవినీతి ఆరోపణలలో చిక్కుకున్నా ఆ కేసుల నుం చి సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల బయటపడ్డారు. ఆ విధంగానే ప్రజా మద్దతు ఉన్నదనే నెపంతో ఆపారమైన డబ్బు ఉన్నదనే భావంతో వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, అధికారం ఉన్నదనే నెపంతో 26 జీవోలు విడదల చేసిన కేసుల్లో ఇరుకున్న మంత్రులందరు కూడా రాజీనామా చేయడం లేదు. ఒకరు లేదా ఇద్దరు రాజీనామా చేసినా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించడం లేదు. ముఖ్యమంత్రి చర్య రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా, చట్టానికి అతీతంగా ఉన్నది. రాజ్యాంగ విలువలకు, చట్టానికి అతీతంగా నడిచిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆ పదవుల్లో కొనసాగడానికి ఏమాత్రం అర్హులు కారు. స్వాతంత్య్ర పోరాటం నాటి కాంగ్రెస్ మాది, ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చినది మేమం టూ బీరాలు పలుకుతున్న నేటి కాంగ్రెస్ నాయకులకు నాటి కాంగ్రెస్‌లోని అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్న రాజకీయ విలువలు ఏవీ?

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles