సీమాంధ్ర దురహంకారం


Tue,March 26, 2013 12:06 AM


అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి నేటివరకు మెదక్ జిల్లా ప్రజలకు 180 కోట్లు మాత్రమే తాగునీరు కు కేటాయించి చిత్తూరు జిల్లాకు ఒకే ఏడాదిలో 7,800 కోట్లు కేటాయించడంలో సీమాంధ్ర పక్షపాతం ఉన్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వివక్షను ఎత్తి చూపారు. దీంతో అసహ నంతో ముఖ్యమంత్రి ‘ఒక్క రూపాయికూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’అని మాట్లాడారు. ఇది హరీష్‌రా వును కాదు, తెలంగాణ ప్రజలను కించపరచడమే. ముఖ్యమంవూతి ఇట్లా మాట్లాడుతుంటే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఎంగిలి మెతులకు ఆశపడ్డ తెలంగాణప్రాంత కాం గ్రెస్,టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు, నవ్వుకుంటూ ఆయ నకు మద్దతు పలికారు.
శాసనసభలో హరీష్‌రావు మాట్లాడినట్టు- ఇప్పటి వరకు తెలంగాణ ప్రజానీకం సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదా రుల నాయకత్వంలోని పాలకులదుర్మార్గాలకు వ్యతిరేకంగా మహత్తర పోరాటాలు చేయడం ద్వారానే హక్కులను సాధించుకోగలిగారు. 610 జీవో సాధన నుంచి నిన్నటి 14ఎఫ్ రద్దు వరకు సాదించినదంతా తెలంగాణ ప్రజాపోరాట ఫలితమే. అంతేతప్ప వారు వెకిలిగా మాట్లాడుతూ, సానుభూతి తో ఇచ్చినవి ఎంతమాత్రం కాదు.

‘నేను ఇక్కడనే పుట్టాను, పెరిగాన’ంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి మరి ఉత్తర తెలంగాణను సోమాలియా గా మారుస్తూ, లక్షలాది ఆదివాసులను ముంచుతున్న పోలవరం ప్రాజెక్టుకు అర్ధరాత్రి అంచనాలు పెంచి యుద్ధ ప్రాతిపదిక మీద జీవోలు ఎందుకు విడుదల చేశారు? మెతుకు సీమలో మెతుకులు పం డించేందుకు సింగూరు ద్వారా నీరు ఇవ్వాల్సినా ఇవ్వకుండా సీమాంధ్ర ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు నీరిస్తూ, మెతుకు సీమ ప్రజలకు కనీసం తాగునీటిని కూడా ఎందుకు మిగల నీయడం లేదు. అభివృద్ధి కోసం నాలుగు సంవత్సరాలుగా కేవలం 180కోట్లు ఇచ్చి, సీమాంవూధకు చెందిన చిత్తూరు జిల్లాకు సత్యసాయి తాగునీటి పథకం చిత్తూరు జిల్లాలోని కొంత ప్రాంతానికి అమలు జరుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మంచినీటి పథకం జిల్లాలోని ఇంకొంత ప్రాంతానికి తాగునీటి పథకాలు అమలు జరుగుతున్నా, ఒకే సంవత్స రంలో 7,800 కోట్లు తాగునీటికి విడుదల చెయ్యడం పక్షపాతం కాదా? సకలం దోచి నాటి ముఖ్యమంవూతుల్లాగానే కిరణ్‌కుమార్ రెడ్డి కూడా హైదరాబాద్‌లో పుట్టిపెరిగినా సీమాంవూధకు చెందిన ముఖ్యమంత్రే తప్ప తెలంగాణకు చెందిన ము ఖ్యమంత్రి కాదు,కాబోడు. తెలంగాణలోనే పుట్టి పెరిగినా సీమాంధ్ర పక్షపాతే అవుతాడు తప్ప తెలంగాణకు సంబంధించిన ప్రజావూపతినిధి కాలేడు. తెలంగాణ ప్రజా ప్రతినిధి అనుకున్నా కూడా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి అవుతారు తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు చూసే ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితుల్లో కాలేడు. ఆయన అన్న మాటలతో తాను తెలంగాణ ప్రజల వ్యతిరేకినేనని శాసనసభలో మాట్లాడిన మాటలతో రుజువు చేసుకున్నాడుపజాస్వామిక వ్యవస్థలో తన ఇంటి నుండి లేదా తన జేబు నుంచి ప్రజలకు ఇచ్చేది ఏమి ఉండదు. కానీ కిరణ్‌కుమార్ ఇక నుంచి తాను ‘తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వ ను ఏమి చేసుకుంటారో చేసుకోండి’ అని మాట్లాడడం నియంతలా సర్వం తామై ప్రజలను పీడించే నియంతలకు చెల్లుతుందేమో కాని ఈ వ్యవస్థలో చెల్లదని నిరూపించవల్సిన సమ యం ఆసన్నమైనది. సీమాంధ్ర ముఖ్యమంవూతులు చేస్తున్న తెలంగాణ వ్యతిరేక చర్యలపై రాజీలేని పోరాటం చేయాలి. డిసెంబర్ 9, 2009 నాటి పోరాటం చేస్తే తప్ప వీరి మెడలు వంచలేము. తెలంగా ణ ప్రాంతాన్ని దోచుకుంటూ నాటి నిజాం నవాబుల నుంచి నేటి కిరణ్ కుమార్‌రెడ్డి దాకా తమ దురంహంకార ప్రవర్తనను ప్రజల మీద రుద్దారు. అధికారం దక్కించుకున్న ప్రతివారు తెలంగాణ ప్రజలను దోచుకొని తమకు ఎదురులేదని విర్రవీగారు. కాని నాటి నీజాం నుంచి నిన్నటి రాజశేఖర్ రెడ్డి వరకు తెలంగాణ ప్రజల పోరాటం ముందు చరిత్ర కాలగర్భంలో కలిశారు. తెలంగాణ ప్రజలు ఉప్పెనలా కదిలితే కిరణ్ కుమా ర్‌రెడ్డి కూడా అందుకు అతీతమేమి కాదు. తెలంగాణ ప్రజల ముందు మోకరిల్లాల్సిందే.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles