నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?


Fri,April 5, 2013 11:38 PM

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్,ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో మొక్కజొన్న, పచ్చజొన్న, సజ్జ, వరి లాంటి పంటలు మాత్రమే పండేవి. పత్తి పంట అనేది ఎలా ఉంటుందో కూడా రైతాంగానికి తెలియని సమయమది, ఆ సమయంలో పత్తిని మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి లక్షలాది ‘బేళ్ళ’ను దిగుమతి చేసుకొనే వారు. ఈ ఆజంజాహీ మిల్లులో పత్తిని వడకడం, నూలు తయారు చేయడం, నూలు ద్వారా బట్టను తయారు చేయడం, బట్టలకు సప్త రంగులు అద్దడం లాంటి ఉత్పత్తులు తయారుచేయబడేవి. ఈ మిల్లులో దాదాపు పదివేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, సుమారు లక్షమంది అసంఘటిత కార్మికులు పరోక్షంగా భృతిని పొందేవారు. ఈ మిల్లు స్వయంగా తనకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిని తయారుచేసుకోవడంతో పాటు వరంగల్ నగరానికి విద్యుత్‌ను అందించేది. ఈ విద్యుత్తు సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు ద్వారా టర్బయిన్లను ఉపయోగించి జలవిద్యుత్తును తయారుచేసేవారు.


ఆజంజాహీ మిల్లు ఉత్పత్తులు భారతదేశంలోని 500వందల సంస్థానాలలో అత్యంత నాణ్యమైన, మన్నికగల, అందమైన వస్త్రాలుగా ప్రసిద్ధి చెంది విపరీతమైన అమ్మకాలు జరిగేవి. దేశంలో మరెక్కడాలేని విధంగా అత్యంత నైపుణ్యం కల్గిన నేత కార్మికులు ఆజంజాహీ మిల్లులో పనిచేసేవారు. ఈ మిల్లులో పనిచేసే వారికి క్షయ, ధనుర్వాతం, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకకుండావూపత్యేకమైన ఆస్పత్రి మిల్లు యాజమాన్యంలోనే నడిచేది. ఈ మిల్లు కార్మికుల పిల్లలకు బయటి ప్రభుత్వ విద్యతో సంబంధం లేకుండా మెట్రుక్యులేషన్ వరకు అతి పెద్ద పాఠశాలను మిల్లు ఆవరణలోనే నిర్మించి వందలాదిమంది ఉపా ధ్యాయులతో నాణ్యమైన ఉచిత విద్యాబోధనను పిల్లలకు అందించేవారు. మిల్లు ఆవరణలో వేలాది కార్మికుల క్వార్టర్లకు సకల సౌకర్యాలు అందిస్తూనే కార్మికుల కుటుంబాల ఆరోగ్యాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకునేవారు. నాడు ఈ మిల్లు నడిచిన తీరు ప్రపంచమే అబ్బురపడే విధంగా ఉండేది. ఆ రోజుల్లో ఆజంజాహీ మిల్లు కార్మికులు సమాజంలో ఒక హోద కలిగి ఉండేవారు.

తెలంగాణ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన తర్వాత దాదాపు 1960 వరకు అత్యంత కోట్లాది రూపాయల లాభాలతో మిల్లు విరజిల్లేది. 1961లో మిల్లును జాతీయ టెక్స్‌టైల్ కార్పోరేషన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మిల్లు అంచలం చలుగా నష్టనబారిన పడిం ది. జాతీయ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఆజంజాహీ మిల్లుతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలలో ని 16 మిల్లులను కూడా తన స్వాధీనంలోకి తీసుకున్న జాతీ య టెక్స్‌టైల్ కార్పోరేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా మిల్లులను సమర్థవంతంగా నడిపించడం లో పూర్తిగా విఫలమయ్యింది. 1975నాటికి ఈ మిల్లుతో పా టు దక్షిణాదిన ఈ సంస్థ స్వాధీనం చేసుకున్న 16 మిల్లులను ఖాయలపడ్డ పరిక్షిశమలుగా గుర్తిస్తూనే దేశవ్యాప్తంగా 109 మిల్లులను ఖాయిలా పడ్డ పరిక్షిశమలగా నిర్ధారిస్తూ ఖాయాలపడ్డ జాతీయ మిల్లుల చట్టం Sick TeXttile undertaking (Nationalization) Act1974(STUNA) కిందికి ఆజంజాహీ మిల్లును కూడా తీసుకువచ్చారు. 1974-75 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాదిన తొమ్మిది మిల్లులకు భారత ప్రభు త్వం సబ్సిడీలు కేటాయించగా, 1976 నాటికి ఈ మిల్లుల సం ఖ్య 16కు చేరుకుంది. అప్పటికే ఉత్తర తెలంగాణలో పత్తిని పండించే స్థితికి రైతాంగం ఎదిగింది.

స్థానికంగా లక్షలాది మిలియన్ టన్నుల నాణ్యమైన పత్తి లభించే పరిస్థితులలో, ఈ సబ్సిడీలతో అత్యంత లాభాలతో నడవాల్సిన మిల్లు 1985 నాటికి అత్యంత ఎక్కువ నష్టంగా చరివూతలోకి ఎక్కింది. ఈ నష్టాలకు వ్యతిరేకంగా యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై మిల్లును ‘దివాలా’ తీయిస్తున్నదనే వాస్తవాన్ని గ్రహించిన ట్రేడ్ యూనియన్ నాయకత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలోని మిల్లు యాజమాన్యాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది కాలం సర్వదేవభట్ల రామనాథం నాయకత్వంలో మహత్తర పోరాటం జరిగినా, ఆ తర్వాత వచ్చిన రాధాకృష్ణా, ఎల్‌ఎస్ ఎన్ రాజు, సుందరరాజు నాయుడు, బండారు నాగభూషణం లాంటి కార్మిక సంఘాల నాయకత్వంలో పోరాటాలు జరగకపోవడం వలన 1985 నాటికి అంచలంచలుగా కార్మికులను పదివేల నుంచి 5 వేల వరకు తొలగించారు. కార్మికులకు కల్పిస్తున్న సకల సదుపాయాలను అంచలంచలుగా తీసివేశారు.

1993 జనవరి12 నాటికి ఖయిలాపడ్డ పరిక్షిశమల ప్రత్యేక చట్టం 1985లోని సెక్షన్ 15 (1) ద్వారా ఆజంజాహీ మిల్లును కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రపంచీకరణ నేపథ్యంలో అపారమైన భూమి విలువ, పరిక్షిశమ విలువ, యంత్రాంగాల విలువ, కార్మిక శక్తి గల్గిన ఈ మిల్లును మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు విప్లవపార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేశాయి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తున్న సమయంలోనే రాజకీయ నాయకులు ప్రవేశించి నాయకత్వం చేజిక్కుంచుకొని పోరాటాల మీద నీళ్ళు చల్లారు. కార్మికులు జీవితాలతో ఆడుకొని తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. శాసనసభ్యులుగా, మంత్రులుగా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కార్మిక పోరాటాలను అణగదొక్కడంతో పాటు మిల్లు పరిరక్షణ కోసం జరిగిన పోరాటాలను ప్రభుత్వంతో అణచివేయించి కార్మిక వినాశానానికి పూనుకున్నారు.2000 సంవత్సరంలో దాదాపు 182 రోజులు కార్మికుల మహత్తర పోరాటం రాష్ర్టంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కేంద్రంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని దిగివచ్చే విధంగా పోరాటం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వరంగల్ నగరంలోని మిల్లుకు దగ్గరగా ఉన్న ఎనమాముల వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవానికి వచ్చిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారుకు అడ్డంగా కార్మిక నాయకులు పడుకోగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిల్లు మూసివేతను నిలిపివేయిస్తానని హామీ ఇచ్చి హైద్రాబాద్ చేరుకోగానే కారుకు అడ్డంగా పడుకున్న మాత్రాన మిల్లు మూసివేత ఆగదు అని ప్రకటించి బాబు ప్రపంచీకరణకు తాను ఆధ్యుడునని, మరొకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిస్సిగ్గుగా సమర్థించారు.

తాడిపత్రి, ఆధోని, తిరుపతి దక్షిణాది రాష్ర్టలలోని కొన్ని మిల్లుల తరహాలోనే ఆజంజాహీ మిల్లును కూడా కార్మికులకే అప్పజెప్పాలని కార్మికుల యాజమాన్యంలో అద్భుతంగా నడిపిస్తామని చంద్రబాబును మరోసారి 2002లో కోరారు. కార్మికుల, ప్రజా సం ఘాల విన్నపాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఈవిధంగానే పెండింగ్‌లో ఉంటే పోరాటాలు ఉధృతమవుతాయనే నెపంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెప్పించి ఆజంజాహీ మిల్లును మూసి వేయించారు. ఇది ఆలస్యం కాకుండా ఒక నెలరోజుల్లోనే 31-10-2000 నాటికి బలవంతపు పదవి విరమణ (వి.ఆర్.ఎస్) స్కీంను అమలు చేయించి 1992 నుంచి అమలవుతున్న ఈ స్కీంను అత్యున్నత దశకు తీసుకొనిపోయి అప్పటికి మిల్లులో మిగిలి ఉన్న 463 మంది కార్మికులలో 13 మంది టెక్నికల్ స్టాఫ్‌ను సీమాంధ్ర మిల్లులకు బదిలి చేయిం చి, 451 మంది కార్మికులను తొలగించారు. అంతటితో ఆగకుండా ఈ మిల్లుకు కల్గిన అత్యంత విలువైన 213 ఎకరాల భూమిని టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు అత్యంత చౌకగా అమ్మి వేసేందుకు నాటి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రయత్నం చేయగా వాటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ తీవ్ర నిర్బంధం మధ్యనే పోరాటం కొనసాగించారు. ఈ పోరాటాన్ని నడిపించిన ప్రజా సంఘాల నాయకులను తుదముట్టిస్తే తప్ప ఈ భూముల ను ఆక్రమించుకోలేమని భావించారు.

ఈ రెండు పార్టీల నాయకులు, ప్రజా వూపతినిధులు పోరాటం జరిపిన ప్రజా సంఘాల నాయకులను అక్రమ కేసులుపెట్టి, అరెస్టు చేయించి జిల్లా నుంచి తరిమేయించారు. ఆ తర్వాత మార్చి1,2007 నాటికి మిల్లు స్థలమైన 213 ఎకరాలలో 117.20 ఎకరాలు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి (కూడా), 65.65 ఎకరాలు ఏపి హౌజింగ్ బోరు కు, 30 ఎకరాలు టెక్స్‌టైల్ పార్కుకు అత్యంత కారుచౌకగా అప్పచెప్పారు. ఎపిహౌజింగ్ బోర్డుకు కేటాయించిన 65.65 ఎకరాల భూమిని హౌజింగ్ బోర్డు రాంకి అనే పైవేటు సంస్థకు రియల్ ఎస్టేట్ కోసం అత్యంత ఎక్కువ ధరకు అమ్మివేసుకుంది. ఇక కూడా కేటాయించిన 117.20 ఎకరాల భూమి లో దాదాపు 100 ఎకరాల భూమి కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధులు కారుచౌకగా దక్కించుకున్నారు.

ఆజంజాహీ యంత్ర సామాగ్రి విలువ కోట్లాది రూపాయలు కల్గి ఉండగా, స్క్రాబ్ కింద అత్యంత తక్కువ విలువకట్టి లక్షలాది రూపాయలకే అమ్మివేసిన చరిత్ర 2007 నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది. దశాబ్దాల తరబడి కార్మికుల రక్త మాంసాలతో నిర్మించిన ఆజంజాహీ మిల్లు చరిత్ర తెలుగుదేశం భాగస్వామ్యం కల్గిన, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వాల హయాంలోనే ముగిసింది. 2002 నాటికి ఆఖరి వంతుగా బలవంతపు పదవి విరమణ చేసిన 451 కార్మికులలో 134 మంది కార్మికులకే 200 చదరపు గజాల ఇంటిస్థలం ఇవ్వాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో463,27-6-2007ని విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పదవీ విరమణ చేసిన కార్మికులం దరికీ ఇళ్ళ స్థలాలు కేటాయించాలంటూ మిగతా 317 మంది కార్మికులు పై జీవోను సవాలు చేస్తూ రాష్ర్ట ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. ఇప్పటి వరకు కూడా రాష్ర్ట ఉన్నత న్యాయ స్థానం ఈ కార్మికులకు న్యాయం చేయలేదు.

తాత ముత్తాతల నుంచి భృతి కల్పించిన మిల్లును ఎలాగు అమ్మేసుకున్నారు, కనీసం వారి, మా రక్త, మాంసాలతో కాపాడుకున్న ఈ నాలుగు అడుగుల స్థలాన్నైనా మాకు కేటాయించి నాలుగు రేకులు వేసుకొని, దాని కింద మేము మా పిల్లలం బతుకుతాం అంటూ ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ కార్మికులు తెలంగాణ ప్రజావూఫంట్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నారు. జిల్లా ఉన్న ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, రియల్టర్‌ల ముసుగులో ఉన్న ప్రజావూపతినిధులకు కొమ్ముకాస్తున్న ఉన్నతాధికారులు మరోసారి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి మిల్లు పరిరక్షణ కోసం, మిల్లును తమ యాజమాన్యంలోనికి తెచ్చుకునేందుకు, మిల్లు స్థలాలను కాపాడేందుకు ఆఖరికి తాము ఎక్కడ పనిచేసామో అక్కడనే జీవిస్తూ తుదిశ్వాస విడుస్తామని ఈ ఆజంజాహీ మిల్లు కార్మికులు తుది శ్వాస విడుస్తామని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలతో విశాల ప్రజాసంఘ నాయకత్వంలో పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఈ 317 మంది కార్మికులకు న్యాయం జరిగే విధంగా తెలంగాణవాదులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles